చెల్లి(తే) వెళ్ళిపోవటమే

                                                                                                                                    వ్యాసం : శర్మ జి ఎస్

ఈ ప్రపంచంలో ఏవైనా చెల్లుబాటు అయ్యేది కొంతకాలమేనని వేటిని పరిశీలించినా తెలియబడ్తుంది . దానికి ఏవైనా , ఎవ్వరైనా కారణం కావచ్చు .

కొన్నాళ్ళో , కొన్నేళ్ళో చెలామణీ అవుతాయి అంటే అవి జీవించి వుంటాయి . ఆ పై ఆ చెలామణీకి చిల్లి పడి చెల్లిపోయి కాలంలో కలిసిపోతాయి . ముందు తరాల వారికి గత చరిత్రగా  మిగిలి , వెలిగి పోతాయి . 

ఇలాగే ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణి జీవన గమనం .  

 ఈ ప్రపంచంలోని ప్రాణికోటి పుట్టటానికి , గిట్టటానికి ఎన్నో కారణాలుంటూనే ఉంటుంటాయి . 
సహజంగా మానవులు మరణిస్తే ఎంతగానో బాధపడ్తుంటారు . మానవులకు మరణం సంభవిస్తే , అందులకు కారణమైన వాటిని నిందిస్తుంటారు . 
మఱి ఈ మానవుల వల్ల ఎన్ని ప్రాణులో వాటి జీవితాల్ని కోల్పోతుంటే బాధపడక పోగా , అమితంగా ఆనందిస్తుంటారు .
నిజానికి ఈ మానవుల వల్ల కాకపోయినా , ఎలాగైనా , ఏ ప్రాణులైనా జీవితాలు కోల్పోక తప్పదు . 

అంటే ఎప్పటికప్పుడు ఈ ప్రపంచం మార్పుని కోరుతుందన్నది అక్షర , అణుక్షణ సత్యం అన్నమాట .

కాకుంటే మిగిలిన ప్రాణికోటి ఎక్కడినుంచి వచ్చాయో , ఎక్కడికి వెళ్తున్నాయో , ఎలా పుడ్తున్నాయో , ఎలా గిడ్తున్నాయో ఆలోచించనే ఆలోచించవు , ఒక వేళ ఆలోచించినా మనకు తెలియకపోనూ వచ్చు . అయినా వాటి జీవనం సాగిపోతూనే వున్నది యివేవీ తెలియకుండానే , తెలుసుకోకుండానే .

ఒక్క మానవులు మాత్రం ఎక్కడినుంచి వచ్చామో , ఎక్కడికి వెళ్తున్నామో , ఎలా పుడ్తున్నామో , ఎలా గిడ్తున్నామో ఆలోచిస్తూనే వున్నారు . ఏదో తెలియనట్లు , తెలిసినట్లు అనిపిస్తున్నా , యింకా తెలుసుకోవాలనే తపనతో , ఆ దిశగా చాలా మంది మానవ ప్రాణికోటి జీవితాలు ముగిసిపోతూనే వున్నాయి . అయినా ప్రయత్నాలు మానలేదు . ఎందుకంటే వీళ్ళు ఆలోచనా శక్తిని వ్యక్త పరచగల  మానవులు కదా ! 

ఈ మానవ జీవన గమనంలో తమ వల్ల మిగిలిన ఎన్నో ప్రాణికోటి జీవితాలని వాళ్ళ(అవసరాల )కు తెలియకుండా ముగింపు యిస్తూనే వున్నారు . అది వారి ప్రగతికి , పురోగతికి , మేధా శక్తికి తార్కాణంగా భావిస్తున్నారు .

ఆ కోవలోకి చెందినదే ఈ రూకల రూపాలు . 

                                                            


4 comments:

 1. Replies
  1. కృతఙ్నతలండి .

   Delete
 2. చాలా బాగున్నాయండీ నాణేలు!
  ఆ ఐదు పైసల నాణెం చూడాగానే చిన్నప్పుడు దాంతో కొనుక్కున్న పాకం జీడి గుర్తొచ్చింది!
  అప్పట్లో మొబైలు ఫోన్లు లేకుండా యెట్లా బతికామురా అని ఇప్పుడు హాశ్చెర్యంగా ఆనిపిస్తున్నాది?

  ReplyDelete
  Replies
  1. నిజమేనండి . గతమెప్పుడూ ఆనందాలని ఙ్నప్తికి తెస్తుంది .
   నేటి రోజుల్లో బోన్ లేకుండా జీవించవచ్చేమో కాని , మొబైల్ ఫోన్ లేకుండా జీవించటం దుర్లభంలా అయిపోయింది . మొబైల్ లేని జీవనం వనమే కదా మఱి .

   Delete