మితమే ..........

                                                                                                                                       రచన : శర్మ జి ఎస్ 

సర్వ సాధారణంగా ఈ జీవరాసుల మనుగడకు ఈ ప్రపంచంలోని కొన్ని ముఖ్యమైన వాటికి కృతఙ్నతతో యిమిడి వున్నది ఆరంభం నుంచి . 


ఆ కొన్నింటిలో యివి లేనిదే ఏ జీవ రాసులు జీవించలేవని తెలుసుకున్న మానవుడు వాటికి కృతఙ్నతగా తల వంచి పూజించటం ఆరంభించాడు ( భయంతో కానీయండి , భక్తితో కానీయండి ) . ఎందుకంటే అవి లేనిదే జీవించలేడు , అవి అధికమైనా జీవించనూ లేడు అన్నమాట . అంటే ప్రాణికోటికి లేదా జీవరాసులకు మితంగా కావాలి అవి .

అవి ఏవంటే పృధ్వ్యాపస్తేజో వాయురాకాశాత్ లు 5 అన్నమాట , కాదు ఉన్నమాటే . వీటి శక్తిని అవగతం చేసుకొన్న మానవుడు , వాటిని అంతు తెలియని భూతాలుగా భావిస్తూ  , అతీతమైన అనంత శక్తి మారు రూపాలుగ భావించాడు , ఆరాధించటం మొదలుపెట్టాడు నాటి నుంచి . 

ఇలా మానవుడు తాను పొందుతున్న సుఖాలకు కారణమైన వాటిని అతీతమైన , భావించి అనంత శక్తిగా ఆరాధించటం మొదలు పెట్టాడు .


అందుకే మన భారత దేశంలో చెట్లను , పుట్టలను , జంతువులను ( కౄర మృగాలను ) పూజించటం ఆరంభమైంది .


చెట్లను పూజించటానికి కారణం ఆ చెట్ల నుంచి పొందుతున్న , మూలాల వేరులు గాని , ఆకులు గాని , పూత గాని , పూవులు గాని ,  కాయలు గాని , పండ్లు గాని కారణమైనాయి . వాటిలోని విటమినుల లాంటి శక్తి  ప్రాణికోటి జీవనానికి మూలాధారమైనవి  కాటమే అసలు కారణం .


పుట్టలను పూజించటానికి కారణం ఆ పుట్టలలో నివసిస్తున్న పాములు జన జీవనానికి పరమ ప్రమాదకరమైనవి . అటువంటి వాటిని డైరెక్టుగా పూజించే ధైర్యము లేక , వాటిని కూడా ఆ అనంత శక్తిలోని  భాగాలుగా భావించి  పూజించటం ఆరంభించాడు . 


ఆ  కౄర మృగాలను కూడా యిదే కోవలోనికి చేర్చి పూజించటం ఆరంభించాడు .


ఈ పూజలన్నింటిలోను స్వార్ధమే కాకుండా కృతఙ్నత కూడా యిమిడి వున్నది .


ఇలా పూజించటంలో , జీవించటంలో  తప్పేమీ  లేదు . 


ఇలా గుడ్డిగా పూజించటం దేనికనుకొన్న కొంతమంది ( ముందు తరాల వాళ్ళను దృష్టిలో వుంచుకొన్న వారై ) ఆ అనంత , అతీత శక్తికి ఆకారాలేర్పరచి ఆరాధించటం ఆరంభించారు . 

ఆనాటి వారి దృష్టిలో దైవం , దేవుళ్ళు అంటే అతీతమైన సర్వ సద్గుణ శక్తులుగా భావించేవారు .  

నిజానికి వారారాదిస్తున్నది సర్వ సద్గుణ శక్తులనే . ఆ శక్తులున్న వాటన్నింటినీ దైవ స్వరూపాలుగా భావించి పూజించేవారు .   


కాకుంటే కాలక్రమంలో ఈ పూజలని తమ సంకుచిత స్వార్ధాలకు వాడుకోవటం మొదలైన తర్వాత , వాటి మీద నమ్మకం సన్నగిల్లి , వాటి మూలాలనే శంకించి , అసలు అవేవీ లేవనే పరిస్థితికి దారి తీశాయి .


వాస్తవానికి నేటికి అవి లేనిదే జీవరాసి జీవనం లేనే లేదు . అయితే ఆ అతీతమైన శక్తులను కృతఙ్నతా భావంతో కాకుండా వైఙ్నానిక శాస్త్రంతో చూస్తూ వాడుకొంటూ , కృతఙ్నతనే మఱచి , యిదంతా తన తెలివితేటలతో సాధిస్తున్నాననుకొంటున్నా
రు నేటి వారు  . 

ఆ నాటి మానవులకు కృతఙ్నతా భావం వుండబట్టే , వాళ్ళు ఘనంగా జీవించ గలిగారు . వాళ్ళు అలా గౌరవించ బడ్డారు . 


నేడు విడి విడిగా పరిశీలిస్తే ఎవ్వరికి వారి వారి కుటుంబాలలో గౌరవం లభ్య పడుట లేదు . అలాగని జీవితాలు వెళ్ళవన్న దిగులు అఖ్ఖరలేదు . 

ఎందుకంటే ఈ సువిశాల ప్రపంచంలో ఎన్నో , ఎన్నెన్నో జీవరాసులు జీవిస్తూనే వున్నాయి . రాసులు రాసులుగా పుట్టుకొస్తున్నాయి , గిట్టి పోతు న్నాయి అను నిత్యం . ఆ జీవరాసులలో మనమూ ఒకళ్ళము . 

మిగిలిన జీవరాసులకు , మన మానవులకు  ఒక్కటే తేడా  . 
అదే ఆలోచనా సంస్కారం . 
దీనిని సక్రమంగా వుపయోగించుకొంటే , మానవుడికంటే అదృష్ట వంతమైన ప్రాణి  ఈ సువిశాల ప్రపంచంలో మరొకటి లేనే లేదని చెప్పవచ్చు . అందుకే ముందు తరాల వాళ్ళు సదా చిరస్మరణీయులులుగా మిగిలిపోయారు .

కనుక మితిగా తెలుసుకొని మసులుకోవలసిందే , అతిగా తెలుసుకొంటేనే అసలు సమస్య మొదలవుతుంది , ఆ అసలుకే ఎసరు వస్తుంది అని   ఎంతైనా మంచిది .


                                                                                 *              *            *

No comments:

Post a Comment