చట్టం కాకూడదెవ్వరి చుట్టం


                                                                                                                                     రచన : శర్మ జి ఎస్

నిర్భయ పేరు వినగానే అలనాటి అంటే ద్వాపరయుగం నాటి హస్తినాపురమనికి వారసత్వమని ఘనంగా ఈనాడు చెప్పుకొంటున్న ఢిల్లీ మనకు గుర్తుకొస్తుంది .
ఆ వారసత్వం ఎటువంటిదంటే , అలనాడు ఒక్కరు కాదు , ఐదుగురు భర్తలున్న ఆ ద్రుపద మహారాజు గారి రాచపుత్రిక ద్రౌపదికే అంతమంది పెద్దల సమక్షంలోనే వివస్త్రను చేయ్య విశ్వ ప్రయత్నం చేశిన వారసత్వం పుచ్చుకొన్న ఢిల్లీ అది . 

అటువంటి ఢిల్లీలో యిక సామాన్య మహిళలది దీనస్థితియే కదా ! .

పైగా నిర్భయను  నడిబజారులో వెళ్తున్న బస్సులో పట్టపగలు నిర్భయంగా అత్యాచారం చేసిన ఆ దోషి సింఘ్ ని పాత్రికేయుల ఇంటర్వ్యూకి అనుమతినివ్వటం , ఆతనిపై లఘు చిత్రాన్ని తీయటానికి అనుమతులనివ్వటం గత రాజకీయ పాలనలో శతాబ్దిగాఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఈ దుశ్చర్యకు పాల్పడటం ఘోర తప్పిదం . 
అందునా ఢిల్లీలో మహిళా మంత్రి గత దశాబ్ద పరిపాలనలో . కంటి తుడుపు చర్యగా ఒక చట్టం సృష్టించాం . దానితో యిక నుంచి మహిళ నిర్భయంగా ఎక్కడైనా తన అవసరాలకు తగ్గట్లు బయటకు వెళ్ళి రావచ్చు అని ఓ స్టేట్మెంట్ యిచ్చారు . ఆ చట్టాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేయలేదు . ఆ చట్టం తదుపరి ఢిల్లీలోనే కాదు గల్లీ గల్లీలో అత్యాచారాలు పేట్రేగి పోతున్నాయి . నోరు తెఱచి అడిగినవారికి ఆ చట్టాన్ని చూపుతున్నారే తప్ప అత్యాచారాలు చేయకుండా చూసే ప్రభుత్వమే రాలేదు నేటి వరకు .

ఇటువంటి నేరస్తులను గొప్పగ మీడియాలో చూపిస్తుంటే , యింకా యింకా అనేకులు పేట్రేగి పోతూనే వున్నారు .

ఇలాంటి వాళ్ళ(దోషుల)కు రాజుల కాలంలో బహిరంగంగా వేసిన ఉఱిశిక్షను సత్వరమే అమలు జరపాలి . అప్పుడైనా పూర్తిగా కాకున్నా , అత్యధిక శాతం అత్యాచారాలు తగ్గే అవకాశాలు ఎక్కువగ వుంటాయి . 

ఆ దోషులను సమాజానికి చూపించాలన్న తపన ( మా ఛానల్ ముందు చూపింది ,మా ఛానల్ ఎక్కువ కవరు చేసింది అని గొప్పలు చెప్పుకొంటున్న ఈ మీడియా పోటీ ప్రపంచంలో ) కంటే , ఆ నేరస్థులను న్యాయస్థానం ఏ ప్రలోభాలకు లొంగకుండా నిర్ణయించిన పిమ్మట , వెంటనే ఆలస్యం లేకుండా ఉఱి తీయించి , ఆ దృశ్యాన్ని కొన్ని రోజుల పాటు ఈ మీడియాలలో ప్రసారం చేయగలిగితే అప్పుడు చాలా వఱకు అత్యాచారాలు తగ్గుతాయి . ఇదే మన ప్రభుత్వాలు సత్వరం తీసుకోవలసిన చర్య .  

దాని వల్ల చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుంది అనటం కంటే , జీవించి వున్న వారందరూ ఆనందంగా , హాయిగా జీవించే అవకాశం వున్న వాళ్ళు అవుతారు .

ఆ క్షణం నుంచైనా వాళ్ళ వాళ్ళ పిల్లలు సంస్కారం నేర్చుకొనే దిశగా అడుగులు వేస్తారు . 

చట్టాలు సృష్టించటం ఘనం కాదు , అమలు జరపటమే ఘనం , ఆనందం , ఆమోదం . 

                                                                                       *************

2 comments:

 1. ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,

  అంతరాయానికి మన్నించగలరు, మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.

  సాయి రామ్ సేవక బృందం,
  తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
  సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
  * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*

  ReplyDelete
  Replies
  1. శ్రీ సాయిరాం గారికి ,
   నమస్కారములు . మీ వెబ్ సైట్ చూశాను . మీరు చేపట్టిన ఈ బృహత్తర ఖార్యం చాలా చాలా ఉత్తమమైనది .
   ఎంతో మందికి తెలుసుకోవాలనుకున్న వారికి , ముందు తరాల వాళ్ళకు విఙ్నాన దాయకం , మార్గ దర్శకమూను .

   Delete