ఉన్నత జన్మ ఈ మానవ జన్మ

                                                                                                                                    రచన : శర్మ జి ఎస్

ఏదైనా అలవాటు చేసుకోవటం తేలికే . దానిని వదలించుకోవటమే చాలా చాలా కష్టమైన పని .

తెలియక చేసేది పొరపాటే , తెలిసి చేసేది , చేస్తున్నది అలవాటుగ పరిగణించాలి . అలా అలవాటైనవి మానాలంటే చెప్పినంత తేఇలక కాదనే చెప్పుకొని తీరాలి .

కొన్ని కొన్ని అలవాట్లు ప్రకృతి, కాల పరంగా వచ్చేవి . అలా వచ్చే అలవాట్లు ప్రకృతి , కాల పరంగా కాలక్రమంలో పోతాయి .

కొన్ని కొన్ని అలవాట్లు శారీరకంగా , ఈ శరీరాన్నంతటినీ అంతర్లీనంగా తన ఆధీనంలో  ఉంచుకొని ఆధిపత్యం చెలాయిస్తున్న ఆకారమే లేని మనసు వల్ల ఏర్పడుతుంటాయి . ఈ అలవాట్లలో కొన్ని దురలవాట్ల కోవలోకి చెందినవి . అటువంటి ఆ దురలవాట్లకు ఈ ప్రాణి బానిస అయిపోతుంటుంది . అందులోంచి బయటకు రావటం అంత సులభమైన పనే కాదంటుంటారు . అది వాస్తవంలో నిజమే కావచ్చు .

ఈ ప్రపంచంలో ని సమస్త ప్రాణులలో ఈ మానవ ప్రాణులు తాము అనుకొన్నది సాధించుకొనే అవకాశాలు అధికంగానే అంది పుచ్చుకొన్నాయనే చెప్పుకోవాలి . ఆ దిశగా అడుగులు వేస్తే సాధించుకోగలరు .

దీనికి కృషి , దీక్ష , పట్టుదల , శ్రధ్ధ , క్రమశిక్షణ అంటే  స్థిర సంకల్పం అన్నమాట . దీన్ని అంటిపెట్టుకొంటే ఆ దురలవాట్లను వదలించుకోగలరు .
ఈ కృషి , దీక్ష , పట్టుదల , శ్రధ్ధ , క్రమశిక్షణలు అలవరచుకోవటానికి ముందు స్థిర సంకల్పం చాలా చాలా అవసరమన్నది గ్రహించి మసులుకోవాలి . త జీవితాన్ని ఆనందమయంగా మలుచుకోవాలి .

ఈ అవకాశం , అవసరం ఒక్క మానవులకు తప్ప ప్రాణులకు తప్ప మరే ప్రాణులకు లేనే లేదు . 
ఎందుకంటే వాటికి ఇవేమీ తెలియవు . పుడ్తున్నాయి , జీవిస్తున్నాయి , మరణిస్తున్నాయి . 

లా ఈ మానవుల జన్మ ఉండదు , ఉండకూడదు .

మిగిలిన ప్రాణులకు , మానవ ప్రాణులకు తేడా ఒక్కటే . విచక్షణా ఙ్నానం . అది ఆ మిగిలిన ప్రాణులకు బహు తక్కువ , ఈ మానవప్రాణులకు బహు ఎక్కువ . 
అందుకే  ఈ మానవ ప్రాణులు మిగిలిన ప్రాణులకు కూడా సాయం చెయ్యాలని ఆలోచిస్తుంటాయి .

కనుక ఈ మానవ జన్మ ఎత్తినందుకు తోటి ప్రాణులను అవసరమైన సమయంలో ఆదుకొనటంతోనే ఈ మానవ జన్మ సార్ధకత చెందుతుంది .

ఒకవేళ ఆదుకొనే శక్తి లేకుంటే , ఏ ప్రాణులకు హాని , కీడు తలపెట్టకుండా ఉన్నా ఈ మానవ జన్మ సార్ధకత చెందినట్లేనని అర్ధంచేసుకోవాలి .

అందుకనే ఈ మానవ జన్మ మహోన్నతమైనదని చెప్పబడ్తోంది , కీర్తించబడుతుంది మన వేదాలలో , అనేక గ్రంధాలలో కూడా .

                                                                      *************

ఇట్స్ సో ఈజి............


                                                                                                                                  సేకరణ : శర్మ జి ఎస్



ఈ నడుమ ప్రముఖులు

" విదేశీ వస్తువులు కొనటం మానేయమని అందఱికి చెప్పటం " పరిపాటి అయింది .
అలా చేస్తే ఆ విదేశీ డాలర్ విలువ పడిపోతుందని , మనదేశ ద్రవ్యం విలువ వృధ్ధి అవుతుందని .


అలనాడు మనసు కవి , మన సుకవి ఆచార్య ఆత్రేయ గారు చెప్పారు " ఎదుటివారికి చెప్పేటందుకే నీతులున్నాయి " అని .



ఎదుటివారిని మారమని చెప్పేబదులు , మనం మారటం చాలా తేలిక . ఆ విషయాన్ని గ్రహించకుండా ఎదుటివారిని మారమంటున్నారు .



ఈ నీతులు / మంచి మాటలు చెప్పే వాళ్ళ ఇళ్ళలో ఎక్కువగా వుండే వస్తువులు ఆ విదేశీ వస్తువులే . అంతే కాదు వాళ్ళ పిల్లలు కాని , వాళ్ళ వాళ్ళ పిల్లలు చదువుకునేది కూడా ఆ విదేశివే .


ఏదైనా ఓ మంచిమాట ఎదుటివారికి చెప్పాలంటే దానికో అర్హత కావాలన్న విషయాన్ని మన పూర్వీకులు ఏనాడో సెలవిచ్చారు . అదే ఆనవాయితీగా వస్తోంది .
అందుకే ఆధ్యాత్మిక గురువులు తమ తమ గురువుల ఆదేశాల మేర సమాజానికి మేలు చేయటానికి ఉపక్రమిస్తుంటారు .


ఆ మధ్య మన ప్రధానమంత్రి గారు కూడా యిలాగే చెప్తూ , ఆయన ఒబామా వస్తున్నాడని ఓ ఖరీదైన సూట్ వేసుకొన్నాడుట . పేదరికం గురించి తెలిసిన తను కూడా యిలాంటి వాటికి ప్రలోభ పడితే , యిక ప్రజానీకానికి మార్గదర్శకుడిగా ఎలా నిలబడగలడు .

అంత గొప్ప రామకృష్ణ పరమహంస గారు కూడా , తను ఎదుటివారికి చెప్పేముందు , తాను ఆచరించి ఆ పైనే చెప్పేవారు . అప్పుడే ఆ మాట ఆదర్శనీయమౌతుంది , ఆచరణయోగ్యమౌతుంది .

**********



ఏ సన్ కైనా లెసన్ అవసరమే



                                                                                                                                   సేకరణ : శర్మ జి ఎస్

గతం గాని , చరిత్ర  గాని ,  పఠించి  , పరిశీలించితేనే బోధపడ్తుంది . 

1.                                                   Kindness costs nothing
                                                                    But
                                                        Knowledge is power...

2. "The most used alphabet 'A' doesn't appear in spelling of 1 to 999 ,
       it appears for the 1st time in 1000 and continues forever...............

       That means We must know "Success requires a lot of patience!''


3. What is talent?

    Rahul Gandhi is yet to start his career at 43 yrs and Mr Sachin retired and awarded 
   “Bharat  Ratna” at 40yrs. .....that's called talent of Mr Sachin . 

    Thats Talent .

   కొంతమంది అపజయాలు మరెంతమందికో గుణపాఠాలు .
   ఒక్కొక్కరి విజయాలు ఎంతమందికో మార్గ దర్శకాలు .

4. What is success?

    In 1988 Tendulkar failed in English in 10th Std.
    Now in 2014, 10th Std English 1st Lesson is about TENDULKAR. .....
    Thats Success..


                                                                   ***************

లెక్క చేయండి , ప్లీజ్ ......................

                                                                                                                            సేకరణ : శర్మ జి ఎస్ 

బ్యాంకుల నుంచి వచ్చే నోట్ల కట్టలు సీల్ వేసి వస్తుంటాయి . వాటిని సహజంగా ఎవ్వరూ లెక్క చేయరు అంటే లెక్క పెట్టుకోరని అర్ధం . ఎందుకంటే అన్నీ సక్రమంగా వుంటాయన్న గట్టి నమ్మకమే దానికి పునాది . దేనికైనా పునాది గట్టిగా వుంటేనే చిరకాలం నిలబడగలుగుతుంది .
అటువంటి ఆ పునాది కూడా గట్టిగా వుండటం లేదని ఈ నడుమ తేలటంతో నోట్ల కట్టలు ఎల్లప్పుడూ లెక్క పెట్టుకోవటమే కరెక్టు అని తేట తెల్లమవుతున్నది . ఈ క్రింది లింకుని పరికించి చూడండి .



video

**********


ఏ సవ్వడి చేయకు విజయం నీ వెంటే


                                                                                                                                      సేకరణ : శర్మ జి ఎస్


                                                                                                               

ఎప్పుడైనా , ఎవరైనా శత్రువుతో తలపడదలచుకొంటే , ముందుగా అందుకు అవసరమైనవన్నీ సమకూర్చుకోవాలి . ఈ సమకూర్చుకొనే సమయంలో నువ్వు ఎవ్వరికీ నువ్వు చేయదలచుకొన్న పనిని తెలియపరచ కూడదు . ఎందుకంటె నీకు ముఖ్యమైన వాళ్ళే ఆ శత్రువుకు నీకు సంబంధించిన విషయాలన్నింటినీ చేరవేశారేమోనన్న అపోహలు నీకు కలగవచ్చు . వాస్తవానికి అది నిజం కాకపోవచ్చు కూడా . ఎందుకంటే నీ లోపలి ఉద్దేశం నీ పెదవి దాటి బయటకు వస్తే అది Fఋధివి దాటిపోతుందన్న నానుడి మన పూర్వీకులు ఏనాడో వెలిబుచ్చారు . 
వాస్తవానికి ఆ నీ లోపల ఉద్దేశం నీకు ముఖ్యమైన వాళ్ళు నీ శత్రువుకి చేరవేయక పోవచ్చు . ఆ ఉద్దేశాలని " భావ తరంగాలని " గాలి ద్వారా వెళ్ళిపోతుంటాయి . రెసీవ్ చేసుకొనేవాడి శక్తిని బట్టి వుంటుంది .

ఆ పై ఆ శత్రువును ఎదుర్కోవాలి . 

ఆ పోరులో గెలిచేటంతవరకు నీ ధ్యాస ఆ శత్రువుని గెలవటం మీదనే ఉంచాలి . అప్పుడే నువ్వు అనుకొన్న దానిని సాధించ గలవు .

అలా సాధింపబడిన విజయం అంతటా వ్యాపించేస్తుంది నీకు తెలియకుండానే .

అదే అసలైన విజయం . ఎప్పటికీ గుర్తుంచుకో . ఎన్నటికీ మరువకు .

***********
                    

సెట్టింగు కాదు , బెట్టింగు కాదు .....మఱి ?

                                                                                                                                    సేకరణ : శర్మ జి ఎస్




చదివారు గదా ! 

ఈ కొటేషన్ వ్రాసిన వాళ్ళు బహుశా " వైద్యో నారాయణో హరిః " అన్న నానుడినే పునాదిగా తీసుకున్నారని తెలియవస్తోంది .

నిజానికి ఆ దేవుడు , ఈ వైద్యుడు యిరువురు స్నేహితులు  కాని ,  వ్యాపార  భాగస్వాములు కాని  కానే కారు   బహుశా ఈ వైద్యుడు కూడా మానవుడే అన్నది మరచి వ్రాసినట్లున్నారు ఈ పై కొటేషన్  .   

చదివి కాసేపు చమత్కరించుకోవటానికి , నవ్వుకోవటానికి బాగుంటుందే తప్ప నమ్మటానికి వీలు లేనిది .

దేవుడు అంటే లింగభేదం లేని శక్తి అన్నమాట . అందుకే ఈ ప్రపంచంలో అంతటా ఆ శక్తిని చూడగలుగుతున్నాము . ఆశక్తే కొద్ది కాలమైనా లేకుంటే అశక్తులమవుతున్నాం . అధిక కాలం లేకుంటే శవంగా , శక్తిహీనమై , నిర్జీవులమైపోతున్నాం . 


అలా లింగభేదం లేని ప్రాణిగా ఎక్కడా లేదు . ఈ ప్రపంచంలోని ప్రాణికోటిలో తప్ప మిగిలిన ప్రకృతిలో అంతటా  ఆ శక్తి  వ్యాపించియున్నందున , ఆ శక్తి ఈ లింగభేద ప్రాణులలో కూడా చేరి మన ప్రాణికోటి అన్నింటికీ స్వల్పకాలం మనటానికి మనుగడనిస్తున్నది . ఈ స్వల్ప కాలంలో మనం ఎంత తెలుసుకో గలిగితే అంత తెలుసుకొని , మనం ఆనందంగా జీవనం సాగించాలి . ముందు తరాల వారికి మార్గదర్శకం కావాలి .

ఇదే  కదా !ఈ మానవ జన్మకి సార్ధకత .

***************

ఎలా ఉండే వాళ్ళం ......? యిలా ఉన్నాం.......


                                                                                                                           సేకరణ : శర్మ జి ఎస్

గతం స్వగతంగా కొన్ని సందర్భాలలో బాగుండవచ్చు .
అన్ని సందర్భాలలో బాగుండదు . గతం బయట పడితే , దానిని బట్టి భవిష్యత్తును చక్కగా రూపొందించుకొనే సదవకాశం కలుగుతుంది . 
                                                                                                                               
ఈ విషయం మనకే కాదు , మన దేశానికి కూడా చాలా అత్యవసరమని తెలియవస్తోంది .
గతాన్ని పరిశీలించినప్పుడు , అప్పుడు తెలిసో , తెలియకో జరిగిన , దొర్లిన పొరపాట్లు మఱలా భవిష్యత్తులో జరుగకుండా , తగు జాగ్రత్తలు తీసుకొని భవిష్యత్తును బంగరు మయంగా చేసుకొనే దిశగా అడుగులు ( దేశమైతే చర్యలు చేపట్టాలి ) వేయాలి .

                                                                         


  
 ************


అవకాశాన్ని అందుకోండి

                                                                                                                       సేకరణ : శర్మ జి ఎస్ 
           

సోదర సోదరీ మణుల్లారా ,

ఓ నాడు అదే మేము చదుకునే రోజుల్లో చదువుకునేటందులకు ఆర్ధిక స్థోమత లేని కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించేది స్కాలర్షిప్ రూపంలో . అందులో కుల, మత ప్రాధాన్యమేమీ లేకుండా విద్యార్ధికి చదువులో వున్న ప్రతిభని బట్టి , ఆ విద్యార్ధి చదువులో ప్రగతి పధంలో దూసుకు వెళ్ళాలన్న సదుద్దేశ్యంతో యిచ్చేవారు .

ఈ రోజుల్లో ప్రభుత్వమే కాకుండా కొన్ని కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ప్రత్యేకంగా ఈ మార్గాన్నే ఎంచుకొని ఎంతో మంది చదువుకోవాలనుకొనే విద్యార్ధులకు ఈ ధన సదుపాయం ఏర్పరిచారు .

ఈ అవసరము వున్న వాళ్ళు , ఈ అవకాశం వినియోగించుకొని సద్వినియోగ పరచుకొనవలసినది . 

ఈ అవసరము వున్న వాళ్ళకు తెలియపరచి మీకు చేతనయినంత సాయం మీ తోటి వారికి అందించవలసినది .





             
                                                                       *******************


ఛేంజ్ ఎక్స్ఛేంజ్

                                                             
                                                                                                                                     సేకరణ : శర్మ జి ఎస్


పుష్కరం అంటే 12 సంవత్సరాలన్నమాట . మన భారతదేశంలో 12 నదులు వున్నాయి .
అవి :
1 .  గంగ    
CountriesIndia, Bangladesh
StatesUttarakhand, Uttar Pradesh, Bihar,Jharkhand, West Bengal
                                  
2 .  నర్మద
CountryIndia
StatesMadhya Pradesh, Maharastra,Gujarat

3 .  సరస్వతి
Ghaggar river flowing through Panchkula inHaryana in India. Ghaggar-Hakra River has been identified as the historic Sarasvati river by many researchers.

4 .  యమున 
CountryIndia
StatesUttarakhand, Uttar Pradesh,Haryana

5 .  గోదావరి
CountryIndia
StatesMaharashtra, Telangana,Chhattisgarh,Andhra Pradesh,Pondicherry (Yanam)
RegionSouthern India, Western India

6 .  కృష్ణ
CountryIndia
StatesMaharashtra, Karnataka,Telangana, Andhra Pradesh

7 .  కావేరి
CountryIndia
StatesKarnataka, Tamil Nadu

8 .  భీమ
CountryIndia
StatesMaharashtra, Karnataka,Telangana

9 .  తపతి
CountryIndia
StatesMadhya Pradesh, Maharastra,Gujarat

10.  తుంగభద్ర
CountryIndia
StatesKarnataka, Andhra Pradesh,Telangana
  
11.  పరిణీత
CountryIndia
StatesMaharashtra, Telangana
DistrictsGadchiroli, Adilabad

12.  తామ్రపర్ణి
CountryIndia
StateTamil Nadu
DistrictsTirunelveli, Thoothukudi

ఈ నదుల వివరాలు విక్కీ పీడియా సహకారంతో .

 12 నదులు 12 సంవత్సరాలకొకమారు పరవళ్ళు త్రొక్కి ప్రవహిస్తుంటాయి . అంతవరకు వున్న ఆ నీళ్ళు స్వఛ్ఛతను సంతరించుకొంటాయి . ఆ ప్రవహించే నదిలో స్నానం చేస్తే సర్వ రోగాలు పోతాయన్న నమ్మకాన్ని జన ప్రభంజనంలో చాటినా ప్రయోజనం లేక , సులభంగా జన ప్రభంజనంలో నాటుకు పోయేలా భక్తి మార్గాన్నే ఎంచుకొన్నారు . భక్తికి ముందు భయం ఎప్పుడూ వుంటుంది కదా ! అందుకనే భయభక్తులు అన్నట్లున్నారు . సర్వ పాపాలు పోతాయని , పుణ్యం మూట వస్తుందని , అది కూడా ఆ ముక్కోటి దేవతలు వచ్చి మనకు కనపడకుండా మనతో స్నానం చేసి , మన పాపాల్ని వాళ్ళు తీసుకొని వెళ్తూ , బదులుగా పుణ్యం మూట అందిస్తారని ప్రచారంలోకి తెచ్చారు కొన్ని యుగాల ముంటి మూల పురుషులు . 

ఇలా పుష్కరాల పుటక ప్రారంభమైంది . 
మామూలుగా ఈ నదులలో స్నానం చెయ్యమంటే ఏ పదిమండో, వందమందో ఎంతో ఖర్చు పెట్టుకొని వచ్చి స్నానం చేసి వెళ్తారు .
మఱి లక్షలలో వచ్చి స్నానం చెయ్యాలంటే భయం గాని , భక్తి గాని వుండాలి . 
మానవులలో నుంచే మఱల మానవులు ( మానవులే కాదు ఏ ప్రాణికోటి అయినా ) పుట్టుకొస్తున్నారు . కనుక వీరిలో యుగారంభం నాటి నుంచి చూసిన ఆ నాటి మానవులు అసలు సిసలు వాస్తవాన్ని గ్రహించి వుంటారు . అదే శక్తి హీనత , అలా తగ్గుతూ రావటం . జనసంద్రం పెరిగి పోవటం . నియంత్రణ చెయ్యి దాటి పోతున్నది . వీళ్ళు చెబితే వింటారు , కాని ఆచరించరు అన్న ధృఢనిశ్చయానికి వచ్చిన వాళ్ళై యిలాంటి దైవ సంబంధమైన భక్తిని ప్రాచుర్యం చేశారు . 
అలా అలా ఆచరిస్తూనే వచ్చారు .
కాలక్రమంలో శక్తిహీనులై  తమ యిష్టానుసారం  ఎవరికి వాళ్ళు ప్రవర్తించటంతో , ఆ తర్వాత యుగాల లోని నిబధ్ధత గలిగిన కొంతమంది మేధావులు భయభక్తులను ప్రాచుర్యంలోకి తెచ్చారు . 

ఆ నాటి ముందు యుగాల వాళ్ళ ముందు చూపు బహు దొడ్డది . 


ఆ ముందు చూపుని వక్ర మార్గంలో సమాజంలో చొప్పించి తోటి మనుషుల మనసుల్ని మోసం చేసి ధనార్జనకు పాటుపడి ప్రోగు చేసుకోవటం వల్ల నమ్మకం కోల్పోవలసి వస్తున్నది . 



లెకుంటే , మనం ఈ ప్రపంచంలో పొందుతున్నదానికి కృతఙ్నతగా ఎంతో కొంత తిరిగి ( ఆ పంచభూతాల ప్రకృతికనండి , లేదా ఆ అనంత శక్తికనండి , లేదా ఆ అనంతశక్తికి ప్రతిరూపాలుగా భావిస్తున్న దైవానికనండి ) సమర్పించుకొనటం సబబే . 

అలా కొనసాగినవే ఈ పుష్కరాలలో స్నానం చేస్తే పాపాలు పోవటం , పుణ్యం రావటం .


                                                                                 


ఇటువంటి విషయాలు విన్న తర్వాత తప్పులు , పాపాలు , ఘోరాలు , నేరాలు పెరిగిపోతాయన్న భయం ఎక్కువై పోతున్నది .
ఎందుకంటే ఈ " తాళపత్ర నిధి లోని పుష్కర స్నాన మహిమ " ను చదివిన తర్వాత , ఆ పుష్కరం(12 సంవత్సరం)లో ఎన్ని పాపాలు ,ఘోరాలు , తప్పులు , నేరాలు చేసినా , ఒక్క మారు పుష్కర స్నానం చేస్తే సర్వ పాపాలు , తప్పులు , నేరాలు మఱియు ఘోరాలు సమష్టిన సమసిపోతాయట . 
మన పాపాల్ని ఆ ముక్కోటి దేవతలు తీసుకుపోతారుట . వాళ్ళు మనతో పాటు స్నానం చేసే భాగ్యాన్ని వాళ్ళకు కలిగించినందులకు పుణ్యం మూట యిచ్చి వెళ్ళి పోతారుట .

వాళ్ళు " ఒక వేళ పొరపాటున / గ్రహపాటున పాపాలు చెయ్యటం జరిగితే , యిలాంటి వాటి వల్ల ఆ పాప నివృత్తి చేసుకోవచ్చని . " 

ఆ విషయం వదలి " ఆ పొరపాటుని అలవాటుగా చేసుకొని , యిలా పుష్కర స్నానాలు చేసి పోగొట్టుకో చూస్తున్నారనే చెప్పుకోవచ్చు కొంతమందైనా "


మన ముందు యుగాల వాళ్ళు మంచి కొరకు ప్రారంభించిన అన్నింటిని యిలా తప్పుగా ఉపయోగించటం అలవాటుగా మారి ఆనవాయితీగా చేసుకొంటున్నారు . 

గమనిక : ఈ వ్యాస ఉద్దేశ్యం ఎవ్వరినీ , శాస్త్రాలని విమర్శించటం కాదని అర్ధం చేసుకోవలసినది . 
               ఆర్ధంచేసుకొని ఆచరించగలిగితే అమిత ఆనందం , సుఖం అందుకోగలరు . 
               నేడు మనం యిలాంటి విషయాలని శ్రమ పడకుండా మన ముందు యుగాల వాళ్ళు ఆ శ్రమంతా వాళ్ళే                    పడి మనకు అందించటం జరిగిందని గ్రహించవలసినది .



*                    *                  *