ఉన్నత జన్మ ఈ మానవ జన్మ

                                                                                                                                    రచన : శర్మ జి ఎస్

ఏదైనా అలవాటు చేసుకోవటం తేలికే . దానిని వదలించుకోవటమే చాలా చాలా కష్టమైన పని .

తెలియక చేసేది పొరపాటే , తెలిసి చేసేది , చేస్తున్నది అలవాటుగ పరిగణించాలి . అలా అలవాటైనవి మానాలంటే చెప్పినంత తేఇలక కాదనే చెప్పుకొని తీరాలి .

కొన్ని కొన్ని అలవాట్లు ప్రకృతి, కాల పరంగా వచ్చేవి . అలా వచ్చే అలవాట్లు ప్రకృతి , కాల పరంగా కాలక్రమంలో పోతాయి .

కొన్ని కొన్ని అలవాట్లు శారీరకంగా , ఈ శరీరాన్నంతటినీ అంతర్లీనంగా తన ఆధీనంలో  ఉంచుకొని ఆధిపత్యం చెలాయిస్తున్న ఆకారమే లేని మనసు వల్ల ఏర్పడుతుంటాయి . ఈ అలవాట్లలో కొన్ని దురలవాట్ల కోవలోకి చెందినవి . అటువంటి ఆ దురలవాట్లకు ఈ ప్రాణి బానిస అయిపోతుంటుంది . అందులోంచి బయటకు రావటం అంత సులభమైన పనే కాదంటుంటారు . అది వాస్తవంలో నిజమే కావచ్చు .

ఈ ప్రపంచంలో ని సమస్త ప్రాణులలో ఈ మానవ ప్రాణులు తాము అనుకొన్నది సాధించుకొనే అవకాశాలు అధికంగానే అంది పుచ్చుకొన్నాయనే చెప్పుకోవాలి . ఆ దిశగా అడుగులు వేస్తే సాధించుకోగలరు .

దీనికి కృషి , దీక్ష , పట్టుదల , శ్రధ్ధ , క్రమశిక్షణ అంటే  స్థిర సంకల్పం అన్నమాట . దీన్ని అంటిపెట్టుకొంటే ఆ దురలవాట్లను వదలించుకోగలరు .
ఈ కృషి , దీక్ష , పట్టుదల , శ్రధ్ధ , క్రమశిక్షణలు అలవరచుకోవటానికి ముందు స్థిర సంకల్పం చాలా చాలా అవసరమన్నది గ్రహించి మసులుకోవాలి . త జీవితాన్ని ఆనందమయంగా మలుచుకోవాలి .

ఈ అవకాశం , అవసరం ఒక్క మానవులకు తప్ప ప్రాణులకు తప్ప మరే ప్రాణులకు లేనే లేదు . 
ఎందుకంటే వాటికి ఇవేమీ తెలియవు . పుడ్తున్నాయి , జీవిస్తున్నాయి , మరణిస్తున్నాయి . 

లా ఈ మానవుల జన్మ ఉండదు , ఉండకూడదు .

మిగిలిన ప్రాణులకు , మానవ ప్రాణులకు తేడా ఒక్కటే . విచక్షణా ఙ్నానం . అది ఆ మిగిలిన ప్రాణులకు బహు తక్కువ , ఈ మానవప్రాణులకు బహు ఎక్కువ . 
అందుకే  ఈ మానవ ప్రాణులు మిగిలిన ప్రాణులకు కూడా సాయం చెయ్యాలని ఆలోచిస్తుంటాయి .

కనుక ఈ మానవ జన్మ ఎత్తినందుకు తోటి ప్రాణులను అవసరమైన సమయంలో ఆదుకొనటంతోనే ఈ మానవ జన్మ సార్ధకత చెందుతుంది .

ఒకవేళ ఆదుకొనే శక్తి లేకుంటే , ఏ ప్రాణులకు హాని , కీడు తలపెట్టకుండా ఉన్నా ఈ మానవ జన్మ సార్ధకత చెందినట్లేనని అర్ధంచేసుకోవాలి .

అందుకనే ఈ మానవ జన్మ మహోన్నతమైనదని చెప్పబడ్తోంది , కీర్తించబడుతుంది మన వేదాలలో , అనేక గ్రంధాలలో కూడా .

                                                                      *************

1 comment:


  1. ఒకవేళ ఆదుకొనే శక్తి లేకుంటే , ఏ ప్రాణులకు హాని , కీడు తలపెట్టకుండా ఉన్నా ఈ మానవ జన్మ సార్ధకత చెందినట్లే...నిజమే చాలా చక్కగా చెప్పారు.

    ReplyDelete