ఇట్స్ సో ఈజి............


                                                                                                                                  సేకరణ : శర్మ జి ఎస్ఈ నడుమ ప్రముఖులు

" విదేశీ వస్తువులు కొనటం మానేయమని అందఱికి చెప్పటం " పరిపాటి అయింది .
అలా చేస్తే ఆ విదేశీ డాలర్ విలువ పడిపోతుందని , మనదేశ ద్రవ్యం విలువ వృధ్ధి అవుతుందని .


అలనాడు మనసు కవి , మన సుకవి ఆచార్య ఆత్రేయ గారు చెప్పారు " ఎదుటివారికి చెప్పేటందుకే నీతులున్నాయి " అని .ఎదుటివారిని మారమని చెప్పేబదులు , మనం మారటం చాలా తేలిక . ఆ విషయాన్ని గ్రహించకుండా ఎదుటివారిని మారమంటున్నారు .ఈ నీతులు / మంచి మాటలు చెప్పే వాళ్ళ ఇళ్ళలో ఎక్కువగా వుండే వస్తువులు ఆ విదేశీ వస్తువులే . అంతే కాదు వాళ్ళ పిల్లలు కాని , వాళ్ళ వాళ్ళ పిల్లలు చదువుకునేది కూడా ఆ విదేశివే .


ఏదైనా ఓ మంచిమాట ఎదుటివారికి చెప్పాలంటే దానికో అర్హత కావాలన్న విషయాన్ని మన పూర్వీకులు ఏనాడో సెలవిచ్చారు . అదే ఆనవాయితీగా వస్తోంది .
అందుకే ఆధ్యాత్మిక గురువులు తమ తమ గురువుల ఆదేశాల మేర సమాజానికి మేలు చేయటానికి ఉపక్రమిస్తుంటారు .


ఆ మధ్య మన ప్రధానమంత్రి గారు కూడా యిలాగే చెప్తూ , ఆయన ఒబామా వస్తున్నాడని ఓ ఖరీదైన సూట్ వేసుకొన్నాడుట . పేదరికం గురించి తెలిసిన తను కూడా యిలాంటి వాటికి ప్రలోభ పడితే , యిక ప్రజానీకానికి మార్గదర్శకుడిగా ఎలా నిలబడగలడు .

అంత గొప్ప రామకృష్ణ పరమహంస గారు కూడా , తను ఎదుటివారికి చెప్పేముందు , తాను ఆచరించి ఆ పైనే చెప్పేవారు . అప్పుడే ఆ మాట ఆదర్శనీయమౌతుంది , ఆచరణయోగ్యమౌతుంది .

**********1 comment: