ఏ సవ్వడి చేయకు విజయం నీ వెంటే


                                                                                                                                      సేకరణ : శర్మ జి ఎస్


                                                                                                               

ఎప్పుడైనా , ఎవరైనా శత్రువుతో తలపడదలచుకొంటే , ముందుగా అందుకు అవసరమైనవన్నీ సమకూర్చుకోవాలి . ఈ సమకూర్చుకొనే సమయంలో నువ్వు ఎవ్వరికీ నువ్వు చేయదలచుకొన్న పనిని తెలియపరచ కూడదు . ఎందుకంటె నీకు ముఖ్యమైన వాళ్ళే ఆ శత్రువుకు నీకు సంబంధించిన విషయాలన్నింటినీ చేరవేశారేమోనన్న అపోహలు నీకు కలగవచ్చు . వాస్తవానికి అది నిజం కాకపోవచ్చు కూడా . ఎందుకంటే నీ లోపలి ఉద్దేశం నీ పెదవి దాటి బయటకు వస్తే అది Fఋధివి దాటిపోతుందన్న నానుడి మన పూర్వీకులు ఏనాడో వెలిబుచ్చారు . 
వాస్తవానికి ఆ నీ లోపల ఉద్దేశం నీకు ముఖ్యమైన వాళ్ళు నీ శత్రువుకి చేరవేయక పోవచ్చు . ఆ ఉద్దేశాలని " భావ తరంగాలని " గాలి ద్వారా వెళ్ళిపోతుంటాయి . రెసీవ్ చేసుకొనేవాడి శక్తిని బట్టి వుంటుంది .

ఆ పై ఆ శత్రువును ఎదుర్కోవాలి . 

ఆ పోరులో గెలిచేటంతవరకు నీ ధ్యాస ఆ శత్రువుని గెలవటం మీదనే ఉంచాలి . అప్పుడే నువ్వు అనుకొన్న దానిని సాధించ గలవు .

అలా సాధింపబడిన విజయం అంతటా వ్యాపించేస్తుంది నీకు తెలియకుండానే .

అదే అసలైన విజయం . ఎప్పటికీ గుర్తుంచుకో . ఎన్నటికీ మరువకు .

***********
                    

2 comments:

  1. మౌనంగా చేయవలసిన పనులు చేసుకుంటూ పోతే....విజయమే సవ్వడి చేసుకుంటూ వెంటపడి వస్తుందంటారా!

    ReplyDelete
  2. అదే కదా మన పూర్వీకులు యిలా చెప్పింది " పెదవి దాటితే ఫృధ్వి వ్యాపించుతుందని " .

    ReplyDelete