నచ్చ(ట)మా ?..........


                                                               నచ్చ(ట)మా ?............

                                                                                                                వ్యాస రచన : శర్మ జి ఎస్                   

శుభోదయం .

సహజంగా చాలామంది చాలామందికి నచ్చుతారు , నచ్చరు .  ఆ నచ్చటంలో కూడా ఒకమారు నచ్చిన వాళ్ళు , మరొకమారు నచ్చకపోవడం . మరల నచ్చడం జరుగుతూ వుంటుంది .

ఇది ప్రతి ప్రాణి జీవితంలో జరిగి తీరుతుంటుంది  .

ఎందుకని తరచి తరచి ఆలోచిస్తే మనకే అర్ధమవుతుంది కూడా  .

ఉదా :  1 ) తనయుడి కోరికలు  ( అవి  ఎంతవైనా  కానీ ) తల్లితండ్రులు తీరిస్తే ఆ తల్లితండ్రులు ఆ తనయునికి  నచ్చి తీరుతారు , లేకుంటే నచ్చరు కాక నచ్చరు .

2 ) అలాగే తనయ కోరికలు  ( అవి  ఎంతవైనా  కానీ ) తల్లితండ్రులు తీరిస్తే ఆ తల్లితండ్రులు ఆ తనయకి నచ్చి తీరుతారు , లేకుంటే నచ్చరు కాక నచ్చరు .

3 ) అలాగే భార్య కోరికలు ( అవి  ఎంతవైనా  కానీ , ఉద్యోగం చేసే భార్య అయినా ) ఆ భర్త  తీరిస్తే ఆ భార్యకి  నచ్చి తీరుతాడు, లేకుంటే నచ్చడు కాక నచ్చడు  .

4 ) అలాగే భర్త కోరికలు ( స్వల్పమైనా , ఉద్యోగం చెయ్యని భర్త అయినా లేక  తన భార్య కంటే తక్కువ ఉద్యోగస్థుడైనా ) ఆ భార్య తీరిస్తే ఆ భర్తకు ఆ భార్య నచ్చుతుంది , లేకుంటే నచ్చదు కాక నచ్చదు .

5 ) అలాగే బంధు వర్గానికి కూడా కొన్ని కొన్ని సమయాలలో నచ్చుతుంటాం , కొన్ని కొన్ని సమయాలలో నచ్చం .

6 ) అలాగే కార్య నిర్వహణలో కూడా  కొన్ని కొన్ని సమయాలలో నచ్చుతుంటాం , కొన్ని కొన్ని సమయాలలో నచ్చం . ( ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం వున్నది . 
తన పై అధికారికి తాను అడ్డుగా ఉండకపోవటం ( ఆ పై అధికారి బలహీనతలను చూసినా చూడనట్లు వదిలేయడం లాంటివి ) కొన్ని కొన్ని సమయాలలో తనకు పురోగతిని కల్పిస్తుంది . కొన్ని కొన్ని సమయాలలో అధోగతికి దారి తీస్తుంది కూడా .

7 ) అలాగని తన పై అధికారికి తాను అడ్డుగా వుండటం ( ఆ పై అధికారి బలహీనతలను చూసి వదిలేయకపోవడం వలన )  కొన్ని కొన్ని సమయాలలో తనకు పురోగతిని కల్పిస్తుంది . కొన్ని కొన్ని సమయాలలో అధోగతికి దారి తీస్తుంది కూడా .

అసలు నువ్వు ఎదుటి వారికీ నచ్చాలి అనుకోవటం , నిన్ను  ఎదుటివారు మెచ్చుకోవాలనుకోవటం నువ్వు  తెలుసుకోలేని  నీలోని పెద్ద బలహీనత . 

ఎందుకంటే , ఎదుటి వారికి నచ్చితే , వారు మనల్ని మెచ్చుకొంటారు , అందువలన , ఆ క్షణం కాకపోయినా , ఎప్పటికైనా మనకు మేలు లేదా లాభం జరుగుతుంది అనుకోవటమే .ఇటువంటి ప్రలోభాలే  దీనికి బీజం .
దీనివలన నువ్వు నువ్వులా జీవించలేకపోతున్నావు . అందువలన నువ్వు శాంతిని , సంతృప్తిని కోల్పోతున్నావు . నువ్వు నీ వాళ్ళ కొరకు జీవించటం వలననే . నీ కొరకు నువ్వు ఎప్పుడు జీవిస్తావు ? ప్రతి జన్మలో యిదే బాణీ అయితే నీ కొరకు నువ్వెప్పుడు జీవించగలవు ? గత జన్మలో ఎలా జీవించావో ఎవ్వరికి ఎరుక లేదు ? కొంచెం ఆలోచించి చూడు .

నువ్వు నువ్వులా జీవించేదెప్పుడు ? నువ్వు నువ్వులా జీవించటమే నీ ఈ జన్మకు కారణమని భావించు .

నువ్వు ఎలా వచ్చావో , నీకు తెలియవచ్చు , నీ ముందు వాళ్ళు చూసి చెప్పారు గనుక . కానీ ఎందుకు వచ్చావో నీకు తెలియదు . ప్రాణం వాయువు రూపంలో వుంటుందని మాత్రం తెలుసుకొనగలుగుతున్నావు  . ఆ ప్రాణ వాయువుని ఎదురుగ చూడలేకపోయినా అనుభవించగలుగుతున్నావు  . ఆ ప్రాణం ఎదో ఒక ఆకార రూపంలో నీకు  దర్శనమవుతుంది కనుక నువ్వు ఏదైనా అనుభవించగలుగుతున్నావు  లేకుంటే ఆ ప్రాణవాయువుని చూడనే చూడలేవు  .

కనుక నువ్వు చేయవలసినదల్లా ఒక్కటే . 
సత్యాన్ని , ధర్మాన్ని అనుసరించు , అది నిన్ను సర్వదా కాపాడుతుంది . ఇక్కడ అనుసరించటమంటే , ఉచ్ఛరించటమే కాదు , ఆచరించటమన్నమాట . 

ఎందులకు ఈ సత్యం , ధర్మాన్ని ఆచరించాలంటే , ఈ సృష్టికి మూలాధారాలు అవే అని మన ముందు యుగాల వాళ్ళు తెలుసుకొని , వాటిని మనకు యిలా అందించారు . 

ఎవ్వరిని శాసించటంలేదు , ఎవరికీ వారు ఆచరిస్తే బాగుంటుందని మాత్రమే ఆశిస్తున్నాను . అందువలన సమాజానికి , ఎవరికీ వాళ్ళకూ  మేలు చేకూరుతుంది .

ఇలా ఆ సత్యాన్ని , ధర్మాన్ని అనుసరించి ఆచరించిన నాడు నువ్వు , నువ్వుగా జీవించగలుగుతావు అని గ్రహించుకోవచ్చు .

                                                         ******************

1 comment:

  1. ఇలా ఆ సత్యాన్ని , ధర్మాన్ని అనుసరించి ఆచరించిన నాడు నువ్వు , నువ్వుగా జీవించగలుగుతావు అని గ్రహించుకోవచ్చు .
    ఉన్నమాట

    ReplyDelete