ఆ తరం ఈతరం

                                                               ఆ తరం   ఈ తరం   ( కథ )
                                                                                                                           రచన : శర్మ జి ఎస్ 
పాత కాలం నాటి రామసుబ్బయ్యని తన పదేళ్ల మనుమడు యిలా అడిగాడు .

ఏంటి తాతయ్య మీరలా కష్టపడుతుంటే నే చూడలేకపోతున్నాను .
మన ఇంటి పనులు మనం చేసుకోవటం కూడా కష్టపడ్తున్నాననుకొంటే ఎలా రా ?
ఒక్కడివి చెయ్యటం కష్టం కదా తాతయ్యా ?
కష్టమే గాని సందర్భం కూడా చూసుకోవాలిగా ?
సందర్భం అంటే ? 
తెలియదా ?
తెలియదు కదా తాతయ్యా ? నేను ఇంగ్లీష్ మీడియం , నాకు 2 వ  లాంగ్వేజ్ హిందీ కదా! 
కదు  మరి . సందర్భం అంటే ఇంగ్లీషు భాషలో " సిట్యుయేషన్ " అన్నమాట .
ఓ అలాగా ! . అంత సిట్యుయేషన్ ఏమొచ్చింది తాతయ్యా ?
అమ్మ , నాన్న ఆఫీసు పనులతో బిజీగా వుంటారు కదా ! నానమ్మ ఇదివరకటిలాఆగ పనులు చక చకా చేయలేకపోతోంది .
చక చకా చేయలేకపోతే ఏం పోయింది ? నిదానంగా నైనా చేస్తున్నది కదా! 
నిదానంగా చేస్తుంది , ఉత్సాహంతో కాదు , చెయ్యక తప్పటం లేదని మాత్రమే .
అటువంటప్పుడు ఈ పనులన్నింటికీ పనిమనిషిని పెట్టుకోమని మా అమ్మ , నాన్న చాలాసార్లు చెప్తూనే ఉన్నారుగా .
నిజమేరా , వాళ్ళు చెప్తూనే వున్నారు , కానీ పని మనుషులు దొరకద్దా ? 
ప్రపంచంలో చాలా మంది పనిలేక బాధపడుతున్నారని , డైలీ న్యూస్ పేపర్లో చదువుతున్నాను   , టి వి లలో వార్తలలో వింటున్నానే .
నువ్వు చెప్పింది అక్షరాలా నిజం . కానీ వాళ్ళందరూ పని చేయాలనుకొనే వాళ్ళు కాదు .
మరి ?
వాళ్ళు చేయాలనుకొన్న పని దొరికే వరకు , అలా పని దొరకటం లేదు అనుకొనే వల్ల లిస్ట్ లోనే ఉండిపోతారు , పడిపోతారు కూడా ! అంతే కాదు మనం ఉండే ఇంటికి  , వాళ్ళుండే ఇంటికి చాలా దూరముంటుంది . రావటానికి , పోవటానికి యిబ్బంది అవుతుంది కదా !
నిజమే తాతయ్యా . మరి మన ఇంటికి దగ్గరగా ఎవ్వరు పని వాళ్ళు లేరా ?
ఉండే ఉంది ఉంటారు , మాములు పని వల్ల కంటే ఎక్కువగా జీతం అడుగుతారు .
అయితే అయింది , అమ్మ , నాన్న సరే అన్నారుగా . పెట్టుకోవసిక్యూ కదా! 
అందుకే పెట్టుకున్నాం . 4 రోజులు పని చేసి ఎగనామం పెట్టింది .
అంటే ? ...............
ఇంగ్లీషులో ఆబ్సెంటిజం అన్నమాట . ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి మానేస్తుంటారు . అప్పుడు మీ నానమ్మ ఒక్కతే వంట , యింటి మిగిలిన పనులు  చేయలేదురా . అందుకే నేను సాయపడ్తుంటా .
అటువంటప్పుడు వంట చేయటానికి ఎవరినైనా పెట్టుకొంటే ?
ఎవరిని పడితే వాళ్ళను పెట్టుకోలేమురా ? మనం బ్రాహ్మణులం కదా! ఎవరో వంట చేస్తే తినలేము . 
మరి బైటకు  వెళ్ళినప్పుడు తింటూనే ఉన్నారుగా తాతయ్యా . 
తప్పనిసరై తింటున్నాము . మీ నానమ్మ కడుపు మాడ్చుకొంటుంది ద్రవ పదార్ధాలు త్రాగి . 
అలా చెయ్యటం ఎందుకు తాతయ్యా , నీలాగా నానమ్మ తినచ్చు కదా ! .
అందరూ ఒకలా వుండరురా . నేను కూడా తప్పని సరై తింటున్నాను . అదే రోజు తినాలంటే , తింటే సబబు కాదురా . 
ఎందుకని సబబు కాదు ?
ధర్మం , ఆపద్ధర్మం అని రెండు ఉంటాయి . ఈ రెండూ ఎప్పుడెప్పుడు , ఎక్కడెక్కడ వాడాలో అప్పుడు , అక్కడ వాడాలి . అంతే గాని అవకాశం వచ్చింది కదా అని వాడకూడదు . ఉదా : దాహమేసి ప్రాణం పోతుంది అంటే ఎలాంటి నీరు దొరకనప్పుడు మురికినీరు ఆ ప్రాణికి పట్టవచ్చు . అంతే కాదు ఆల్కహాల్ పడితే ప్రాణం బ్రతుకుతుంది అంటే అది కూడా పట్టవచ్చు . అలాగని రోజు అవి తీసుకోకూడదు . తీసుకొంటే వ్యసనంగా మరి ఆ ప్రాణమే పోతుంది . 
అలాగా తాతయ్యా . 
అందుకేరా యిలా మీ నానమ్మకు తోడుగా నేను ఇష్టపడి కష్టపడుతున్నాను . ఇష్టపడి కష్టపడితే కష్టపడ్తున్నామన్న భావనే ఆ కష్టపడేవాళ్ళకి వుండదురా .
మీకుండకపోవచ్చు తాతయ్యా . నాకు మాత్రం చాలా చాలా కష్టపడుతున్నారని . అందుకే నేను పెద్దయిన తర్వాత మీకా కష్టం లేకుండా చేయాలనుకొంటున్నాను .
ఎం చేస్తావురా ?
పనిమనుషులు దొరకటం లేదు అన్న సమస్య లేకుండా , హాయిగా ఓ రోబోట్ ను పెట్టేస్తాను .
రోబోటా ! ఎందుకు ? ఏం చేస్తుంది ?
ఆ అదే . అన్ని పనులు చేయటానికి .
అది బొమ్మ కదరా , ఎలా చేస్తుంది .
అది స్వతహాగా చెయ్యదు , అంటే దానంతట అది ఏమి చెయ్యదు . నేనే దానిని అన్ని పనులు చేసేలా తయారు చేస్తాను .
ఎలా ? 
అది ఏ ఏ పనులు చెయ్యాలో ముందుగా వివరంగా వ్రాసుకొని , ఆ పై అలాంటి ప్రోగ్రామ్ చేసి , ఈ ప్రోగ్రామ్ దానిలో ఇన్సర్ట్ చేస్తాను .
అప్పుడది చేస్తుందా ?
అప్పుడే అది చేయగలుగుతుంది . దానికి మనలా ఆలోచించే మెదడు లేదు .
మెదడు లేనప్పుడు అదెలా ఆలోచించగలుగుతుంది ?
అది ఎప్పుడూ ఆలోచించలేదు తాతయ్యా .
అయితే నువ్వు చెప్పిన పనులెలా చేయగలుగుతుంది ?
నేను చేసే ప్రోగ్రామ్ వల్లనే చెయ్యగలుగుతుంది . 
అంటే దానిని అలా తయారు చేస్తావా ?
దానిని నేను తయారు చెయ్యను ? ఆ రోబోట్లు తయారు చేసే ఉంటాయి . మార్కెట్లో పెట్టి అమ్ముతారు . అవి కొనుక్కొని మనకు అదెలా పని చేయాలో , అలా ప్రోగ్రామ్ చేసే దాని హార్టులో ఫీడ్ చేస్తే అది , మనకు కావలసినట్లుగా పనులు చేసి పెడ్తుంది . 
బాగుందిరా . ఇప్పుడే కొనుక్కుంటే బాగుంటుంది కదా ! 
అవి యిప్పుడమ్మరు యిక్కడ . ఫారెన్ లో ఉంటాయి . చాలా రేటు .
చాలా రేటా  ? అయితే వద్దు లేరా .
అది కాదు తాతయ్యా . ఫారెన్ నుంచి ఇక్కడకు తెచ్చుకొనేటప్పటికీ ఆ కంట్రీ పన్నులు , ఈ కంట్రీ పన్నులు , ఎక్సయిజ్ పన్నుల్ని , యిలా రక రకాల పన్నులు దానిమీద వేస్తారుట . అందుకని దాని రేటు ఎక్కువయి పోతుందట మొన్న మా మమ్మీ ,  డాడీ చెప్పారు .
అయితే మీ మమ్మీ , డాడీకి ముందే కొనమని చెప్పావా ? 
లేదు తాతయ్యా , నాకు ఓ వస్తువు కావలసి అడిగితే , అప్పుడు చెప్పారు  నేను పెద్దయ్యేటప్పటికీ , మన ఇండియా వల్లే ఆ రోబోట్లను తయారు చేస్తారు . అప్పుడు అంత రేటు ఉండదు కదా ! 
అప్పటిదాకా మమ్మల్నిలాగే కొనసాగమంటావు .
అంతే కదా తాతయ్యా .
పోనీ నీకు చాతనైనంతలో సాయపడవచ్చుగా .
ఓపిక లేదు తాతయ్యా . 
అప్పుడే ఓపిక అయిపోయిందా ?
ఇప్పుడు ని వయసెంతరా ?
10 యియర్స్ .
ఇప్పుడు న వయసెంతో తెలుసా ?
నాకెలా తెలుస్తుంది ? మీరెవరైనా చెప్తే తెలుస్తుంది . చెప్పండి తాతయ్యా .
72 సంవత్సరాలు . నేనైతే ఆ పదేళ్ల వయసుకి ఆమడ దూరం నుంచి బిందెతో నీళ్లు తెచ్చేవాడిని . ఏ పని చెప్పినా చెయ్యను అనకుండా చేసే వాళ్ళం . ఎదురు చెప్పేవాళ్ళం కాదు .
బహుశా వాళ్ళు మిమ్మల్ని అర్ధం చేసుకొని , మీరు చేయగలిగిన పనులే చెప్పేవాళ్ళేమో .
అంటే మేము మీరు చెయ్యలేని పనులను చెబుతున్నావనుకుంటున్నావా ?
అది కాదు తాతయ్య , మీ రోజుల్లో చదువులకు , ఈ రోజుల్లో చదువులకు ఎంతో తేడా వున్నదిగా .
దానికి , దీనికి సంబంధమేమిటిరా ?
ఉంది . మీ ఆ రోజుల్లో యిన్ని పుస్తకాలు ఎక్కడున్నాయి . 
సబ్జక్ట్స్ మాత్రం అవేరా ?  
ఈ పుస్తకాలు మొయ్యలేక వెన్నుపూస నల్లపూస అయిపోతోంది . అందుకే మీరేం చెప్పినా మేం చెయ్యలేకపోతున్నాము . 
ఈ విషయంలో నేను నీతో ఏకీభవిస్తున్నాను . 
అందుకే తాతయ్యా , మీ కష్టం చూడలేక , నేను చెయ్యలేక ఆ రోబోట్  లో మనకు కావలసిన విధానంగా ప్రోగ్రామ్ ఫీడ్ చేసి మీ కష్టాన్ని తగ్గించాలనుకొంటున్నా.
ఎలా ప్రోగ్రామ్ చేస్తావ్ ? ఏ ఏ పనులు మాకు తగ్గిస్తావో చెప్పరా ? 
అది తెల్లవారు ఝామున ఏమేమి చేయాలో ఫీడ్ చేసి ఉంచుతా . ఆ ప్రకారం 4 .30 గంటలకి నాయనమ్మను లేపుతుంది . రోజూ ఏమేమి చేయాలో అడుగుతుంది . ఫర్ ఎక్జామ్పుల్ ఈ రోజూ స్కూలు లంచ్ బాక్సులలోకి ఏమేమి చేసి పెట్టాలో అడుగుతుంది . ఆ తర్వాత పిల్లలను ఎన్నింటికి లేపాలో అడుగుతుంది . ఎవరెవరిని ఎన్నింటికి లేపాలో , ఎవరెవరికి వేడి నీళ్లు ఎలా కావాలో , ఎవరెవరికి ఏం  బ్రేక్ ఫాస్ట్  చేయాలో అడుగుతుంది . అలా  అన్నింటిని చెప్పిన ప్రకారం తన మైండ్ లో ఫీడ్ చేసుకొంటుంది . 
అది మరచిపోదా ? అన్ని గుర్తుపెట్టుకొంటుందా ? ఆశ్చర్యంగా అడిగాడు తాతయ్య .

మరచి పోదు , పైగా అన్నీ త్వరగా చేసేస్తుంది , అందరకి టైం కి అందిస్తుంది . ఎవరికీ శ్రమ ఉండదు  తాతయ్యా .    
అలా కంటిన్యువస్ గా ఎప్పుడూ పని చేస్తుంటుందా ? అడిగాడు తాతయ్య .
అది కంటిన్యువస్ గా పని చేయలేదు . దాని బ్యాటరీ 8 గంటలు మాత్రమే పని చేస్తుంది .  మళ్ళీ ఆ బ్యాటరీకి  ఛార్జింగ్ 1 గంట పెట్టాలి . అప్పుడు మళ్ళీ 6 గంటలు పని చేస్తుంది అని వివరించాడు మనుమడు .
మనకే పనులు అది చేయకపోయినా మళ్ళీ ఆ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవాలా ? అని అడిగాడు తాతయ్య .
అక్కర్లేదు తాతయ్యా . దాని వర్కింగ్ కెపాసిటీ 6 గంటలు మాత్రమే . 5 గంటలు పని చేసిన తర్వాత అది బీప్ శబ్దం యిస్తుంది ( మరో అరగంటలో ఛార్జింగ్ పెట్టాలని ) , ఆ బీప్ శబ్దం మళ్ళీ మరో పావు గంటకు యిస్తుంది . అప్పుడు వెంటనే ఛార్జింగ్ లో పెట్టాలి అన్నమాట .
రోబోట్ లో లోపల అమర్చబడిన ప్లగ్ వైరుని బైటకు తీసి ప్లగ్గుని ఛార్జింగ్ సాకెట్లొ వుంచాలి .  
మరి మధ్యాహ్నం పూట మాకు లంచ్ వేడిగా చేసి పెడుతుందా ?
పెడ్తుంది . కాకుంటే మీకు దాన్ని హ్యాండిల్ చేయటం తెలియదుగా . అందుకని ఉదయమే మీకు చేసేస్తుంది . మీరు కావలసినప్పుడు ఒవేన్ లో వెచ్చ చేసుకొని తినండి .
మరల ఈవెనింగ్ స్నాక్స్ కూడా అదే అందిస్తుంది . రాత్రి వంట కూడా అదే చేసేస్తుంది .  డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా పెడ్తుంది . బ్యాటరీ ఉంటే మనందరికి వడ్డిస్తుంది . లేకుంటే ఛార్జింగ్ అయ్యే వరకు ఆగితే అదే వడ్డిస్తుంది .
బాగుందిరా . మా మనుమడు మా కష్టాన్ని మా బాగా తగ్గించేస్తాడన్న మాట . 
నీకెలా ఈ ఆలోచన వచ్చిందిరా .
మీ కష్టాన్ని చూసినప్పుడు కాదు తాతయ్యా , మా సాయం మీరు అడుగున్నప్పుడు , మేము చేయలేకపోయినప్పుడు . ఎందుకు చేయలేకపోతున్నానని ఆలోచించినప్పుడు , ఈ కాలంలో అందరూ ప్రతి చిన్నపనికి  అలసిపోతున్నారు , అందువల్లనే వాళ్ళ వాళ్ళకి ఏమి చేయలేకపోతున్నారు . అలా చేయకుంటే రిలేషన్ షిప్ ఎలా మెయింటైన్ అవుతుంది . అర్ధం చేసుకోకపోగా అపార్ధాలు ఎక్కువవుతాయి . అందుకనే టెక్నాలజీని ఉపయోగించు కోవాలనుకొన్నా . అప్పుడైనా నా వాళ్లకు నా వంతు చేయగలుగుతాను . అలాగే అందరూ ఎవరి వాళ్లకు వాళ్ళు చేయగలుగుతారు . ఆ రిలేషన్ షిప్ కొనసాగుతుంది కదా ! అని బదులిచ్చాడు ఆ మనుమడు .

ఓ ప్రక్క మనుమడి తెలివితేటలకు  అనందం , మరోప్రక్క ఈ మనుమడు పెద్దయి ఆ రోబోట్ ని తెచ్చి సుఖపెట్టేనాటికి , తాము బ్రతికే వుంటామా అన్న సందేహంలో పడిపోయాడు సుబ్బరామయ్య  .                                                      ************************  No comments:

Post a Comment