ఎదగటం - ఒదగటం                                                   ఎదగటం - ఒదగటం
                                                                                                                   వ్యాసరచన : శర్మ జి ఎస్   

పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎదగమని వెంటపడుతుంటారు . 
అలాగే ఎదిగిన తర్వాత నది వయసు దాటిందంటే అడగమని వేధిస్తుంటారు .

ఎదగటానికి ఎంతోమంది సాయం కావాలి , దొరకచ్చు , దొరకక పోవచ్చు . దొరకక పోయినా ఎదుగ గలరు .

మరి ఒదగటానికి ఎవ్వరి సాయం లభ్య పడదు , ఎవరికీ వారే ఒదిగి వుండవలసి వస్తుంది . 

వి  మానవ జీవితానికి చాలా ముఖ్యమైనవి .

తల్లితండ్రులు తమ ( ఆడ / మగ ) పిల్లల దగ్గర వుండవలసి వస్తుంది ఎంత స్థితి
మంతులకైనా . ఎలాగంటే ప్రేమతోనో , కన్న పిల్లల అవసరాలకో లేక భార్యా భర్తలలో ఒకరు గతించో లేక వున్న ఒక్కగా నొక్క కొడుకును వదులుకోలేకనో , లేక వున్న ఒకే ఒక్క కూతురిని వదులుకొని , విడిగా వుండలేకనో , లేక తమ మనుమళ్ళు , మనుమరాండ్రు చిన్న పిల్లలనో , లేక తమ కోడలు ఉద్యోగం చేస్తుందనోవాళ్ళకు ఎవరి అండ లేదనో పలు రకాల కారణాలను వాళ్ళ వాళ్ళ మనసులకు సర్ది చెప్పుకొని వుంటూంటారు .
ఇటువంటి పరిస్థితులలో తప్పనిసరిగా ఒదిగి వుండవలసి వస్తుంది . ఒదిగి వుండటం ఒక వైపు మాత్రం వారినే ఆశ్రయిస్తుంది .
చెప్పటం తేలికే . ఆచరణకు చాలా చాలా కష్టతరమైనది .
పెద్ద వయసు వచ్చిన తల్లితండ్రులు ఏమి చేసినా , ఏమి మాట్లాడినా తప్పుగా చెలామణి అవుతుంటుంది . ఎందుకంటే పిల్లల సంపాదన ముందు , తల్లితండ్రుల సంపాదన లెక్కకు రాదు . వాళ్ళు అనుభవించిన కష్టసుఖాలన్నీ పిల్లలకు లెక్కకు రావు . దీనికి బలమైన కారణం సామాజిక జీవన శైలిలో త్వరితగతిన వచ్చిన ఊహించని పెను మార్పులు
సామాజిక జీవనంలో యిటువంటి మార్పులు సమాజ శ్రేయస్సుకు ఉపయోగ పడవలసిందే . స్వంత లాభంగా ఆపాదించుకోకూడదు . అదేదో తామే సాధించినట్లు , తామే అనుభవిస్తున్నట్లు , వాళ్ళ పెద్దలేమి యిటువంటివి వారి జీవన యానంలో చూడలేదన్నట్లు , వీళ్ళే జీవన విధానానికి నాంది పలికినట్లు భావించకూడదు .
పెద్ద వయసు వచ్చిన తల్లితండ్రులు అందుబాటులో వున్నారంటే ఎంతగానో ఆనందించాల్సి వున్నది . వాళ్ళు మార్గదర్శకులు తమ పిల్లలకు అన్ని సమయాలలో . విషయం మరచారు నేటి పిల్లలు .
తాము ఎంతో చక్కగా చూస్తున్నా తమ దగ్గర తమ తల్లి తండ్రులు వుండలేకపోతున్నారని , అందుకే వాళ్ళ మనసుని బాధ పెట్టటం యిష్టం లేక వృద్ధాశ్రమంలో డబ్బులు నెల నెలా ఖర్చు చేస్తున్నాము . నెలకొకమారు వాళ్ళ దగ్గరకు వెళ్ళి కుశల సమాచారములు అడిగి వస్తున్నాము . పిల్లలను అడిగినప్పుడు వాళ్ళకు చూపించలేకపోతున్నాము అంటే , వాళ్ళ వాళ్ళ చదువులు , ఉద్యోగాల వల్ల వీలు కుదరటం లేదు . వీలు కుదిరినప్పుడు మొబైల్లో మాట్లాడిస్తూనే వున్నాము . అయినా వాళ్ళకు సంతృప్తి లేదు . అంతకు మించి ఏమి చేయగలం అంటుంటారు చాలా మంది పిల్లలు .
నాడు ఆంగ్లేయులు భారత దేశాన్ని పరిపాలించిన కాలంలో , దేశ  స్వాతంత్య్రం లేదు కాని , మన సంస్కృతి , సాంప్రదాయాలన్నింటినీ చక్కగా కొనసాగించారు . అలా కొనసాగించటంవలననే , మన దేశానికి  స్వాతంత్య్రం కావాలన్న వాళ్ళు ఎంతో మంది పుట్టుకొచ్చారు . దానికి కారణం మన సన్స్కృతి , సంప్రదాయాలే
స్వాతంత్య్రం అయితే వచ్చింది , గాని  స్వేఛ్ఛ యధేఛ్ఛగా పెరిగిపోవటంతో ( ఆంగ్లేయులని తరిమి పారేసి , వాళ్ళ సంస్కృతిని అలవర్చుకొనటమే ) మన సంస్కృతిని అలవరచుకోలేక పోతున్నారు .
నిజానికి తల్లి తండ్రులు కోరుకొంటున్నది యిది కానే కాదు . ఇంటిలోని వాళ్ళందరితోటి సహ జీవనం . సహ జీవనంలో ఎదురవుతున్న కష్టాలలో పాలు పంచుకోవాలని , లభ్య మవుతున్న సుఖాలలో పాలు పంచుకొని సంతృప్తి చెందాలని .
ఇలా చేస్తారని తెలిసే పిల్లలు వాళ్ళ తల్లి తండ్రులను వాళ్ళకు కనపడనంత దూరంగా వుంచుతున్నారు .
వాళ్ళ స్వవిషయాలలో జోక్యం చేసుకోవటం వాళ్ళకు యిష్టం వుండకపోవటమే అసలు సిసలైన కారణం .
వాళ్ళు , వాళ్ళ పిల్లలు పెద్దైన తర్వాత వాళ్ళు , వాళ్ళ విషయాలన్నీ వాళ్ళ తల్లితండ్రులకు పరవిషయాలు . ఎటువంటి సలహాలు చెప్పే ప్రయత్నం చెయ్యకూడదు . వాళ్ళు , వాళ్ళ పిల్లల విషయాలు వాళ్ళ స్వవిషయాలుగా భావిస్తున్నారు .
అలా వాళ్ళ స్వవిషయాలలో జోక్యం చేసుకొనే విషయాన్నే పెద్దవాళ్ళు మరో రకంగా అర్ధం చేసుకొనటం వల్లనే , యింకా పిల్లల ప్రేమ కావాలనుకొంటుంటారు . అది పొందలేక పోతున్నారు .
ఎప్పుడు పొందగలరంటే .......

వాళ్ళింటిలోనే వుంటూ , వాళ్ళ స్వవిషయాలలో కల్పించుకోకుండా వుండటమంటే సాక్షీభూతుడుగా వుండటం అన్నమాట . వాస్తవానికి మానవులకు కావలసినది యిదే . ఎందుకంటే
జగతిలో ఎవరికి ఎవరూ లేరు
ఎవరితో ఎవరూ ఎన్నడు పోరు
ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వుండాలంటారు .
అలా వుండలేరు , దానికి కారణం మాయ .
అంతా నాదే , అందరూ నా వాళ్ళే నన్న మాయ మానవులను పట్టి పీడించటంతో , దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు .తమ పిల్లల మానాన తమ పిల్లలను వదలి వేసిన నాడు అంటే , వాళ్ళు చాలా చాలా పెద్దవాళ్ళైనారు , మనకంటే ఎక్కువగా ప్రపంచాన్ని చూశారు , చూస్తున్నారు , వాళ్ళకు మన సలహాలు , సంప్రదింపులు , మంచి చెడు అవసరం లేదు , వాళ్ళకు తెలిసినంతగా మనకు తెలియదు అని తెలుసుకొన్న నాడు .
అప్పుడు తల్లితండ్రులనేమిటి , అత్త మామలనైనా తమ యింట్లోనే పెట్టుకొని చూసుకొంటారు , ఎలాంటి వృద్ధాశ్రమాల అవసరమే వాళ్ళకు లేదు .
వినటానికి చాలా చాలా బాగున్నది . నూటికి నలుగురో , ఐదుగురో వుంటారేమో
అనుక్షణం ఒదిగి ఒదిగి వుండవలసిన స్థితి . ఆచరణకే అసాధ్యమైనది చాలా మంది తల్లి తండ్రులకు . ఎప్పుడో ఒకమారు అంటే ఒదిగి వుండటం కుదరవచ్చు .
ఉదా : ప్రయాణంలో నుల్చోలేక , అందుబాటులో వున్న ప్రక్క సీటు వారిని సర్దుకొనమంటే , సరే నని సర్దుకొనగానే , అలాగే సర్దుకొని కూర్చొని ప్రయాణం చేస్తారు . బండి దిగిన తర్వాత అబ్బ చాలా యిబ్బంది పడ్డాననుకో అని చెప్పుకొంటుంటారు . వాస్తవానికి ప్రయాణం 4 / 5 గంటలు మాత్రమే . 4 / 5 గంటల ప్రయాణంలో సర్దుబాటు అంత బాధగా వుంటే మరి జీవిత శేష కాలం ( ఇంత అని నిఖరంగా తెలియనిది ) ఎలా ఒదిగి ఒదిగి వుండగలరు
కనుకనే వుండలేకపోతున్నారు .
అలా వృద్ధాశ్రమాలలో చేర్పించి తామేదో గొప్పగా తల్లి తండ్రులను , అత్త మామలను ఎంతో చక్కగా చూస్తున్నామని భావిస్తుంటుంటారు .
భవిష్యత్తులో వాళ్ళూ పెద్ద వాళ్ళౌతారు , వాళ్ళను వాళ్ళ పిల్లలు మాత్రమైనా చూస్తారో లేదో గ్రహించలేకపోతున్నారు .
డబ్బులు మనుషులను దగ్గర చేరుస్తాయి , మనసులను దగ్గర చేర్చలేవు . డబ్బులతో బంధాలను కొనుక్కోలేము అన్నది గ్రహించటం ఎంతైనా మంచిది .
డబ్బులు జబ్బుల్ని కూడా పూర్తిగా తగ్గించలేవు . సుఖాల్ని అందిస్తాయేమో కాని , సంతోషాన్ని , సంతృప్తిని అందించలేవు . సుఖం శరీరానికి సంబంధించినది , సంతోషం , సంతృప్తి మనసుకు సంబంధించినవి .
పంచేద్రియాలను చూపించగలం . విడి విడిగా పని చేస్తాయి . వీటన్నింటినీ ఒక్క త్రాటి మీద నడిపించగలిగినదే మనసు . మనసు యిది అని చూపించటానికి ఒక్కటి కాదు . పంచేంద్రియాల సమ్మేళనం .
ఒదిగి వుండటం కష్టమే , కాని యిష్టమైన వాళ్ళకు వాళ్ళ శేష జీవితం ప్రశాంతంగా సాగిపోతున్నట్లు కనపడ్తుంది అందరికి . కాని అది ఆత్మ వంచనే .

                                                                  
                                            ******* ******* *********

1 comment:

  1. పెద్దవాళ్ళయ్యాకా ఉమ్మడి కుటుంబంలో సాక్షీ భూతంగా జీవించాలి, ఎవరికి ఎవరూ కర్తలు కాదు. అడిగితే సలహా చెప్పాలి నిర్ణయంకాదు. నిత్యమూ పోరుపడేకంటే వేరుపడడమే మంచిది.

    ReplyDelete