భయ భక్తులు


భయ భక్తులు 
( కవిత )
                                                                                                                     రచన : శర్మ జి ఎస్
తప్పులు , పాపం చేస్తే ,
ఆ దేవుళ్ళే కాపాడతారని ,
తప్పులు చేయటం ,
అదో ఘనకార్యంగా ,
అలవాటు చేసుకొన్నారు  ,
ఆ భావన తోనే  ,
ఆ దేవుళ్ళనే వేడుకొంటున్నారు  '

కాపాడటం లేదనుకుంటే  ,
ముడుపులు కట్టబెడ్తూ ,
తమ యిడుములు బాపమంటున్నారు ,
అప్పటికీ కనికరించకుంటే ,
ఇంకొంచెం యిస్తానంటారు ,
బదులు రాకుంటే ,
తమంతట తామే ,
పోనీ యిది కూడా తీసుకో అంటూ ,
డీల్ పెంచుతుంటారు ,
ఎలాగైనా తమని ,
ఒడ్డున పడేయమంటారు .

అదేమంటే ,
మీరున్నది మా  కోసమే కదా!
ఆవాసమే లేకుండా ,
అటూ , ఇటూ ,
తిరుగుతున్న మీకు ,
ఈ ఆవాసాలేర్పరచింది  
మేమే కదా ! అంటూ 
ఎదురు తిరుగుతారు 
మమ్ము కాపాడకుంటే ,
మా మాట వినకుంటే ,
మీ ఆవాసాలకే  ఎసరు పెడ్తామంటారు ,
పదే పదే చేస్తుంటారిలా బ్లాక్ మెయిల్  . 

భక్తి లేనే లేదు , 
భయమూ పోయింది ,
అందుకే  అన్నారు ,
మన ముందు తరాల వారు ,
భక్తి , భయమూ లేకున్నా ,
భయ భక్తులైనా వుండాలని  .

వాస్తవానికి ,

ఆ దేవుడి ( అనంత శక్తి ) ముందు ,
ఏ జీవైనా , జీవుడైనా ,
ఓ అణువు మాత్రమే నన్నది ,
గ్రహించుకొంటే చాలు ,

ఆ చెత్త వేషాలకు చెక్  చెప్పినట్లే .********

1 comment: 1. భయభక్తులులే వోయి, న
  భయంబు గోరిరి జిలేబి భక్తులు కాకా
  మయముగ జేసెరనంతుని!
  స్వయంభు నాతడు వినండి సకలంబతనౌ !

  జిలేబి

  ReplyDelete