కోమలి


కోమలి
                                                                                                                                రచన : శర్మ జి ఎస్
                              
ఆ అధరం
అతి మధురం


ఆ గలగల నవ్వులు
కిలకిలారావాలు


అవి కన్నులా ! కావు,
పద్మపత్రాలు

ఆ వాలుజడ 
మెలికల త్రాచుపాము


ఆ యమ నడక
హంస గమనం


ఆ అవయవాల సొంపులు
చిక్కని పాల పొంగులు

ఆ అన్నులమిన్న అందాలు
మరులుగొల్పు సుగంధాలు


    *****

భావి పౌరులు


                 భావి పౌరులు 
                                                                            రచన : శర్మ జి ఎస్ 
       
చిరు చిరు లేతకొమ్మలే
చిన్నారి పొన్నారి పాపలు

చిరు చిరు కొమ్మలలో 
లేతరెమ్మల నిగనిగలు

చిన్నారి పొన్నారి పాపలలో 
ముసి ముసి నగవులు

చిరు చిరు లేత కొమ్మలే 
రేపటి కూకటి  వృక్షాలు

చిన్నారి పొన్నారి పాపలే
రేపటి మేటి భావి పౌరులు .
   
         ******

దేవుడు వరమిచ్చినా.............


                                                                                       "   దేవుడు వరమిచ్చినా............. "
      

                                                                                                                 నాటిక రచన : శర్మ జి ఎస్                            

సారధి : ఒరేయ్ రఘు ,మనదేశంలో పేదవాడు ఎంత కష్టపడి పని చేసినా , పెద్దవాడు కాలేక్ పోతున్నాడు . ఎంత ఎత్తు ఎదిగినా గొఱ్ఱెకి బెత్తెడే తోక అన్నట్లున్నాయి మన కూలీల జీవితాలు. ఏ నాటికైనా బాగుపడతాయంటావా ? 

రఘు : ఏమిటిరా సారధి , అంతలోనే అంత డీలా పడిపోయావ్.

సారధి : ఏమున్నదిరా రోజు రోజుకి మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి కాని, మనకూలీ మాత్రం పెరగటం లేదురా. ఇదంతా ఆ మానేజర్ గారి వల్లనేరా ?

రఘు : ఏం ? ఏమైంది ?

సారధి : ఏమవటం ఏమిటిరా ? ఈ చాలీ చాలని కూలీతో  ఎన్నాళ్ళిలా కాలం గడపటం ?

రఘు : దానికి ఆయన ఏం చేస్తారురా ?ఈ ఫాక్టరీ ఏమైనా ఆయనదా ఏమిటి ?

సారధి :బలేవాడివిలేరా .ఆయనది కాకపోతే మాత్రం డైరెక్టర్ గారికి తెలియ చేయవలసిన బాధ్యత ఎంతైనా వుందా ? లేదా ?

రఘు :ఆ విషయం నిజమేలే. మఱి తెలియచేయనంటున్నారా ?

సారధి :అలా అంటే సమస్యే వుండదుగా. మనమే ఏదో ఒక దారి చూసుకొంటాంగా.

రఘు : అది సరే కాని , మన యూనియన్ సెక్రెటరీ గారిని అడగక పోయావ్.

సారధి : అడిగానురా.

రఘు : ఏమన్నారేమిటి ?

సారధి : ఏముంది , మనం మాట్లాడినట్లుగా వాళ్ళు మాట్లాడలేరుట.

రఘు : అవును మరి. మనం మాట్లాడినట్లుగా వాళ్ళూ మాట్లాడితే , వాళ్ళు మనలాగే మామూలు కార్మికుల్లా  వుండిపోదురు . యూనియన్ సెక్రెటరీలు  కాకపోదురు . ఆది సరేగాని ఫైనల్ గా ఏమన్నారు ?
                       
సారధి : మానేజరు గారితో మాట్లాడరట, డైరెక్టర్ గారు రావాలి. ఈ విషయం ఆయనే తేల్చాలి అన్నారట.


రఘు : డైరెక్టరు గారు రాత్రే వచ్చారుట. మరి సెక్రెటరీ గారికి మళ్ళీ గుర్తు చేద్దామా ?

సారధి :ఆ........... టప్పక గుర్తు చేద్దాం. అరుగో సెక్రెటరీ గారు ఆఫీసువైపు వెళ్తున్నారు. ద మాట్లాడుదాం.

రఘు  : అలాగే వెళ్దాం పద.

              
                                                                               *****        ******        *****

సారధి  రఘు ( ఇరువురూ కలసి ) నమస్తే సార్.

సెక్రెటరి నమస్తే ఏమిటిలా హడావుడిగా వస్తున్నారు ?

సారధి ఏముంటుందండి . అదే మా కూలీ గురించి . ఈ చాలీ చాలని కూలీతో ఎన్నాళ్ళిలా  జీవితాలు గడపటమా ? ఆని. అన్నింటిలోను మార్పు వచ్చింది , మనిషి తయారు చేస్తున్న ప్రతి వస్తువుకి  విలువ పెరుగుతోంది. కాని ఆ మనిషికి మాత్రం విలువ పెరగటం లేదు. కూలీ పెరగటం లేదు.
                        
రఘు  ఇంతకుముందు చాలామార్లు చెప్పి వున్నాం , కానీ  ప్రతి సారి డైరెక్టరు గారు లేరు అంటున్నారు. ఇపుడు వచ్చారు. మీకు తెలిసే ఉంటుంది.

సెక్రెటరి తెలిసింది కనుకనే , వెంటనే వచ్చాను.

రఘు  మంచిపని చేశారు. మా సమస్యను ఈ రోజైనా పరిష్కరించండి.

సెక్రెటరి ఏంటోయ్ రఘు , అంత హడావుడి పడితే పనులు కావటం తేలిక కాదోయ్.

సారధి ఏం ? ఏందుకని కావండి ?

సెక్రెటరి డైరెక్టర్ గారితో మాట్లాడాలంటే ముందుగా అప్పాయింట్మెంట్ ఫిక్స్ చేసు కోవాలి , కొత్త సినిమాకి అడ్వాన్స్ బుక్ చేసుకున్నట్లు.

సారధి మఱి ఈ విషయం తెలిసినవారు , ముందుగానే అప్పాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోలేకపోయారా ?

సెక్రెటరి ఆ విషయం  మీరు నాకు చెప్పవలసిన అవసరం లేదులే. మనేజరు గారు ముందుగానే ఫిక్స్ చేసి వుంటారు.  మాట్లాడి చెప్తాను .

సారధి తప్పకుండా మా కూలీ పెంచే విధంగా మాట్లాడండి. ఈ సమస్య తేల్చకపోతే , వచ్చే నెలలో సమ్మె చేయటానికి సిధ్ధంగా వున్నామని కూడా  చెప్పండి.
                       
సెక్రెటరి ఏమిటీ  ? సమ్మె చేస్తారా ! సమస్యలు పరిష్కారం కావాలంటే , సమ్మెలు , దొమ్మీలు కాదు చేయవలసింది.ఉభయులూ కలసి మాట్లాడుకోవాలి. ఆ  సమయం  రావాలి. అంతే కాని ఆవేశం పనికిరాదు , ఆవేశం వల్ల పని కాదు , కాకపోవచ్చు కూడా .

సారధి :  ఉభయులూ కలిసినా ఉపయోగం కనపడకుంటే ?

సెక్రెటరి అది అప్పుడు ఆలోచించవలసిన మాటలే . నేనిప్పుడే మాట్లాడి చెప్తాను.

సారధి  రఘు అలాగే లెండి.

                                                                     *****         ******           *****   

                                                                 ( మానేజరు గారి ఛాంబర్ లో  )

సెక్రెటరి గుడ్ మార్నింగ్ సార్.

మానేజరు వెరీ గుడ్ మార్నింగ్. ఎందుకో యిలా వచ్చారు ?

సెక్రెటరి డైరెక్టరు గారు వచ్చారు కదా ! అప్పాయింట్మెంట్ తీసుకోమని గుర్తు చేద్దామని.

మానేజరు దేనికో ?

సెక్రెటరి అదేనండి. మా వర్కర్ల కూలీ గురించి మాట్లాడతామన్నారు గదా !

మానేజరు ఓహ్ ! ఆ విషయమా ! అలాగే . ఈ రోజు మాట్లాడతాను. మీరు నిశ్చింతగా వుండండి.

సెక్రెటరి :సరే కూలీ పెంచే బాధ్యత మీదే. వెళ్ళొస్తా సార్.


                                                                         *****        *****       *****                                                                                                                

రఘు ఏమండి సెక్రెటరీ గారు. మానేజరు గారు ఏమన్నారు ?

సెక్రెటరి ఈ రోజు తప్పక మాట్లాడతానన్నారు.

సారధి ఏమిటండి ఎపుడూ అంటున్న మాటేగా . ఆయనగారికి యిది కొత్తేమీ  కాదుగా. 

సెక్రెటరి సారధీ , ఏమిటా మాటలు ? ఆయన మంచితనాన్ని  మరచిపోయావా ? ఒక్కసారి గుర్తు తెచ్చుకో .

సారధి ఏమిటండి ఆయనగారి మంచితనం  ?  నాకీ కూలీ పనిలో చేర్పించటమేనా  ? పెద్దవాళ్ళెప్పుడూ యింతే. వాళ్ళు చేసే తప్పులు కప్పిపుచ్చుకోవడానికి   కొన్ని అపుడప్పుడు యిటువంటివేవో  మంచి పనులు చేస్తుంటారు.      

సెక్రెటరి ఆయన తప్పులు చేయడం ఏమిటి ? కప్పిపుచ్చుకోవడమేమిటి ? ఆస్సలు నీ కూలీ పని యివ్వడమే ఆయన చేసిన మొట్టమొదటి తప్పు.

సారధి తప్పు కాదులెండి. మమ్మని వాళ్ళ గుప్పెటలోంచి  బయటకు పోకుండా వుండేందుకు నాకీ కూలీ పని యిచ్చారే గాని , ఊరకనే ఏమీ ఇవ్వలేదు లెండి.

సెక్రెటరి నిజమే సారధి. ఈ రోజుల్లో గ్రాడుయేట్లు ,  ఇంజినేర్లు  , ఎం బీ ఏలు  చదివి వుద్యోగాలు దొరకక , నానాయాతన పడ్తూ, ఆఖరికి యీ కూలీ పని కూడా చిక్కక  రోడ్ల వెంట తిరుగుతున్న వారు ఎంతోమంది వున్నారు ఈ సమాజంలో . ఇటువంటి సమాజంలో జీవిస్తున్న నీవు ఇంటర్ కూడా పాస్ కాక , ఖాళీగా తిరుగుతూ  చెడి పోతున్నావని , మీ అన్న నన్ను ప్రాధేయపడితే , నీకీ కూలీ పని యిప్పించానే గాని, 
ఆయన కొరకేమీ గాదులే.

సారధి ఓహోహో , బలే చెప్పారే. ఎందుకండి ఈ కాకమ్మ కబుర్లు .

సెక్రెటరి రఘూ  నీవైనా సారధికి చెప్పు.

రఘు   : ఏమిటిరా సారధి. ఈ అర్ధం పర్ధంలేని మాటలెందుకురా ? ఈ రొజు మాట్లాడు  తానన్నారు కదా , చూద్దాం.

సారధి : రఘూ , నీవేనా యీ  మాటలంటున్నది ? మనకు రావలసినది మనం నిర్మొహమాటంగా అడగటం కూడా తప్పన్నమాట . అయినా కందకు లేని దురద చేమదుంపకా ? ఏమిటి ?
                        
రఘు  పోనీలేరా . ఈ ఒక్కరోజు ఆగుదాం. ఇంతలో మునిగిపోయేదేముంది.

సారధి : మునిగిపోవటానికి ఎంత కాలమో అవసరం లేదు , ఒక్క సెనైనా చాలు.

రఘు   : నిజమేననుకో. ( సెక్రెటరీ వైపు తిరిగి ) చూడండి సెక్రెటరీ గారు, ఈ రోజు ఎలాగైనా మా పని అయ్యేటట్లు చూడండి.

సెక్రెటరి : తప్పకుండా.

సారధి : చూడండి , మఱో విషయం. సమస్య తేల్చకపోతే , సమ్మె చేయటానికి సిధ్ధంగా వున్నామని తెలియచేశారా ? లేదా ?

సెక్రెటరి : లేదు , అంత అవసరం రాలేదు.

సారధి ఏం ? ఏందుకని తెలియచేయలేదు ?

సెక్రెటరి కూలీ పెంచుతారో , లేదో తెలుసుకోకుండానే , ఈ విషయం తెలియచేస్తే , ఒక రకంగా  బెదిరిస్తున్నట్లుంటుందని , యిన్నాళ్ళు అనుభవం ఉన్న నాలాంటి  ఒక యూనియన్ సెక్రెటరీ వెళ్ళి  తెలియచేయవలసిన విషయం కాదు.

సారధి ఓహో అలాగా ! దాహం వేసినప్పుడు బావి తవ్వుకోవటం , చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం  మా యువతరానికి నచ్చవని మేం ముందే చెప్పమన్నాం.
                        
రఘు : ఈ వాదన దేనికిరా సారధి. ఈ రోజు అటో , యిటో తేలిపోతుందిగా.

సారధి : ఏమిటిరా తేలేది? ఈ రోజు, రేపు , ఎల్లుండి అంటూ యింతదాకా మీటింగులతోనే కాలం గడిపారు. ఇంకా  ఎన్నాళ్ళీలా  ఈ మీటింగులనే ఈటింగులతో ?

రఘు  : నిజమేననుకో . ఈ రోజు తేలకపోతే సమ్మె చేద్దాం , సరేనా ? ( సెక్రెటరీ వైపు తిరిగి ) ఆ...... చూడండి సెక్రెటరీ గారు శ్రమ అనుకోకుండా , మానేజరు  గారికి గట్టిగా చెప్పండి. మేము యిక్కడే వెయిట్  చేస్తూ వుంటాం.

సెక్రెటరి శ్రమ అనుకొంటే , ఇన్నాళ్ళుండేవాణ్ణి కాదు. మంత్రసాని తనం ఒప్పుకున్నాక , బిడ్డొచ్చినా , గొడ్డొచ్చినా  కడిగి నీళ్ళు పోయాల్సిందేగా . వెళ్ళొస్తా.

                                                                         ( సెక్రెటరి వెళ్ళిపోతాడు )

సారధి ఒరేయ్ రఘు , మనవాళ్ళంతా దేనికో క్యాంటీన్ లో గుమి గూడుతున్నారు , చూద్దాం పద.

రఘు : మళ్ళీ మనం త్వరగా యిక్కడకి రావాలి సుమా ! లేకుంటే సెక్రెటరీ గారొచ్చి వెళ్ళిపోతారేమో .

సారధి : సరేలే , పద పోయి వద్దాం.

                                                                                               
                                                                           *****           *****           *****  

                                                                     ( క్యాంటీన్ లో )

 సీతయ్య : నా సొమ్ము నే తాగుతాను, తలకపోసుకుంటాను. మధ్యలో  యీడెవడంట నన్నాపటానికి , నన్నడగటానికి  .అస్సలు యీడెవడంట నన్నాపటానికి ?                                                
                            సింతసెట్టు సిగురు చూడు
                     సిన్నదాని పొగరు చూడు
                           రమ్ము సారా తాగి సూడు
                           రాజమండ్రి జైలు సూడు                                 సింతసెట్టు

                            ఒరేయ్ , ఎంకిగా , పోలిగా రండహె , రండహె, రండి తొరగా.

పోలయ్య : ఏటిరోయ్ సీతయ్య , అందరినీ రమ్మంటుండావ్, తలా కాత్త పోత్తవా ఏటి ?

సీతయ్య : ఆ  సారా , నాకేరా , నా మనసారా తాగుతా . మిమ్మల్నందరినీ పిలిచిందేటి కంటే , మన యూనియన్  సెక్రెటరీల జాతకాలు సెద్దామని.

ఎంకయ్య : ఒరేయ్ పోలిగా , ఈ డెపుడు నేర్సుకున్నాడురా , ఈ జాతకాలు సెప్పడం .

పోలయ్య : ఆడికేం తెలుసురా జాతకాలు , మహా తెలిస్తే వాళ్ళ బావ జాతకం తెలుస్తాది .అదెరా మన యూనియన్ సెక్రెటరీ ఆడి బావే గదర..

సీతయ్య : ఒరేయ్ ఏటిరా ఎంకిగా , పోలిగా , ఏదో  కూత్తుండారు . మా బావ యూనిన్ సెక్రెటరీ అయితే , నాకేటిరా  ? రాంహె , రంహె, నా పక్కన కూకోండహె, సెత్తాను.

ఎంకయ్య : దేనికిరా  సీతయ్యా ? మన సెక్రెటరీ గారెటూ లోనకెళ్ళారుగా మాట్లాడటానికి . కొంచెం సేపు ఆగితే అంతా వారే సెప్తారుగా.

సీతయ్య : ఒరేయ్ సన్నాసుల్లారా , మన యూనియన్ సెక్రెటరీలు , లోనకెల్లటం  బయటకు రావటం , బయటనుంచి  లోనకెల్లటం మినహా ఏమీ సెప్పగరుగా. పైగా బయటకు  రాగానే ఒఠ్ఠి మూగోల్లయిపోతారురా.
                       
పోలయ్య : బలేగ సెప్తుండావే నాయాల్ది. అలా  మూగోల్లయిపోటానికి ఏదైనా కారణముం దంటావా ? 

సీతయ్య : తెలవదేటి  నీకు ? సానా కత ఉందిరా.

పోలయ్య : సత్తె పెమాణకం సేసి  సెప్తుండా. నిజ్జంగా నాకు తెల్వదురా. నాకే కాదురా , ఈడ సానామందికి తెల్వదురా .

సీతయ్య : మఱి అందుకే కదంటరా ,నే సెప్తానన్నది. జాగర్తగా యినుకోండ్రోయ్. ఆస్సలు పెద్దోల్ల సేంబర్లో ఏర్  కండిషన్లు ఏటికి పెడ్తారనుకుండారు ?

ఎంకయ్య : ఏటికేమిటి , ఇది కూడా మరసిపోయావట్రా . మందు మా బాగా పని సెత్తున్నట్టున్నాది . చల్లదనానికి  కదంటరా.

సీతయ్య : సల్లదనానికే . ఆ సల్లదనంతోనే పనంతా పూర్తి సేత్తార్రా. ఆ సల్లదనానికీ , మన యూనియన్  సెక్కెటరీలకు  లింకుందిరా .

పోలయ్య :లింకేమిట్రోయ్. ఏదో కొత్త విషయం సెప్తుండట్టున్నావ్ .

సీతయ్య : అదేరా ఆ లింకు మగడుకీ పెల్లానికి ఉన్నంత లింకురా అది . విడదీయలేనిదిరా. 

ఎంకయ్య : అంత లింకా అది.

సీతయ్య : ఎంతో కోపంతో , ఎన్నో కార్మికుల కోర్కెలతో , మన సెక్కెటరీలు మాట్టాట్టానికి లోనకెల్తారు గంద. అంతే  సాదరంగా రమ్మంటూనే , ఏ సి ఆన్ చేసేత్తార్రా. ఇంకేటుంది మన సెక్కెటరీల వల్లు సల్లపడిపోతుందిరా.  అలా ఆల్లు సల్లబడటనికే ఆల్ల సేంబర్ లో ఏ సి లు .

పోలయ్య : అలాగంటరా ! కోపంలో ఉన్నోరి ఆ యేసం అంతమాత్రాన సల్లబడుతుంద టరా ?

సీతయ్య : అలా సల్లబడ్తే సరే సరి ,లేకుంటే , యింకా ఆల్లకాడ సానా  ఆయుధాలు  వున్నాయిరోయ్ ఆల్లని సల్లబరచటానికి .

పోలయ్య : ఏటిరా అవి ???????

సీతయ్య : సల్లని దింకుల్ని సల్లగా కడుపులోనకి పంపుతార్రా.

ఎంకయ్య : అంతమాత్రానికే సల్లబడిపోతార్రా. నేన్నమ్మను గాక నమ్మను.

సీతయ్య : అప్పటికీ సల్లపడలేదనుకో . మఱో ఆయుధం తీత్తార్రా. అదే ముచ్చట్లోకి దించేత్తారు. మందు బాటిల్ అందిచ్చేత్తారు.

పోలయ్య : ఈ ఏల సానా యిసయాలు సెప్పినావు . బోలెడు తాంకులురా నీకు .

సీతయ్య  అప్పుడే ఏమైందిరా , యింకా చానా వున్నాయిరా . సెప్తుండా యినుకోండిరా .అలా సల్లపరసబడిన మన సెక్కెట్రీలు మనకు సేసిన సపదాలన్నీ మరిసిపోతార్రా.

ఎంకయ్య :అంత తొరగా మర్సిపోతారంట్రా.

సీతయ్య : అలా మర్సిపోవటం మన సెక్కెటరీల తప్పేమీ కాదురా.

ఎంకయ్య : ఇదేటిరోయ్ , బలె తమాసాగా సెత్తుండావే.

సీతయ్య : తమాసా కాక ఏటుందిరా . ఆల్ల చేమ సమాచారాలను, అల్ల కుటుంబ స్దితి గతులను అడుగుతార్రా.

ఎంకయ్య : అడిగితే ?

సీతయ్య : ఇంకేటుంది. ముద్దొస్సినపుడే సంకెక్కాలన్నట్టు , అవకాసం దొరికినపుడే వాడుకోవాలన్న మాదిరిగా , ఆల్లకున్న కుటుంబ  యిబ్బందుల యిసయాలన్నీ  ఒకటొకటిగా యివరంగా యివరిత్తార్రా.
                        
ఎంకయ్య : అలాగా ! అపుడా పెద్దోల్లు ఏమంటార్రా ?

సీతయ్య :ఆ పెద్దోల్లు యీల్ల వైపు జాలిగా సూత్తూ , చ్....చ్....చ్.... అయ్యో పాపం యిన్ని యిబ్బందులు పడ్తున్నారా . ఇదుగో ఇంద , యిది తీసుకోండి  అంటుంటె యీల్లు ( వీళ్ళు ) తీసుకోటానికి మొహమాటపడ్తూనే , అందుకోకపోతే .........................  

అది సాలదేమో అనుకొని , మల్లీ వత్తారుగా అపుడు చూద్దం అంటారా పెద్దోల్లు . 

ఆ తర్వాత అంటే వాతగా మారి మనసుని ఎక్కడ బాధపెట్టుద్దో నని యెంటనే అందుకుంటార్రా.  ఆ పై  కుక్కిన పేనులైపోతార్రా. 
                       
ఎంకయ్య : అయితే మన యిసయాలు  ?

సీతయ్య : మన యిసయాలు మొత్తం మర్సిపోతార్రా. అలా  పుచ్చుకొన్న తర్వాత , మన  యిసయం మాట్లాడుతుంటే , మధ్యలో ఆ మానేజర్లే  ఆఖర్న గుర్తు సేత్తార్రా. మేం నాయం సేకూరుత్తామని  మీ కార్మికులకు సెప్పండి అని  . 

అపుడేమో మన యూనియన్ సెక్కెటరీలు  తల్లూపుతూ , ఆ  యిసయంలో మీరు నిషింతగా ఉండండి అంటూ బైటకు వచ్చేత్తార్రా  .

ఎంకయ్య : నువ్విలా చెప్తా వుంటె  ఏ , రామాయణ ,బారత , బాగవతాలకన్నా , మన యూనియన్  బాగోతం బలే యింట్రస్తుగా వుందిరోయ్.

పోలయ్య : ( అంతా విన్న పోలయ్య ) అపుడు మన నాయకులు ఏమంటారు ఆ  మానేజర్లతో  ?

సీతయ్య : లోన గంగినెద్దులా తలలూపిన ఆ మన నాయకులే , మనకాడకొచ్చి , మేం యిపరీతంగా చర్చించాము.  మా మాటలకు సిత్తు అయి , ఎదురు సెప్పలేక ,  నాయం తప్పక సేకూరుత్తామని మనకు యినిపిత్తార్రా.       

పోలయ్య : నిజ్జంగా అలా చేత్తారంటావా .

సీతయ్య : అందుకే కదరా , మనకీ కట్టాలు . మనంసేత్తున్న కట్టానికి తగ్గ పలితం యిత్తే , మన గుడిచెలు గూడా  మిద్దెలవుతాయిరా . 

పోలయ్య : ఈ యాల సానా  యిసయాలు తెలుసుకున్నారా . ఇంతకీ మన కూలీ విషయం ఏమైనా తేలుస్తారంటావా ?

సీతయ్య : తేల్చరు గాక తేల్చరు , పైగా నానుత్తారు . మనం ఓటడిగితే ,ఆల్లు యింకోటి సెప్తార్రా.

ఎంకయ్య : అదెలాగరా ?

సీతయ్య : కన్ను పోయిందేటిరా కనకలింగం అని అడిగితే , బ్రాకెట్టాడొచ్చానురా భద్రలింగం అని బదులిచ్చినట్టు.

ఎంకయ్య : ఇదంతా నమ్మమంటావురా .

సీతయ్య : నమ్ము , నమ్మకపోటం నీ  యిట్టం రా   ఇదుగో యిటు సూడు, రోజూ నాను తాగే నాటుసారా మీద పెమాణకం సేసి సెప్తుండా.ఇంతదాకా  నాను సెప్పిందంతా నిజమేరా. ఈక ఆ పైన నీ యిట్టం. 
                        
పోలయ్య : ఒరేయ్ సూపర్వైజర్ పిలుత్తుండాడురా . మత్తరు  గుమాత్తా  , ఆడే మనకోసం సూత్తున్నాడటరా. మనం ఎల్లకుంటే , చానాసేపు అయిందని మానేజరు గారికి  రిపోట్టు పంపుతాడురా. పదండి పోదాం.
                        
                                                               ( అందరూ వెళ్ళిపోతుంటారు )                                                                                                                                                       

సారధి : ( ఇంతదాకా ఆ  క్యాంటీన్ లోనే వుండి అంతా విన్నవాడై రఘుతో ) విన్నావుగా. ఇపుడైనా తెలిసిందా మన  యూనియన్ నాయకుల చేష్టలు .ఈ రోజు తేల్చుకోవాలి.

రఘు : పదరా , సెక్రెటరీ గారు లోపలనుంచి బైటకు వస్తున్నారు. ఫద పోదాం.
          
                                                           ( ఇరువురూ ఆఫీసు వైపుగా వెళ్తారు ) 

సెక్రెటరి : ఏమిటోయ్ రఘు ఆ జనం ?

రఘు : ఏముందండి . మీ సీతయ్య బావగారు తప్ప తాగి జాతకాల సోది చెప్తున్నాడు లెండి.

సారధి :ఆ జాతకాల సోది ఎవరివో కావండి , మీ యూనియన్ సెక్రెటరీల ప్రతిభల గురించి , ప్రగల్భాల గురించి  , విపులంగా , విశదీకరిస్తున్నాడు లెండి .

సెక్రెటరి : త్రాగినవారిని లోపలకు రానీయకూడదుగా. ఎలా రానిచ్చారు ?

సారధి :ఎందుకని రానీయకూడదో ?

సెక్రెటరి : నోట్లో మందు పొసుకున్నవాడికి , నోరు కంట్రోల్లో వుండక ఏదేదో వాగేస్తారని.

సారధి : ఏదేదో వాగటం లేదులెండి . ఆతను బయటపెట్టిన విషయాలన్నిటికీ బదులు చెప్పండి, చాలు.

సెక్రెటరి : ఏ సారధి , నీ అర్ధం పర్ధం లేని ప్రశ్నలకు , తప్ప త్రాగి  , వాగే వాడి మాటలకు బదులివ్వటం కంటే ,తెలీనోడి  కాళ్ళు పట్టుకోవటమే మేలు. 


                                ( డైరెక్టరు గారి కారు హారన్ వినపడ్తుంది . సెక్యూరిటీ మెయిన్ గేట్ తెఱుస్తాడు , కారు వచ్చి ఆఫీసు ముందు ఆగింది. ప్యూన్ వచ్చి గబ గబా కార్ డొర్ ఓపెన్ చేశాడు. డైరెక్టర్ గారు దిగగానే యూనియన్  సెక్రెటరి  విష్ చేస్తాడు )                

సెక్రెటరి : గుడ్ మార్నింగ్ సార్.

డైరెక్టర్ : వెరీ గుడ్ మార్నింగ్  ( అంటూ ఆఫీసు లోపల తన ఛాంబర్ లోనికి వెళ్తాడు ).

సెక్రెటరి : ( కొంత సమయం వెయిట్ చేసి ఆఫీసు ప్యూన్ చేత కబురు పంపాడు ) నేను కలవాలనుకుంటున్నానని చెప్పు.
                
                                                     ( ప్యూన్ లోపలకు వెళ్ళీ చెప్తాడు , రమ్మను అని చెప్తాడు )

ప్యూన్ : ( బయటకు వచ్చి ) రమ్మన్నారు సార్ .

                                                ( సెక్రెటరి  ఛాంబర్ లోపలకు  వెళ్తాడు , కూర్చొంటాడు. ) 

డైరెక్టర్ : వెరీ గుడ్ మార్నింగ్.  సెక్రెటరీ  గా రు చెప్పండి.

సెక్రెటరి : మన కార్మికుల దినసరి వేతనం గురించి మాట్లాడుదామని వచ్చాను.

డైరెక్టర్ : నేనింతకుముందే వేతనాలు పెంచమని చెప్పేశాను .

సెక్రెటరి : ఇంకా మీతో చర్చించాలని , మీరు బిజీగా ఉన్నారని ఇంతదాకా చెబుతూ వచ్చారు. మా కార్మికులు వచ్చే  వారం నుంచి సమ్మె చేద్దామంటున్నారు. నేనే ఈ రోజు డైరెక్టర్ గారు వస్తున్నారు . లుసుకొని చర్చిస్తాను అన్నాను.               

డైరెక్టర్ :సెక్రెటరీ గారు . ఇది  షిఫ్ట్ మారే సమయం కదా ! కార్మికులందరినీ ఆఫీస్  బయట  ఆవరణలో వెయిట్ చేయమనండి. మీరు వెళ్ళవచ్చు.
      
                                           ( సెక్రెటరి బైటకు వచ్చి సారధి , రఘులను పిలచి అందర్ని , యిక్కడకు రమ్మని కబురు చేస్తాడు ) 

డైరెక్టర్   : ( మానేజర్లని ఇంటర్ కం ఫోన్లోనే ) కార్మికులకు పెంచిన  వేతనాలు అమలుజరుపుతున్నారా ? లేదా ?

మానేజర్  : లేదు. మీరొచ్చింతర్వాత మరో మారు మీతో డిస్కస్ చేసి ఆ పై మీరు చెప్పిన విధంగా చేద్దామని .

డైరెక్టర్  :బకాయిలు కూడా పెండింగ్ పెట్టారుగా.

మానేజర్  :అవును సార్.

డైరెక్టర్   :  ( ఇంటర్ కం లోనే ) మీరు కూడా  5 నిముషాలలో బైటకు రండి. 

                                                                   ( అందరూ ఆఫీసు బయటకు వస్తారు. ) 

                 కార్మికులారా , ఇపుడే తెలిసింది మీ వేతనాలింకా పెరగలేదని . చాలా  చాలా   బాధపడ్తున్నాను ఆలస్యమైనందులకు. వాస్తవానికి మీ వేతనాలు పెంచమని రెండు నెలలక్రిందటే మన మానేజర్లకి. ఈ పెరిగిన జితం వినాయకచవితి నుంచి యివ్వ వలసిందిగా  చెప్పాను. 
ఎక్కడో ఏదో తప్పిదం వలన మీరందరూ ఎంతగానో కలతచెంది, కఠోర నిర్ణయాలు తీసుకునే  దిశలో వెళ్తున్నారు. ఈ రోజు నుంచి మీ  వేతనం పెరిగినది తదుపరి వచ్చే బట్వాడా లో వస్తుందని  , బకాయీలు   4 రోజుల్లో ఇచ్చేటట్లుగా ఆర్డర్స్ జారీ  చేస్తున్నాను. జరిగిన లోపానికి  చింతిస్తున్నాను.
                            
                     ( సెక్రెటరి, సారధి, రఘు, యితర కార్మికులందరూ కలసి ) డైరెక్టరు గారికీ జిందాబాద్. జిందాబాద్  జిందాబాద్.

సారధి  :కార్మికులారా , ఈ రోజు మనందరికెంతో సుదినం. 

                         ఫ్యాక్టరీ ఓ పవిత్రమైన దేవాలయం అయితే,

                         అందులోని దేవుడు ఆ యజమాని

                         పూజారి మానేజరు

                         భక్తులు కూలీలు

                         దేవుడు వరమిచ్చినా పూజరి వరమీయడనట్లుగా అయినది మన పరిస్ధితి ఈ రోజు. ఇలాంటి  పరిస్ధితుల వలన మనం సమ్మె దిశగా పయనించాలని కఠోర  నిర్ణయాలు  తీసుకొనదలిచాం. సెక్రెటరీ  గారిని అపార్ధం చేసుకున్నాము. పొరపాటే.
 ఇందువలన నష్టపోయేది ఎవరు  ? మనం , మనతో పాటు మన యజమాని.  మీరనుకోవచ్చు.                       
యజమానికేం నష్టం . వేతనాల ఖర్చు లేదు గదా అని. కాని ఉత్పత్తి తయారు కాకుండా 
ఆగిపోతుందే ? ఆందువలన వారు సరకు సప్ప్లై చేస్తానన్న వారికి సకాలంలో సప్ప్లై చేయలేక పోవలసి వస్తుంది .ఆ పై మనమూ పస్తులు పడుకోవలసి వస్తుంది. ఏదో మూలకెళ్ళి ఏదొ పనిచేసి బతకటానికి ప్రయత్నిస్తాము.
                         
కానీ అది మనకు ఆనందాన్నివ్వదు. ఈ పరిస్ధితుల్లోంచి బైటపడాలంటే , డైరెక్టరు గారు     మానేజర్లతో , యూనియన్ సెక్రెటరీలతోనే కాకుండా ,కార్మికులతో కూడా కలుసుకుని ఫాక్టరీ పరిస్ధితులను తెలుసుకుంటుంటే బాగుంటుందని నా వినయ పూర్వక విన్నపం.

కార్మికులారా అందరూ కలిసి గట్టిగా చెప్పండి ,డైరెక్టరు గారికి జిందాబాద్ , డైరెక్టరు గారికి  జిందాబాద్ . 
              

                                              ******       తెఱ మూయబడ్తుంది   *******      


   ( ఈ నాటిక 26-12-1980 ఆకాశవాణి విజయవాడ కార్మికుల కార్యక్రమంలో ప్రసారం 
                                                                                                                                    చేయబడ్డది )                                                                                                                                                                  

గమనిక : ఎవరైనా ఈ నాటికను ప్రదర్శించదలచుకొంటే నాకు తెలియపరచవలసినదిగా కోరుతున్నాను .  

బంధం - అనుబంధము

                                                                   బంధం - అనుబంధము

                                                                                                                  వ్యాస రచన : శర్మ జి ఎస్ 

ఈ బంధం , అనుబంధములు మానవుల జీవితాలలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి . 
అందునా మన భారత దేశ సంస్కృతికి వెన్నెముక లాంటిది .

ఈ మన భారత దేశంలో వుండే బంధాలు అనుబంధాలు .

కొడుకు  
కూతురు
తల్లి 
తండ్రి
అమ్మమ్మ
నాయనమ్మ
తాతయ్య
ముత్తాత 
ముత్తవ్వ

కొడుకులు , కూతుళ్ళు పెరిగి పెద్దైన తర్వాత , వెరే అమ్మాయిలతో , వేరే అబ్బాయిలతో కళ్యాణం చేసేస్తారు . ఈ కళ్యాణంతో ఆ యిరువురు భార్యా భర్తలనబడతారు . ఆ క్షణం నుంచి ఆ యిరువురిది భార్యా భర్తల బంధం . ఒకరికి కావలసినది మరొకరు యిచ్చిపుచ్చుకొంటుంటారు . ఇక్కడ తన, పర భేదమే వుండదు . 

అంతదాకా ఈ యిరువురికి విడి విడిగా వాళ్ళింటిలో  ఆ అందరితో బంధాలుంటాయి . 

మా అమ్మ 
మా నాన్న 
మా అన్నయ్య 
మా తమ్ముడు 
మా అక్కయ్య
మా చెల్లి
మా అత్తయ్య 
మా మామయ్య 
మా బావ 
మా మఱది 
మా బావ మఱది

ఇలాంటి వెన్నో బంధాలు ఆ యిరువురికి వుంటుంటాయి .

కాని ఈ కళ్యాణం అయిన తర్వాత ఓ పేద్ద పెను మార్పు చోటు చేసుకొంటుంది .

అదే యిలా 

మా అత్తయ్య గారు
మా మామయ్య గారు
మా బావ గారు
మా మఱది గారు 

ఇలా గార్లతో మొదలవుతాయి కొత్త బంధాలనే అనుబంధాలు .

ఇంతదాకా "మా "అంటూ వున్న అనుబంధాలలో పెను మార్పుగా ఆ యిరువురి జీవితాలలో ఓ కొత్త బంధం ఏర్పడుతుంది .
అదే మా ఆయన ( గౌరవంగా ) , నా మొగుడు / నా భర్త అని ఆడపిల్లకు 
అదే నా పెండ్లాము / నా భార్య అని మగపిల్లవాడికి . 
భర్త అనబడే ఆ  మగవాడు విడిగా ఆడవారిపేరుకి గాని , ఆ బంధానికి గాని  గారు తగిలించి పిలువ వలసిన అవసరం లేదని అలనాటి పూర్వీకులు నిర్ణయించారు .
మగపిల్లలు / మగవాళ్ళు తన భార్యని ఏకవచన సంబోధన శాస్త్ర సమ్మతం . 

ఇక అక్కడనుంచే ఆ యిరువురిలో స్వార్ధం మొదలవుతుంది . ఈ వివాహ బంధం  , తర్వాత మిగిలిన మూడు వంతుల జీవితాన్ని చిందర వందర చేస్తుంది . ఆ చిందర వందర అందరిలో కాకున్నా కొంతమందిలో ఆనందాన్ని అందిస్తుంది . ఇంకొంతమందికి బాధను అందిస్తుంది . మఱికొంతమందికి సుఖ దుఃఖాలను అందిస్తుంటుంది .

వాస్తవంగా బంధం , అనుబంధాలు వేరు వేరు కాదు . రెండూ ఒక్కటే . 

ఆ బంధం ఎటువంటిదంటే ,

తల్లీ కూతుళ్ళ అను బంధం
తండ్రీ కొడుకుల అను బంధం 
అన్నా తమ్ముళ్ళు అను బంధం 
అన్నా చెల్లెళ్ళు అను బంధం
అక్కా చెల్లెళ్ళు అను బంధం 
భార్యా భర్తలు అను బంధం /
మొగుడు పెళ్ళాం అను బంధం 
ఇలాంటివే మిగిలిన అన్ని బంధాలు / అనుబంధాలు .

ఈ బంధాలన్ని మన భారత దేశంలో అతి పవిత్రమైనవి .

ఈ బంధాలు ఒక్క మారు ఏర్పడితే మనం పోయిన తర్వాత కూడా ఆ బంధాలు అలా నిలిచిపోతాయి , అందఱి నోళ్ళలో నానుతుంటాయి .

అందుకే మన భారత దేశం ప్రపంచంలో అత్యున్నత స్థానం ఏర్పరచుకొన్నది .

బంధం , అనుబంధములు దేశ కాలమాన పరిస్థితులను బట్టి మారుతుంటాయి .

మిగిలిన అన్ని దేశాలలో ఈ బంధాలు శాశ్వతం కాదు , తాత్కాలికమైనవే . 

అందువల్లే అక్కడి ఆడ , మగ వాళ్ళు వాళ్ళ మొత్తం జీవితంలో ఎన్నటికీ భార్యా భర్తలు కాలేరు , జీవిత భాగస్వాములుగా మాత్రమే పిలువబడ్తుంటారు .

ఎప్పుడైతే జీవిత  భాగస్వాములయ్యారో , వాళ్ళు వ్యాపారం చేస్తున్నారే కాని జీవితాన్ని ఆనందించటం కాని , తన / తమ వంశాన్ని వృద్ధి చేసుకోవటం గాని లాంటి బాధ్యతలు లేనే లేవు .

వాళ్ళు ఆ ఆడ , మగ కలయిక బంధాన్ని వ్యాపారంగా భావించటం వలన , వాళ్ళ వాళ్ళ జీవిత పయనంలో అనేకమంది భాగస్వాములు చొరబడ్తుంటారు .

సహజంగా ఎక్కడైనా  భాగస్వాములను పేర్లతో పిలుచుకొంటారు కదా ! వాళ్ళు ఏ భాగస్వాములనైనా అలాగే పిలుచుకొంటారు . 

ఆ భాగస్వాములను ఎంచుకోవటానికి ఎవరికి వాళ్ళకు స్వేఛ్ఛ కలిగి వుంటారు . ఇలా ఆ స్వేఛ్ఛతో ఒకరినొకరు తెలుసుకొనుటకు వాళ్ళు జీవిత భాగస్వామ్యానికి ముందు కలిసి తిరుగుతూ వుంటారు అన్ని విషయాలలో . అలా కలిసి వుంటున్నప్పుడు ఒకరి కొకరు తెలుసుకోవటానికి ఎంత టైం పట్టినా ( వాళ్ళు ఒకరి కొకరు యిష్టపడితే ) కలిసే వుంటుంటారు . 
    
అలా నచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఒప్పంద పత్రిక వ్రాసుకొని , జీవిత భాగస్వాములౌతారు . 

అలా వుంటున్న సమయంలో ఒకరి కొకరు నచ్చకుంటే ఆ  ఒప్పందాన్ని రద్దు చేసుకొంటారు .

ఎప్పుడూ ఎంచక్కా వాళ్ళు పేర్లతో ఏకవచన సంబోధనతో సంబరపడి పోతుంటారు . ఇది మన భారత దేశంలో స్నేహితుల నడుమ , పరిచితుల నడుమ , చిన్నవారి పట్ల మాత్రమే కొనసాగుతూ వుంటుంది . అలాగని జీవితం ముగిసే వరకు వుండాలని ఏమీ లేదు .

కాని భార్యా భర్తల బంధం కడదాకా వుండాలని మన పూర్వీకులు మర్యాద పూర్వకమైన సంబోధనలను మనకు అందించారు . ఒకరినొకరు గౌరవించుకోవటం ఆ భార్యా భర్తల నడుమ పేర్లతో కాదు బంధంతో అని వ్యక్తపరచి ఆచరణలో వుంచారు .

ఎప్పుడైతే ఏకవచన సంబోధన చేసుకొంటున్నారో వాళ్ళు మిగిలిన దేశాలలో లాగా జీవిత భాగస్వాములే కాని , ఎన్నటికీ భార్యా భర్తలు కాలేరు . 
ఎందుకంటే స్నేహాన్ని చేసినప్పుడు ఎదుటివారు మనకు నచ్చనట్లుగా ప్రవర్తన కొనసాగిస్తుంటే , ఆ స్నేహం వద్దనుకొని విడిపోతారు . అలాగే ఆ మిగిలిన దేశాల వాళ్ళు ఆ జీవిత భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నారు . 

వాళ్ళకు ఏ బంధాలు లేవు కనుక , వాళ్ళు ఏమీ దాచుకోవటానికి సంపాదించరు  . 

ప్రపంచంలో మిగిలిన అన్ని దేశాలకు శాశ్వత బంధాలు లేకపోవటం వలన వాళ్ళకున్న బంధాలన్నింటికి సంవత్సరంలో ఒక్క రోజు కేటాయించి ఆనందిస్తుంటారు . కనీసం ఆ ఒక్క రోజైనా ఆనందిద్దామని అలా ఏర్పాటు చేసుకొన్నారు . 

మదర్స్ డే 
ఫాదర్స్ డే 
ఫ్రెండ్ షిప్ డే 
లవర్స్ డే 
అంకుల్స్ డే  
ఆంటీస్ డే  
గ్రాండ్ మదర్స్ డే 
గ్రండ్ ఫాదర్స్ డే 
లాఫింగ్ డే 

ఇలా రక రకాలుగా ఏర్పాటు చేసుకొన్నారు . 

ఏ బంధమూ కడదాకా కొనసాగించలేమని వాళ్ళ సామర్ధ్యత వాళ్ళకు బాగా తెలుసు కాబోలు .  కనుకనే సంవత్సరంలో ఆ ఒక్క రోజైనా వాళ్ళతో గడిపి ఆనందాన్ని పంచాలని , ఆనందిద్దామనుకొన్నట్లున్నారు .

శాశ్వత బంధాలున్న మన భారతదేశ ప్రజలలో కొంతమంది వాటిని పాటిస్తూ , మన శాశ్వత బంధాలని వదలి వేస్తున్నారు .


మఱి మన భారతదేశ ప్రజలకు అన్ని బంధాలు వున్నాయి గనుక , మనం అటు మొగ్గు చూపటం ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదు .

మన భారత దేశ ప్రజలలో కొంతమంది పరాయి దేశాలకు ధన సంపాదన పరంగా వెళ్ళి , ఈ దుస్సంప్రదాయ సంస్కృతిని అంటించుకొంటున్నారు . మఱికొంతమంది అంతర్జాలం ద్వారా అరువు తెచ్చుకొంటున్నారు .  

తన భర్త తనను ఏక వచనంతో పిలవటం వల్ల ఆ భార్యకి కలిగే నష్టమేమీ లేదు . అలా పిలవటంతో ఆ భార్యకు ఆ భర్త వద్ద బెరకు , బిడియం పోయి చనువు , స్వతంత్రం 
పెరుగుతాయి . 

కనుక మన భారతదేశ సంప్రదాయాన్ని తెలుసుకొని దానినే కొనసాగిస్తే చాలా చాలా మంచిది . 


                                                       ********************

మోక్షము అంటే ..........


                                                               మోక్షము అంటే ..............

                                                                                   సేకరణ ( కాసరబాద బ్లాగు నుండి )

ఈ శ్లోకములో ముందు ధీరులు ఎవరో చెప్పి ఆ ధీరులు మోక్షమునకు తగిన వారి అని చెపుతారు.
ఇది అద్వైత సిద్ధాంతం.
మోక్షమంటే ఏదో చని పొయినతర్వాత కలిగే సుఖము కాదు
మోక్షము ఈ లోకములోనే పొందవచ్చు.
మోక్షసాధనకి కావలసినది నిష్కామ కర్మ.
విషయములందు ఆసక్తి లేకుండా నిష్కామ కర్మ చెయ్యడము,
నిష్కామకర్మ చేసినప్పుడు కూడా ఆ కర్మ ఫలితముగా
సుఖాలు దుఃఖాలు రెండూ వస్తాయి.
సుఖ దుఖం సమేకృత్వా - అన్నట్లుగా
వాటిని సమానముగా చూస్తూ
వాటి మీద చలించకుండా నిష్కామకర్మ చేయడమే ప్రథానము
అ సుఖ దుఃఖాలు ఎవరిని బాధించవో వారే ధీరులు.
ఆ ధీరులు మోక్షమునకు తగిన వారు.
సుఖదుఃఖాలు ఎవరిని బాధించవో వారు శాశ్వత ఆనందములో ఉన్నవారే  
కోరికలు లేకుండా నిష్కామ కర్మచేస్తూ పొందిన శాశ్వత ఆనందమే మోక్షము.
ఇది ఈ శ్లోకానికి తాత్పర్యము.
ఇది యే శ్రీకృష్ణ భగవానుడు అందరికి చెప్పిన మాట.
వేదపరాయణులకే మోక్షము అన్నమాట లేదు
దీనిలో అడవాళ్ళా మగవాళ్ళా అన్న మాటలేదు.
రాజులా రంకులా అన్నమాట కూడా లేదు.
బ్రాహ్మణుడా శూద్రుడా అన్నమాటకూడా లేదు.
ఇది ఆ నిష్కామ కర్మ చేసి అనందము పొందగల ధీరులకేట .
                          
                                    || ఓమ్ తత్ సత్ ||

                                                   సేకరణ ( హిందూ వేదశాస్త్రం నుండి )


మోక్షం అంటే మనస్సుని , శరీరాన్ని అత్మనుంచి శరీరం చైతన్యం
లో ఉండగానే వేర్పాటు చేయడం అన్నమాట. 
మోక్షం అంటే మరణించిన తర్వాత పొందేది కాదు. బ్రతికి ఉండగానే ఆత్మతో జీవించగలిగేటట్లు సాధనలో సాధ్యమయ్యేటట్లు చేసుకోవటమే కాని మరొకటి కాదు. 
అదే మోక్షం. ఆత్మానుభూతి . ఎవరి అనుభూతిని వాళ్ళే పొందాలి. ఎవరి నిగ్రహానికి తగిన విధంగా వాళ్ల వాళ్లకు తగిన అనుభవం సాధనలో చేకూరుతూనే ఉంటుంది. 
ఆత్మ అనే భగవంతునితో అనుసంధానమై అత్మసాధన కొనసాగిస్తూ జీవించటం నేర్చుకోవాలి. కొద్దిపాటి శ్రద్ధాశక్తులు కలిగిన ప్రతివాళ్ళు దీన్ని అనుభూతి పొందుతారు. ఆ నమ్మకంతో, ఆ పట్టుదలతో, నిరంతర తపనతో, ఆత్మ జ్ఞానంకోసం నిరంతరం ఆత్మ మార్గంలో సాధన చెయ్యాలి.


వసతే వాస్తు ( శాస్త్రం )

             
                                                          వసతే వాస్తు ( శాస్త్రం )
                                                                                                                  వ్యాస రచన  : శర్మ జి ఎస్

మానవులు సుఖంగా జీవించాలంటే కొన్ని వుండాల్సిందే .
ఆ కొన్నింటి కొరకు ధనం సంపాదించాల్సిందే . ఆ ధనం సంపాదించటానికి ఎంతో కష్ట పడవలసి వస్తుంది .

అంత కష్టపడి ఆ ధనం సంపాదించిన తర్వాత  నిలువ నీడగా ఇల్లు కావాలనిపిస్తుంది .
ఆ ఇల్లు ఎలా వుండాలి / ఎన్నిగదులుండాలి అన్నది ఆలోచించి ప్లాను వేసుకొంటారు . అంతవరకు బాగానే వున్నది .

అయితే ఆ యింటిలోని గదులు ఎక్కడ , ఎలా వుండాలి అన్నది తెలియ చేసేదే వాస్తు శాస్త్రం అంటారు .

అసలు వాస్తు అంటే ఏమిటి ? అన్నది మొదట తెలుసుకోవటం చాలా మంచిది .
వాస్తు అంటే వసతి  అని అర్ధం . ఇల్లు కట్టుకొన్న తర్వాత ఆ యిల్లు వసతిగా వుండాలన్నది ప్రధానమైన విషయం .

వసతే కాలక్రమంలో వాస్తుగా మారి శాస్త్రంగా స్థిరపడింది .

ఆ విజ్ఞాన శాస్త్రం ప్రకారం దక్షిణం నుంచి ఉత్తరం వైపు , పడమర నుంచి తూర్పు దిశగా కాంతి రేఖలు ప్రసారమవుతుంటాయని తెలియచేస్తున్నది . 
తదనుగుణంగా ఇంటిలోని గదులను నిర్మించుకోవలసి వస్తున్నది . దీనినే మన పూర్వీకులు విజ్ఞానశాస్త్రం అని చెప్పకుండా దక్షిణం యమ స్థానమని , నిద్ర లేస్తూనే తల దక్షిణం దిక్కుని చూడ కూడదని చెప్పేవారు . కనుక వీలైనంతవరకు దక్షిణాన్ని ఏ ముఖ్య పనులకు ఉపయోగించకూడదంటుంటారు .

పంచ భూతాలుగా పిలవబడ్తున్న ఫృధ్వ్యాపస్తేజో వాయురాకాశాత్ లు ఈ ప్రాణికోటి జీవనానికి మూలాధారమైనవి .
అవి ఏ దిశగా వుంటే మన మానవ జీవనానికి బాగుంటాయో అనుభవంలో తెలుసుకొన్న మన పూర్వీకులు కాదు , ముందు యుగాల వారు వాళ్ళ వాళ్ళ అనుభవాలను శాస్త్రాలుగా రచించారు .

అయితే ఆ యుగాలలో పెద్దలు చెప్పింది విని వాళ్ళ జీవితాలలో ఆచరణలో పెట్టేవారు . 
కాలక్రమంలో , యుగాల మార్పుతో చెప్పింది వినటమే కాని , ఆచరణ యోగ్యం కానప్పుడు , తోటి ప్రాణికోటికి నష్టం వాటిల్లుతుందని ఆలోచించిన కొంతమంది ఆ విజ్ఞానశాస్త్రాల్ని , దైవం పేరుతోనో లేక భయంపేరుతోనో సమాజంలోకి చొప్పించారు .

ఏది ఎలా చేసినా సమాజ శ్రేయస్సే ప్రధానంగా భావించారు ఆ నాటి వాళ్ళు . 

దీనిని కాలక్రమంలో కొంతమంది తోటివాళ్ళను దోచుకొనే స్థాయికి ఉపయోగించు కొంటున్నారు . అందువల్లనే  విజ్ఞాన విషయాలు అజ్ఞానం మురుగులో మరుగున పడ్తున్నాయి . 

వీళ్ళ వలననే నమ్మకం సన్నగిల్లి పోతోంది , పోయింది కూడా .  

తెలిసినా , తెలియకున్నా నిప్పుని డైరెక్టుగా ముట్టుకొంటే కాలుతుంది కదా ! అలాగే నమ్మినా , నమ్మకున్నా వీటిని ఆచరిస్తే శుభఫలితాలు యిస్తాయి కదా ! అన్నది తెలుసుకొని ఆచరిస్తే సత్ఫాలితాలు అందుకోవచ్చు అందరూ .

నమ్మినా ఆచరించకుంటే దుష్ఫలితాలు తప్పవు కదా ! 

తెలిసి చేసినా , తెలియక చేసినా తప్పు తప్పే గాని , ఒప్పుగా ఎన్నటికి పిలువబడదు కదా ! ఆ తప్పు ఒప్పుగా మారినప్పుడే ఒప్పుగా పిలువబడ్తుంది .


ఆచరించటం , ఆచరించకపోవటం వారి వారి ధృక్పధం మీద ఆధారపడి వుంటుంది .

అసలు శాస్త్రాలంటే అనుభవ సారాలన్నది గ్రహిస్తే చాలా చాలా మంచిది . ఈ శాస్త్రాలకు గత మూడు యుగాల సీనియారిటీ  ఉండి , సత్ఫలితాలను అందిస్తూ వచ్చాయి . 


మనమే మాత్రం కష్టపడకుండా మనకు వడ్డించిన విస్తరిలా మన ముందు వుంచారు . వారికి సర్వదా మనము మన మనఃపూర్వకంగా కృతఙ్నతలు చెప్పుకోవాలి .

                                                                 ****************

షో కేసు బొమ్మలాయెనేడు ,
గాంధీ జయంతి ,
ఘనంగా జరుపుకొనే ఆనవాయితి ,
ప్రజానాయకులందరూ ,
పుష్పగుఛ్ఛాలను ,
విగ్రహం ముందుంచారు ,
సంబరాలను అంబరాలు తాకేలా ,
వేదికలపై ఉపన్యాసాలు దంచేశారు ,
రహస్య గూటికి మందుని దించేశారు ,
గాంధీ అహింసావాదాన్ని ఆ మందులో ముంచేశారు ,
ఇదే అసలు సిసలు అహింసావాదమని తేల్చేశారు ,
ఆ హింసా వాదమే ఆశావాదం గా నొక్కి వక్కాణించారు  

ఆ నాడే , అదే 
స్వతంత్రం రాక మునుపే , 
తెలుసుకొన్న గాంధీజీ , 

మనుషులకు మనుషులతో మంచి చెప్తే వినరని , 
మనసుకి చిత్త చాంచల్యం ఎక్కువని ,
చిత్త చాంచల్యం అధికమైన ఆ కోతుల చేతనే ,

అవి కూడా మంచి చెప్పే విధంగా మారాయని,
మానవులమైన మనమూ మారాలని వెల్లడి చేశారు  

ఆ మూడు కోతులు యిస్తున్న సందేశాలని  
అలా అలా గాలిలో వదిలేసేశారు  
చూడ ముచ్చటగా ముద్దొచ్చేస్తున్నాయని ,
వాళ్ళ వాళ్ళ షో కేసులలో బంధించారు 

అలా తెలియచేసిన ఆ మూడు కోతులు ,
                     ఇప్పుడు ,
తమ భంగిమలను మార్చేశాయి ,
నోరు మూసుకు కూర్చున్నాయి 

దివి నుంచి కాంచిన గాంధీజీ ఆత్మ 
ఆశ్చర్యానికి లోనయ్యింది .

                       *****