షో కేసు బొమ్మలాయెనేడు ,
గాంధీ జయంతి ,
ఘనంగా జరుపుకొనే ఆనవాయితి ,
ప్రజానాయకులందరూ ,
పుష్పగుఛ్ఛాలను ,
విగ్రహం ముందుంచారు ,
సంబరాలను అంబరాలు తాకేలా ,
వేదికలపై ఉపన్యాసాలు దంచేశారు ,
రహస్య గూటికి మందుని దించేశారు ,
గాంధీ అహింసావాదాన్ని ఆ మందులో ముంచేశారు ,
ఇదే అసలు సిసలు అహింసావాదమని తేల్చేశారు ,
ఆ హింసా వాదమే ఆశావాదం గా నొక్కి వక్కాణించారు  

ఆ నాడే , అదే 
స్వతంత్రం రాక మునుపే , 
తెలుసుకొన్న గాంధీజీ , 

మనుషులకు మనుషులతో మంచి చెప్తే వినరని , 
మనసుకి చిత్త చాంచల్యం ఎక్కువని ,
చిత్త చాంచల్యం అధికమైన ఆ కోతుల చేతనే ,

అవి కూడా మంచి చెప్పే విధంగా మారాయని,
మానవులమైన మనమూ మారాలని వెల్లడి చేశారు  

ఆ మూడు కోతులు యిస్తున్న సందేశాలని  
అలా అలా గాలిలో వదిలేసేశారు  
చూడ ముచ్చటగా ముద్దొచ్చేస్తున్నాయని ,
వాళ్ళ వాళ్ళ షో కేసులలో బంధించారు 

అలా తెలియచేసిన ఆ మూడు కోతులు ,
                     ఇప్పుడు ,
తమ భంగిమలను మార్చేశాయి ,
నోరు మూసుకు కూర్చున్నాయి 

దివి నుంచి కాంచిన గాంధీజీ ఆత్మ 
ఆశ్చర్యానికి లోనయ్యింది .

                       ***** 

No comments:

Post a Comment