వసతే వాస్తు ( శాస్త్రం )

             
                                                          వసతే వాస్తు ( శాస్త్రం )
                                                                                                                  వ్యాస రచన  : శర్మ జి ఎస్

మానవులు సుఖంగా జీవించాలంటే కొన్ని వుండాల్సిందే .
ఆ కొన్నింటి కొరకు ధనం సంపాదించాల్సిందే . ఆ ధనం సంపాదించటానికి ఎంతో కష్ట పడవలసి వస్తుంది .

అంత కష్టపడి ఆ ధనం సంపాదించిన తర్వాత  నిలువ నీడగా ఇల్లు కావాలనిపిస్తుంది .
ఆ ఇల్లు ఎలా వుండాలి / ఎన్నిగదులుండాలి అన్నది ఆలోచించి ప్లాను వేసుకొంటారు . అంతవరకు బాగానే వున్నది .

అయితే ఆ యింటిలోని గదులు ఎక్కడ , ఎలా వుండాలి అన్నది తెలియ చేసేదే వాస్తు శాస్త్రం అంటారు .

అసలు వాస్తు అంటే ఏమిటి ? అన్నది మొదట తెలుసుకోవటం చాలా మంచిది .
వాస్తు అంటే వసతి  అని అర్ధం . ఇల్లు కట్టుకొన్న తర్వాత ఆ యిల్లు వసతిగా వుండాలన్నది ప్రధానమైన విషయం .

వసతే కాలక్రమంలో వాస్తుగా మారి శాస్త్రంగా స్థిరపడింది .

ఆ విజ్ఞాన శాస్త్రం ప్రకారం దక్షిణం నుంచి ఉత్తరం వైపు , పడమర నుంచి తూర్పు దిశగా కాంతి రేఖలు ప్రసారమవుతుంటాయని తెలియచేస్తున్నది . 
తదనుగుణంగా ఇంటిలోని గదులను నిర్మించుకోవలసి వస్తున్నది . దీనినే మన పూర్వీకులు విజ్ఞానశాస్త్రం అని చెప్పకుండా దక్షిణం యమ స్థానమని , నిద్ర లేస్తూనే తల దక్షిణం దిక్కుని చూడ కూడదని చెప్పేవారు . కనుక వీలైనంతవరకు దక్షిణాన్ని ఏ ముఖ్య పనులకు ఉపయోగించకూడదంటుంటారు .

పంచ భూతాలుగా పిలవబడ్తున్న ఫృధ్వ్యాపస్తేజో వాయురాకాశాత్ లు ఈ ప్రాణికోటి జీవనానికి మూలాధారమైనవి .
అవి ఏ దిశగా వుంటే మన మానవ జీవనానికి బాగుంటాయో అనుభవంలో తెలుసుకొన్న మన పూర్వీకులు కాదు , ముందు యుగాల వారు వాళ్ళ వాళ్ళ అనుభవాలను శాస్త్రాలుగా రచించారు .

అయితే ఆ యుగాలలో పెద్దలు చెప్పింది విని వాళ్ళ జీవితాలలో ఆచరణలో పెట్టేవారు . 
కాలక్రమంలో , యుగాల మార్పుతో చెప్పింది వినటమే కాని , ఆచరణ యోగ్యం కానప్పుడు , తోటి ప్రాణికోటికి నష్టం వాటిల్లుతుందని ఆలోచించిన కొంతమంది ఆ విజ్ఞానశాస్త్రాల్ని , దైవం పేరుతోనో లేక భయంపేరుతోనో సమాజంలోకి చొప్పించారు .

ఏది ఎలా చేసినా సమాజ శ్రేయస్సే ప్రధానంగా భావించారు ఆ నాటి వాళ్ళు . 

దీనిని కాలక్రమంలో కొంతమంది తోటివాళ్ళను దోచుకొనే స్థాయికి ఉపయోగించు కొంటున్నారు . అందువల్లనే  విజ్ఞాన విషయాలు అజ్ఞానం మురుగులో మరుగున పడ్తున్నాయి . 

వీళ్ళ వలననే నమ్మకం సన్నగిల్లి పోతోంది , పోయింది కూడా .  

తెలిసినా , తెలియకున్నా నిప్పుని డైరెక్టుగా ముట్టుకొంటే కాలుతుంది కదా ! అలాగే నమ్మినా , నమ్మకున్నా వీటిని ఆచరిస్తే శుభఫలితాలు యిస్తాయి కదా ! అన్నది తెలుసుకొని ఆచరిస్తే సత్ఫాలితాలు అందుకోవచ్చు అందరూ .

నమ్మినా ఆచరించకుంటే దుష్ఫలితాలు తప్పవు కదా ! 

తెలిసి చేసినా , తెలియక చేసినా తప్పు తప్పే గాని , ఒప్పుగా ఎన్నటికి పిలువబడదు కదా ! ఆ తప్పు ఒప్పుగా మారినప్పుడే ఒప్పుగా పిలువబడ్తుంది .


ఆచరించటం , ఆచరించకపోవటం వారి వారి ధృక్పధం మీద ఆధారపడి వుంటుంది .

అసలు శాస్త్రాలంటే అనుభవ సారాలన్నది గ్రహిస్తే చాలా చాలా మంచిది . ఈ శాస్త్రాలకు గత మూడు యుగాల సీనియారిటీ  ఉండి , సత్ఫలితాలను అందిస్తూ వచ్చాయి . 


మనమే మాత్రం కష్టపడకుండా మనకు వడ్డించిన విస్తరిలా మన ముందు వుంచారు . వారికి సర్వదా మనము మన మనఃపూర్వకంగా కృతఙ్నతలు చెప్పుకోవాలి .

                                                                 ****************

No comments:

Post a Comment