బంధం - అనుబంధము

                                                                   బంధం - అనుబంధము

                                                                                                                  వ్యాస రచన : శర్మ జి ఎస్ 

ఈ బంధం , అనుబంధములు మానవుల జీవితాలలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి . 
అందునా మన భారత దేశ సంస్కృతికి వెన్నెముక లాంటిది .

ఈ మన భారత దేశంలో వుండే బంధాలు అనుబంధాలు .

కొడుకు  
కూతురు
తల్లి 
తండ్రి
అమ్మమ్మ
నాయనమ్మ
తాతయ్య
ముత్తాత 
ముత్తవ్వ

కొడుకులు , కూతుళ్ళు పెరిగి పెద్దైన తర్వాత , వెరే అమ్మాయిలతో , వేరే అబ్బాయిలతో కళ్యాణం చేసేస్తారు . ఈ కళ్యాణంతో ఆ యిరువురు భార్యా భర్తలనబడతారు . ఆ క్షణం నుంచి ఆ యిరువురిది భార్యా భర్తల బంధం . ఒకరికి కావలసినది మరొకరు యిచ్చిపుచ్చుకొంటుంటారు . ఇక్కడ తన, పర భేదమే వుండదు . 

అంతదాకా ఈ యిరువురికి విడి విడిగా వాళ్ళింటిలో  ఆ అందరితో బంధాలుంటాయి . 

మా అమ్మ 
మా నాన్న 
మా అన్నయ్య 
మా తమ్ముడు 
మా అక్కయ్య
మా చెల్లి
మా అత్తయ్య 
మా మామయ్య 
మా బావ 
మా మఱది 
మా బావ మఱది

ఇలాంటి వెన్నో బంధాలు ఆ యిరువురికి వుంటుంటాయి .

కాని ఈ కళ్యాణం అయిన తర్వాత ఓ పేద్ద పెను మార్పు చోటు చేసుకొంటుంది .

అదే యిలా 

మా అత్తయ్య గారు
మా మామయ్య గారు
మా బావ గారు
మా మఱది గారు 

ఇలా గార్లతో మొదలవుతాయి కొత్త బంధాలనే అనుబంధాలు .

ఇంతదాకా "మా "అంటూ వున్న అనుబంధాలలో పెను మార్పుగా ఆ యిరువురి జీవితాలలో ఓ కొత్త బంధం ఏర్పడుతుంది .
అదే మా ఆయన ( గౌరవంగా ) , నా మొగుడు / నా భర్త అని ఆడపిల్లకు 
అదే నా పెండ్లాము / నా భార్య అని మగపిల్లవాడికి . 
భర్త అనబడే ఆ  మగవాడు విడిగా ఆడవారిపేరుకి గాని , ఆ బంధానికి గాని  గారు తగిలించి పిలువ వలసిన అవసరం లేదని అలనాటి పూర్వీకులు నిర్ణయించారు .
మగపిల్లలు / మగవాళ్ళు తన భార్యని ఏకవచన సంబోధన శాస్త్ర సమ్మతం . 

ఇక అక్కడనుంచే ఆ యిరువురిలో స్వార్ధం మొదలవుతుంది . ఈ వివాహ బంధం  , తర్వాత మిగిలిన మూడు వంతుల జీవితాన్ని చిందర వందర చేస్తుంది . ఆ చిందర వందర అందరిలో కాకున్నా కొంతమందిలో ఆనందాన్ని అందిస్తుంది . ఇంకొంతమందికి బాధను అందిస్తుంది . మఱికొంతమందికి సుఖ దుఃఖాలను అందిస్తుంటుంది .

వాస్తవంగా బంధం , అనుబంధాలు వేరు వేరు కాదు . రెండూ ఒక్కటే . 

ఆ బంధం ఎటువంటిదంటే ,

తల్లీ కూతుళ్ళ అను బంధం
తండ్రీ కొడుకుల అను బంధం 
అన్నా తమ్ముళ్ళు అను బంధం 
అన్నా చెల్లెళ్ళు అను బంధం
అక్కా చెల్లెళ్ళు అను బంధం 
భార్యా భర్తలు అను బంధం /
మొగుడు పెళ్ళాం అను బంధం 
ఇలాంటివే మిగిలిన అన్ని బంధాలు / అనుబంధాలు .

ఈ బంధాలన్ని మన భారత దేశంలో అతి పవిత్రమైనవి .

ఈ బంధాలు ఒక్క మారు ఏర్పడితే మనం పోయిన తర్వాత కూడా ఆ బంధాలు అలా నిలిచిపోతాయి , అందఱి నోళ్ళలో నానుతుంటాయి .

అందుకే మన భారత దేశం ప్రపంచంలో అత్యున్నత స్థానం ఏర్పరచుకొన్నది .

బంధం , అనుబంధములు దేశ కాలమాన పరిస్థితులను బట్టి మారుతుంటాయి .

మిగిలిన అన్ని దేశాలలో ఈ బంధాలు శాశ్వతం కాదు , తాత్కాలికమైనవే . 

అందువల్లే అక్కడి ఆడ , మగ వాళ్ళు వాళ్ళ మొత్తం జీవితంలో ఎన్నటికీ భార్యా భర్తలు కాలేరు , జీవిత భాగస్వాములుగా మాత్రమే పిలువబడ్తుంటారు .

ఎప్పుడైతే జీవిత  భాగస్వాములయ్యారో , వాళ్ళు వ్యాపారం చేస్తున్నారే కాని జీవితాన్ని ఆనందించటం కాని , తన / తమ వంశాన్ని వృద్ధి చేసుకోవటం గాని లాంటి బాధ్యతలు లేనే లేవు .

వాళ్ళు ఆ ఆడ , మగ కలయిక బంధాన్ని వ్యాపారంగా భావించటం వలన , వాళ్ళ వాళ్ళ జీవిత పయనంలో అనేకమంది భాగస్వాములు చొరబడ్తుంటారు .

సహజంగా ఎక్కడైనా  భాగస్వాములను పేర్లతో పిలుచుకొంటారు కదా ! వాళ్ళు ఏ భాగస్వాములనైనా అలాగే పిలుచుకొంటారు . 

ఆ భాగస్వాములను ఎంచుకోవటానికి ఎవరికి వాళ్ళకు స్వేఛ్ఛ కలిగి వుంటారు . ఇలా ఆ స్వేఛ్ఛతో ఒకరినొకరు తెలుసుకొనుటకు వాళ్ళు జీవిత భాగస్వామ్యానికి ముందు కలిసి తిరుగుతూ వుంటారు అన్ని విషయాలలో . అలా కలిసి వుంటున్నప్పుడు ఒకరి కొకరు తెలుసుకోవటానికి ఎంత టైం పట్టినా ( వాళ్ళు ఒకరి కొకరు యిష్టపడితే ) కలిసే వుంటుంటారు . 
    
అలా నచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఒప్పంద పత్రిక వ్రాసుకొని , జీవిత భాగస్వాములౌతారు . 

అలా వుంటున్న సమయంలో ఒకరి కొకరు నచ్చకుంటే ఆ  ఒప్పందాన్ని రద్దు చేసుకొంటారు .

ఎప్పుడూ ఎంచక్కా వాళ్ళు పేర్లతో ఏకవచన సంబోధనతో సంబరపడి పోతుంటారు . ఇది మన భారత దేశంలో స్నేహితుల నడుమ , పరిచితుల నడుమ , చిన్నవారి పట్ల మాత్రమే కొనసాగుతూ వుంటుంది . అలాగని జీవితం ముగిసే వరకు వుండాలని ఏమీ లేదు .

కాని భార్యా భర్తల బంధం కడదాకా వుండాలని మన పూర్వీకులు మర్యాద పూర్వకమైన సంబోధనలను మనకు అందించారు . ఒకరినొకరు గౌరవించుకోవటం ఆ భార్యా భర్తల నడుమ పేర్లతో కాదు బంధంతో అని వ్యక్తపరచి ఆచరణలో వుంచారు .

ఎప్పుడైతే ఏకవచన సంబోధన చేసుకొంటున్నారో వాళ్ళు మిగిలిన దేశాలలో లాగా జీవిత భాగస్వాములే కాని , ఎన్నటికీ భార్యా భర్తలు కాలేరు . 
ఎందుకంటే స్నేహాన్ని చేసినప్పుడు ఎదుటివారు మనకు నచ్చనట్లుగా ప్రవర్తన కొనసాగిస్తుంటే , ఆ స్నేహం వద్దనుకొని విడిపోతారు . అలాగే ఆ మిగిలిన దేశాల వాళ్ళు ఆ జీవిత భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నారు . 

వాళ్ళకు ఏ బంధాలు లేవు కనుక , వాళ్ళు ఏమీ దాచుకోవటానికి సంపాదించరు  . 

ప్రపంచంలో మిగిలిన అన్ని దేశాలకు శాశ్వత బంధాలు లేకపోవటం వలన వాళ్ళకున్న బంధాలన్నింటికి సంవత్సరంలో ఒక్క రోజు కేటాయించి ఆనందిస్తుంటారు . కనీసం ఆ ఒక్క రోజైనా ఆనందిద్దామని అలా ఏర్పాటు చేసుకొన్నారు . 

మదర్స్ డే 
ఫాదర్స్ డే 
ఫ్రెండ్ షిప్ డే 
లవర్స్ డే 
అంకుల్స్ డే  
ఆంటీస్ డే  
గ్రాండ్ మదర్స్ డే 
గ్రండ్ ఫాదర్స్ డే 
లాఫింగ్ డే 

ఇలా రక రకాలుగా ఏర్పాటు చేసుకొన్నారు . 

ఏ బంధమూ కడదాకా కొనసాగించలేమని వాళ్ళ సామర్ధ్యత వాళ్ళకు బాగా తెలుసు కాబోలు .  కనుకనే సంవత్సరంలో ఆ ఒక్క రోజైనా వాళ్ళతో గడిపి ఆనందాన్ని పంచాలని , ఆనందిద్దామనుకొన్నట్లున్నారు .

శాశ్వత బంధాలున్న మన భారతదేశ ప్రజలలో కొంతమంది వాటిని పాటిస్తూ , మన శాశ్వత బంధాలని వదలి వేస్తున్నారు .


మఱి మన భారతదేశ ప్రజలకు అన్ని బంధాలు వున్నాయి గనుక , మనం అటు మొగ్గు చూపటం ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదు .

మన భారత దేశ ప్రజలలో కొంతమంది పరాయి దేశాలకు ధన సంపాదన పరంగా వెళ్ళి , ఈ దుస్సంప్రదాయ సంస్కృతిని అంటించుకొంటున్నారు . మఱికొంతమంది అంతర్జాలం ద్వారా అరువు తెచ్చుకొంటున్నారు .  

తన భర్త తనను ఏక వచనంతో పిలవటం వల్ల ఆ భార్యకి కలిగే నష్టమేమీ లేదు . అలా పిలవటంతో ఆ భార్యకు ఆ భర్త వద్ద బెరకు , బిడియం పోయి చనువు , స్వతంత్రం 
పెరుగుతాయి . 

కనుక మన భారతదేశ సంప్రదాయాన్ని తెలుసుకొని దానినే కొనసాగిస్తే చాలా చాలా మంచిది . 


                                                       ********************

7 comments:

 1. బంధాల అనుబంధాల బాంధవ్యాల పై మీ వ్యాసం బహుబాగున్నది శర్మ సర్..

  మనుషుల మనసుల్లో ఒకరి పట్ల ఒకరికి గౌరవం మర్యాద విధేయత చూస్తే వచ్చేది కాదు. అవి ఒకరిపట్ల మరొకరికి కలిగే అభిమానం నమ్మకం విశ్వసనీయత పై ఆధార పడి ఉంటాయి..

  కుటుంబ విలువలు ఇవే.. ఇవే సమాజాన్ని ముందుకు నడిపే సోపానాలు.. కుటుంబం లో ఈ విలువలు మరిచిన నాడు నా అనుకున్న వారే పరాయిగా మిగిలిపోతారు. ఆ విలువలను గౌరవించేవారు పరాయి మనిషైనా మనలో ఒకరిగా ప్రశంసలందుకుంటారు.

  ~శ్రీ~
  గరుడగమన శ్రీరమణ

  ReplyDelete
  Replies
  1. ఒక కుటుంబం లో పెను మార్పులు (మంచైనా చెడైనా) వచ్చేది కళ్యాణం జరిగాకనే అని శెలవిచ్చారు. [నాకు పెళ్ళి ఇంకా కాలేదు గాని మా అమ్మ మా నాన్నమ్మ వాళ్ళ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను]

   ఈ మాట నూటికి నూరు పాళ్ళు నిజమని నమ్ముతున్నాను. మాయమ్మ మా నాయనమ్మను ఏ రోజు దూషించలేదు. మా నాయనమ్మ కూడా మాయమ్మను ఎప్పుడు పన్నెత్తి మాట అనేవారు కాదు. గుణగణాలను ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటు వచ్చారు. ఇప్పటికీ ముప్పై మూడేళ్ళు ఐనా ఇద్దరిని చూస్తే అత్తాకోడళ్ళు నిజంగా ఎలా ఉండాలో వారే ఉదాహరణ అని అంటారు మా అమ్మమ్మవాళ్ళు. మా నాయనమ్మ రెండెళ్ళ క్రితం కాలం చేశారు ఐనప్పటికీ మాయమ్మ ఆమేను తలుచుకోని రోజంటు లేదు.
   నాకొచ్చే భార్య కూడా ఇలా కలుపుగోలు స్వభావం కలిగి ఉండాలని పెద్దవాళ్ళని గౌరవించాలని మాయమ్మ, నాన్న గారి కోరిక.. నా అభిమతం కూడా.. ఓం కేశవాయ నమః

   Delete

  2. ముందుగా మీకు స్వాగతం , సుస్వాగతం .

   మీ అమ్మగారు , మీ నాయనమ్మ గారు అలా ఒకరి నొకరు అర్ధం చేసుకొంటూ వుండటం ఏ పూర్వజన్మల పుణ్యఫలమో కావచ్చు .
   మీకు కాబోయే , రాబోయే జీవిత భాగస్వామి కూడా అలాంటి సద్గుణాలు కలిగిన అమ్మాయి రావాలని ఆశిస్తున్నాను .

   Delete
 2. బంధాలు అనురాగాలు అంతా బూటక నాటకాలు అనిపిస్తుంది నాకు ఎందుకో. మన్నించాలి తప్పు కూడా ఐయి ఉండవచ్చునండి.

  ReplyDelete
  Replies
  1. ఈ బంధాలు , అనుబంధాలు బూటకం అనిపించినపుడు ప్రపంచమంతా నాటకమని ఖచ్చితంగా అనిపించి తీరాలి . అపుడే నువ్వు ముందుకు మునుముందుకు సాగిపోగలవు . లేకుంటే నీ కుంచె కదలదు , కలం కదలదు . ఇవన్నీ తాత్కాలికమైనవే ఈ ప్రపంచంలో ఏవీ శాశ్వతమైనవి కావు . ప్రపంచం లోని పంచభూతాలే శాశ్వతమైనవి , మార్పు చెందుతూ చెందనట్లుగా కనపడేవి ఎప్పటికప్పుడు క్రొత్తగా , కొంగొత్తగా .

   Delete
 3. ఆలు మగల బంధమ్మే
  కాలము కడదాక నిలుచు , కడచిన వన్నీ
  కాలముతో నేర్పడినవి ,
  పాలింపగ నిలుచు , లేద , పాడై పోవున్ .

  ReplyDelete
 4. ఆలు మగల బంధమ్మే
  కాలము కడదాక నిలుచు , కడచిన వన్నీ
  కాలముతో నేర్పడినవి ,
  పాలింపగ నిలుచు , లేద , పాడై పోవున్ .

  ReplyDelete