సంతోషాన్ని కొనగలమా ?


                                                                                                                         
ఆ మధ్య  ఏ  శుభకార్యానికి వెళ్ళినా , ఆ  పెద్దవాళ్ళు  చిన్నపిల్లల్ని వాళ్ళ బంధువులలో పెద్దవాళ్ళ వద్దకు తీసుకువెళ్ళి వంగి కాళ్ళకు దండం పెట్టించే వారు . వాళ్ళు  చెప్పినట్లే  పెట్టేవాళ్ళు 
వెంటనే ఆ దండం పెట్టించుకొంటున్న ఆ పెద్దవాళ్ళు   "   కలకాలం పిల్లా  పాపలతో ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలతో , సుఖ శాంతులతో హాయిగా జీవించండి "   అని ఆశీర్వదించేవాళ్ళు  . ఈ దీవెన వినగానే మనసు ఎంతో  ఆనందాను
భూతికి లోనయ్యేది . ఆ దీవెన / ఆశీర్వాదంలో అంత ఆనందం ఇమిడి ఉండేది .

మరి ఈ రోజుల్లో   ఆ ఆశీర్వాదాలు ఎక్కడా వినపడటం లేదు . నమస్కారం పెట్టమనేవారు లేరు పెట్టే వారు లేరు,  పెట్టించుకునేవారూ కనపడటం లేదు  . అలా వంగి కాళ్ళకు నమస్కారం చేయటం ఎంతో తప్పుగా భావిస్తున్న రోజులివి . అలా నమస్కరించటం వలన తనని చిన్నచూపు చూస్తున్నారన్న భావన అధికమై, అలా వంగి నమస్కారాలు చెయ్యటమే మానేసేశారు ఈ కాలపు వాళ్ళు , వాళ్ళను కన్నతల్లితండ్రులు కూడా . వాస్తవానికి వాళ్ళను కన్న తల్లితండ్రులు వాళ్ళ చిన్నతనంలో వాళ్ళ పెద్దల మాట విన్నవాళ్ళే  . వంగి నమస్కారాలు చేసినవాళ్ళే . మరి వాళ్ళ చిన్నపిల్లలకి ఎందుకు చెప్పలేకపోతున్నారు ????????

అంటే..... వీళ్ళలో కూడా ఎక్కడో ఏదో మూల అలా వంగి నమస్కారం చేయటం తప్పేమో అన్న ఓ చిన్న సందేహం బీజంగా  బలంగా నాటుకుండటం వలన , పిల్లమీద పడుతున్న మీడియా ప్రభావం , వీళ్ళమీద పడటం వలననూ ,ఇప్పుడు వాళ్ళ చిన్నపిల్లలకు  చెప్పలేక పోతున్నారు . వాళ్ళ చేత ఆలా వంగి నమస్కారం చేయించలేక పోతున్నా రు . అలాగని  పిల్లలమీద ప్రేమాభిమానాలు ఏ మాత్రం  తగ్గుతున్నాయనుకోవటానికి వీలు లేదు . అలా అని వాళ్ళు వాళ్ళ చిన్నపిల్లల కొరకు  రూపాయి ఖర్చు చేయవలసిన స్ధానంలో వంద  రూపాయలైనా ఖర్చు చేయటానికి వెనుకాడటం లేదు .

ఉదాహరణకు :  ఆ నాటి నుంచి మొన్న మొన్నటిదాకా చిన్నపిల్లలను కంటున్నవారేగా అందరు . ఎవరైనా పొత్తిబట్టలు వాడేవారు , అంతే గాని   బేబీ ప్యాడ్స్ , హగ్గీస్ , మఱియు డైపర్స్  వాడేవాళ్ళా ? వాళ్ళు చిన్నపిల్లలకీ , వాళ్ళకు భేదం చూపించేవారు కాదు . వాళ్ళ స్వవిషయాల్లో కూడా అంతే .

ఉదాహరణకు : ఈ నాడు భర్త పుట్టిన రోజునొ / పెళ్ళి రోజునో  భార్యకు అడిగిన గిఫ్ట్ కొని పంపించి  కూడా, చూసి ఆనందించ టానికి వీలుపడదు , ఆఫీసు పనులతోనో , లేక వ్యాపార పనులలొనొ బిజీగా వుండి . బాధపడి ప్రయోజనంలేక అలాగే అలవాటు పడిపోతున్నారు . అదే వాళ్ళ పిల్లల జీవితాలకు అమలు జరుపుతున్నారు . 

ఇటువంటి వారికి తన కన్న చిన్నవారిని దీవించాలన్న ఆలోచన క్రమేపీ అడుగున పడిపోతుండటంతో , అలా పెద్దవాళ్ళకు వంగి నమస్కారం చేయించాలన్న ఆలోచన వారి మనసులలో చొరబడటం లేదు .ఆ దీవెనలోని అంతరార్ధం : "   సుఖ శాంతులతో హాయిగా కలకాలం హాయిగా ఉండండి "   అంటే    

సుఖ       = సుఖం  
శాంతులు    = శాంతితో
కలకాలం    = ఎల్లప్పుడు 
హాయిగా    = ఆనందంగా  
ఉండండి     = ఉండమని.   

చాలామంది తమ పెద్దవాళ్ళను సుఖసంతోషాలతో చూసుకొంటున్నామనుకొంటున్నారు  . సంతోషపెడ్తున్నామని అనుకొంటున్నారు . వాళ్ళకి వాళ్ళు స్వయంగా చూసుకొనే అవకాశం లేక , పలు రకాలుగా వృధ్ధాశ్రమాలలో , 
అనాధాశ్రమాలలొ స్వయంగా విచారించి , వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు  డబ్బు  మాసం మాసం వ్యయం చేస్తూ చాలా 
చాలా  శ్రధ్ధ తీసుకొంటున్నామని అనుకుని మును ముందుకు అలా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు ఆనందంగా  . నిజానికి వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళని సంతోషంగా  చూసుకోలేకపోతున్నారని ఘంటాపధంగా చెప్పవచ్చు . 

ఎందుకంటే సుఖం దేహానికి  సంబంధించింది .ఆ దేహన్ని  ఏర్ కండిషండ్ గదిలో ఉంచితే  చల్లబడుతుంది , సుఖాన్ని పొందకలుగుతుంది . ఇలాంటి  సుఖాన్ని కొనుక్కోగలం , కానీ సంతోషం అలా కొనుక్కునేది కాదు .
మనసుకి  సంబంధించినది . ఆ మనసు ఎక్కడుందో  ఎంత మందికి తెలుసు ?   పైగా సంతోషం ఒకరు ఒనకూర్చగలిగినదే , అదీ ఎదుటివారి మనసుల్ని తెలుసుకున్నపుడు మాత్రమే .

అలా ఎదుటివారి ఆంతర్యం తెలుసుకోలేనపుడు ఎవరికి వారు ఒనకూర్చుకోవలసినదే గాని కొని అందించ గలిగేది 
కాదు . ఈ నగ్న సత్యం  తెలుసుకుంటే సుఖ సంతోషాలకు కొదవే లేదు . కనుక కొంచెం ఆలోచించి నడతను తదను
గుణంగా  మార్చుకుంటే అందరికి ఆనందం .

చాలామంది ,ఇంత శ్రమ తీసుకోవటం దేనికి ? రేపు మనమూ వృధ్ధుల మవుతామని తెలుస్తూనే ఉన్నది గదా , ముందు జాగ్రత్త చర్యగా డబ్బులు బ్యాంక్ లో జమ చేసి ఆదా చేసుకొంటే మనమేమీ ఇబ్బందులు పడవల్సిన 
అవసరం లేదు అనుకుంటుంటారు . అది పేద్ద తప్పుడు ఆలోచన మాత్రమే . 

డబ్బు మనిషి అవసరాలలో ఉపయోగపడటం విశేషమే , ఆనందించాల్సిన విషయమే . అయితే అందరి జీవితాలకు
అన్వయించబడదు . నూటికి ఏ ఒక్కరికో మాత్రమే అలా ఉపయోగపడ్తుంది . డబ్బు డబ్బుని సంపాదించేటట్లయితే , 
ఈ నాడు ఎంతోమంది ఎన్నో వ్యాపారాలు దినమూ పెడుతూనే ఉన్నారు . అతి తక్కువ కాలంలో ఆ వ్యాపారాలని 
మూసివేస్తూనే ఉన్నారు . మనమూ నిత్యం చూస్తూనే ఉన్నాము . కనుక డబ్బు మనలని బాగుచేస్తుందనుకోవటం , మనకెంతోఉపయోగపడుతుందను కోవటం నూటికి నూరు శాతం నిజం కాదు . డబ్బు మనిషిచే సృష్టించబడ్డది . పై పై అవసరాలకనుగుణంగా ఉపయోగపడుతుందే తప్ప అంతర్గత విలువలముందు అది బలాదూర్ . 

కనుక మనల్నెవరో సంతోషపెడ్తారనుకోవటం నిజం కాదు , సంతోషం మనసుకి సంబంధించినది కావటం వలన ఎవరికి వారు ప్రయత్నించుకోవటం చాలా చాలా మంచిది . అపుడు ఎవరినీ మనం దూషించవలసిన అవసరం మన దరి చేరదు . 
పైగా యిలా ప్రయత్నించటం వలన మన మనసు ఏ స్థాయిలో వున్నదో మనకు అవగతమవుతుంటుంది . పెడత్రోవ పట్టకుండా మన మనసుని సన్మార్గంలో నడిపించే అవకాశాన్ని మన అదుపులో వుంచుకున్న వాళ్ళమవుతాం .  


సంతోషాన్ని కొనుక్కోలేము , మనంతట మనమే తెచ్చుకోవాలి .


                                                                    **********
  గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ - ఓల్డ్ గ్రేట్ బ్రిడ్జ్

South San Francisco
S F O Down Town
Golden Gate Bridge
తేది : 20/05/2013

ఈ రోజు ఉదయం ఆదివారం అందరు ఆలస్యంగా లేచారు . నేనూ 6.16 కి లేచాను , నా కాలకృత్యాలు ముగించుకుని 
ల్యాప్ టాప్ ఓపెన్ చేసి కధను కరెక్ట్ చేసుకొంటున్నాను . నా శ్రీమతి కాఫీ యిచ్చింది .  నా పెద్ద మనుమడికి మొన్న 
మిష్టరీ స్పాట్ ,ఎస్ ఎఫ్ ఓ బీచ్కి వెళ్ళి వచ్చిన ప్రభావం , ఆ పై వద్దన్నా వినకుండా అర్ధగంట సమయం చేసిన బబుల్ 
బాత్ ప్రభావం , వెరసి జలుబుతో కూడిన జ్వరం సరసన చేరాయి . 

ఇటువంటప్పుడే మనం మన మంచితనాన్ని , విచక్షణాఙ్నానాన్ని కోల్పోవటము జరుగుతుంటుంది ,ఆలోచించ
నీయకుండా కోపం కప్పేస్తుంది .  కోపం మనను ప్రవేశించగనే , మనుషులమైన మనం పశువులుగా మారి , పసి
వాళ్ళను యిబ్బందుల పాల్జేయటం జరుగుతుంటుంది .

అందుకనే తమాయించుకొని ఒక్క క్షణం ఆలోచిస్తే వాళ్ళు చేసినదాంట్లో తప్పు లేదన్నది మనకు అవగతమవు
తున్నది . అదే కదా బాల్యం . ఆ బాల్యమే కదా మనం పోగొట్టుకున్నామని ఎన్నోమారులు ఎంతమంది దగ్గరో బయటపడిన వాళ్ళమే కదా ! మనం పోగొట్టుకున్నది మన పిల్లలు కూడా ఎందుకు పోగొట్టుకోవాలి అన్నది మనం గ్రహించుకుంటే , వాళ్ళని మనం కోపగించవలసిన అవసరమే రాకుండా పోతుంది ఈ విషయంలో . 

దానితో కొంచెం ఆలస్యంగా లేచి , భోజన కార్యక్రమాలు ముగించుకొని తర్వాత ఎస్ ఎఫ్ ఓ గోల్డెన్ గేట్ బ్రిడ్జి కి వెళ్దామ నుకున్నాము .

అలాగే 2.30 కి బయలుదేరాం కారులో . ఆ అందమైన  రహదారుల  చుట్టూరా అందమైన కొండలు ఎవరో పేర్చినట్లు
న్నాయి . ఆ కొండలలో అచ్చటచ్చట అందమైన ఆకృతులతో భవనాలు , ఆ భవనాల ముందు కళాకృతులతో చక్కటి సారీ చిక్కటి చెట్లు మొక్కల్లా కనపడుతూ మన కళ్ళను ఆకర్షిస్తాయి  . 

ఇంత ట్రాఫిక్ కి అసలు మూల కారణం వేరే ఉంది . అదేమిటంటే ఈ అమెరికాలో వీకెండ్ రాగానే వీకెన్ అయిపోయిన వీళ్ళందరూ , యిళ్ళను వదలి హాయిగా ఎంజాయ్ చేయాలని యిలా విహారయాత్రలకు వెళ్తుంటారు . ఈ వెళ్ళటంలో కొంతమంది స్వంత కార్లలో , యింకొంతమంది రెంటల్ కార్లలో , మరి కొంతమంది తమ స్వంత  కార్ హౌస్ ఎటాచ్ మెంటుని  ( అంటే దీనిలోనే బెడ్ , కిచెన్ , బాత్ రూం ఉంటాయి  , ఇవి అద్దెకు కూడా దొరుకుతుంటాయి , కాకుంటే వీటిని ఎక్కడంటే అక్కడ కార్లలా పార్క్ చేయ వీలు కాదు . )ని తమ కారుతో , తీసుకుని ఇలా వెళ్తుంటారు . ఇటువంటివన్నీ ఆ రహదారిని అపుడపుడు కొంత సమయం పాటు స్తంభిపచేస్తుంటాయి .

ఆ రహదారి అన్ని రకాల వాహనాలతో  .  క్రిక్కిరిసి పోయి , అక్కడక్కడ 10 , 15 నిముషాల చొప్పున ఆగుతూ 3.25 కి చేరాము ఓల్డ్ ఎస్ ఎఫ్ ఓ మీదుగా గోల్డెన్ బ్రిడ్జి దాటాము . 

నిజంగా చూడ కనువిందుగా ఉన్నది . ఈ బ్రిడ్జి సముద్రం మీద క్రింద సపోర్టులు లేకుండా స్ప్రింగ్ మీద నిర్మిం
చబడ్డది . వాళ్ళ నిర్మాణ  నైపుణ్యానికి హ్యాట్స్ ఆఫ్ .వాళ్ళు ఏది తయారు చేసినా ఆ నాణ్యత కనపడుతుంది . 
అక్కడ ఆ సుందర దృశ్యాలను కళ్ళారా చూసి , కెమేరాలో బంధించటం జరిగింది . మధ్యలో షిప్ లో సైట్ సీయింగ్ ఆ 
ప్రక్కన డౌన్ టౌన్ ( కొత్తగా కట్టబడిన ఎత్తైన కట్టడాలు ,ఇదే కొత్త ఎస్ ఎఫ్ ఓ ) , నడుమ ఆల్క్రాట్జ్ దీవి ( పాత కాలంలో షిప్ మీదగా అమెరికా వచ్చేవాళ్ళకి పోర్ట్ ఆఫ్ అథారిటీగా పని చేసింది , యిప్పుడు ఖైదీలనుంచే జైల్ గా ఉపయోగిస్తున్నారు . 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది 1866 నుంచి .) ఉన్నది .

గోల్డెన్ గేట్ బ్రిడ్జి నుంచి ఆ వైపు ఉన్న కొండల నుంచి సైట్ సీయింగ్ ప్లేసులకి కారులో వెళ్ళాము . ఈ మధ్యలో బైసైకిల్ష్ట్ 
లు ఆడా మగా తేడా లేకుండా వేగంగా వెళ్తున్నారు ఆ కొండ పైకి . నిజంగా సుందర దృశ్యమే , ఎడమ వైపు డౌన్ టౌన్ , గోల్డెన్ గేట్, ఇంకొక వైపు సముద్రం , మరొక వైపు లోతైన లోయలు . కెమేరాలో కొన్ని సుందర దృశ్యాలను క్లిక్ చేశాము .

అక్కడ నుంచి రిటర్న్ యింటికి .  


                                                                      ********
మిష్టరీ స్పాట్ - హిష్టరీ స్పాట్


శాంతా క్రూజ్ బీచ్


ఈ రోజు శనివారం , తేది 19/05/2013 . భోజనాల తర్వాత మిష్టరీ స్పాట్ కి , ఎస్ ఎఫ్ ఓ బీచ్ కి బయలుదేరాము. మధ్యాహ్నం 12.30 కి కారులో .  బీచ్ లో పిల్లలు యిసుకతో ఆడుకొనే సామగ్రిని దారిలో షాపింగ్ చేశారు . 1.36 కి చూపించే  షో కి టికెట్లు తీసుకున్నాడు . నగరం లోంచి కొండ పైకి వెళ్ళ్తుంటే , అంతా అడవులు , ఆ అడవులల్లో , ఆ కొండలలోనే అక్కడక్కడా కొన్ని యిళ్ళు , వంకర కంకర దారులు , పక్కనే ఎత్తైన వృక్షరాజాలు , ఇంకో వైపు పాతాళాన్ని ఙ్నప్తికి తెస్తున్న లోతైన లోయలు .

ఈ మధ్యలో కామెడీగా నా చిన్న మనుమడు  చిటికెన వేలు చూపిస్తూ హడావుడి చేశాడు .దిగిన వంటనే అప్పటికే 1.40 దాటింది , అయినా రెస్ట్ రూం ఎక్కడా అని ఆ ప్రయత్నం అప్రయత్నంగా జరిగిపోయింది .
 చిటికెన వేలు కున్న స్పెషల్ గుణం , ఒకడు మొదలెడితే వరుస అందరికీ అంటుకుంటుంది అంటువ్యాధిలా . వ్యాధి అన్నానే కాని ఆ పని పూర్తి అయింతర్వాత హాయిగా  ఫీలయ్యం అందరం . అప్పుడే అనిపించింది వదిలించు
కోవటంలో ఇంత ఆనందం వుంటుందని .

మిష్టరీ స్పాట్ షోకి రెడీ అయ్యాము . ఏపుగా పెరిగిన వృక్షరాజాలు ఏటవాలుగా కనపడ్తున్నా అవి క్రింద పడవు ,
పడేటట్టుగా ఉంటాయి . ఆ తర్వాత పైకి వెళ్ళాము అనటం కన్నా , ఎక్కామంటేనే బాగుంటుంది . అక్కడ ఒక బల్ల ఒకవైపు ఎత్తు , ఇంకోవైపు పల్లం బాగా కనపడ్తుంటుంది .

దాని మీద ఎత్తైన ప్రదేశంలో ఒక బంతి పెడితే అది పల్లం వైపు జారకుండా అక్కడే ఉండిపోయింది . ఆ తర్వాత అదే బంతిని పల్లం వైపు నెట్టింది . అది అక్కడ ఉండకుండా ఎత్తుగా వున్న వైపు పరుగున వచ్చి అక్కడే నిలిచింది .
ఆ తర్వాత నా పాకెట్ లోని కలం తీసుకొని ఎత్తు వైపు ఉంచింది . అది నిశ్చలంగా అక్కడే వుండిపోయింది . మఱల పల్లం వైపు అదే కలాన్ని క్యాప్ లేకుండా పల్లం వైపు క్రింద వైపు పెట్ట్టింది .ఆ కలం పల్లం వైపు ఉండకుండా ఎత్తు వైపు వచ్చి అక్కడ నిలిచింది . చివరగా నీళ్ళు పల్లం వైపు పోస్తే అవి పల్లం వైపు పోకుండా మెఱక వైపుగా పైకి వచ్చాయి . ఇదేమి మంత్రం కాదు , తంత్రం కాదు . అదే మిష్టరీ స్పాట్ . భూమ్యాకర్షణ శక్తి ఆ పల్లం వైపు తక్కువ , మెఱక వైపు సరిగ్గా వుంది .

ఆ తర్వాత అక్కడ ఓ చక్కల గదిలోనికి అడుగుపెట్టటంలోనే యిబ్బందితో కూడిన విషయమే .ఆ గది ఏటవాలుగా ఉంటుంది . అడుగులు వేయటమే కష్టం . అక్కడ వంగినా పడిపోము . ఫొటోలు కూడా తీసుకున్నాము . నిజమే అందులో అబధ్ధమేమీ లేదు అన్న నిర్ధారణకు వచ్చాము .

ఈ మొత్తానికి 45 నిముషాల నుంచి 60 నిముషాల వరకు సమయం పడ్తుంది .

అటుపిమ్మట వెంట తీసుకొచ్చుకున్న ( మన ) పులిహోర అందరం లాగించాము . లోడింగ్ అయింతర్వాత అన్ లోడింగు సర్వ సహజమే కదా ! ఆ దిశగా అడుగులు వేశారు కొందరు . . అర్ధగంట అయింతర్వాత బయలుదేరాం ఎస్ ఎఫ్ ఓ బీచ్ కి . 20 నిముషాలలో చేరుకున్నాము . కారు పార్కింగ్ చేసి , ఎక్స్పోజ్ అయ్యే శరీరాన్ని సన్ స్క్రీన్ లోషన్ స్ప్రే పూసుకొని యిక బీచ్ ఒడ్డుకి చేరుకున్నాము .

మనమేమో మన శరీరం ఎక్కడ నల్లబడిపోతుందోనని సన్ స్క్రీన్ లోషన్ పూసుకొని బీచ్ వద్దకు వెళ్తుంటే , ఇక్కడ అమెరికన్లు ఒంటిమీద గుడ్దపీలిక లాంటివి అడ్డం పెట్టుకుని సన్ బాత్ చేస్తున్నారు బోర్లా పడుకుని . అలా అందాలారబోస్తున్నారు చాలామంది . వాళ్ళను చూసేమో సముద్రం కూడా నురగలు కక్కుతూ , ఉరుకుల పరుగులు తీస్తూ , పలకరించి పోతున్నది . ఆ దృశ్యాలను కెమేరాతో చిత్రీకరించాము .

ఎంత వైవిధ్యం ఇండియా వాళ్ళకి - అమెరికా వాళ్ళకి . ఇండియాకి , అమెరికాకి అన్ని విషయాలలో తేడానే .

7 గంటలకు రిటర్న్ బయలుదేరి , గ్రాసరీస్ తీసుకొని 8.30 కి ఇంటికి చేరుకొన్నాము .

                                                                        *********

అంతరంగ రహస్యం
నేను ,

చేయలేనివి  ఎవరో చేసేస్తుంటే సంతోషిస్తా
చెప్పలేనివి ఎవరో చెప్పేస్తుంటే సంతోషిస్తా
చూడలేనివి ఎవరో చూసేస్తుంటే సంతోషిస్తా
తినలేనివి , తినకూడనివి ఎవరో తినేస్తుంటే సంతోషిస్తా

చేయాలనుకున్నవి   ( నాకంటే ముందర ) ఎవరో చేసేస్తుంటే  ఏడ్చేస్తా
చెప్పాలనుకున్నవి   ( నాకంటే ముందర ) ఎవరో చెప్పేస్తుంటే  ఏడ్చేస్తా
చూడాలనుకున్నవి  ( నాకంటే ముందర ) ఎవరో చూస్తుంటే  ఏడ్చేస్తా
తినాలనుకున్నవి   ( నాకంటే ముందర ) ఎవరెవరో తినేస్తుంటే ఏడ్చేస్తా


ఇష్టం లేనివి చెప్పేటప్పుడు ఒమిట్ చేస్తా
నాకిష్టమైనవాటికి కమిట్ అవుతా

నేనే ఈ కలికాలపు జీవిని
ఈ జీవితం సుఖదుఃఖాల మిశ్రమం
ఇదే అసలు సిసలు అంతరంగ రహస్యం .

                           *******************

నా ( న్యూ ) నుడులు - 5
1                   కడుపు నిండితే కబుర్లు ,

                     కడుపు మండితే రచనలు .

2                   ఆడిన మాట తప్పకు ,

                     వాడిన మాట వాడకు ,
                     తిట్టిన తిట్టు తిట్టకు .

3                   పడుచు అలిగిందంటే వలపు రేగిందన్నమాటే ,

                     ముసలిది అలిగిందంటే ముసలం పుట్టిందన్నమాటే .

4                   తడి ఒక వయసు దాకే ,

                     తపన తనువు చాలించే దాకా .

5                   పదవి , పెదవి లేనిదే ,

                     ఈ ఫృదివే లేదు .

6                   ఎదుటివారికి చెప్పేటప్పుడు ఉన్నంత ఊపు ,

                     తను చేసేటప్పుడు ఉండదు .

7                   నిప్పు లేనిదే పొగ రానే రాదు ,

                     తప్పు చేయనిదే పగ కానే కాడు .

8                   పగ వద్దు అంటే పలువురితో గలభా పడవద్దని ,

                     ప్రేమ అంటే ప్రేరణతో మమత అని . 

9                   బతికినప్పుడు నవ్వులు ,
                     పోయినప్పుడు నువ్వులు  .                 

10                 నలుగురిలో నవ్వులో పాలు పంచుకో ,
                     నలుగురిలో  మాత్రం నవ్వులపాలు కాబోకు  . 

                                                                                                        ( మళ్ళీ కలుసుకొందాం )

                                     *********              
                   

నా ( న్యూ ) నుడులు - 4
1                 ఇరవై ఏళ్ళు నిండనివారిన సలహాలడకండి 
                   అరవై ఏళ్ళు నిండిన వారిని  సలహాలడగండి .

2                 అప్పు చేసి పప్పుకూడు తినటం
                   తప్పు చేసి జైలు కూడు తిన్నట్లే .

3                 డొంక అంటే గతుకుల బాట 
                   నిజం అంటే నిప్పుల మూట .

4                  చిరాకున్నా , పరాకున్నా 
                    బ్రతుకు సమస్య అవుతుంది .

5                  పొగడ్తలకి
                    నమ్మకం అనే నరం అరిగిపోతుంది
                    గర్వం అనే నరం పెరిగిపోతుంది .

6                   పేదవారిని బెదిరించకు
                     పెద్దవారిని ఎదిరించకు .

7                   అనుభవాన్ని మించిన చదువు లేదు
                     నమ్మకాన్ని మించిన గురువు లేడు .

8                   వయసులోని పొందు
                     వయసులోనె పొందు .

9                  చెక్కిలిపై ముద్దివ్వు
                    బిగి కౌగిలి సడలివ్వు .

10                 సంద్రంలో ఆనందానికీ , కల్లోలానికీ ఆనవాళ్ళు కెరటాలే
                     మనిషిలొ ఆనందానికీ , విషాదానికీ ఆనవాళ్ళు కన్నీళ్ళే .


                                                                                                           ( మళ్ళీ కలుసుకొందాం )

 

నన్ను చూశాడు

నన్ను చూశాడు ,
కన్ను గీటాడు ,
నన్ను చేరమన్నాడు , 
తను చేరుకున్నాడు ,
మరువం మరువరానిదన్నాడు ,
మధురాతి మధురమన్నాడు , 
మల్లెపూలు యివిగో అన్నాడు ,
ఎదలో చోటియ్యమన్నాడు ,
పయ్యెదనే పక్కకేశాడు ,
భయము వలదన్నాడు ,
వదలమన్నాడు ,
అభయమిదే నన్నాడు ,
ఉభయం తనదే నన్నాడు ,
భయం , భయం అంటుంటే ,
న భయం , న భయం అంటూ ,
చెంత చేరబోయాడు ,
రానే వచ్చాడు మా అయ్య ,
వేయనే వేశాడో  గట్టి దెబ్బ . 

          *******