నన్ను చూశాడు ,
కన్ను గీటాడు ,
నన్ను చేరమన్నాడు ,
తను చేరుకున్నాడు ,
మరువం మరువరానిదన్నాడు ,
మధురాతి మధురమన్నాడు ,
మల్లెపూలు యివిగో అన్నాడు ,
ఎదలో చోటియ్యమన్నాడు ,
పయ్యెదనే పక్కకేశాడు ,
భయము వలదన్నాడు ,
వదలమన్నాడు ,
అభయమిదే నన్నాడు ,
ఉభయం తనదే నన్నాడు ,
భయం , భయం అంటుంటే ,
న భయం , న భయం అంటూ ,
చెంత చేరబోయాడు ,
రానే వచ్చాడు మా అయ్య ,
వేయనే వేశాడో గట్టి దెబ్బ .
*******