శర్మ జీ ఎస్
ఇలాంటి వాటన్నిటి వెనుక మనకు కనపడకుండా ఒకటి దాగి వున్నది .
అదే కాలం .
ఇవన్నీ అందరకీ తెలిసినవే అయినా , వాటిలోని అంతత్రార్ధం తెలుసుకోకుండా ఫలితాల కొఱకు ఎదురు చూడటం . అవి అందనప్పుడు నిరాశ చెందటం పరిపాటి అయిపోయింది . అప్పుడు కాలాన్ని నిందించటం సర్వ సాధారణమై పోయింది .
అసలు ఈ ప్రపంచంలో మానవ మనుగడకు మూలాధారమైనది కాఇలం అని తెలుసుకొంటే సమస్యలు సమస్యలుగా కనపడవు . వెఱపు లేకుండా ఆనందంగా జీవించే అవకాశాలు అధికంగా లభ్యమౌతాయి .
********
ఇల్లలకగానే పండుగ కాదు
తాళి కట్టగానే శోభనం కాదు
రోగం అప్పటికప్పుడు రాదు
వచ్చినా , వెంటనే తగ్గిపోదు
స్థలం కొనగానే విలువ పెరగదు
నారు వేయగానే పంట పండదు
ఇల్లు కట్టి చూడు , పెళ్ళి చేసి చూడు
ఆలోచన రాగానే ఆచరణకు నోచుకోదు
ఎసరు పెట్టగానే అన్నం తయారు కాదు
ప్రేమించగానే పెళ్ళాము కాదు , మొగుడు కాడు
కడుపుతో వుండగానే పిల్లలను ప్రసవించలేరు
బ్యాంకులో డిపాజిట్ చేయగానే వడ్డీ కలవదు