వాషింగ్టన్ DC

                                                                               
                                                                                                                                      రచన : శర్మ జీ ఎస్

మా మేనకోడలు మమ్మల్ని అనుసరించింది . ఉదయం 8.45 కి ఎడిసన్ టైం ప్రకారం బయలుదేరాము మా మేన       కోడలు చేసిన కొబ్బరి అన్నంతొ , ఇంకా యితర ఆహార సామగ్రితో  వాషింగ్టన్ కి . ఉదయం 11 గంటలకి మధ్యలో బ్రేక్ తీసుకొని 35 నిముషాల తర్వాత మళ్ళీ ప్రయాణం చేశాము .

మధ్యాహ్నం 3 గంటలకు వాషింగ్టన్ కి చేరుకున్నాము . కారు పార్కింగ్ కొరకు వెతుక్కోవలసి వచ్చింది . ఉంటానికి చాలా ఉన్నాయి , కానీ గంటకి , 2 గంటలకి పే చేయాలిట . మేము చూడాలనుకున్నది వైట్ హౌస్ , దానికి దగ్గర పార్కింగులు ఉన్నాయి గాని , అవకాశం లేక కొంచెం దూరంగా పార్కింగ్ చేసి , అందరం అలా ఫుట్ పాత్ మీద నడ చుకొంటూ 17 త్ స్ట్రీట్ లో ఉన్న వైట్ హౌస్ కి బయలుదేరాము .

అంతరాయాలు ఎలాగైనా వస్తాయన్నది మనం గ్రహించుకోవాలి . మా చిన్న మనుమడు 2 వేళ్ళు పైకెత్తాడు , వెంటనే మేము చేతులు పైకెత్తాల్సి వచ్చింది . ఆ పక్కనే వున్న బేకరీ లాంటి దాంట్లోకి వెళ్ళి ఆ రెస్ట్ రూం కార్యక్రమాలు వరుసవారీగా ముగించుకుని మళ్ళీ బయలుదేరాము . 17 త్ స్ట్రీట్ కి వెళ్ళి క్యాపిటల్ బిల్డింగ్ చూసుకొని , ఆ ప్రక్కనే వున్న వైట్ హౌస్ కి  నడచుకొంటూవెళ్ళాము .


వైట్ హౌస్
                                                                                         
నేను , నా ధర్మపత్ని 
                                                                                 

                                                   
 పేద్ద ఆవరణతో , పచ్చ పచ్చని పర్యావరణంతో , ఆ వైట్ హౌస్ పైన సెక్యూరిటీ గార్డ్స్ పహరా కాస్తుంటారు ఎల్ల వేళలా . ఆ కాంపౌండ్ వెలుపల కాప్స్ ( City Of Police / భద్రతా పోలీస్ బలగాలు ) నలువైపులా వస్తున్న జనాన్నిపరిశీలిస్తుంటారు .సందర్శకులకు యిబ్బంది కలగకుండా చూస్తుంటారు . ఆరు బయట నుంచి ఫొటో తీసుకునే వాళ్ళను అభ్యంతర పెట్టరు . అలా అక్కడ 45 నిముషాలు గడిపిన తర్వాత ఆ వైట్ హౌస్ కెదురుగా ముందున్నగార్డెన్ లోకి వెళ్ళాము . అక్కడ నుంచి వైట్ హౌస్ వ్యూ చాలా చక్కగా కనపడ్తుంది . అక్కడ వుండి కొన్ని ఫొటోలను క్లిక్ చేశాము .అక్కడే వున్నఓ స్టాట్యూ (కి) ముందు ఫొటోలు తీసుకున్నాముఅక్కడ నుండి లాన్ లో నడుచుకొంటూ వస్తుంటే , ఓ ఉడుత కనపడింది . అది ముంగిసంత వున్నది . ఇక్కడ అన్నీ అలాగే ఉంటున్నాయి .

మా చిరంజీవి అంతదూరం మీరు నడవలేరు , మీరిక్కడే వుండండి , నే  కార్ తీసుకొస్తాను అనటంతో మేము మెల్లగా వరల్ద్ బ్యాంక్ ముందు ఆగిపోయాము .

అక్కడ రోడ్ల మీద ఎక్కడా చెత్త కనపడనీయరు , ఎప్పటికప్పుడు ఎవరైనా కాల్చి పారేసిన సిగరెట్ ముక్కలు లాంటి వగైరాల చెత్తను  చేత్తో కాదు , ఇలాంటి  పరికరంతో .30 నిముషాల తర్వాత మావాడు తచ్చిన కారులో గబ గబా ఎక్కి ( రోడ్ల మీద పార్కింగ్  చేయకూడదు . చేస్తే టికెట్ ఇస్తారు ట్రాఫిక్ కాప్స్ . కాప్స్ అంటే సిటీ ఆఫ్ పోలీస్ అని అర్ధం ) 250 డాలర్స్ పే చేయాల్సివస్తుంది . రిటర్న్ బయలుదేరుతూ , వాషింగ్టన్ వీధులూ చూసుకోంటూ ( కారులో నుంచే ) షుమారుగా 5.30  ప్రాంతాల్లో ఎడిసన్ కి బయలుదేరి 8.45 కి బ్రేక్ తీసుకోకుండా ఇంటికి చేరుకొన్నాము .


                                                                                     ********

నా న్యూనుడులు - 7

                     
                                                                                                                                    రచన : శర్మ జీ ఎస్

1  .   కోపాన్ని కోపంగా ప్రదర్శించటం పేటెంట్ ,
        ఆ కోపాన్ని నవ్వుగా మలచుకోవటం టాలెంట్ .

2   .  అవకాశం (రా) లేదని ఆలోచించకు ,
        అవకాశం వున్నపుడు ఆలసించకు ,
        అలాగని అవకాశం కోసం ఎదురుచూడకు .

3   .  ఆలోచనలతో అడుగులు వేయకు ,
        ఆసుపత్రిలో పడక చేరకు .

4   .  కళ్ళు తెరిస్తే కష్టాలు ఆరంభం ,
        కళ్ళు మూస్తే కలల సంరంభం ,

5  . ఆయన బాగా ఉంటే ఆభరణాలడిగేదాన్ని ,
        బాగా లేడు కాబట్టే ఆ భరణం అడుగుతున్నా .

6   .  భావతరంగాలు అలా అలా పయనిస్తూనే వుంటాయి ,
        అందుకున్నవారికి సందర్భాన్ని బట్టి సందేశాన్నిస్తాయి .

7   .  నీతులెపుడూ వినటానికి బాగానే వుంటాయి ,
        ఆచరణకు అం(దనం)త దూరంలో వుంటాయి ,
        ఆహ్వానిస్తే  అమృతాన్నే అందిస్తాయి ,
        నిరాకరిస్తే అన్యుల ఒడిలో చేర చూస్తాయి .

8   .  నీ జీవితం హ్యాపీగా , సాఫీగా సాగాలంటే ,
        నిన్ను నీవే మార్చుకోవాలి ,
        అంతే గాని ,
        ఎదుటివారు మారాలని కోరుకోకు .

9   .  చీటికి మాటికి పాట పాడమంటే మా ఆవిడ పాడదు ,
        చీటీ పాట పాడమంటే అమాంతంగా పాడేస్తుంది  .

10 .  నీవు అనుకున్నది ఆ క్షణం నీకు ఒప్పు అనిపించవచ్చు ,
        ఎదుటివారికి అదే క్షణం తప్పు అనిపించవచ్చు ,
        ఆ మరు క్షణం అదే నీకూ తప్పు అనిపించవచ్చు .


                                                                                                                       ( మళ్ళీ కలుసుకొందాం )

ఫర్ నేం సేక్ 17 మైల్స్ డ్రైవ్

                                                                                                                                      రచన : శర్మ జీ ఎస్

ఆ రోజు ఈ అమెరికాలో మే 25 , సమయం మధ్యాహ్నం 11.30 కి 17 మైల్స్ డ్రైవ్ కి బయలుదేరాం . ఆ సముద్ర తీర ప్రాంతంలోని 17 మైళ్ళ డ్రైవ్ లో అనేక ఆకర్షణలుంటాయి దర్శించటానికి . ( ఫర్ నేం సేక్ )పేరుకే 17 మైల్స్ డ్రైవ్ చేస్తే చాలా మైళ్ళు న్నాయి ఆ సముద్ర తీర ప్రాంతం కొండల చుట్టూరా .

ఆ  రహదారికి కుడి ఎడమల పండ్ల తోటలుంటుంటాయి . ఆ తోటలు రాబోతుండగా కొన్ని చేతి వ్రాత బోర్డ్లు కనప డ్తుంటాయి . ఉచితంగా  ప్రవేశించండి . మా అనుమతి అవసరం లేదు . తిన్నవారికి తిన్నంత , అందుకేమీ మేము వెల కట్టం , మీరు మీ వెంట కోసుకుని తీసుకు వెళ్ళే వాటికే వెల కడ్తాం అని . ఇలాంటి బోర్డ్లు ఉన్న తోటలు చెర్రీస్ , బాదం , జీడిపప్పు , కిస్మిస్స్ , ఆ రహదారిలో అధికంగా కనపడ్తుంటాయి .చెర్రీ ఫలాలు
చెర్రీ చెట్లు

అలా వెళ్తూ చెర్రీ తోట ముందు మా వాహనం ఆపి అందరం ఆ తోటలోనికి ప్రవేశించాము . ఇది ఒక నూతనమే కాదు వినూత్న అనుభూతి మనలాంటి భారతీయులకి . ఎందుకంటే మన భార తదేశంలొ తోట గట్టు మీద నుల్చొని ఆ చెట్ల అందాలనో ,లేక ఆ ఫలాలనో వీక్షిం చనే అనుమతినీయకపోగా , ఫోండి ఫోండి అంటూ తరిమేసే అతి భయంకర మైన అధునాతన సంస్కృతి మనది . కారణం ఆ తోటలోని చెట్లకు కాచిన ఆ ఫలాలను చూస్తే ఎక్కడ  వీళ్ళందరి దృష్టి ఆ చెట్లకు తగిలి పంట మంటల్లో పడి మాడిపోతుందేమోనని , లోనికి అనుమతిస్తే ఎక్కడ పంట మొత్తం కోసి నాశనం చేస్తారోనన్న భయంకరమైన భావాలే మూల కారణం .
వీళ్ళు అలా కాదు , అలా చెట్లకు కాసిన పంట వృధాగా నేలపాలు అయ్యే బదులు , తోటి మానవులు తినాలనుకు
న్నం త తృప్తిగా , తాజాగా ఆరగించి మజాతో ఆనందిస్తారని  , ఆ తర్వాత వాళ్ళు తమ వెంట తీసుకు వెళ్ళాలనుకు న్నంత వాళ్ళే కావాలనుకున్నవి కోసుకుంటే , దానికి మాత్రమే వెల కడ్తామని భావించి యిలా ఆనందిస్తారు .చూశారా మనకు , వాళ్ళకు భావాలలో ఎంత తారతమ్యమో .
మేం 6 గురం , అల ఆ తోటలోనికి ప్రవేశించి , ఆ తోటంతా తిరిగి , తినాలనుకున్నంత తిని , కొన్ని కోసుకుని బయట కు వచ్చి ఆరు బయట వున్న కౌంటర్లో పే చేశాం .
ఆ తోటల పెంపకం , ఆ పై ఆ ఫలాల పంపకం , అమ్మకం ఓ వినూత్న తరహాలో అమిత అందాన్నిస్తూ కన్నుల విందు , మన మనసులకు పసందు కల్గిస్తుంటాయి .                                                                                                                                                                                                                                                                                                                           
వెల్లుల్లి తోట

వెల్లుల్లి తోట

ఆ ప్రక్కనే వెల్లుల్లి తోటలు ఉన్నాయి , ఆ పెంపకం చూస్తుంటే ఎంతో అందంగా వున్నది . ఆ తోటలకు వాళ్ళు అందిం చిన నీరు ఎండిపోకుండా వాళ్ళు , నల్లటి ప్లాస్టిక్ పేపర్తో ఆ తోటలో నాటిన అన్ని మొక్కలకూ కప్పి ( నేలమీద ఉండే లా ,కొంచెం నేల కనపడేలా ఉంచి ) ఆ తోటకు అన్నివైపులా నీళ్ళ గొట్టాలను అమర్చి , వాటికి ఎప్పుడు నీళ్ళను అందించాలో వివరంగా ఉదయం 7 , మధ్యాహ్నం 1 , మరల సాయంత్రం 7 గంటలకు సూచిస్తారు . ఆయా వేళల్లో ఎవరి సాయం తీసుకోకుండా అవి నీళ్ళను ఆ మొక్కలకు / చెట్లకు అందిస్తాయి .
అలా ఓ 30 నిముషాలు ఆనందించి , మరల ముదుకు బయలుదేరాం .


స్పానిష్ టెన్నిస్ క్లబ్
స్పానిష్ టెన్నిస్ క్లబ్

ఆ దారిలో నున్న స్పానిష్ క్లబ్ కి చేరు కున్నాం . సహజంగా అక్కడ క్లభ్ మెంబర్స్ కి టేబుల్ టెన్నిస్ ఆడుకోవ టానికి 8 కోర్ట్లు వరకు వున్నాయి చాలా విశాలమైన వాతావరణంలో . ఆ టెన్నిస్ కోర్ట్లు ఎంతో అందంగా ఉంటా యి .కొన్ని ఇళ్ళు క్లభ్ మెంబర్స్ కి యిస్తారు . అక్కడే వున్న దుకాణం లోపలనే ఈ ఆటలకు సంబంధించిన దుస్తులు , ఆట వస్తువులు అమ్ముతారు . కావాలనుకున్న మనలాంటి వాళ్ళకు కూడా అమ్ముతారు . దానిలోనే కాఫీ , కూల్డ్రింక్స్ , స్నాక్స్ వగైరా అమ్ముతారు . ఇక్కడ సైకిల్స్ ఉచితంగా ఆ చుట్టుపక్కల చూసి రావటానికి యిస్తారు . విలాసవంతమైన జీవనశైలి వీళ్ళది . దానికొరకే సంపాదిస్తారు , జీవిస్తారు .

అక్కడనుంచి అర్ధగంట తర్వాత బీచ్ ఒడ్డుకి బయలుదేరాం . మరో 2 గంటలు ప్రయాణం చేసి అక్కడే వున్న బీచ్ ఒడ్డుకు చేరుకున్నాం . శనివారం కావటం వలన ఆ సరికే వీక్షకు లు చాలామంది ఎంజాయ్ చేయటం , వెళ్ళటం , మరల మాలా కొంతమంది రావటం జరుగుతున్నది . ఆ బీచ్ ఒడ్డు   కు వెళ్ళబోయే ముందే మేం మావెంట తెచ్చుకున్న చిత్రాన్నం అందరం ఆరగించాం .


బీచ్ తీరాన
ఆ తర్వాత అక్కడకి వెళ్ళి ఆ అలల జోరు చూసి ఆనందించాము . అక్కడ నుండి యింకొంచెం ముందుకు వచ్చాం .

బర్డ్ రాక్
ఇక్కడ అనేక దేశాల పక్షులు అన్నీ ఆ ఒక్క కొండమీదనే ( బర్డ్ రాక్ అంటారు ,ఆ సముద్రం మధ్యలో వున్నది ,
ఇటు వంటివి చాలా వున్నా ) వాల్తాయి . అదో ప్రత్యేకత ఆ కొండకి . ఆ దరిదాపులకు వెళ్ళగానే , మన వద్దకు కొన్ని పక్షు లు వస్తుంటాయి .

బర్డ్ రాక్ తీరాన
ఉడుత వచ్చి మనముందు నుల్చ్హొని ఏమైనా పెట్టమని చూస్తుంటుంది . పల్లీలు మన అరచేతిలో పెట్టుకొని చూపిస్తే వచ్చి , చేయి పట్టుకొని ఒకటొకటిగ తింటుంది . ఆ దృశ్యం  చూడ ముచ్చట వేసింది . అలాగే మిగి లిన కొన్ని పక్షులు కూడా మన చెంతకు వస్తుంటాయి వాటి ఆహారం కొరకు .

ఈ అమెరికాలో ఎక్కడికక్కడ రెష్ట్ రూం లు వుంటాయి . ఎవరికీ యిబ్బంది కలుగకుండా వుండాలని , బహిర్ ప్రదే శాన్ని భ్రష్టపరచకూడదన్న వాళ్ళ పటిష్టమైన శాసనాన్ని ఎవరూ ధిక్కరించకుండా అన్ని వసతులూ కల్గిస్తారు .
సింపుల్ గా శాసనాలు తయారుచేయటం లో చూపించే శ్రధ్ధ వాటి అమలుకు కూడా చాలా కృషి చేయాలన్నది వీళ్ళ నుంచి మన ప్రభుత్వాలు నేర్చుకోవాలి .

ఇదంతా కొండల ఘాట్ ఏరియా పైనే సవారి . ఇలా 400 మైళ్ళకు పైనే వుంటుంది . ఇది సముద్ర తీరప్రాంతపు పేద్ద రహదారి క్యాలిఫోర్నియా లో నంబర్ 1 .


ఘోష్ట్ ట్రీ
అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళాం . అక్కడ ఘోష్ట్ ట్రీ అని వుంటుంది , 5.30  కి చేరుకొన్నాం . సముద్రపు ఒడ్డు ప్రక్కగా , అది కొన్ని వంద ల ఏళ్ళ నుంచి అలానే వున్నది , అదీ లోయలోనే వుంటుంది . ఆ ఘోష్ట్ ట్రీ ని చూసి , ఇంకొంచెం ముందుకు వెళ్ళాం . ఆ సరికి సాయంత్రం 5.30 అయింది . సూర్యుడు వెలుగులు వెదజల్లుతూనే వ్న్నాడు , ఛలి మాత్రం వెన్నులో వణు కు పుట్టిస్తున్నది గాలిని వెంట వుంచుకొని . ఈ సుందర దృశ్యాలను మరల మరల చూడాలనిపించినా , మనకు అన్ని విధాలా వీలు పడదు అన్న భావన మెదలగా , అలాగే వణుకుతూ మరికొంచెం ముందుకు వెళ్ళాం . అక్కడా కొన్ని ఫొటోలు తీసుకున్నాం అలాగే వణుకుతూ , కేశాలు ఆకాశానికెగురుతున్నా , మరల ఈ అవకాశం రాదేమోనని . ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాం .


బిగ్ సర్ బ్రిడ్జ్
ఇంకొంచెం ముందుకు వెళ్ళి బిగ్ సర్ బ్రిడ్జిని చూశాం . ఇది 1932 లో నిర్మించబడింది . అక్కడనుంచి ఆ సముద్ర తీరం అతి సుందర దృశ్యం . అక్కడనుంచి మరికొంచెం ముందుకు వెళ్ళాం . వన్ వే లో వెళ్ళాల్సి వచ్చింది . ఈ బ్రిడ్జి ప్రక్కనే ఉన్న కొండను నరికి రోడ్డు విశాల కార్యక్రమం జరుగుతు న్నది . ఈ బ్రిడ్జిమీద అత్యంత ఏకాగ్రతతో డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి . అల వెళ్ళి మరి కొన్ని ఫొటోలు ఆ సుందరమైన సముద్రతీరప్రంతాన తీసుకొని తిరుగు ప్రయాణం చేయటం జరిగింది .

                                                                                     **********

నయాగరా ఫాల్స్

                                                                                                                                     రచన : శర్మ జీ ఎస్
                                                                                                
నయాగరా ఫాల్స్ 
నయాగరా ఫాల్స్ 


ఈ అమెరికాలోనే చాలాచోట్ల అంటే కొన్ని కొన్ని స్టేట్స్ కి టైమ్ తేడా వుంటుంటుంది . కాలిఫోర్నియాలో ఉదయం 6 గంటలైతే , న్యూయార్క్ , న్యూజెర్సీ , వాషింగ్టన్ లలో ఉదయం 9  గంటలవుతుంది .

ఈ రోజు నయాగరా ఫాల్స్ కి వెళ్ళాలనుకున్నాం . వాహనంలో బయలుదేరితే ఎడిసన్ నుంచి 6 / 7 గంటలు పడ్తుంది వితౌట్  ఎనీ బ్రేక్స్ . న్యూజెర్సీలోని ఎడిసన్ లోని మా  మేనకోడలు ఈ మధ్యనే చూసిందట . అందుకని తను రాననటంతో , మాకుటుంబం ( నేను , నా శ్రీమతి , మా కొడుకు , కోడలు , ఇద్దరు మనమళ్ళు ) వరకు భోజనాలు ముగిం చుకుని రెంటల్ ఇన్నోవాలో బయలుదేరాము 2.30 కి యిక్కడి టైం ప్రకారం  .  మా వాడు తెచ్చుకున్న టాం టాం జీ పి ఎస్ సాయినడిగి వాళ్ళ జీ పి ఎస్ స్టాండ్ కి ఫిక్స్ చేసుకొనటంతో , గైడ్ మన పక్కనే ఉండి మనము ఎటు వెళ్ళాలో చెప్తుంటే అలా .

ఏదైనా తినాలనిపించినా , లేక గ్యాస్ ( పెట్రోల్ ) ట్యాంకులో ఫిల్ చేయించుకోవాలన్నా , ఆ హైవే లో ఎక్కడికక్కడ     ఎగ్జిట్ లు గ్రీన్ కలర్ బోర్డ్లో వైట్ లో డిస్ప్లే అవుతూ దర్శనమిస్తాయి . అవి అన్నీ ఆథరైజ్ద్ వే . అన్ ఆథరైజ్ద్ గా ఒక్కటైనా ఉండనే ఉండవు  .
మ్యాక్ డొనాల్డ్ డ్రైవ్ త్రూ
ప్రతి గ్యాస్ ఫిల్లింగ్ ప్లేసుల ప్రక్కనే ఓ రెస్టారెంట్ లాంటిది ఉండి తీరుతుంది ( ఎక్కువ మ్యాక్ డొనాల్డ్ లు ఉంటుంటాయి ). ఇవి ఒక్కటే ఉన్న ప్లేసుల్లో డ్రైవ్ త్రూ కూడా ఉంటాయి , అంటే వాహనంలో నుంచి దిగకుండా అక్కడ కౌంటర్లో ఆర్డర్ చేసి అలాగే ముందుకు వెళ్ళి అవతల పే చేసి తీసుకోవటం . ఇలాంటి అరేంజ్ మెంట్స్ ఎందుకు చేశారంటే , ఇక్కడ మంచు ,చలి అధికంగా వుంటాయి . ఆ సమయంలో వాహనం లో నుంచి దిగి వచ్చి , ఇచ్చేవరకు నిరీక్షించటం         యిబ్బందికరమైన స్థితి . అందుకని యిలాంటి అరేంజ్ మెంట్స్ చేస్తారీ అమెరికాలో . కష్టమర్లు వీళ్ళకు నిజమైన  దేవుళ్ళలా భావిస్తారు ఆచరణతో , మాటలలో కాదు .

ప్రతి వస్తువు మీద ఆ వస్తువు తయారీకి సంబంధిత వివరాలు కనపడ్తుంటాయి . ఇవి మనకు డ్రైవింగ్ లో అలసట లేకుండా ఉండేటందులకు కూడా ఉపయోగపడ్తాయి ఈ ఎగ్జిట్ లు .

ఇలా ఆగటాన్ని బ్రేక్స్ అంటుంటారు . ఇలాంటి బ్రేక్స్ 3 , 4 వేసుకొంటూ  నైట్ 12 గంటలకు డేస్ ఇన్ హోటల్ కి వెళ్ళి
అక్కడ సెల్లార్లో మా వాహనం పార్కింగ్ చేసి , మా లగేజ్ తీసుకొని ఆ ప్రక్కనే వున్న లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్ కి రెసెప్షన్ కౌంట ర్ కి వెళ్ళి మా రూమ్స్ కీస్ తీసుకొని మేమొక రూంలో , మా కొడుకు , కోడలు , మనుమళ్ళు మరొక రూంలో దిగా ము . ఇక్కడ చలి పులి వణికిస్తున్నది .

మా చిరంజీవి వెంటనే రూం హీటర్ ఆన్ చేశాడు . ఆ తర్వాత ఒక అర్ధగంటకి నిద్రపోయాము .ఉదయాన్నే లేచి కాల
కృత్యాలు ముగించుకొని 9 గంటలకు ఆ ప్రక్కనే వున్న నయాగరా ఫాల్స్ కి  పిల్లల్ని స్ట్రాలర్స్ లో కూర్చోపెట్టుకుని బయలుదేరాము . చల్లగాలి ఎక్కువగానే ఉన్నది .


పూలచెట్లు 


ఇక్కడ పూలచెట్లు , అదేంటి పూలచెట్లు అంటున్నా రేమిటి ? పూలమొక్కలు కదా అనవలసింది అన్న అనుమానం కలిగి వుండవచ్చు . అక్కడకే వస్తున్నా , ఇక్కడ చెట్లకి ఆకులు తక్కువ , పూలే ఎక్కువ . పెద్ద పెద్ద చెట్లకు కూడా పూలే ఉంటాయి . అలా వెళ్ళి అక్కడే వున్న క్యూలో నుల్చొని టికెట్లు తీసుకొని బోర్డ్ వాక్ కి వెళ్ళి ఎడమ వైపు నయాగరా ఫాల్స్ , కుడి 
రెయిన్ బో బ్రిడ్జ్ 
వైపు రెయిన్ బో బ్రిడ్జ్ చూసుకొని లిఫ్ట్ లో క్రిందకు వెళ్ళాము  ఆ " మేడ్ ఆఫ్ ద మిస్ట్ " బోట్ ఎక్కటాని  
కి . అచ్చటే  కొంత సమయం ఉండి ఆ దృశ్యా లను చూస్తూ , వాటిని వాటితో పాటు మమల్ని మా వెంట తెచ్చుకున్న కెమేరాలలో ఉంచాం . ఎలెక్ట్రిక్ బోటు లో ఆ ఫాల్స్ వరకు తీసుకువెళ్ళి చూపిస్తారు . ఆ ఎలెక్ట్రిక్ బోటు వద్దకు వెళ్ళా లంటే లిఫ్ట్ లో క్రిందకు వెళ్తే ,అక్కడ వాళ్ళు ఓ బ్లూ రెయిన్ కోట్ యిస్తారు , అది వేసుకొని వెళ్ళాలి . ఎందు కంటే ఆ వాటర్ ఫాల్స్ మనమీదపడి డ్రెస్ తడిసి పోకుండా వుండేటందులకై  .అలా వెళ్తుండగా , దారిలో ఆ నీళ్ళలో , దొంగ జపం చేసే కొంగలు యిక్కడ జపం చేయకుండా పైనే విహరిస్తూ , వాటిని చూడటనికి పైపైకి వస్తున్న చేప పిల్లలను తమ కాళ్ళతో పట్టుకొని నోటికి కరుచుకొని ఆరగించేస్తాయి .


మేడ్ ఆఫ్ మిస్ట్ బోట్ & దొంగ జపం కొంగలు
 అలా   ఆ సుందర మనోహర దృశ్యాలను చూస్తూ , వాటిని వాటితో పాటు మమల్ని మేం తెచ్చుకున్న కెమేరాలలో ఉంచేశాం .
 ఆకాశాన్నుంచి దిగువ కొస్తున్న జలధారలు
ఆ ఆకాశం ఎక్కడుంది ? అసలు వుందా , లేదా , లేక ఆకాశమే ఈ ఉరవళ్ళ పరవళ్ళను ఇటకు పంపుతున్నదా అన్న అనుమానం కలిగిస్తుంటాయి ఆ వాటర్ ఫాల్స్ . ఆ ఉరవళ్ళు , ఆ పరవళ్ళు చూపరులను పరవశం చేస్తున్నాయి . అలా ఆ మేడ్ ఆఫ్ మిస్ట్ లో వెళ్తుంటే , ఎడమవైపు , ఎదురుగా ఆ వాటర్ ఫాల్స్ ,


మేమున్నది అమెరికా , ఆ వెనక కెనడా దేశం

 కుడివైపు పేద్ద పేద్ద స్టార్ హోటల్ బిల్డింగ్స్ , రహ దారు లు కనపడ్తుంటాయి . అది అమెరికా అను కొంటే పొర పడ్డట్లే మనం మనసుకు , కంటికి కూడాను . అది కెనడా దేశమట . వినగానే ఆశ్ఛర్యం కలిగింది . అలా చూసుకొంటూ , వెనుకకు వస్తుంటే మా ఎదురుగా రెయిన్ బో బ్రిడ్జ్ దర్శనమిస్తుంది .

రెయిన్ బో బ్రిడ్జ్ , ఇరు దేశాలకు చిరు వారధి


ఈ బ్రిడ్జ్ విశేషమేమిటంటే ఇటు అమెరికాకి , అటు కెనడాకి నడుమ వారధిగా పని చేస్తుంది . అమెరికా వాళ్ళకు , కెనడా వాళ్ళకు వీసా అవసరం లేదట , ఎపుడైనా వెళ్ళవచ్చుట ఆ బ్రిద్జ్ పైన . మిగిలిన ఏదేశస్థులకైనా వీసా చూపిం చి  తీరవలసిందే . మిగిలిన దేశస్థులు వీసా లేకుండా , అక్కడి అధికారులను తప్పించుకొని ఆ బ్రిడ్జ్ వాహనంలో దాట ప్రయత్నిస్తే , ఆ రోడ్డు పైనే వున్న కత్తులు ఆ వాహనపు టైర్లని కట్ చేసేస్తాయిట .

 ఆ తర్వాత మేం వేసుకున్న రెయిన్ కోట్స్ తీసి అక్కడే వున్న డస్ట్ బిన్స్ లో వేసి మరల లిఫ్ట్ ఎక్కి పైకి ( బోర్డ్ వాక్ )వద్దకు వచ్చి , మరల కొంత సమయం ఆ దృశ్యాలను , కెనడా దేశపు బిల్డింగ్స్ ని మాతో పాటు వాటిని కెమేరాలో క్లిక్ చేశాము . అక్కడ నుండి హోటల్ కి బయల్దేరాం . మేం వెంట తెచ్చుకున్న అల్పాహారాలను , ఆ హోటల్ రూంలో ఎలెక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండుకున్న అన్నము ఆరగించి , సాయంత్రం 4.45 గంటలకు  ఎడిసన్ కి రిటర్న్ బయలు దేరాము .

                                                                                             ************

దింపుడు కళ్ళ ఆశ


” దింపుడు కళ్ళ ఆశ ” (హాస్య నాటిక )

రచన : శర్మ జి ఎస్

పాత్రలు – పాత్రల స్వభావాలు
యమధర్మరాజు : యమసీమ ( భూలోకవాసుల పాప , పుణ్యాలను బేరీజు వేసే ఏకైక కార్యాలయం  )కి ఏకైక అధిపతి.
చిత్రగుప్తుడు : యమసీమకి ( దివిసీమకా? యమసీమకా ? పాపపుణ్యాల కనుగుణంగా తేల్చి చెప్పగల) ఏకైక అకౌంటెంట్.
కింకరులు           :   కిం అనగానే కం అనుకుని హాజరయ్యే యమ భటులు.
నారాయణ          :   నరలోకంలో నివసించే సామాన్య నరుడు.

( తెఱ తీయగానే )
( అది యమసీమ . అచట యమధర్మరాజు ఆధీనములో , చిత్రగుప్తుని ఆధ్వర్యములో , నరలోకము నుంచి వచ్చిన శవాలకు , వారి వారి పాపపుణ్యాల కర్మలకనుగుణంగా , వారికి చేయవలసిన సకల మర్యాదలు చేయుదురు . యమధర్మరాజు కొలువు తీరి ఉన్నాడచట . చిత్రగుప్తుడు ఆతని ఏకైక ఎకౌంటెంట్ , కింకరులు అచటనే ఉంటారు )
చిత్రగుప్తుడు: ప్రభూ గత మూడు నాళ్ళుగా తమరు దివిసీమ సభకు వెళ్ళుటవలన కొన్ని కేసులు మీ పరిశీలనకై ఉండిపోయినవి . ఇపుడు పరిశీలనకు అనుమతించినచో , ఆ కేసులను ప్రవేశపెట్టెదను.
యమధర్మరాజు: ప్రవేశపెట్టుడు .
చిత్రగుప్తుడు: కింకరులారా , వరుసవారీగా ప్రవేశపెట్టుడు .
కింకరులు:  చిత్తం అమాత్యా ! ( లోపలకు శవాలను మోసుకురావటానికి వెళ్తారు )
యమధర్మరాజు: గుప్తా! ఏతెంచిన శవాలలో ఎవరి సంఖ్య అధికముగా నున్నది ?
చిత్రగుప్తుడు:  ప్రభూ!  పాపులే అధికముగా యున్నారు . పుణ్య కర్మలు చేసి ఇటకేతెంచిన వారు బహు స్వల్పం. ఎందులకో వివరించెదరా !
యమధర్మరాజు: ప్రతి యుగంలో 25 శాతం మాత్రమే వృధ్ధి చెందాలని ఆ బ్రహ్మదేవుల వారి శిలాశాసనం. ఐతే దాన్ని కూడా ఈ కలియుగ మానవులు అధిగమించాలని, సృష్టికి ప్రతిసృష్టి చేయాలని, పలు ప్రాణులతో సాగిస్తూ జీవిస్తున్నారు  పిల్లలకు జన్మనిస్తున్నారు . అది వారి ఘనతగా దండోరా వేసుకుంటున్నారు . వింత ధోరణులు , వింత పోకడలు ఈ కలియుగాన్ని కల్తీయుగంగా మార్చేశాయి. అందువలననే పాపులు అధికసంఖ్యలో తరలి వస్తున్నారిచటకు .
( ఇంతలో కింకరులు శవాలను మోసుకు వచ్చి అత ఓ మూలగా ఉంచుతారు )
చిత్రగుప్తుడు:  ప్రభూ!  ఈ నరుడు కన్నతల్లితండ్రులకు , ఒక్కగానొక్క పుత్రుడు . ఆ తల్లితండ్రులు  పుత్రుడిని అమిత గారాబంగా చూసుకున్నారు . చివరికి ఆ తల్లితండ్రులకు కూడుపెట్టక , వారి ఆస్తిని కైవశం చేసుకొని , వారినే శవాలుగా మార్చటానికి కిరాయి హంతకులతో మంతనాలు జరిపి అంతమొందించిన అధమాధముడు.
యమధర్మరాజు:  అటులనా ! కంప్యూటర్ తో కంపారిజన్ పూర్తి అయినదా ?
చిత్రగుప్తుడు: అయినది ప్రభూ . శిక్ష సెలవీయుడు . తక్షణమే అమలు జరిపించెద .
యమధర్మరాజు:  అతగాడికి స్పృహ కలిగించి కుతకుత ఉడుకుతున్న వంటనూనెలో అదేపనిగ ముంచుడు మఱల నే చెప్పువఱకు
( కింకరులు ఆ శవాన్ని తరలించారు శిక్ష అమలు జరుపు ప్రదేశానికి.  వెంటనే మఱో శవాన్ని హాజరు పరుస్తారు )
చిత్రగుప్తుడు: ప్రభూ ఈ నరుడు , కట్టుకున్న కన్నెపిల్ల కడుపున కాయ కాయించకపోగా, వ్యసనాలకు బానిసై , పరాయి పంచన ఆ ఇల్లాలికి పడకవేసి , హయిగా వ్యసనాలను అనుభవించాడు . ఆ ఆడకూతురు సుఖరోగాలతో మంచాన్నంటిపెట్టుకుని , మందిప్పించమంటే , సుఖాన్ని పొందినపుడు  రోగాన్ని కూడా అనుభవించాల్సిందే . మందు నాకు కావాలి , నీకు కాదు అన్న నికృష్ఠుడు . సెలవీయండి .
యమధర్మరాజు : అయినచో ఈ నీచుడ్ని ఉడుకునూనెలో ముంచుతూ , ఉడుకు నీళ్ళతో కడుగుడు.
(మఱలా ఆ శవాన్ని తరలించారు శిక్ష అమలుజరుపు ప్రదేశానికి . మఱో శవాన్ని ప్రవేశపెట్టితిరి )
చిత్రగుప్తుడు:  ప్రభూ ఈ పడతి తన పడుచుతనాన్ని అలుసుగ తీసుకుని , అందినవారికందఱికి అందిస్తూ ,అందినంత దోచుకొంటూ , కట్టుకున్న భర్తను మోసం చేస్తూ , పడక సుఖాన్ని అందించక, అడుగడుగునా , మీరే నా పతి , ప్రత్యక్షదైవం . నేను మీ అర్ధాంగిని . నా పడక మీ పక్కనే అన్నది తెలిసి కూడా పొందాలని ఉంటుంది , కాని పొందలేకపోతున్నా. మీరున్నపుడు , నాకు మీ పడక చేరాలనిపించదు . మీరింట్లో  లేనపుడే నాకు మీతో సుఖం పంచుకోవాలనిపిస్తుంది అంటూ తప్పించుకు తిరిగింది అతను  జీవించినంతకాలం . ఆతను పోగానే  అడ్డంకి తొలగిందని అమిత ఆనందం చెంది , అడ్డూ ఆపు లేకుండా సుఖాల్ని పొంది ,రోగాల దరిజేరి , ఇటకు చేరింది . శిక్ష సెలవీయుడు .
యమధర్మరాజు:  ఓ అటులనా ! గుప్తా , ప్రతి శవాల చిట్టా కంప్యుటర్ తో ఎంతో జాగ్రత్తగా ట్యాలీ చేసిన మీదటే ఈ కొలువుకి హాజరు పరచుచుంటివిగదా! .
చిత్రగుప్తుడు:  ఔను ప్రభూ , అటులనే చేయుచుంటిని .  సందేహమెందులకు వచ్చింది ?
యమధర్మరాజు:  నీ మీద అణుమాత్రం సందేహము లేదు ? ఆ మధ్య నరులు మన పరిపాలనా దక్షత మీద  సినిమాలు తీసి ఆనందించుచున్నారుట.  బ్రహ్మదేవులవారు నిన్న నిర్వహించిన సభలో వెల్లడించి , హెచ్చరించారు .
చిత్రగుప్తుడు: నేను ప్రత్యేక శ్రధ్ధతో పరిశీలిస్తాను ప్రభూ .
యమధర్మరాజు: ఈ చిత్రాంగిని చిత్ర,విచిత్రమైన ఆ ముళ్ళ కంచెలో ఉంచి సైక్లింగ్ చేయించండి .
( కింకరులు తక్షణమే ఆ శవాన్ని శిక్షాస్ధలానికి తరలించి, తదుపరి శవాన్ని హాజరు పరిచారు )
చిత్రగుప్తుడు:  ప్రభూ నేటికిదే అఖరు కేసు .
యమధర్మరాజు: నుడువుడు .
చిత్రగుప్తుడు: కంప్యూటర్ కంపారిజన్ లో ఆరిజనే దెబ్బతిన్నట్లున్నది .
యమధర్మరాజు : ఆశ్ఛర్యంగా ఉన్నదే , ఇపుడే సెలవిచ్చితివిగదా , ప్రత్యేక శ్రధ్ధతో పరికిస్తున్నానని . ఇంతలో ఏమైంది ?
చిత్రగుప్తుడు:  అదే నాకూ అర్ధం కావటంలేదు . ఈ కేసు పూర్వాపరాల లోనికి వెళ్ళగా, ఈతని మేని రంగు , నన్ను ఖంగు తినిపించుచున్నది .
యమధర్మరాజు        గుప్తా ! నీకేమి మతి చలించలేదుగా ! కనుల ముందు కనుపించుచున్న కాఱునలుపుని కాదనుచుంటివా ? భూలోకవాసులకువలె నీకునూ మసక రాలేదుగదా ?
చిత్రగుప్తుడు: లేదు ప్రభూ , పలుమారులు పరిశీలించితిని . ప్రయోజనం యోజనం దూరంలో కూడా కనపడటం లేదు . మన చిట్టా ప్రకారం ట్యాలీ  కాకున్నచో , శిక్షను అమలు జరుపము అన్న మన పరిపాలనా దక్షతను ఎఱింగిన మానవులు , తమ ముఖములను మార్చుచుంటిరేమో అన్న సంశయము నన్ను వెంటాడుచున్నది .
యమధర్మరాజు : అదియును మన దృష్తిలోకి తీసుకోవలసిన విషయమే . నరులు తెలివి మీరి ప్రవర్తించుచున్నారని బ్రహ్మదేవులవారు నుడివినారు .ఆ తైల భాండాగారమందున్న స్వస్వరూప తైలమును ఆతనిపై చిలకరించుము .
చిత్రగుప్తుడు: అదియును చిలకరించి చూచితిమి . ఏ మార్పును  గోచరించలేదు . నరులు ఈ తైలమునకు విరుగుడు కనుగొంటిరా అన్న అనుమానం  నాలో బలపడుచున్నది .
యమధర్మరాజు : ఈ స్థితిలో దండన గాని మన్నన  గాని చేయుటకు మన శిలాశాసనాలు అంగీకరించవు . సందేహ నివృత్తి అయిన పిమ్మటే తగిన శిక్ష వేయగలం .

సభను రేపటికి వాయిదా వేస్తున్నాము. ( అంతఃపురం లోనికి వెళ్ళిపోతాడు )

చిత్రగుప్తుడు: ( శవము వైపు తిరిగి లోలోన వేదమంత్రోఛ్ఛారణ లోలోనే చేసి ,స్పృశించి )  నారాయణా , నారాయణా , లే
నారాయణ:  ( ఆ శవము జీవము పుచ్చుకున్నదై ఒక్క ఉదుటున లేచి ) ఒరేయ్ రామిగా, ఆ పత్తిబేళ్ళను , ఆ గిడ్డంగులలో త్వరగా పేర్చరా .

( బిగ్గఱగా అరుస్తాడు )

చిత్రగుప్తుడు: నారాయణా , హడావుడి తగ్గించు. ఇది గిడ్డంగి కాదు , కనీసం నీ జన్మభూమి అద్దంకి కాదు .  నీ బుధ్ధి మాకెఱుకేలే . నీ ఆ చేష్టలు మాకు తెలియవనుకొనుచుంటివా ?
నారాయణ: నేను మితభాషిని , పరస్త్రీ ద్వేషిని .
చిత్రగుప్తుడు: మా చెవులకే పూలు పెట్టుచుంటివా ?
నారాయణ : మా ఆవిడ తలలోకే పూలు కొనుటకు వసతి లేకున్నది . ఇంక మీ చెవులకెక్కడ పూలు పెట్టెదను ?
చిత్రగుప్తుడు: మాకే వినిపించుచుంటివా ?
నారాయణ:  తెలియనివారికి వినిపించుట లోక పఱిపాటే గదా ! నాది ప్రేమ పెళ్ళి కాదు, పెద్దలు కుదిర్చినది. అందుకే పూలు కొనకున్నను మా సంసారం హాయిగా  జరిగిపోతున్నది .
చిత్రగుప్తుడు: ఎందుకు జరిగిపోదు , ఓ పక్కన చాటుమాటుగా నీవు ఆ గిడ్డంగులలోని ఆడంగులతో  సలిపిన సలపరింతలు నీ భార్యకు తెలియనివి కానీ , మాకు తెలియనివి  కావు .
నారాయణ:  రామ రామ , హరి హరీ .
చిత్రగుప్తుడు: ఇక్కడేమో ఇలా  రామ రామ ,  హరి హరీ  నా ? అక్కడేమో రామ్మా, రా…మ్మా ,హాయ్ , హాయి  అంటూ రంధిగా సాగించిన రంకులు మాకు  తెలియవనుకొని , కప్పిపుచ్చునుకొన ప్రయత్నించు చుంటివా ?
నారాయణ: పాపం శమించుగాక , ఆడవారిని చూచిన ఆమడ డూరమున నుండు నేను ఆడంగులతో , అందులో ఆ గిడ్డంగుల లోనా ? ఛీ….ఛీ… మమ్మలే ఏమార్చకు , మా పై  ఏలిక వారికీ విషయము తెలిసిన కఠోరమగు శిక్ష విధించెదరు .
యమధర్మరాజు: ( వైర్ లెస్ లో ) గుప్తా , అతగాడి కలరేమైనా ఓ కొలిక్కి వచ్చినదా ? శీఘ్రగతిన ముగించుము .
చిత్రగుప్తుడు:  చిత్తం ప్రభూ. ( నారాయణ తో ) నారాయణా నీ శరీర ఛాయ ఏమిటో తెలియపరుచుము .
నారాయణ:  నా  రంగు మీకు కనపడుటలేదా !  ఇంత వెలుతురులో కూడా . ఆశ్ఛర్యముగా నున్నదే . ఆమావాస్య రాత్రులలో నన్ను నేను పరిచయం చేసుకొనక తప్పదు . పట్టపగలు , పున్నమి రాత్రులలో కొట్టొచ్చినట్లు కనపడే కారు నలుపు రంగే నాది .
చిత్రగుప్తుడు: అసత్యములాడకుము .
నారాయణ: నిత్యము నేనీ రంగే . అసత్యములు నాకేల , ఇది ఆ భగవత్ లీల .
చిత్రగుప్తుడు : మీ మానవులు రోజు రోజుకీ కనటం , కనుగొనటంలో అత్యంత ఉత్సాహమును ప్రదర్శించుచున్నారు . నారాయణ:( కంగారుగా )అంటే మీరు మనుషులు కారా? మీరెవ్వరు ? నేనెక్కడ వున్నాను. నన్ను కిడ్నాప్ చేసితిరా ? చిత్రగుప్తుడు: గాభరా పడకు నారాయణా .
నారాయణ: ( ఆందోళనగా ) మీరు మా మానవుల లాగా అగుపించుటలేదు . మీరే గ్రహవాసులు ? నాపై మీకాగ్రహమేల ? డబ్బుల కొఱకు కిడ్నాప్ చేసితిరా ? నా వద్ద గాని , మావాళ్ళ వద్ద గాని అంత డబ్బులు లేవు . మాది మిక్కిలి పేద కుటుంబం . పిత్రార్జితాలు గాని , పై డబ్బుల సంపాదనగాని మావద్ద లేనే లేవు . రెక్కాడితే గాని  డొక్కాడని డొక్కు కుటుంబం మాది . మా తల్లితండ్రులకు నేనొక్కణ్ణే పిల్లవాడిని . మా ఆవిడకు నేనొక్కన్నే మొగుణ్ణి . నా పిల్లలిద్దరికి నేనొక్కణ్ణే తండ్రిని . ఎటుచూసినా  నేనొక్కణ్ణే మా వాళ్ళందరికి . దయచేసి నన్ను వెంటనే వదిలేయండి . వేరెవ్వరినైనా చూసుకోండి  ప్లీజ్ .
చిత్రగుప్తుడు: నారాయణా కంగారుపడకు. మేము నీవనుకుంటున్నట్లు మేము కిడ్నాపర్స్ మీ కాదు . అయినా నిన్నిచటికి తెచ్చింది మఱల అచట దించటానికీ కాదు .
నారాయణ: మొదట నన్ను ప్రత్తి కంపెనీలో దింపుడు . రేపు శనివారం . మా కూలీలకు బట్వాడా యీయనిచో ,  నన్ను రాజస్ధాన్ లోని మరాట్వాడాకు పంపెదరు .
చిత్రగుప్తుడు: నీ నాటకాలింక ఆపు .
నారాయణ:  సాంబయ్యను మందు తెమ్మని పంపా. వాడక్కడ నా కొరకు ఎదురుచూస్తుంటాడు . వెంటనే నన్ను పంపండి , లేకుంటే మందు ఇచట దొరుకుతుందా ?
చిత్రగుప్తుడు: మమ్మల్నే మందు సప్ప్లై చేయమనుచుంటివా ? మెల్లగా నీ అసలు రంగు బైటపడుచున్నది .
నారాయణ: మీరు నన్ను అపార్ధం చేసుకొంటున్నట్లున్నారు . మీరు నాకంటగడ్తున్న అలవాట్లకు అసలు బానిస  మా కంపెనీలోనే కూలీగా పనిచేసే ఆ నారాయణ అయ్యుంటాడు .  ఓ మారు పరిశీలించుకోండి .
చిత్రగుప్తుడు: ( వెంటనే  కంప్యూటర్లో పరిశీలించి ) నీవు నక్కల నారాయణవు కాదా ?
నారాయణ: కానే కాదు . నేను నడిగొప్పుల నారాయణాను. నేను నేనే , వాడు వాడే .
చిత్రగుప్తుడు:            అలాగా ! అయితే సరి .
నారాయణ: హమ్మయ్య , యిప్పటికైనా గుర్తించారు . నాకదే పదివేలు కాదు లక్షలు , కోట్లు. లేకుంటే నన్ను నమ్ముకున్న నా భార్యాబిడ్డలు ఏమైపోయేవాళ్ళో . మీ సంశయం తీరిందిగా. నన్ను త్వరగా పంపించేయండి .
చిత్రగుప్తుడు:  తొందరపడకు నారాయణా , అంత తొందర ముందర వుంటే ఎదర బతుకంతా చిందర వందర అన్నారు మీ మానవులే .
నారాయణ:  ఆ మానవులే, ఆలస్యం అమృతం విషం అని కూడా అన్నారు . అవసరాల కొద్దీ ఎన్నెన్నో అంటుంటారు. అవన్నీ వదిలేసి నన్ను వెంటనే పంపించే మార్గం చూడండి .
చిత్రగుప్తుడు: అటులనే, మా ప్రభువులతో సంప్రదించి నీ పయనమునకు తగు ఏర్పాట్లు చేసెద ( అతనిని వెంటనే శవంగా మార్చాడు )
**********
( యమధర్మరాజు అత్యవసరంగా కొలువు తీరారు )

యమధర్మరాజు: గుప్తా , ఈ అత్యవసర కొలువుకు గల కారణం ?
చిత్రగుప్తుడు:  ప్రభువులు మన్నించవలె . ఘోరతప్పిదము జరిగిపోయినది మనకింకరుల వంకర పనుల వలన . నక్కల నారాయణకు బదులుగా , నడిగొప్పుల నారాయణను కొని వచ్చితిరి .
యమధర్మరాజు: ఈ తప్పిదము ఎటుల జరిగినది ? విచారించితివా ?
చిత్రగుప్తుడు: విచారించితిని , ఆ పై యిటుల జరిగినందులకు విచారించుచుంటిని .
( వేరొక ఫ్లాపీని ఇన్సర్ట్ చేసి పరిశీలించి ) మన్నించండి ప్రభూ , ఈ నక్కల నారాయణని భూలోకమునకు పంపుట వీలుకాదు . ఈతగాడు దేహము  చాలించెనని అచ్చట అగ్గిపాల్జేసితిరి . అటులైన ఆతనిని ఏ దేహం లోనికి పంపెదరు .
ఆ  నక్కల నారాయణ దేహములోనికి పంపెదము .
యమధర్మరాజు: ఆతగాడికి స్పృహ కలిగించుము . విచారించెదము .
చిత్రగుప్తుడు: ( వేద మంత్రోఛ్ఛారణ లోలోనే గావించి ) నారాయణా లే , లే నిన్ను మీవారి వద్దకు చేర్చెదము . కానీ…..
నారాయణ: కానుల కాలం ఎపుడో పోయింది . మాది కార్ల కాలమండి .
చిత్రగుప్తుడు: నిన్ను నీ భార్యాబిడ్డలు గాని , నీ పిల్లలు గాని , నిన్నెఱిగిన వారెవ్వరూ నిన్ను గుర్తించలేరు . వేరే వాళ్ళు గుర్తు పట్టగలరు . వారిని నీవు గుర్తు  పట్టలేవు .
నారాయణ: చతుర్లాడకండి . నన్ను నా వాళ్లు , నన్నెరిగినవాళ్ళు గుర్తు పట్టనపుడు , వేరే వాళ్ళెలా గుర్తుపడతారు ? నన్ను గుర్తుపట్టినవాళ్ళని , నేను గుర్తుపట్టనా ? ఇదేదో తిరకాసుగా ఉందే .
యమధర్మరాజు:       నారాయణా నిన్ను  నీ లోకమునకు  పంపెదను . అట ఎచట వుండెదవు ?
నారాయణ: అద్దె ఇళ్ళ అగచాట్లను తట్టుకోలేక , ఈ మధ్యనే బాంకు  వాళ్ళ పుణ్యమా అని ఓ స్వంత ఇల్లు కట్టుకున్నాను . వసతులంతగా లేకపోయినా , సంసారమీదటానికి ఏ యిబ్బంది లేదు .
చిత్రగుప్తుడు: నీ భార్యా బిడ్డలు నిన్ను లోనకు రానీయరు . మా మాట నెమ్మదిగా ఆలకించు .  నీవనుకుంటున్నట్లు యిది భూలోకం కాదు .
నారాయణ: మఱే లోకం ? మీరెవ్వరు ? తెలుగు బాగానే మాట్లాడుచుంటిరిగా .
చిత్రగుప్తుడు: మేము సర్వభాషా ప్రవీణులం. ఇది యమసీమ , వారే యమధర్మరాజు ప్రభువులు . నేను చిత్రగుప్తుడను.   మీ భూలోకము మాకెపుడు సుపరిచితమే . మీ భూలోకవాసులకి మేము ఎపుడూ కొత్తే .
నారాయణ:  అంటే నేనిపుడు మరణించితినా ? అటులైన ఎటుల మీతో మాటలాడుచుంటిని ?
చిత్రగుప్తుడు: నిక్కముగా నీవు మరణించితివి . ఇపుడు నీవు దేహమున లేవు.ఇందులో యిసుమంతైనను సందేహము లేదు . కావలసిన ఒకపరి నీ అవతారమును చూసుకొనుము .

( వెంటనే తనను తాను చూసుకొని భయభ్రాంతుడై రోదిస్తుంటాడు )

చిత్రగుప్తుడు: ఏడవకు నారాయణా , ఏడవకు , నిన్ను చూస్తుంటే మాకూ జాలిగనే వున్నది . ఎన్నో యుగాలనుంచి , ఎన్నో కేసులు పరిశీలించి శిక్షనమలుజరిపిన మాకు నీ  కేసు కొంచెం యిబ్బందికరంగా ఉన్నది .
నారాయణ: (యివేవీ వినిపించుకోకుండా ఏడుస్తూ ) అయ్యయ్యో అపుడే చనిపోయానా ! పట్టుమని పదేళ్ళైనా ఆ సంసార  సుఖాన్ని అనుభవించనే లేదు .
చిత్రగుప్తుడు: ఈ తప్పిదము మా కింకరుల పొరపాటు వలన జరిగింది . అది మా తప్పుగా భావించి విచారణ చేయుచుంటిమి .
నారాయణ: ఇందువలన నా జీవితము నాకు తిరిగి వస్తుందా ? రాదు కదా !
చిత్రగుప్తుడు: ఈ తప్పును సరిదిద్దుటకు మార్గమాలోచించి యున్నాము . నీకు నూతన దేహమును మా ఏలిక ప్రసాదించదలచారు .అందులకు నీవు మాతో సహకరించవలె .
నారాయణ: కళ్ళల్లో కారం చల్లి , నా ఆకారాన్నే మార్చేసి , మమకారాన్ని మసి చెసి , యిపుడు సహకరించాలా ? దేనికొరకు ? నా భార్య నన్ను లౌ చేస్తుందా ?నా బిడ్డలు నన్ను యింట్లోకి ఎలౌ చేస్తారా ?
చిత్రగుప్తుడు: గట్టిగా చెప్పలేం . ఒట్టిగా మాత్రమే చెప్పగలం .
మఱో అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకో . మఱల ఆ శోభనం నాటి సుఖాన్ని అనుభవించి ఆనందించు .
నారాయణ: వింటుంటే బలే హుషారు పుడుతోంది, గాని  నా పెళ్ళాం నాక్కావాలి . నా పెళ్ళానికి నేనే మొగుణ్ణి కావాలి . భూలోకానికెళ్ళిన తర్వాత మీమీద కన్స్యూమర్  కోర్టులో కేసు వేస్తా .
చిత్రగుప్తుడు: అలాగే వేసుకో , కానీ అక్కడకు వెళ్ళాలంటే , నీవు మాతో తప్పక సహకరించవలె .
నారాయణ: అలాగైతే సహకరిస్తా .

( మళ్ళీ నారాయణకి స్పృహ లేకుండా చేసి , కంప్యూటర్ లో మఱోమారు క్షుణ్ణంగా  పరికించిన మీదట )

చిత్రగుప్తుడు:  ప్రభూ , ఓ ఫ్లాష్ .
యమధర్మరాజు: ఏమిటి గుప్తా ?
చిత్రగుప్తుడు: ఒకటే ఒక్క మార్గమున్నది ప్రభూ .ఈతని భార్య ఇతనిని చేసుకొనకముందు , తనకు వరుసైన బావతో ప్రేమ కలాపాలు , సరస సల్లాపాలు సాగించి అతనినే పెళ్ళి చేసుకొంటానని పెద్దలకు చెప్పింది . కాని జాతకాలు సరిపోలేదని , అతనికిచ్చి చేస్తే ఆడదానికి ముఖ్యమైన ఐదవతనాన్ని నువ్వు కోల్పోతావని , కనుక చేసుకోవద్దని
ఈ నారాయణనే చేసుకోమని బలవంతం చేసి పెళ్ళి చేశారు. ఇపుడామె బావ  యిచటకు వచ్చుటకు సిధ్ధంగా ఉన్నాడు . అల్పాయుష్కుడని పేరు పడటంతో , ఆతని కింకను పెళ్ళి కాలేదు . ఈ నారాయణని ఆతని శరీరంలో  ప్రవేశపెట్టినచో ,
ఆ అమ్మాయి తల్లితండ్రులు అతనిని చూసి , చచ్చి బ్రతకటంతో ఆతని రోగాలన్నీ చచ్చిపోయాయని , అతను ఆరోగ్యంగా బ్రతికి బట్ట కడ్తున్నాడని భావించి వాళ్ళమ్మాయిని ఆతనికిచ్చి మళ్ళీ పెళ్ళి చేస్తారు .  ఈ నారాయణ తన పెళ్ళామే తనకు దక్కిందని  ఆనందం చెందుతాడు  . మన ఈ ప్రక్రియతో ,  అదే  సమయంలో ఆ అమ్మాయి బావ కూడా తను ప్రేమించినమ్మాయే తనకు పెళ్ళాం కావటంతో , తను చచ్చి బ్రతకటం తనకో గొప్ప అదృష్టమనుకొంటాడు . ఇందుకేనేమో తననింతవరకూ , ఎవరూ పెళ్ళి చేసుకోలేదనుకుంటాడు .
యమధర్మరాజు: భూలోకంలో స్మశానం ఊరి చివర ఉండటం వలన శవాన్ని అంత  దూరం మోయలేక, మధ్య మధ్యలో దించుకుంటుంటారు . అలా దించుకున్న సమయంలో , ఈ నారాయణని ఆ శవంలో ప్రవేశింపజేసిన , వారి బంధువులు అమితంగా  ఆనందపడిపోతారు .  ఇదే భూలోకవాసులకు ” దింపుడు కళ్ళ ఆశ ” గా అమలులోకి వస్తుంది.నాటినుంచి అలా మధ్య మధ్యలో దింపటం శవాన్ని మోయలేక కాదని , అలా దింపితేనైనా మఱలా బ్రతికి బట్ట కడ్తాడేమోనని కొండంత ఆశతో  ఎదురు చూస్తుంటారు . ఇంక జాగు సేయక తక్షణమే ఆ విధముగ చేయుడు .
చిత్రగుప్తుడు: ఆఙ్ఞ ప్రభూ .
( చిత్రగుప్తుడు ఆఙ్న మేరకు  కింకరులు నారాయణని , ఆ నరేష్ శవంలో ఆవహింపజేయటానికి తీసుకు వెళ్తారు . ఆ నరేష్ శవాన్ని స్మశానం మార్గమధ్యలో శవ వాహకులకు బరువుగా వుండి కిందకు దించుతారు . సరిగ్గా అదే సమయంలో ఆ కింకరులు నారాయణని ఆ నరేష్  శవంలో ఆవహింపజేస్తారు . అమాంతంగా ఆ శవంలోని నరేష్  కదిలి లేచి  కూర్చోవటంతో అక్కడ వున్న యావన్మంది భయభ్రాంతులకు గురి అయి పారిపోతుంటారు .
ఆ నరేష్ శవంలో ఉన్న నారాయణ , వాళ్ళ వెంబడి పరుగెత్తుతూ తనని చూసి భయపడవద్దని , తను చచ్చి
బ్రతికానని చెప్తాడు . మొదట కంగారుపడినా , ఆ తర్వాత అందరూ ఆనందపడ్తారు . ఇంతకీ అసలు విషయమేమిటంటే నారాయణ ఆ శవంలో ఆవహించగానే గత  స్పృహ కోల్పోతాడు . అందువలన యమధర్మరాజు మీద గాని , చిత్రగుప్తుల మీద గాని కన్స్యూమర్ కోర్టు లో కేసు వేయలేకపోతాడు తన పునర్జన్మలో. )
రవళి తన బావైన నరేష్ ని మళ్ళీ పెళ్ళిచేసుకున్న తర్వాత , పైకి బావలా కనపడ్తున్నాడే గాని , తనను , పిల్లను  చూసుకోవటంలో గాని,  ఆ సుఖం అందించటంలో గాని, ఒకటేమిటి , అతని నడవడి ముమ్మూర్తులా నారాయణనే గుర్తుకు తెస్తున్నది . ఎవరితో చెప్పుకోగలదు. మొగుడు పోయిన తనకు మొహం మొత్తకుండా మళ్ళీ మొగుణ్ణి
యిచ్చారు . ఎవరు మాత్రం ఇంతకన్నా  ఏం చేయగలరు . లేని బావ కంటే గూని బావైనా మేలేగదా అని తను ఆ కనపడ్తున్న ఆ నరేష్ బావతోనే  జీవనం సాగిస్తుంది…


                                                                      ******       తెర పడ్తుంది     ******editor
Print Friendly

Your email address will not be published.
Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>