నా న్యూ నుడులు 14
రచన: శర్మ జి ఎస్
1 . సంగమానికి లింగ భేదం అవసరం
సహజీవనానికి లింగ భేదం అఖ్ఖర లేదు .
2 . నమ్మిన వారికి ఈ జగం నాటకం
నమ్మని వారికి ఈ జగం బూటకం .
3 . శక్తి వల్ల లాభాలు
ఆసక్తి వల్ల అనర్థాలు .
4 . ఎదుటి వారిని మార్చటం కంటే
మనకు మనం మారటం తేలిక .
5 . వేషం మార్చినంత తేలిక కాదు
ద్వేషాన్ని మానుకోవడం తేలిక కానే కాదు .
6 . అప్పుడప్పుడు అయినా అప్పు చేయకూడదు .
అప్పు తీర్చకుంటే డప్పు వేయబడుతుంది .
7 . సులభంగా పొందేది స్వలాభం వైపే మొగ్గుతుంది .
కష్టతరమైనది సమాజ శ్రేయస్సు కోసమే .
8 . అవసరం అయినప్పుడు ఎదుటి వారి మీద జాలి చూపించాలి .
అవకాశం ఉన్నప్పుడు ఎదుటివారితో జాలీ చెయ్యాలి .
9 . పంపటం అంటే వదిలించుకోవటం
ఆచరణ అంటే అంటించుకోవడం .
10 . ఓ నాడు అన్ని రోగాలకు మెడిటేషన్ చెక్
ఈ నాడు అన్ని రోగాలకు మెడికేషన్ లాక్ .
( మళ్ళీ కలుసుకుందాం త్వరలో )
No comments:
Post a Comment