కర్ణుని జన్మ వృత్తాంతం గురించి.....

 కర్ణుడి జన్మ వృత్తాతం గురించి ......

                                 వ్యాస రచన : శర్మ జి ఎస్ 


దూర్వాస మహాముని అంటేనే విపరీతమైన కోపం కలవాడు అని కదా ! 


అటువంటి దూర్వాస మహా ముని వారి వద్ద ఆయనకు పూజకు కావలసిన సామగ్రి తెచ్చి పెడుతూ వుండేది కుంతి అనే యువతి . 

అటువంటి ఆ మహాముని ఆ అమ్మాయి సేవలకు సంతోషించాడు . 

ఒకానొక రోజు అమ్మాయి నీకు ఒక మంత్రం యిస్తున్నాను . ఈ మంత్రం వల్ల నీకు పిల్లలు అవసరమైనపుడు ఉపయోగించుకో అని చెప్పారు . అలాగే స్వామి అంటూ యింటికి తిరుగు ముఖం పట్టింది . ఆ వెళ్ళే దారిలో ఆ అమ్మాయికి ఒక చిన్న సందేహం వచ్చింది . ఆ మంత్రం పని చేస్తుందా ? ఆ మంత్రానికి పిల్లలు కలుగుతారా అన్న సందేహం కలగడంతో , పరిశీలించి చూద్దాం. సత్యమో ? అసత్యమో తెలిసిపోతుంది గదా ! అని , వెంటనే అక్కడ పక్కనే వున్న కొలను లో కాళ్ళూ , చేతులు పరిశుభ్రం చేసుకొని , ఆ మంత్రాన్ని చదువుతూ మొదట సూర్యభగవానుడిని ప్రార్ధించింది . వెంటనే ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఆ సూర్యభగవానుడు ప్రత్యక్షమై , నీవు కోరినట్లు , నీకు పుత్రుడిని ప్రసాదిస్తున్నాను అని ఒక పిల్లవాడిని ( ఆ కుంతి చేతులలో పెట్టి ) ప్రసాదించి వెళ్ళిపోయాడు . 

కుంతి ఆశ్చర్య పోయింది , ఆనందం చెందింది . కొంత తడవుకు తను యింటికి వెళ్ళాలి అన్న విషయం జ్ఞప్తికి రాగానే , ఒక్కసారి చేతుల్లో వున్న పసిపిల్లవాడిని చూచి ఉలిక్కి పడ్డది . తనకు యింకా పెళ్ళి కాలేదు . ఈ పసి పిల్లవాడిని తీసుకొని తను ఎలా యింటికి వెళ్ళగలదు . వెళ్లలేదు కదా ఎక్కడ అయినా వదలిపెట్టి వెళ్ళాలి . అలా ఎలా వదలగలను అని అనుకొని , మళ్ళీ ఆ మంత్రం చదివి సూర్యభగవానుడిని ప్రార్ధించింది . 

ఆయన వెంటనే ప్రత్యక్షమై ఏమిటి ? అని అడగగా , తన పరిస్థితి వివరించింది . 

అప్పుడు ఆ సూర్యభగవానుడు " నేను మంత్ర బద్దుడను . ఏమీ చెయ్యలేను . ఆ మంత్రం చదివి ప్రార్థించే ముందే , నువ్వు యివన్నీ ఆలోచించు కోవాలి . ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం ఏమీ లేదు . వెనుకకు తీసుకోవడం జరగని పని . కాకుంటే నీ పరిస్థితిని వివరించావు గనుక , ప్రథమ తప్పిదం క్రింద మన్నించి , ఒక సలహా యిస్తాను . ఆ ప్రకారం చెయ్యి . ఆ పిల్లవాడిని నీటిలో వదలి వెయ్యి . ఆ పిల్లవాడిని ఏ పురుగూ పుట్రా , జలచరాలు , జంతువులు భక్షించకుండా అతనికి రక్షణగా సహజ కవచ కుండలాలు ఇవిగో , తీసుకో అని చెప్పి అంతర్ధానం అయి వెళ్ళి పోయారు . 

ఇక చేసేదేమీ లేక తన పేగు తెంచుకుని , పంచుకొని పుట్టకపోయినా బాధతో నీటిలో వదలి యింటికి వెళ్ళిపోయింది . ఇది కర్ణుడి జన్మ వృత్తాంతం . 


ఇప్పుడు ఈ కథ మహాభారతం లోనిది .

ఈ కథ లోని అంతరార్థం ఏ యుగం లోని మానవులకు అయినా ఉపయోగ పడుతుంది .  

అదెలాగంటే " పెళ్ళి కాని యువతులు కామంతో ( కోరికతో ) / తెలిసో /తెలియకో గాని ఆ కోరిక తీర్చుకుంటే , అందువల్ల ఆ యువతి గర్భం దాలిస్తే ఆ గర్భానికి కారణమైన యువకుడిది ( మగవాడిది ) కాదు తప్పు , ఆ యువతిదే . 

( అలాగని యువకులు గానీ , మగవారు కానీ ఆడపిల్లల మీద అటువంటి అపచారానికి గానీ / అత్యాచారానికి గానీ చేసే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు . చేస్తే కఠిన శిక్షలు అమలు చేస్తారు . )

ఏ యుగంలో అయినా కట్టుబాట్లను తప్పి ఎవ్వరూ నడచుకోకూడదు . అలా నడుచుకోవడం క్షమించరాని నేరం / తప్పు . కోరిక కోరబోయే ముందు , ముందు వెనుకలు ఆలోచించు కోవాలి . ఒక్క ఆ కోరిక మాత్రమే కాదు , ఏ కోరిక అయినా ముందు వెనుకలు ఆలోచించుకొని కోరుకోవాలి . అలా ఆలోచించకుండా కోరిక పుట్టగానే తీర్చుకుందామని ప్రయత్నాలు మొదలెడితే , వాటి ఫలితాలు అనుభవించి తీరవలసిందే . 

కనుక పెళ్ళి కాని యువతులు , యువకులతో / మగవారితో సంగమం చేయరాదు . అలా ఆ కట్టుబాటు తప్పి చేస్తే , దాని ఫలితం / శిక్ష ఆ యువతులకే , వారితో కలిసిన మగవారికి కాదు . కనుక యువతులు యిది తెలుసుకొని , నడుచుకోవాలి అని ._*

*_ఆ కాలానికి మాత్రమే అది కరెక్ట్ కాదు . ఈ / ఏ కాలానికి అయినా యిదే కరెక్ట్ అనే చెప్పబడ్డది మన హైందవ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం . 


                            **********

నా న్యూ నుడులు -14

                నా న్యూ నుడులు  14

                                         రచన: శర్మ జి ఎస్ 

1  . సంగమానికి లింగ భేదం అవసరం 
      సహజీవనానికి లింగ భేదం అఖ్ఖర లేదు .

2  . నమ్మిన వారికి ఈ జగం నాటకం 
       నమ్మని వారికి ఈ జగం బూటకం .

3  .  శక్తి వల్ల లాభాలు 
       ఆసక్తి వల్ల అనర్థాలు .

4  .  ఎదుటి వారిని మార్చటం కంటే 
        మనకు మనం మారటం తేలిక  .

5  .  వేషం మార్చినంత తేలిక కాదు 
       ద్వేషాన్ని మానుకోవడం తేలిక కానే కాదు .

6  .  అప్పుడప్పుడు అయినా అప్పు                                        చేయకూడదు . 
        అప్పు తీర్చకుంటే డప్పు వేయబడుతుంది .

7  .   సులభంగా పొందేది స్వలాభం వైపే                                   మొగ్గుతుంది .
        కష్టతరమైనది సమాజ శ్రేయస్సు కోసమే .

8   .  అవసరం అయినప్పుడు ఎదుటి వారి                               మీద జాలి చూపించాలి . 
         అవకాశం ఉన్నప్పుడు ఎదుటివారితో                              జాలీ చెయ్యాలి .

9   .   పంపటం అంటే వదిలించుకోవటం 
         ఆచరణ అంటే అంటించుకోవడం .

10 .   ఓ నాడు అన్ని రోగాలకు మెడిటేషన్ చెక్ 
         ఈ నాడు అన్ని రోగాలకు మెడికేషన్ లాక్ .

              ( మళ్ళీ కలుసుకుందాం త్వరలో )

ఎలా ఉండే వాళ్ళం ......? యిలా ఉన్నాం.......


                                                                                                                           సేకరణ : శర్మ జి ఎస్

గతం స్వగతంగా కొన్ని సందర్భాలలో బాగుండవచ్చు .
అన్ని సందర్భాలలో బాగుండదు . గతం బయట పడితే , దానిని బట్టి భవిష్యత్తును చక్కగా రూపొందించుకొనే సదవకాశం కలుగుతుంది . 
                                                                                                                               
ఈ విషయం మనకే కాదు , మన దేశానికి కూడా చాలా అత్యవసరమని తెలియవస్తోంది .
గతాన్ని పరిశీలించినప్పుడు , అప్పుడు తెలిసో , తెలియకో జరిగిన , దొర్లిన పొరపాట్లు మఱలా భవిష్యత్తులో జరుగకుండా , తగు జాగ్రత్తలు తీసుకొని భవిష్యత్తును బంగరు మయంగా చేసుకొనే దిశగా అడుగులు ( దేశమైతే చర్యలు చేపట్టాలి ) వేయాలి .

                                                                         


  
 ************