రచన : శర్మ జీ ఎస్
పెళ్ళిళ్ళు చేయటానికి అటు ఏడు తరాలు , ఇటు ఏడు తరాలు చూసేవాళ్ళు మా పెద్దవాళ్ళు . ఇపుడేమిటి , ఇలా చూస్తున్నారు , అలా చేసేసుకుంటున్నారు అని మా బామ్మ అంటుండేది . ఆ మాట వినగానే నాకు ఆశ్ఛర్యం అనిపించింది .
" అదేమిటి బామ్మా ? అలా అంటావేమిటి ? ఏం చూసేవాళ్ళేంటి ? " అడిగాను .
" ఔనురా " పెళ్ళి అంటే నూరేళ్ళ పంట " అని ఓ మహా కవి అని ఎలుగెత్తి పాడించాడు . వినలేదా ? "
" విన్నాను బామ్మా ? చాలా విన సొంపుగా వుంది . పెళ్ళి జరిగే విధానాన్ని చక్కగా తెలియజేశారు .వినసొంపుగా వుండాలంటే ఏ మాటైనా సంగీతపరంగా రాగయుక్తంగా ఆలాపిస్తే బాగానే వుంటుంది . "
" ఇప్పుడు మనకు కావలసింది అది కాదు . పెళ్ళి అంటే నూరేళ్ళ పంట అంటే ఏమిటి ? అని . "
" నువ్వు చెప్పు బామ్మా , నేను వింటాను . తెలుసుకోవాలనిచాలా కుతూహలంగా వున్నది . "
" పెళ్ళి చేసేటప్పుడు గాని / చేసుకొనేటప్పుడు గాని / చేయవలసివచ్చినప్పుడు గాని చాలా చాలా ముఖ్యమైన విషయాలు చూడవలసి వున్నది . దాని మీదే భవిష్యత్తు బంగారుబాట అయ్యే అవకాశం వుంటుందిరా .
పెళ్ళికూతురి వైపు వాళ్ళు పరిశీలించాల్సినవి .
1 . వాళ్ళ వంశం వాళ్ళకు ఆడవాళ్ళను గౌరవించే అలవాటు వున్నదా ?
2 . వాళ్ళ వంశంలోని మగవాళ్ళు ఆడవాళ్ళకంటే ముందే టపా కట్టేస్తారా ? అప్పుడు ఆ యింటి భారం ఈ అమ్మాయిమీద పడ్తుంది కనుక .
3 . వాళ్ళకు వంశాభివృధ్ధి తప్ప ఆరోగ్యవృధ్ధి చూసుకొనే అలవాట్లు ఉన్నాయా ? లేదా ?
4 . వాళ్ళు వాళ్ళ యింటికి సంబంధం కలుపుకొని తెచ్చుకుంటున్న అమ్మాయిని చాకిరీ తగ్గించి సుఖపెడ్తారా ? లేదా ?
5 . వాళ్ళు మనమ్మాయి చేత ఉద్యోగం చేయించి డబ్బులు కూడబెట్టుకోవాలనుకుంటున్నారా ?
6 . వాళ్ళు అవసరాలకు ఖర్చు పెడ్తారా , లేక ఎందుకులే అని వదిలేస్తారా ?
పెళ్ళికొడుకు వైపు వాళ్ళు పరిశీలించాల్సినవి .
1 . ఆ కోడలుగా అడుగిడబోయే అమ్మాయి గుణ గణాలే వాళ్ళ వంశ వారసులకు ప్రధానమైన విషయం గనుక పరిశిలించాల్సిందే .అవే ముందు తరాల వారసులకు వారసత్వమౌతూ కొనసాగుతాయి .
2 . ఆ అమ్మాయి పెద్దలను గౌరవిస్తుందా ? లేక మొగుడిని మాత్రమే గౌరవిస్తుందా ?
3 . ఆ అమ్మాయి చదివిన చదువు తన సంసారాన్ని ( అవసరమైతే ) సరిదిద్దుకోగలదా ?
4 . ఆ అమ్మాయికి తన స్వేఛ్ఛ ముఖ్యమా ? లేక ఆ ఇంటిలోని నలుగురి శ్రేయస్సు ముఖ్యమా ?
5 . ఆ అమ్మాయి మన వంశప్రతిష్టలకు భంగం కలగకుండా నడుచుకోగల నడవడిక గలదేనా ?
6 . ఆ అమ్మాయి తన పిల్లలని ( వంశ వారసులను ) చక్కగా పెంచగలదా ? ( కొంతమందికి పిల్లను కనటం యిష్టం లేదనుకునే వాళ్ళను దృష్టిలో పెట్టుకొనవలసి వస్తోంది ) .నక్షత్రాలను , రాశులను , లగ్నములను చూసి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు . "
" ఇవేంటి బామ్మా . నక్షత్రాలేమో ఆకాశంలో వుంటాయి . మనమేమో భూమ్మీద వుంటాము . వాటిని మనం చూడటమేమిటి ? అవి మనల్ని కాపాడటమేమిటి ? అంతా అయోమయంగా వుంది బామ్మా . "
" ఈ ప్రపంచంలో ఏదైనా తెలియకముందు , అంతా అయోమయంగానే వుంటుంది . తెలుసుకున్న తర్వాత , యింతేనా ? అని మన మనసు తేలిక పడ్తుంది . ఇక ఆపై దాన్ని వుపయోగించాలనే తహ తహ అధికమౌతుంటుంది . "
" అదేమిటో వివరంగా చెప్పు బామ్మా . "
" చెప్తా శ్రధ్ధగా విను . వినటమే కాదు ,ఆలోచించి ఆచరణలో పెట్టాలి మంచిది అనిపిస్తే , అర్ధమైందా ? "
" అలాగే బామ్మా , మా మంచి కోరి చెప్తున్నప్పుడుమీ పెద్దల మాట తప్పకుండా వింటాము . "
" ఈ భూమండలం , నక్షత్ర మండలాల చుట్టూరా చుట్టి వస్తుంటుంది . ఆ నక్షత్ర మండలాల ప్రభావం ఈ భూమండలం మీద పడ్తూనే వుంటుంది . ఈ విషయాన్ని మన పూర్వీకులు ( ముందు తరాల వారు ) ఎన్నో పరిశోధనలు చేసి , ఎంతో మంది జీవితాలను కూడా పరిశీలించి ఇటువంటి మంచి విషయాలను ఎన్నిటినో కనుక్కొని , రాబోయే తరాల వాళ్ళకు కానుకగా యిచ్చి , మార్గదర్శకులయ్యారు .
నిజానికి ఈ నాడు మనం చేస్తున్నవన్నీ , మనమేమీ కొత్తగా ఏమీ చేయటం లేదు . మనం చేస్తున్నవన్నీ మన పూర్వీకులు చేసినవే . కాకుంటే విషయం అదే గాని , విధానమే మారుతుంది . కనుక మనవి ఎంగిలి బతుకులే . దీనికే మనం ఏదో కొత్తగా , కనుక్కున్నామని , చేస్తున్నామని , మనం లేకపోతే ఈ ప్రపంచానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని విఱ్ఱవీగుతుంటాము . ఇది చాలా పెద్ద పొఱపాటు .
ఇక అసలు విషయానికి వస్తున్నా ( నక్షత్రాలు , రాశులు , లగ్నములు ) .
నక్షత్రాలు 27 , ఒక్కొక్క నక్షత్రానికి పాదాలు 4 , 27 x 4 = 108 పాదాలు . వాటిని చూసే ఈ రాశులు 12 , ఈ నక్షత్రాలకు అధిపతులుగా , అంటే ఈ 108 పాదాలుగల నక్షత్రాలను పరిపాలిస్తుంటాయి .
అంటే ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి . ఆ 27 నక్షత్రాలు 12 రాశుల అధీనంలో ఉంటాయి . ఈ రాశుల గుణ గణాలను కూలంకషంగా పరిశీలించిన మీదట అవి ఏ గుణం కలవో , ఏ గణం కోవకు చెందినదో నిర్ణయిస్తారు .
ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాలి , గుణం అంటే బుధ్ధికి సంబంధించినది . గణం అంటే అంశకు సంబంధించినది .
1 . మేషం ( అశ్వని 4 పాదాలు దేవగణం , భరణి 4 పాదాలు మనుష్యగణం . & కృతిత్తిక 1 వ పాదం రాక్షసగణం . ) = మేక అంటే ఈ రాశికి సంబంధించిన నక్షత్రాల పాదాలలో సాధుగుణం గలిగి , మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు .
2 . వృషభం ( కృత్తిక 2,3,4 పాదములు రాక్షసగణం , రోహిణి 4 పాదములు మనుష్యగణం & మృగశిర 1 , 2 పాదములు దేవగణం = ఎద్దు , మొరటుగ వుండి బండ చాకిరీ చేయటానికి ఏ మాత్రం వెనుకాడరన్నది తెలుస్తోంది .
3 . మిధునం ( మృగశిర 3,4 పాదములు దేవగణం , ఆరుద్ర 4 పాదములు మనుష్యగణం , పునర్వసు 1,2,3 పాదములు దేవగణం ) = అంటే దాంపత్య కలయిక . కామ గుణాన్ని చక్కగా ఆనందించాలనుకునే మనస్తత్వం కలవారు .
4 . కర్కాటకం ( పునర్వసు 4 వ పాదము దేవగణం , పుష్యమి 4 పాదములు దేవగణం , ఆశ్లేష 4 పాదములు రాక్షసగణం ) = ( ఎండ్రకాయ ) అవకాశం కొరకు ఎదురుచూస్తూ , వచ్చినప్పుడు వదులుకోకుండా గట్టి పట్టు పట్టే స్వభావం గలవారు .
5 . సింహం ( మఖ 4 పాదములు రాక్షసగణం , పుబ్బ 4 పాదములు మనుష్యగణం , ఉత్తర 1 వ పాదం మనుష్యగణం ) = సింహంలా కనపడ్తూ , అధికారాన్ని వినియోగించుకుంటుంటారు .
6 . కన్య ( ఉత్తర 2,3,4 పాదములు , హస్త 4 పాదములు దేవగణం & చిత్త 1, 2 పాదములు రాక్షసగణం ) = కన్యలా సంతోషంగా జీవిస్తారు ఎవరికీ తలవంచకుండా ) .
7 . తుల ( చిత్త 3,4 పాదములు రాక్షసగణం , స్వాతి 4 పాదములు దేవగణం & విశాఖ 1,2,3 పాదములు రాక్షసగణం ) = వస్తువులను తూనిక వేయాల్సి వచ్చినప్పుడు త్రాసు ( కాటా ) ని తీసుకొని తూస్తాము ఎటూ మొగ్గు చూపకుండా . అలాగే వీళ్ళు బ్యాలెన్స్ డ్ గా వుంటారు .
8 . వృశ్చికం ( విశాఖ 4 వ పాదము రాక్షసగణం , అనూరాధ 4 పాదములు దేవగణం & జ్యేష్ట 4 పాదములు రాక్షసగణం ) = తేలు , ఇది తనని ఎవరూ ఏమీ చేయకుండా ఎదుటివారిని కుట్టటంలో అత్యంత ప్రావీణ్యత గలిగిన ఓ కీటకం . అవకాశం వదులుకోరు ఈ రాశి స్వభావులు .
9 . ధనుస్సు ( మూల 4 పాదములు రాక్షసగణం , పూర్వాషాఢ 4 పాదములు మనుష్యగణం & ఉత్తరాషాఢ 1 వ పాదం మనుష్యగణం ) = విల్లు . అవసరం వచ్చినప్పుడు విల్లు వాడటం చాలా చాలా సద్గుణం . ఈ రాశివారు ఈ స్వభావం కలిగి వుంటారు .
10. మకరం ( ఉత్తరాషాఢ 2,3,4 పాదములు మనుష్యగణం , శ్రవణం 4 పాదములు దేవగణం & ధనిష్ట 1 , 2 పాదములు రాక్షసగణం ) = మొసలి . నిద్రపోతున్నట్లే వుంటుంది , కాని అవకాశం కొరకు ఎదురుచూస్తూ వదలిపెట్టనే పెట్టదు .
11. కుంభం ( ధనిష్ట 3 , 4 పాదములు రాక్షసగణం , శతభిషం 4 పాదములు రాక్షసగణం & పూర్వాభాద్ర 1,2,3 పాదములు మనుష్యగణం ) = కలశం లాంటి నిండు కుండ . సద్గుణాల రాశులు .
12. మీనం ( పూర్వాభాద్ర 4 వ పాదం మనుష్యగణం , ఉత్తరాభాద్ర 4 పాదములు మనుష్యగణం & రేవతి 4 పాదములు దేవగణం ) = అంటే చేప . ఇది నీటిలోనే వుంటూ ఆంతులేని ఆనందాలను అనుభవిస్తున్నట్లు హడవుడిగా గెంతుతూ పైకి కనపడ్తుంది . తన స్థావరాన్ని దాటి బయటకు రావటానికి యిష్టపడనే పడదు . గీసిన గిరి లోనే జీవించటంలో ఆనందాల్ని అనుభవిస్తుంటుంది .
సహజంగానే కొన్ని జంతువులకు వైరం వుండనే వున్నది . అందులో వివాహ విషయంలో తప్పక ఆ జంతు వైరం గల నక్షత్రాలు గల ఆడ మగ వాళ్ళకు వివాహం చేస్తే ఆ యిరువురి నడుమ అడుగడుగునా , భేదాభిప్రాయాలు , తఱచుగా కొట్లాటలు , యిరువురి నడుమ ప్రేమ భావం చాలా తక్కువగా వుంటుంది .
అంతే కాకుండా గణ పొంతన కూడా చాలా అవసరమైనదిగా భావించాలి . దేవగణం , మనుష్యగణములైతే ఎంతో మంచిది . దేవ , మనుష్యగణములు గాని ,రాక్షస మనుష్యగణములు గాని పనికి రావు . రెండు ఒకే గణములైన యిబ్బందులుండబొవు .
అయితే శాస్త్ర ప్రకారం గణములు అన్నీ కుదరకపోయినా , కనీస వైర జంతువులను చూసుకొనగలిగితే చాలావరకు జీవితం ఆనందమయంగా వుంటుంది .
అది కూడా చాలా మంది చూడక , ఆ శాస్త్రాన్నే అవతల పెట్టి , తమ కనుకూలంగా ముహూర్తాలు పెట్టించుకొని పెళ్ళిళ్ళు హడావుడిగా చేసేసుకొంటున్నారు . ఆ తర్వాత వచ్చే యిబ్బందుల్ని ఎదుర్కోలేక విడిపోతున్నారు .
మన భూమండలం చుట్టి వస్తున్న నక్షత్ర మండలాల ప్రభావం మన మనుగడ మీద ఎంతగా వున్నదో అర్ధమైందిగా . కనుక అటు ఏడు , ఇటు ఏడు తరాలే కాకుండా పెద్దలు చెప్పిన వీటిని గూడా చూడటం ఎంతో శ్రేయస్కరం కదా ! ఆలోచించుకో .
********

పిల్లలు వారంత వారే పెళ్ళిళు చేసేసుకుంటుంటే చూసేదెవరు? చూసి చేసేసినవీ పెటాకులవుతున్నాయి. ఎక్కడో లెక్క తప్పుతోంది సార్!
ReplyDeleteఎక్కడో అన్నది ప్రశ్నార్ధకంగానే మిగిలిపోతోంది ఎన్ని యుగాలకైనా . కాకుంటే వేరొకటి ప్రశ్నగా మిగిలిపోతుంది .
Delete