కర్ణుడి జన్మ వృత్తాతం గురించి ......
వ్యాస రచన : శర్మ జి ఎస్
దూర్వాస మహాముని అంటేనే విపరీతమైన కోపం కలవాడు అని కదా !
అటువంటి దూర్వాస మహా ముని వారి వద్ద ఆయనకు పూజకు కావలసిన సామగ్రి తెచ్చి పెడుతూ వుండేది కుంతి అనే యువతి .
అటువంటి ఆ మహాముని ఆ అమ్మాయి సేవలకు సంతోషించాడు .
ఒకానొక రోజు అమ్మాయి నీకు ఒక మంత్రం యిస్తున్నాను . ఈ మంత్రం వల్ల నీకు పిల్లలు అవసరమైనపుడు ఉపయోగించుకో అని చెప్పారు . అలాగే స్వామి అంటూ యింటికి తిరుగు ముఖం పట్టింది . ఆ వెళ్ళే దారిలో ఆ అమ్మాయికి ఒక చిన్న సందేహం వచ్చింది . ఆ మంత్రం పని చేస్తుందా ? ఆ మంత్రానికి పిల్లలు కలుగుతారా అన్న సందేహం కలగడంతో , పరిశీలించి చూద్దాం. సత్యమో ? అసత్యమో తెలిసిపోతుంది గదా ! అని , వెంటనే అక్కడ పక్కనే వున్న కొలను లో కాళ్ళూ , చేతులు పరిశుభ్రం చేసుకొని , ఆ మంత్రాన్ని చదువుతూ మొదట సూర్యభగవానుడిని ప్రార్ధించింది . వెంటనే ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఆ సూర్యభగవానుడు ప్రత్యక్షమై , నీవు కోరినట్లు , నీకు పుత్రుడిని ప్రసాదిస్తున్నాను అని ఒక పిల్లవాడిని ( ఆ కుంతి చేతులలో పెట్టి ) ప్రసాదించి వెళ్ళిపోయాడు .
కుంతి ఆశ్చర్య పోయింది , ఆనందం చెందింది . కొంత తడవుకు తను యింటికి వెళ్ళాలి అన్న విషయం జ్ఞప్తికి రాగానే , ఒక్కసారి చేతుల్లో వున్న పసిపిల్లవాడిని చూచి ఉలిక్కి పడ్డది . తనకు యింకా పెళ్ళి కాలేదు . ఈ పసి పిల్లవాడిని తీసుకొని తను ఎలా యింటికి వెళ్ళగలదు . వెళ్లలేదు కదా ఎక్కడ అయినా వదలిపెట్టి వెళ్ళాలి . అలా ఎలా వదలగలను అని అనుకొని , మళ్ళీ ఆ మంత్రం చదివి సూర్యభగవానుడిని ప్రార్ధించింది .
ఆయన వెంటనే ప్రత్యక్షమై ఏమిటి ? అని అడగగా , తన పరిస్థితి వివరించింది .
అప్పుడు ఆ సూర్యభగవానుడు " నేను మంత్ర బద్దుడను . ఏమీ చెయ్యలేను . ఆ మంత్రం చదివి ప్రార్థించే ముందే , నువ్వు యివన్నీ ఆలోచించు కోవాలి . ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం ఏమీ లేదు . వెనుకకు తీసుకోవడం జరగని పని . కాకుంటే నీ పరిస్థితిని వివరించావు గనుక , ప్రథమ తప్పిదం క్రింద మన్నించి , ఒక సలహా యిస్తాను . ఆ ప్రకారం చెయ్యి . ఆ పిల్లవాడిని నీటిలో వదలి వెయ్యి . ఆ పిల్లవాడిని ఏ పురుగూ పుట్రా , జలచరాలు , జంతువులు భక్షించకుండా అతనికి రక్షణగా సహజ కవచ కుండలాలు ఇవిగో , తీసుకో అని చెప్పి అంతర్ధానం అయి వెళ్ళి పోయారు .
ఇక చేసేదేమీ లేక తన పేగు తెంచుకుని , పంచుకొని పుట్టకపోయినా బాధతో నీటిలో వదలి యింటికి వెళ్ళిపోయింది . ఇది కర్ణుడి జన్మ వృత్తాంతం .
ఇప్పుడు ఈ కథ మహాభారతం లోనిది .
ఈ కథ లోని అంతరార్థం ఏ యుగం లోని మానవులకు అయినా ఉపయోగ పడుతుంది .
అదెలాగంటే " పెళ్ళి కాని యువతులు కామంతో ( కోరికతో ) / తెలిసో /తెలియకో గాని ఆ కోరిక తీర్చుకుంటే , అందువల్ల ఆ యువతి గర్భం దాలిస్తే ఆ గర్భానికి కారణమైన యువకుడిది ( మగవాడిది ) కాదు తప్పు , ఆ యువతిదే .
( అలాగని యువకులు గానీ , మగవారు కానీ ఆడపిల్లల మీద అటువంటి అపచారానికి గానీ / అత్యాచారానికి గానీ చేసే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు . చేస్తే కఠిన శిక్షలు అమలు చేస్తారు . )
ఏ యుగంలో అయినా కట్టుబాట్లను తప్పి ఎవ్వరూ నడచుకోకూడదు . అలా నడుచుకోవడం క్షమించరాని నేరం / తప్పు . కోరిక కోరబోయే ముందు , ముందు వెనుకలు ఆలోచించు కోవాలి . ఒక్క ఆ కోరిక మాత్రమే కాదు , ఏ కోరిక అయినా ముందు వెనుకలు ఆలోచించుకొని కోరుకోవాలి . అలా ఆలోచించకుండా కోరిక పుట్టగానే తీర్చుకుందామని ప్రయత్నాలు మొదలెడితే , వాటి ఫలితాలు అనుభవించి తీరవలసిందే .
కనుక పెళ్ళి కాని యువతులు , యువకులతో / మగవారితో సంగమం చేయరాదు . అలా ఆ కట్టుబాటు తప్పి చేస్తే , దాని ఫలితం / శిక్ష ఆ యువతులకే , వారితో కలిసిన మగవారికి కాదు . కనుక యువతులు యిది తెలుసుకొని , నడుచుకోవాలి అని ._*
*_ఆ కాలానికి మాత్రమే అది కరెక్ట్ కాదు . ఈ / ఏ కాలానికి అయినా యిదే కరెక్ట్ అనే చెప్పబడ్డది మన హైందవ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం .
**********