రచన : శర్మ జీ ఎస్
( ( 1959 లో విడుదలైన ( అంటే స్వాతంత్ర్యం వచ్చిన 12 ఏళ్ళకన్నమాట ) " ఇల్లరికం " తెలుగు సినిమాలో కొసరాజు రాఘవయ్య చౌదరి గారు వ్రాసిన ఈ పాటకు నేటి రాజకీయ నాయకులకు పేరడీగా వ్రాయటం జరిగింది ))
భలేచాన్స్ భలేచాన్సులే...
భలేచాన్సులే భలేచాన్సులే
లలలాం లలలాం లక్కీచాన్సులే
భలేచాన్సులే
అధికారంలో వున్న మజా...
అధికారంలో వున్న మజా..
అది అనుభవించితే తెలియునులే,
తెలియునులే,
భలేచాన్సులే...
అమాయకపు ప్రజలకు ఒక్క నాయకుడౌ ,
అదృష్ట యోగం పడితే , పడితే ,
పోటీదారులే లేకుంటే
ఆ నాయకుడిదే అధికారం ,
అధికారం ,
భలేచాన్సులే...
మందుపోసినా అమృతంలాగా
కమ్మగా ఉందనుకుంటే
బహుకమ్మగా ఉందనుకుంటే
ఛీ, ఛా అన్నా చిరాకు పడక
దులపరించుకు పోయేవాడికి
భలేచాన్సులే (అధికారంలో వున్న మజా )
సీ బీ ఐ పట్టుకుని బయటికీడ్చినా,
చెఱసాలలో ఫెట్టినా ,
సీటు పట్టుకొని వేలాడీ , వేలాడీ ,
దూషణ భూషణ తిరస్కారములు
ఆశీస్సులుగా తలచేవాడికి ,
భలేచాన్సులే (అధికారంలో వున్న మజా )
అణగి మణగి ఉన్నామంటే
అంతా మనకే చిక్కేది (2)
పైసా పైసా కూడబెట్టితే
మనవాళ్ళకే కాదా దక్కేది
అది మనవాళ్ళకే కాదా దక్కేది
అది మనకే ఇహ మనకే
అది మనకే మనకే మనకే
వదలను కనకే , కనకే , కనకే .
*******