మినరల్ వాటర్ ప్లీజ్



                                                                                                                            సేకరణ : శర్మ జి ఎస్
పాఠకులారా ,

మీలో చాలామందికి తెలిసిన విషయాలే అయి వుండవచ్చు . కొంతమందికి తెలిసుండకపోవచ్చని భావించి ఈ విషయాలు తెలియచేస్తున్నాను .
అంతే కాకుండా ఎంతమందికి తెలిసినా , యింకా తెలియని వాళ్ళుంటూనే వుంటుంటారు . అందుకే , ఆ తెలియని వాళ్ళ కొఱకే ఈ టపా అనుకోండి .







ఈ టపాలోని విషయాలు వాట్సప్ ద్వారా తిరువళ్ళూరు సుబ్బారావు పంపినవి . 
అవి పాఠకులందరితో షేర్ చేసుకోవాలన్న సదుద్దేశంతో ఈ టపాలో పొందుపరుస్తున్నాను .
వాళ్ళెందుకు అలా చేశారో తెలియకపోవచ్చు గాని , యిలాంటివి మన కంట పడినప్పుడు సందేహించక తప్పదు కదా ! 
పరిశీలించి పర్చేజ్ చేయండి ప్లిజ్ .

ఈతి బాధలు - నీతి బోధలు


                                                                                                                                  సేకరణ : శర్మ జి ఎస్ 



నీతులు ఎవరు చెప్పినా వింటానికి బాగానే వుంటాయి . ఆచరణ విషయానికొస్తేనే అందుకోలేనంత దూరంలో వున్నట్లు అనిపిస్తాయి . 
ఈతి బాధలకు నీతి బోధలు అత్యవసరమైనవి . 
అందుకనే చాలా వరకు ఎక్కడికక్కడ అందరూ చెప్తూనే వున్నారు . విచిత్రమైన విషయమేమిటంటే వినే వారు తగ్గి పోయారు , ఆచరించే వారు అసలు కనపడటం లేదనే చెప్పుకోవాలి .

పాఠాలు కూడా పదే పదే చదివితేనే వస్తాయి కదా !


అయినా ఎందుకు చెప్తున్నానంటే , పలుమార్లు చదవగా , చదవగా కొన్నైనా ఆచరణ అలవాటు చేయగల్గుతాయన్న సదుద్దేశంతోనే ఈ టపా . 

1. నదీ ప్రవాహం విస్తరించాలని ఒడ్డునే కోస్తుంది ఆ ఒడ్డుకే తెలియకుండా . అలాగే శత్రువులను బలహీన పరచాలి    వాళ్ళకు తెలియకుండానే . దెబ్బ తెలియకూడదు . 

2. ధర్మాల్లోకెల్లా ఉత్తమ ధర్మం నిజం చెప్పడం . 
   పాపాల్లోకెల్లా మహాపాపం అబధ్ధం చెప్పడం .

3. మృదువుగా మాట్లాడాలి 
   మృదువుగా వ్యవహారాన్ని చక్కబెట్టాలి 
   మృదువుగా హెచ్చరించాలి ( అవసరమైనప్పుడు )
   మృదుత్వాన్ని మించిన పదునైన ఆయుధం లేనే లేదు 
   ( కొన్ని సందర్భాలలో ).

4. తనకు ఉన్నంతలో పదుగురికీ పెట్టి తినేవాడు ,
   ఈ ఇహం లోను , ఆ పరంలోనూ గౌరవం పొందుతాడు .

5. సంపద - స్నేహ సంపద 
   ఈ రెడింటిలోనూ ఏది కావాలని అడిగితే 
   స్నేహమే కోరుకుంటారు విఙ్నులు .

6. ఙ్నానజ్యోతి మనసులోని చీకట్లనూ తొలగిస్తుంది .

7. జీవితం సముద్రమైనప్పుడు 
   చంచలమైన ఇంద్రియాలే నీళ్ళు 
   అఱి షడ్వర్గాలే మొసళ్ళు 
   ధిర్యమే తెప్ప .

8. క్రోధమే మానవుని పతనానికి తొలి మెట్టు 
   ఆ క్రోధం కారణంగానే 
   కార్తవీర్యార్జునుడు పరశురాముడి చేతిలో 
   రావణుడు రాముడి చేతిలో ఓడిపోయారు .

9. దేశానికి 
   మంచి జరిగినా  
   చెడు జరిగినా 
   పాలకుడిదే పూర్తి బాధ్యత .

10.అహింస - సత్యం - దయ - ఇంద్రియ నిగ్రహం 
   లాంటి వాటికి మించిన తపస్సు లేదు .

11.తీరని అప్పు 
   ఆరని నిప్పు 
   ఎల్ల వేళలా ప్రమాదమే .

12.నాయకుడనేవాడు 
   ముఖస్తుతికి లొంగకూడదు 
   పొగడ్తలతో దగ్గఱ కావాలనుకొనే వారిని 
   ఎల్లవేళలా దూరంగా వుంచాలి .



ఈ భీష్మ నీతి బోధలు తెలుగు వన్స్ వెబ్ సైట్ నుంచి కె . బసంత్ ద్వారా వాట్సప్ లో చూడటం జరిగింది .  

                  *          *          *

ప్రాయాలు - అభిప్రాయాలు



                                                                                                                                   సేకరణ : శర్మ జి ఎస్ 

ఈ ప్రపంచంలో  తల్లి తండ్రుల మీద  అభిప్రాయాలు చాలా వరకు ప్రాయానికణుగుణంగా మారుతుంటాయి . స్థిరంగా వుండవు అన్నది నగ్న సత్యమే .

ఓ మారు యివి పరికించి చూడండి . 

1.   4 ఏళ్ళ వయసులో                  మా అమ్మా , నాన్నలు చాలా గొప్పవాళ్ళు .
2.   6 ఏళ్ళ వయసులో                  మా అమ్మా , నాన్నలకు అన్నీ తెలుసు .
3.  12 ఏళ్ళ వయసులో                 మా అమ్మా , నాన్నలు మంచి వాళ్ళే , కాని కోపమెక్కువ .
4.  14 ఏళ్ళ వయసులో                 మా అమ్మా , నాన్నలు చిన్నప్పుడు మాతో బాగా వుండేవారు .
5.  16 ఏళ్ళ వయసులో                 మా అమ్మా , నాన్నలు ప్రతిదీ గుచ్చి గుచ్చి అడుగుతుంటారు .
6.  18 ఏళ్ళ వయసులో                 మా అమ్మా , నాన్నలని ఏదడిగినా వద్దంటారు , ఇప్పుడు కాదంటారు .
7.  20 ఏళ్ళ వయసులో                 మా వల్ల కావటం లేదు , ఒకళ్ళనొకళ్ళు ఎలా వేగుతున్నారో .
8.  30 ఏళ్ళ వయసులో                 మా పిల్లల అల్లరి భరించలేక పోతున్నాం . చిన్నప్పుడు మా అమ్మా ,  
                                                నాన్నలకు మేము ఎలా భయపడే వాళ్ళమో .
9.  40 ఏళ్ళ వయసులో                 మా అమ్మా , నాన్నలు మమ్మల్ని క్రమశిక్షణలో పెంచారు . మేమూ మా 
                                                పిల్లల్ని అలాగే పెంచాలి .
10. 50 ఏళ్ళ వయసులో                మనల్ని పెంచటం కొరకు మా అమ్మా , నాన్నలు ఎంత కష్ట పడ్డారో 
                                                ????? తలచుకొంటేనే  ఆశ్ఛర్యమేస్తుంది .
11. 60 ఏళ్ళ వయసులో                 మా అమ్మా నాన్నలు గొప్పవాళ్ళు .

తల్లి తండ్రులను అర్ధం చేసుకోవటానికి  వాళ్ళ పిల్లలకి  56 ఏళ్ళు పడ్తోంది అన్న మాట . 

అందుకే కాబోలు అంటుంటారు . 

అనుభవిస్తే గాని అర్ధం కాదని ,

తలనొప్పి తనదాకా వస్తేనే గాని అర్ధం కాదని ,

ఈ లోగా కొంతమంది తల్లితండ్రులు వాళ్ళను ఈ ప్రపంచాన్ని వదలి వెళ్ళి పోవచ్చు . ఇంకొంతమంది ఎదురుగా వున్నా అర్ధం చేసుకోలేక పోవచ్చు . బహు కొద్దిమంది మాత్రమే అర్ధం చేసుకో గలరేమో ? 

                                                                           *                *               *