కర్ణుని జన్మ వృత్తాంతం గురించి.....

 కర్ణుడి జన్మ వృత్తాతం గురించి ......

                                 వ్యాస రచన : శర్మ జి ఎస్ 


దూర్వాస మహాముని అంటేనే విపరీతమైన కోపం కలవాడు అని కదా ! 


అటువంటి దూర్వాస మహా ముని వారి వద్ద ఆయనకు పూజకు కావలసిన సామగ్రి తెచ్చి పెడుతూ వుండేది కుంతి అనే యువతి . 

అటువంటి ఆ మహాముని ఆ అమ్మాయి సేవలకు సంతోషించాడు . 

ఒకానొక రోజు అమ్మాయి నీకు ఒక మంత్రం యిస్తున్నాను . ఈ మంత్రం వల్ల నీకు పిల్లలు అవసరమైనపుడు ఉపయోగించుకో అని చెప్పారు . అలాగే స్వామి అంటూ యింటికి తిరుగు ముఖం పట్టింది . ఆ వెళ్ళే దారిలో ఆ అమ్మాయికి ఒక చిన్న సందేహం వచ్చింది . ఆ మంత్రం పని చేస్తుందా ? ఆ మంత్రానికి పిల్లలు కలుగుతారా అన్న సందేహం కలగడంతో , పరిశీలించి చూద్దాం. సత్యమో ? అసత్యమో తెలిసిపోతుంది గదా ! అని , వెంటనే అక్కడ పక్కనే వున్న కొలను లో కాళ్ళూ , చేతులు పరిశుభ్రం చేసుకొని , ఆ మంత్రాన్ని చదువుతూ మొదట సూర్యభగవానుడిని ప్రార్ధించింది . వెంటనే ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఆ సూర్యభగవానుడు ప్రత్యక్షమై , నీవు కోరినట్లు , నీకు పుత్రుడిని ప్రసాదిస్తున్నాను అని ఒక పిల్లవాడిని ( ఆ కుంతి చేతులలో పెట్టి ) ప్రసాదించి వెళ్ళిపోయాడు . 

కుంతి ఆశ్చర్య పోయింది , ఆనందం చెందింది . కొంత తడవుకు తను యింటికి వెళ్ళాలి అన్న విషయం జ్ఞప్తికి రాగానే , ఒక్కసారి చేతుల్లో వున్న పసిపిల్లవాడిని చూచి ఉలిక్కి పడ్డది . తనకు యింకా పెళ్ళి కాలేదు . ఈ పసి పిల్లవాడిని తీసుకొని తను ఎలా యింటికి వెళ్ళగలదు . వెళ్లలేదు కదా ఎక్కడ అయినా వదలిపెట్టి వెళ్ళాలి . అలా ఎలా వదలగలను అని అనుకొని , మళ్ళీ ఆ మంత్రం చదివి సూర్యభగవానుడిని ప్రార్ధించింది . 

ఆయన వెంటనే ప్రత్యక్షమై ఏమిటి ? అని అడగగా , తన పరిస్థితి వివరించింది . 

అప్పుడు ఆ సూర్యభగవానుడు " నేను మంత్ర బద్దుడను . ఏమీ చెయ్యలేను . ఆ మంత్రం చదివి ప్రార్థించే ముందే , నువ్వు యివన్నీ ఆలోచించు కోవాలి . ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం ఏమీ లేదు . వెనుకకు తీసుకోవడం జరగని పని . కాకుంటే నీ పరిస్థితిని వివరించావు గనుక , ప్రథమ తప్పిదం క్రింద మన్నించి , ఒక సలహా యిస్తాను . ఆ ప్రకారం చెయ్యి . ఆ పిల్లవాడిని నీటిలో వదలి వెయ్యి . ఆ పిల్లవాడిని ఏ పురుగూ పుట్రా , జలచరాలు , జంతువులు భక్షించకుండా అతనికి రక్షణగా సహజ కవచ కుండలాలు ఇవిగో , తీసుకో అని చెప్పి అంతర్ధానం అయి వెళ్ళి పోయారు . 

ఇక చేసేదేమీ లేక తన పేగు తెంచుకుని , పంచుకొని పుట్టకపోయినా బాధతో నీటిలో వదలి యింటికి వెళ్ళిపోయింది . ఇది కర్ణుడి జన్మ వృత్తాంతం . 


ఇప్పుడు ఈ కథ మహాభారతం లోనిది .

ఈ కథ లోని అంతరార్థం ఏ యుగం లోని మానవులకు అయినా ఉపయోగ పడుతుంది .  

అదెలాగంటే " పెళ్ళి కాని యువతులు కామంతో ( కోరికతో ) / తెలిసో /తెలియకో గాని ఆ కోరిక తీర్చుకుంటే , అందువల్ల ఆ యువతి గర్భం దాలిస్తే ఆ గర్భానికి కారణమైన యువకుడిది ( మగవాడిది ) కాదు తప్పు , ఆ యువతిదే . 

( అలాగని యువకులు గానీ , మగవారు కానీ ఆడపిల్లల మీద అటువంటి అపచారానికి గానీ / అత్యాచారానికి గానీ చేసే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు . చేస్తే కఠిన శిక్షలు అమలు చేస్తారు . )

ఏ యుగంలో అయినా కట్టుబాట్లను తప్పి ఎవ్వరూ నడచుకోకూడదు . అలా నడుచుకోవడం క్షమించరాని నేరం / తప్పు . కోరిక కోరబోయే ముందు , ముందు వెనుకలు ఆలోచించు కోవాలి . ఒక్క ఆ కోరిక మాత్రమే కాదు , ఏ కోరిక అయినా ముందు వెనుకలు ఆలోచించుకొని కోరుకోవాలి . అలా ఆలోచించకుండా కోరిక పుట్టగానే తీర్చుకుందామని ప్రయత్నాలు మొదలెడితే , వాటి ఫలితాలు అనుభవించి తీరవలసిందే . 

కనుక పెళ్ళి కాని యువతులు , యువకులతో / మగవారితో సంగమం చేయరాదు . అలా ఆ కట్టుబాటు తప్పి చేస్తే , దాని ఫలితం / శిక్ష ఆ యువతులకే , వారితో కలిసిన మగవారికి కాదు . కనుక యువతులు యిది తెలుసుకొని , నడుచుకోవాలి అని ._*

*_ఆ కాలానికి మాత్రమే అది కరెక్ట్ కాదు . ఈ / ఏ కాలానికి అయినా యిదే కరెక్ట్ అనే చెప్పబడ్డది మన హైందవ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం . 


                            **********

8 comments:

  1. మహాభారతంలోనిది అంటే సరిపోదు. మీరు చదవకుండా అన్నారు. భారతంలో ఎలా ఉందో ముందు చదవండి. ఊహాగానాలు భారతానికి ఆపాదించి వద్దు

    ReplyDelete
    Replies
    1. మహాభారతంలో ఏముందో చెప్పొచ్చుగా ఇలా చదువుకో అంటూ ఎకసెక్కాలాడక ?

      Delete
    2. మూలం చదవండి. తెలుగువివరణలతో సహా వ్యాసభారతం గోరఘ్ పూర్ గీతాప్రెస్ నుండి తెలుగులిపిలో లభిస్తోంది. ఎకసెక్కాలు ఆడటం వంటి పిచ్చిమాటలు మీ అపోహనుండి పుట్టినవి. గ్రహించగలరు.

      Delete
  2. ముందుగా చాలా ఏళ్ళ తర్వాత మీతో సంభాషించే అవకాశం నాకు లభ్యం అయింది ఈ రోజు . మీకు నమస్కారములు .
    ఇందులో మహాభారతాన్ని కించపరచలేదు . ఇంకొకటి వాటిలో గల అంతరార్థం ఎలా నేటి సమాజం తీసుకుంటే బాగుంటుందో అన్న విషయాన్ని యిందులో తెలియ చేశాను . అంతే గానీ వేరే ఎటువంటి దురుద్దేశం యిందులో లేదు .
    మీరు అపార్థం చేసుకున్నారని , యిప్పుడు యిలా అర్థం చేసుకొనమని సవినయంగా తెలియ పరుస్తున్నాను అండి .

    ReplyDelete
    Replies
    1. కర్ణజననవృత్తాంతం భారతంలో ఎట్లాగు ఉన్నది అన్న విషయం దయచేసి పరిశీలించండి. మీరు వ్రాసినది వేరుగా ఉన్నా భారతాన్ని కించపరచలేదు నిజమే. కాని మూలం పరిశీలించి వ్రాయటం మరింత సముచితంగా ఉంటుంది అని మాత్రమే నా సూచన. ఒక కథలోని అంతరార్ధం తరచిచూడటం మంచి ప్రయత్నమే కాని దానికోసం ముందుగా మూలాన్ని ఆశ్రయించాలి కాని కల్పితకథలను గ్రహించి వ్యాఖ్యానించుకోవటం వృథా అని నా ఉద్దేశం.

      Delete
    2. సరే అండి .

      Delete
  3. శర్మ గారూ,
    మీ సౌలభ్యం కోసం చెబుతున్న మాట. వ్యాసుల వారి మహాభారతం ఆదిపర్వంలో 110వ అధ్యాయం పేరు "కర్ణసంభవం". అది కేవలం నలభై శ్లోకాలు నిడివి గల వృత్తాంతం. వీలు చూచుకొని పరిశీలించండి.

    ReplyDelete
    Replies
    1. నమస్తే అండి . నేను వాస్తవంగా అందులోని అంతరార్థం మాత్రమే చెప్పాలనుకున్నాను నేటి సమాజానికి . అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది . అదేమిటంటే టైటిల్ అలా పెట్ట కూడదు " కర్ణుడి జన్మ వృత్తాంతం గురించి ......" అని కాకుండా అందులోని అంతరార్థం గురించి అని అర్థం అయ్యేటట్లుగా పెడితే బాగుండేది అండి .

      Delete