1 చెప్పుచేతల్లో పెరుగుతుంటే ,
జీవితం బహు భేషుగ్గా ఉన్నట్లే .
2 చెప్పు చేతుల్లోకి వచ్చిందంటే ,
కాళ్ళు మల మల మాడినట్లే .
3 రసాలకు ఓ సీజన్ అంటూ ఉంటుంది ,
సరసాలకు ఓ సీజన్ అంటూ ఉండదు .
4 శృంగారం బంగారం ధర్మపత్నితో ,
శృంగారం అంగారం పరపత్నితో .
5 రక్తి అనుభవించనిదే విరక్తి కలుగదు ,
ముక్తి లభించకుంటే విముక్తి దొరకదు .
6 ఇంగ్లీష్ వాళ్ళు రేప్ ని అత్యాచారానికి నిదర్శనంగా శాసించారు ,
తెలుగు వాళ్ళు రేపు ని భవిష్యత్తుకి బంగారు బాటగా భావించారు .
7 సద్గుణం కలకాలం ఉండాలని మెలమెల్లగా అలవడ్తుంది .
దుర్గుణం దొరికిందే ఛాన్సుగా తక్షణమే అంటుకుంటుంది .
8 మనం మొబైల్ని వాడుకుంటున్నట్లే ,
మనల్ని కొంతమంది వాడుకొంటుంటారు .
9 ఆడవారిని ఇంత అని చెప్పడం వల్లకాక ,
ఇంతి అని సింపుల్ గా చెప్పి వదిలేశారు .
10 ఆ నాడు ఉద్యోగం పురుష లక్షణం ,
ఈ నాడు ఉద్యోగం పౌరుష లక్షణం .
( మళ్ళీ కలుసుకొందాం )
**********
అస్తు! అస్తు!!
ReplyDeleteవాస్తవాలు చక్కగా చెప్పారు
ReplyDelete