దమ్ముండాల
రచన : శర్మ జీ ఎస్
ఒకవైపు హాలీవుడ్ , మరొకవైపు లాస్ ఏంజల్స్ , ఇండియా ఆంధ్రాలో సికింద్రాబాద్ , హైదరాబాద్ లలా . అటువంటి హాలీవుడ్ లోని యూనివర్సల్ స్టూడియో ఆవరణ అది . వీక్షించటానికి ప్రవేశ రుసుము ఒక మనిషికి 149 డాలర్లు ఫ్రంట్ లైన్ పాస్ ఇది . జనరల్ క్యూలో నుల్చోకుండా , గేట్ ఆ గుండా అనుమతిస్తారు . వి ఐ పి పాస్ అయితే 299 డాలర్లు , ఏ మాత్రం ఆలస్యం ఎక్కడా లేకుండా అనుమతిస్తారు . 89 డాలర్ల టికెట్ ఇంటర్నెట్ లో బుక్ చేస్తే 2 డేస్ అనుమతిస్తారు .
ఏ రోజు కా రోజు వాళ్ళు వీక్షింపజేసే ప్రదర్శనల వివరాలు అన్నీ ఏ రోజుకారోజు వివరంగా తెలియచేస్తుంటారు పాంప్లెట్ల రూపంలో . ఆ షెడ్యూలు ప్రకారం అన్నీ చూడవచ్చు . ఎక్కడా ఏ షోకి ఏమీ పే చేయనఖ్ఖర్లేదు .
ఏదైనా మనం తినాలనుకున్నా , కొనాలనుకున్నా , అన్నీ అక్కడే లభ్యమవుతాయి . మనం ఎక్కడ ఏ రైడ్ కి వెళ్ళి
నా , ఎక్కడ ఫొటో తీయించుకున్నా , అక్కడ వున్న ఫొటో ల్యాండ్ వాళ్ళు యిచ్చే ఆ కార్డు చూపించినా , లేకుంటే ఆ షో వివరాలు తెలియచేస్తే మన ఫొటొ , మనకు చూపిస్తారు . 8 క్ష్ 10 సైజ్ 24.95 డాలర్లు పే చెయ్యాలి . ల్యామినేషన్ తో కావాలనుకుంటే మరో 5 డాలర్లు పే చేయాలి . వద్దంటే వాళ్ళేమి యిబ్బంది పెట్టరు .
ఆ జురాసిక్ పార్క్ రైడ్ కి 3.50 కి వెళ్ళి 4.30 షోకి లైనులో నుల్చొన్నాం . ఇక్కడ ఏది చూడాలన్నా ( ఫ్రీగా చూపి
స్తున్నా ) పేద్ద పేద్ద క్యూలు ( తిరుపతి , షిర్డి ఆలయాలను ) ఙ్నప్తికి తెస్తాయి . అలా క్యూలో నుల్చొని 40 నిముషా
లకు రైడ్కి వెళ్ళే బోటులో కూర్చొన్నాము . 3 వ వరుసలో ఆఖరున నేను , నా పక్కన నా శ్రీమతి కూర్చున్నాము .
సహజంగా బోట్ లో ముందు వరుసలో కూర్చొంటే , మనం తడిసే అవకాశాలు , ఝడిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . సావకాశంగా ఆనందించే వీలు ఉంటుంది .
అందరికీ కామన్ గా ఒక సేఫ్టీ మెజర్మెంటుగా అర్ధ చంద్రాకారంగా వున్నదానిని మా కాళ్ళ ముందుకు వంచారు . ఈ జురాసిక్ పార్క్ రైడ్లకు సెంట్రల్ కంట్రోల్ ఆఫీస్ అక్కడే సపరేట్ గా వుంటుంది . వాళ్ళే బటన్ నొక్కుతారు . ఈ బోటు నీళ్ళలోనే చైన్ సిష్టంలో నడుస్తుంది జస్ట్ లైక్ ట్రైన్ . మా బోట్ బయలుదేరింది . అలా పైకి ఎక్కి క్రిందకు దభాలున దిగి , ఎడమవైపుగా తిరిగింది , అక్కడ మూసి వున్న గేటు దానంతట అదే తెరుచుకున్నది . మరలా అలా ముందుకు వెళ్తుంటే , ఎడమవైపు పేద్ద డైనోసారా మన బోట్ మీదకు వంగి మనలని పట్టుకొంటుందేమోనన్న భయం కలిగించి , ఆ పక్కనే వున్న ఓ కొమ్మను కొరికి , నములుతూ నీళ్ళు మనమీదకు చల్లుతుంది . ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మరల ఇంకా కొన్ని డైనోసారాలు , పిల్లలు , నడివయసువి మీదకు వస్తున్నట్లుగా , తొంగి చూస్తున్నట్లుగా మిడకు వస్తున్నట్లు వుంటాయి . మరికొంచెం ముందుకు వెళ్ళి ఎడమవైపు ఉన్న కొండచరియ క్రిందగా వెళ్ళి ముందుకు వెళ్తుండగా , కుడివైపున పైనుంచి ఆ జురాసిక్ పార్క్ సినిమాలో చెడిపోయిన కారు , పడ్తుంది క్రిందకు , మనమీద పడ్తుందేమో అన్న భయం కలిగిస్తుంది . అది దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే , కొండ గుహలోంచి పైకి వెళ్తుంది . అలా వెళ్ళేటప్పుడు వేగాన్ని అందుకుంటుంది . అదెలా వుంటుందంటే క్రిందనుంచి సరాసరి ఆకాశం వైపు వెళ్తున్నట్లుగా వుంటుంది . ఒక్కసారి అందరి గుండెలు జారుతుండగా , పై నుంచి ఓ డైనోసారా మీదకు దూకుతుంది.
అంతదాకా చీకటిగా వున్న ఆ ప్రదేశం కాంతులు వెదజల్లుతుంటుంది . ఇక భయ పడటం మన వంతు అవుతుంది . అలా ఎంతసేపో వుండదు , ఆ డైనోసారాకు అందకుండగా గభాలున క్రిందకు దించి కుడివైపుగా వెళ్తుంది బోట్ . ఇంకొంచెం ముందుకు రాగానే 5 , 6 డైనోసారాలు మనమీదకు వచ్చే ప్రయత్నం చేస్తుంటాయి . భయం గుప్పెటలో దాక్కొని ఉంటాము . ఎక్కడా ఆగదు ఈ బోటు . హమ్మయ్య తప్పించుకున్నాం లే అనుకొంటుండగా , మరల పైకి తీసుకెళ్తాడు , పైనుంచి అతి పెద్ద డైనోసారా మనమీదకు దూకుతుంది మనం ఊహించం కూడా . ఎలాగైనా ఈ గండం నుంచి బయట పడ్తే బాగుండు అన్న ఆలోచన మనకు కలిగే లోపల , మనల్ని తప్పించటానికి చేసే ప్రయత్నం అన్నట్లుగా ఒక్క సారి అంత ఎత్తునుంచి క్రిందకు ఎత్తి పడేస్తాడు . అక్కడనుంచి ఆ బోట్ మామూలు స్థాయికి రావటంలో ఆక్కడ వున్న నీళ్ళు పైకెగురుతాయి , గుండె జారి గల్లంతైంది అని అనుకోకుండా వుండలేము . బ్రతుకు జీవుడా అని బైటకు వచ్చేస్తాము ఆ బోట్ రైడ్ నుంచి .
నిజానికి ఈ రైడ్ యింత యిదిగా వుంటుందని ముందుగా తెలిసుంటే , మాలాంటి వాళ్ళు వెళ్ళరు అనుకొంటాను నేను . వాస్తవానికి అక్కడ కొన్ని నియమ నిబంధనలను సూచించే బోర్డు వుంటుంది ఈ రైడ్స్ కి . అది నేను మొదట చూడలేదు . గుండె జబ్బులవాళ్ళు , హై బీ పి , లో బీ పి వాళ్ళు , బ్యాక్ పెయిన్ , నడుము నొప్పులు వున్నవాళ్ళు , గర్భవతులు , విరోచనాలతో , వాంతులతో బాధపడ్తున్నవాళ్ళు , సర్జరీ చేయించుకున్నవాళ్ళు , 4 అడుగుల ఎత్తు లోపు చిన్న పిల్లలు , ఈ రైడ్స్ చేయకూడదని , ఒక వేళ వారి ఉత్సాహంతో వారు చేస్తే , ఆ తర్వాత ఎదురయ్యే సమస్యలకు మాకెటువంటి సంబంధం లేదని వివరంగా లిఖించబడి , ప్రకటించబడి వుంటుంది ప్రతి రైడ్ వద్ద .
ఇది వయసువాళ్ళకు , తట్టుకునేవాళ్ళకు ఓ గొప్ప థ్రిల్ . అనుమానమేమీ లేదు .
డబ్బులొక్కటే చాలదు , అసలు దమ్ముండాల , అపుడే గుండె దిటవుగా వుంటుంది . ఆ దమ్మే ఇలాంటి రైడ్స్ కి
అసలు సిసలు గుండె బలం .
అసలు సిసలు గుండె బలం .
**************
దమ్ము లేదండి ఆయ్! :)
ReplyDeleteడబ్బులుంటే చాలదు , డబ్బులతో అన్నీ సాధించలేము అని చెప్పటమే జరిగిందండి
Delete