మోతాదు మించితే
రచన : శర్మ జీ ఎస్
ఏవైనా అలవాట్లు అధికమై , వాటి వల్ల మన జీవితాలు అస్తవ్యస్తమైపోతున్నప్పుడు అవే అలవాట్లు వ్యసనాలుగ నామకరణం చేయించుకోబడ్డాయి . అలా చేయబడినవే ఈ సప్త వ్యసనాలు .
అవే జూదము , మాంస భక్షణము , సురాపానము ( మత్తు మందులు సేవించుట ) వేశ్యా సంగమం , వేట ( జీవహింస ) పర స్త్రీ లోలత్వము లు .
ఈ కాలంలో దాదాపుగా అందరూ ఈ (సప్త ) వ్యసనాలనే వాటిని అధికంగా అనుభవిస్తూ బాగా వున్న వాళ్ళని మనం నిత్యం సమాజంలో చూస్తూనే వున్నాము . కనుక వీటిని వ్యసనాలుగా మనం చెప్పుకోకూడదు యిపుడు . దీనిని బట్టి మనము అర్ధం చేసుకోవలసినది ఏమిటంటే , మనసు బలహీనమైనవారికి మాత్రమే వ్యసనాలుగ మిగిలి
పోతున్నాయని .
ఈ వ్యసనాలనేవి ఆయా దేశకాలమాన పరిస్థితులను బట్టి నిర్ణయించబడ్డాయే తప్ప అవి స్థిరమైనవి కాదని అర్ధం చేసుకోవాలి .
అయితే పైన మన పూర్వీకులు చెప్పినట్లుగా ఆ సప్తవ్యసనాల వల్ల మాత్రమే కాదు జీవితాలు నాశనమయ్యేది .
సృష్టి ఆరంభం నుంచి , ఈ జీవుల నుంచే మరల మరల జీవుల సృష్టి జరుగుతుండటం వలన , ఆ జీవులకుండే శక్తి క్రమక్రమంగా క్షీణించిపోతుంది . అదే సమయంలో కొన్ని గుణాలు ఈ శక్తిహీనమైన జీవుల మీద అధిక ప్రభావం చూపడంతో , క్రమేపీ ఆ మామూలు గుణాలు కూడా దుర్వ్యసనాలుగ దర్శనమీయటం ప్రారంభించాయి . అందు
వలన , క్రమేపీ చిన్న చిన్న విషయాలకు అలవాటు పడి , వాటిలోనే మునిగి తేలుతుండటం వలన ఈ వ్యసనాల సంఖ్య అధికమవుతూ వచ్చింది .
ఈ వ్యసనాల సంఖ్య 7 వద్దనే ఆగక , అలా అలా నానాటికీ అధికమైపోతున్నది . ఈ అలవాట్లు మనకిచ్చే ఫలి
తాల్ని బట్టి అవి సదలవాట్లా , దురలవాట్లా అన్నది నిర్ణయించబడ్తుంది .
మంచివై కొనసాగిస్తే జీవితం హాయిగా గడచిపోతుంది ఎవరికైనా .
చెడు గుణాలు కొనసాగిస్తే జీవితం భారమై దుర్భరమై పోతుంది ఎవరికైనా .
మోతాదు మించకుండా వున్నంతవరకు ఏవైన అలవాట్లుగ వుండిపోతాయి . ఈ అలవాట్లే ( చిన్నవైన / పెద్దవైన ) . మోతాదు మించితే వ్యసనాలుగ మారి విశ్వరూపంతో స్వైరవిహారం చేసేస్తాయి , వున్నపళాన పండంటి జీవితాల్ని పనికిమాలిన జీవితాలుగ నిరూపిస్తాయి .
కనుక అలవాట్లను వ్యసనాలుగ మార్చకుండా , వాటికి బానిసలు కాకుండా తగు జాగ్రత్తలో మనమున్నట్లైతే మన జీవితాలు , మనలను నమ్ముకున్నవారి జీవితాలు హ్యాపీగా , సాఫీగా సాగిపోతాయి .
********

No comments:
Post a Comment