రచన : శర్మ జీ ఎస్
( మఱి కొన్ని , మఱి కొన్నాళ్ళలో )
1 . రాతను మార్చేది ఎవరో , కాని
వ్రాతను సరిదిద్దుకోవలసినది మాత్రం మనమే .
2. చెప్పు చేతిలోకి రాకూడదు ,
చెప్పు చేతల్లో ఉంటే చాలు .
3. శాసనాలు కలకాలం ఉంటాయి ,
వాసనలు క్షణకాలమే ఉంటాయి .
4 . నడక బాగున్నంత మాత్రాన సరిపోదు ,
నడత బాగుంటే ఎక్కడైనా మెప్పు పొందగలం .
5 . ఓర్పుని ఎదుటివాళ్ళలో చూడాలనుకొంటుంటారు ,
నేర్పు మాత్రం తమలోనే చూడమంటుంటారు .
6 . ఒకరికి ఆ మూల ఈశాన్యంగా భావిస్తారు ,
ఆ ముందువాళ్ళకు అదే మూల వాయవ్యం .
7 . ఒకరు ఆ మూలని నైఋతిగా భావిస్తారు ,
అదే మూలని అటు వాళ్ళు ఆగ్నేయంగా భావిస్తారు .
8 . శాస్త్రాలు మన ముందు తరాల వాళ్ళ అనుభవ సారాలు ,
నేడు అవసరానికి వాడుకొనే అత్యంతోత్సాహ అస్త్రాలు .
9 . మార్పు ఎదుటివారిలో రావాలని కోరుకొంటుంటారు ,
అదే మార్పు తమలో రావాలంటే మాత్రం తట్టుకోలేరు .
10 . ఒకరు ఓ పని చేస్తే తప్పుగా పరిగణిస్తారు ,
అదే పని వారు చేస్తే ఒప్పుగా , బహు గొప్పగా భావిస్తారు .
( మఱి కొన్ని , మఱి కొన్నాళ్ళలో )