ఎదురీత

                                                                                                                              కధా రచన : శర్మ జీ ఎస్

భారతమ్మ కి ఐదవతనం లేదన్న బాధతో పాటు , వారసులు లేరే అన్న బాధ తోడైంది . ఐశ్వర్యానికే లోటు లేదు , భర్త పోతూ పోతూ స్థిర , చరాస్తులన్నీ ఆమె పేరే వ్రాసేశాడు .

ఒక్కగానొక్క కొడుకు రాహుల్ , కోడలు రూప . రూప రూపవతే , చదువుకున్న పిల్ల , ఉన్నత కుటుంబాన్నించి వచ్చినా , చాలా సాదా సీదాగా ఉంటుంది . దంపతులై రెండేళ్ళైనా ఇంకా రూప గర్భాన ఓ వంశాంకురం ఉదయించలేదన్నదే ఆమెకు దిగులు .

ఇన్నాళ్ళు కనలేదంటే ఫామిలీ ప్లానింగ్ అనుసరిస్తున్నారేమోనని అనుకున్నది . తీరా కోడలి నడిగితే

"   అటువంటిదేమి లేదండి అత్తయ్యగారు, మాకూ పిల్లల్ని కనాలనే ఉంది "   అని బదులిచ్చింది రూప .

"   మఱి మన ఫామిలీ డాక్టర్ని కలిసి చెకప్ చేయించుకోకపోయారా "   అని సలహా యిచ్చింది .

"   డాక్టరు గారిని కలిసి పరీక్షలు చేయించుకొన్నాము . ఇద్దరిలో ఏ లోపం లేదు , ఎప్పుడైనా కనవచ్చు "   అన్నారు .

"   మఱి యింకేమిటాలస్యం ? "

"   ఆలస్యం మా వైపునుంచి ఏమీ లేదు , ఆ టైం యింకా వచ్చినట్లు లేదు "   అన్నది .

"    నువ్వు చెప్తున్నది నిజమేనా ? "   అన్నది భారతమ్మ .

"   నిజమేనడి అత్తయ్యగారు . ఆయన గారు కూడా ఆలోచిస్తున్నారు "   అన్నది రూప .

"    పోనీ వేరే ఫేమస్ డాక్టర్ల వద్ద చెకప్ చేయించుకోండి "   అన్నది భారతమ్మ .

"   అలాగే చెప్తానండి ఆయన గారికి "    .

రాహుల్ , రూప లు పేరుమోసిన ప్రముఖ డాక్టర్ల వద్దకు టెస్ట్ ల కు వెళ్ళారు . అన్ని టెస్త్ లు చేసిన మీదట
"   మీరిరువురూ పిల్లల్ని కనే సామర్ధ్యం కలిగి ఉన్నారు . మీదే ఆలస్యం "   అని సర్టిఫై చేశారు .

అదే విషయాన్ని తల్లి భారతమ్మకు చెప్పాడు .

"   సంతోషం రాహుల్ మంచి వార్త చెప్పావు , యింక అటు వైపుగా నడక సాగించండి . "   అన్నది.

"   అలాగేనమ్మా "   అన్నాడు .

ఆరు మాసాలైనా ఆ ఛాయలేమీ కనపడక పోవటంతో జ్యోతిష్య శాస్త్రవేత్త జానకిరామయ్యగారికి కబురు చేసింది భారతమ్మ .

"   రండి జానకిరామయ్యగారు రండి , కూర్చోండి "   అన్నది భారతమ్మ .

"   ఏమిటమ్మా విశేషం ? "   అడిగాడు .

"    మీకు తెలియకుండా విశేషాలేముంటాయి ? ఆ విశేషం గురించి మాట్లాడాలనే మిమ్మల్ని పిలిపించాను " అన్నది .

"    సెలవీయండమ్మా "

"   ఈ యింటికి వారసులు కావాలి , నా కొడుకు , కోడలు ఎంతోమంది ప్రముఖ డాక్టర్లని కలిశారు , వాళ్ళలో ఏ లోపం లేదు , ఆ అర్హత  వారికి స్వతహాగా ఉన్నది , ఏ వైద్యం అవసరం లేదు , ఎప్పుడైనా ఆ అవకాశం రావచ్చు అన్నారు . కాని నాలుగేళ్ళు వెళ్ళిపోయాయి . ఆ ఊసే లేదు . ఒక మారు మీరు జాతకాలు చూసి ఎప్పుడు ఆ శుభఘడియలు వస్తాయో తెలియచేస్తారని పిలిచాను "   అన్నది .

"   తప్పకుండానమ్మా . ఇరువురి జాతకాలు యివ్వండి , చూసి సెలవిస్తాను అన్నాడు జానకి రామయ్య  .

"   మా రాహుల్ జాతకం యిదివఱకే చూశారుగా "   అన్నది .

"   ఇదివఱకు చూసినా , యిప్పుడు మళ్ళీ చూడాలి , దేనికంటే ,మీ రాహుల్ జాతకంతో , మీ కోడలు జాతకం కలిపి వచ్చే మిశ్రమ ఫలితాలే  మీ వంశ వారసుల జాడలు తెలియచేస్తాయి  ".

"    అలాగా ! ,ఇవిగోనండి శాస్త్రుల్లు గారు "   అంటూ అందజేసింది భారతమ్మ .

జాతకాలని అందుకున్న జానకిరామయ్య రెండు జాతకాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట "   అమ్మగారు వీరిరువురికీ సంతానయోగం బాగానే వుందమ్మా , అందులో ఏ మాత్రం సందేహం లేదు , కాకుంటే వివాహమైన 11 సంవత్సరాలకి గాని ఆ యోగం ఫలించదు "   సెలవిచ్చాడు .

"   అయితే యిప్పుడు లేదంటారా ?"   అన్నది భారతమ్మ .

"   అవునమ్మా , ఈ లోగా మీరెంత ప్రయత్నించినా ఆ యోగం లభించదు "  .

"  వేరే మార్గాలేమైనా ఉన్నాయా ? "

"   ఏ మార్గాలైనా ఆ 11 సంవత్సరాలు పూర్తి కాకుండా ఏ ఫలితాన్నీయలేవు , వృధా ప్రయాస తప్ప ".

"   సర్లేండి శాస్త్రుల్లుగారు "

జానకిరామయ్య శాస్త్రుల్లు గారు వెళ్ళిపోయారు . భారతమ్మకేమి చేయాలో పాలుపోలేదు . వాళ్ళత్తగారు అన్నమాట గుర్తొచ్చి , "   ఒరేయ్ రాహుల్ జ్యోతిష్య శాస్త్రవేత్త జానకిరామయ్యగారు యిలా అన్నారు "   అన్నది .

"   అమ్మా నేను జ్యోతిష్యాన్ని నమ్మను , రాళ్ళను నమ్మను ,నిన్ను నమ్ముతాను , నా శక్తిని  నమ్ముతాను " అన్నాడు .

"   సరేరా నన్ను నమ్ముతానంటున్నావుగా , ఓ పని చేయి నామాట విని పుణ్య క్షేత్రాలు తిరిగి రండిరా మీ యిరువురు , అప్పుడైనా ఆ దేవుడికి మనపై కరుణ వస్తుందేమో ? "   అన్నది భారతమ్మ .

"   పుణ్య క్షేత్రాలు తిరిగే వయసు కాదు , అంత సమయము లేదమ్మా నాకు , వీలు కుదిరితే తప్పక వెళ్ళొస్తా నీ మీద గౌరవంతో "   అన్నాడు .

"   వీలు కుదిరితే కాదు రాహుల్ , వీలు చేసుకో , యిది మన వంశానికి సంబంధించినది "  .

                                                                                                    *         *        *        *

"   అమ్మా నీవెన్ని చెప్పినా నేనంగీకరించను , అనుసరించను . డాక్టర్లని నమ్ముతాను , ఏ లోపం  లేదన్నారు మా యిరువురిలో . పిల్లల్ని కనటానికి కావలసిన అర్హతలన్ని మా యిరువురికి ఉన్నాయని వ్రాత పూర్వకంగా యిచ్చారు " .

"   వ్రాత పూర్వకంగా యిచ్చి వుండవచ్చు , నేను తప్పనను . కాని మన నుదుటి వ్రాతలు మాత్రం జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనకు తెలియబడ్తాయి . మనకు శాస్త్రాలే ఆధారాలు, అనుసరణలు . నువ్వు నమ్మినా , నమ్మకున్నా నేను అనుసరిస్తాను "   అన్నది.

"   నీ యిష్టం , నేను మాత్రం నమ్మను . ఇంకా ఏడేళ్ళు అఖ్ఖర్లేదు , ఏడు మాసాలు చాలు నిన్ను నానమ్మని చేయటానికి ."

భారతమ్మ ప్రోద్బలంతో వీలు చేసుకొని చాలా పుణ్యక్షేత్రాలను దర్శించారు రాహుల్ రూపలు .
       
                                                                                                   *      *     *     *      *

ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న భారతమ్మకి రూప గర్భవతి అయిందని తెలియగానే అమిత ఆనందాన్ని పొందింది . రాహుల్ ఆనందానికి అంతులేదు . రూపని అపురూపంగా చూసుకొంటున్నారు .ఫామిలీ డాక్టర్ పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నది మెడిసిన్స్ తో పాటు .

భారతమ్మ మనసులో జానకిరామయ్య గారు చెప్పిన సమయానికే అపురూప గర్భవతి అయిందని అర్ధం చేసుకున్నది . జానకిరామయ్య గారిని ఓ మారు రమ్మని కబురంపింది.

జాతకాలు క్షుణ్ణంగా పరిశిలించిన మీదట "   అమ్మగారు వారసుడే వస్తున్నాడు , అందుకు సందేహమేమీ లేదు . అయితే ..... "

"   జానకిరామయ్య గారు , రాక రాక యిన్నాళ్ళకు ఈ యింటికి వంశాంకురం వస్తుంటే మళ్ళీ ఆ అయితే ... ఏమిటండి  ? "   అన్నది కంగారుగా .

"   భయపడవలసిన పనేమి లేదమ్మా , కాకుంటే నార్మల్ డెలివరీ మాత్రం కాదు , సిజేరియన్  ".

"   ఆ విషయం డాక్టరు గారు చెప్పలేదే , పైగా నార్మల్ డెలివరీ అని ,అన్నీ సక్రమంగా వున్నాయని అన్నారే "  .

"   డాక్టరు చెప్పినా , చెప్పకపోయినా జరిగేది జరుగక మానదు , నార్మల్ డెలివరీ మాత్రం కానే కాదు , సిజేరియన్ , అది కూడా పెద్దదే "   అన్నాడు .

"   మఱి తల్లీ , బిడ్డా క్షేమంగా వుంటారా "    అన్నది .

"    ఆ విషయంలో సందేహించాల్సిన అవసరం లేదు . ఇలాంటి వాస్తవాలని వెల్లడించిన సమయంలో , శాస్త్రాల్ని నమ్మకుండా ,తూలనాడుతుండటం వలన , కొంతమంది జ్యోతిష్కులు తమ బ్రతుకు బరువు కాకుండా వుండేటందులకు ,ఆ శాస్త్రాన్ని తమ బ్రతుకుకి తెరువుగా ఉపయోగించుకుని లేనిది చెప్పటం వలన ,  ఆ శాస్త్రాల్ని ఎవ్వరూ నమ్మని పరిస్థితి వచ్చేసింది . ఫలితంగా శాస్త్రం మీద సమాజంలో నమ్మకం తగ్గిపోయింది . ఆ వచ్చే వారసుడి నక్షత్రం దోషభూయిష్టమైనది . అందులకు గ్రహాలకు శాంతులు , హోమాలు చేయించవలసి వుంటుంది .
ఇంక నే వెళ్ళొస్తానమ్మా "   అన్నాడు .

"   అలాగాండి  ! సరే మా చిరంజీవితో సంభాషించి మీకు మళ్ళీ కబురు చేస్తాను "   అన్నది .

                                                                                                         *      *      *       *

"   ఒరేయ్ రాహుల్ పుట్టబోయే శిశువు దోషనక్షత్రంలో జన్మిస్తాడని , నార్మల్ డెలివరీ కాదని , సిజేరియన్ అని అది కూడా పెద్దదేనని సెలవిచ్చారురా జానకిరామయ్య గారు . డాక్టరు గారేమంటున్నార్రా "   అడిగింది భారతమ్మ .

"   అమ్మా నార్మల్ డెలివరీ అనే చెప్పారు , సందేహమేమీ లేదు "   అన్నాడు .

"   ఎంతమందో డాక్టర్లు మీలో ఏ లోపమూ లేదన్నారు , వెంటనే సంతానం కంటారని చెప్పారు . ఈ 11 ఏళ్ళ కాలంలో మీరెన్నో గుళ్ళు , గోపురాలు చుట్తి  వచ్చారు , పూజలు పునస్కారాలు చేశారు , కాని మీకు సంతాన ప్రాప్తి కలగ లేదు . శాస్త్రుల్లుగారు చెప్పినట్లు రూప ఇప్పటికి గర్భవతి అయింది కదా ! నాకెందుకనో జానకిరామయ్య గారి మాటలు నిజమనిపిస్తున్నాయిరా ."

"   అంతగా నమ్మకం నీకుంటే ఓ పని చేద్దామా ? "   అన్నాడు .

"   ఏం చేద్దాం ? "   అడిగింది భారతమ్మ .

"   మానవుడు గ్రహాల మీద పట్టు బిగిస్తున్న ఈ రోజుల్లో , పిల్లల్ని వెంటనే కనాలా ? వద్దా ? లేక కొంచెం ఆలస్యంగానా ! అన్నది తనే డిసైడ్ చేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు , ఆ పిల్లల్ని మంచి నక్షత్రంలో కనేటట్లుగా ప్లాన్ చేసుకోవటం పెద్ద కష్టమేమీ కాదుగా . ఎటూ సిజేరియన్ పెద్దదే అన్నారు కదా ! అందులోనూ దోష నక్షత్రం అన్నారు కనుక , పంచాంగాలలో శిశుజననము ఆపరేషనులకు మంచి సమయములు అని వివరంగా తెలియచేస్తున్నారు . అందులో మనం ఓ పండిత బ్రాహ్మణుడిని అడిగి మంచి నక్షత్రం చూసుకొని ఆ పెద్ద ఆపరేషన్ చేయించేద్దాం , అప్పుడింక బాధే ఉండదుగా "   అన్నాడు .

"   ఈ ఆలోచన బాగానే ఉందిరా , అలాగే చేద్దాం "   అన్నది భారతమ్మ .

"    అమ్మా మంచి నక్షత్రం చూసి ఫైనల్ చేస్తే , డాక్టరు గారితో సంప్రతించి పెద్దాపరేషనుకు తేదీ ఫిక్స్ చేస్తాను " అన్నాడు .

                                                                                                              *     *     *     *

"   అమ్మా  పండిత బ్రహ్మ గారు చెప్పినట్లుగా డాక్టరుగారు పెద్దాపరేషనుకి టైం ఫిక్స్ చేశారు ఉదయం 10 గంటలకు "   అన్నాడు.

"   ఆ మంచి నక్షత్రం ఎంతవఱకు ఉందో  అన్నీ జాగ్రత్తగా చూడరా . ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని ఆలస్యం చేయకుండా ఎర్లీగా బయలు దేరితే చాలా మంచిది  "   అన్నది .

"   అలాగేనమ్మా , అందుకే ఉదయం 8 గంటలకే ప్లాన్ చేశాను . డాక్టరు గారు కూడా కరెక్ట్గా 1 గంట ముందే ధీయెటర్లో ఉంటానన్నారు . నేను 8 గంటలకే రూపతో బయలుదేరతాను . అన్నీ అరేంజ్ చేశాను , నువ్వేమీ కంగారుపడక , చిరంజీవి మనం అనుకున్నట్లు మంచి నక్షత్రంలోనే జన్మిస్తాడు "   .

"   సంతోషం క్షేమంగా వెళ్ళి లాభంగా రాండి  "   అన్నది .

రూపని తీసుకొని యిన్నోవాలో  బయలుదేరాడు . థీయెటర్ కి కాల్ చేసి అన్నీ సిధ్ధం చేశారో లేదో యింక్వైరీ చేస్తున్నాడు డ్రైవింగ్ చేస్తూనే . జే ఎన్ టీ యు చేరేసరికి తెలంగాణా యిష్యూ ఫైనల్ చేయకుండా మళ్ళీ మళ్ళీ పోష్ట్ పోన్ చేసే దిశగా స్టేట్మెంట్ కేంద్రం జారీ చేసిందని , అప్పటికప్పుడు రాస్తా రోకో నిర్వహిస్తుండటంతో ట్రాఫిక్ టెరిఫిక్ గా నిల్చిపోయింది . రంగా యిన్నోవా మధ్యలో వుండిపోయింది , ఆతృత పెరిగింది , అటూ యిటూ దిక్కులు చూస్తున్నాడు , ఎటైనా వెళ్ళే అవకాశాలేమైనా ఉన్నాయోనని . ఏ మార్గం కనపడలేదు .ఇంతలో తన ఇన్నోవాకు పక్కగా తెలంగాణా ఐకాస అద్యక్షుడు కోదండరాం వెళ్ళటం గమనించిన  రాహుల్ "   కోదండరాం గారు , నమస్తే  ఒక్క క్షణం డెలివరీ కేసిది , మా ఆవిడని అర్జెంట్ గా  పెద్దాపరేషన్ కొఱకు హాస్పిటల్ కి తీసుకువెళ్తున్నాను , కొంచెం
దారి యిప్పించండి , ప్లీజ్ "  అని రెక్వెష్ట్ చేశాడు .

వెంటనే "   ఈ యిన్నోవాకు దారిచ్చి పంపండి "   అనౌన్స్ చేశాడు మైకులో . అది వినగానేభారంగా "   హమ్మయ్య  " నిట్టూర్పుతో కూడిన శ్వాసల నడుమ యిన్నోవా స్టీరింగ్ స్టార్ట్ చేశాడు . "   కోదండరాం గారు అర్ధం చేసుకున్నందులకు థాంక్స్ "    చెప్పి దూసుకు వెళ్ళిపోయాడు .

ఆ సరికే 9 గంటలు దాటింది . హాస్పిటల్ కి చేరుకొనే సమయం లోపల ధీయెటర్లోని అరేంజ్మెంట్స్ చేసి , స్ట్రెచర్ తిసుకొని రమ్మని సలహా యిచ్చాడు . సరిగ్గా 9.45 అయింది ,  వెంటనే ధీయెటరుకి తీసుకు వెళ్ళారు . డాక్టరుగారు రెడీగా ఉండటంతో హాపీగా ఫీలయ్యాడు  రాహుల్, రూపతో కలసి .అనుకున్న ప్రకారం ఆపరేషన్ 10 గంటలకే ఆరంభమైంది .  ఆపరేషన్ పెద్దది కావటం వలన గంటన్నర టైం పడ్తుందని ముందుగానే డాక్టర్ తెలియ
చేయటంతో బయటే నిరీక్షిస్తున్నాడు .

ధీయెటర్ లోపల ఆపరేషన్ జరుగుతున్నది , 45 నిముషాలు  గడిచాయి . ఎప్పటికప్పుడు ఎలాగుందో , ఎంతవఱకు వచ్చిందో అక్కడి సిష్టర్స్ ని అడిగి తెలుసుకుంటున్నాడు , వాళ్ళమ్మకు  తెలియచేస్తున్నాడు , ఆమె టెన్షన్ పడకుండా ఉండేందుకు .

సడెన్ గా లోపలనుంచి ఓ స్ట్రెచర్ బైటకు తీసుకు వస్తున్నారు కంగారుగా సిష్టర్స్

" ఏమైంది " అడిగాడు .

"   మీ డాక్టర్ గారు  మెలికలు తిరుగుతూ ఆపరేషన్ ధీయెటర్లోనే సడెన్ గా పడిపోయారు ,పరీక్ష చేస్తే 24 గంటల కడుపునొప్పి అని కంఫర్మ్ అయింది , అందుకే అర్జెంట్ గా ధీయెటరుకి తీసుకు వెళ్తున్నాం "   బదులిస్తూనే నడుస్తున్నారు మర్~ఓ ఆపరేషన్ ధీయెటరుకి .

"   మఱి మా ఆవిడ ఆపరేషన్........? "   కంగారుగా .

"   కంగారు పడకండి , వేరే ఫేమస్ డాక్టరు గారిని పిలిచాము . వస్తున్నారు , హి యీజ్ ఆన్ ద వే ."

"   టైం 11 గంటలు దాటింది , ఎంతసేపట్లో వస్తారు ? "

"   ట్రాఫిక్ లేకుంటే ఓ గంటలో వచ్చేస్తారు , ఈ ఆపరేషన్ ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు . ప్లీజ్ ఓపిక పట్టండి , మాకూ తెలుసుగా "   అని బదులిచ్చారు .

చేసేది ఏమీ లేక రాహుల్ టెన్షన్ పడటం , ఎదురు చూడటం తప్ప .

ఎదురుగా గడియారం 12 గంటలు దాటింది , డాక్టరు గారినుంచి కాల్ వచ్చింది రెసెప్షన్ కి .

ఆశగా "   ఎప్పుడొస్తారు డాక్టరు గారు "    అడిగాడు రాహుల్ .

"   ట్రాఫిక్ లో ఉన్నారుట , ఆ తెలంగాణా వాళ్ళ రాలీ అక్కడుందట , ఇంకో గంటో , గంటన్నరో పట్టవచ్చు అన్నారు "    అన్నది రెసెప్షనిష్ట్ .

"   అంత టైమా ? అంటే 2 గంటలు దాటుతుందిగదా ! ఈ లోపలే ఆపరేషన్ పూర్తి చెయ్యాలి "

"   ఆ విషయం నాకు తెలియదండి "    అన్నది రెసెప్షనిష్ట్.

"   ఇలా అయితే ఎలా ? "

"   మీ డాక్టరు గారికి ఇలా అవుతుందని ఎవరికి తెలియదు కదా ! కొన్ని కొన్ని అనుకోకుండా వచ్చినప్పుడు ఎవరు మటుకు ఏం చేస్తారు వెయిట్ చేయటం తప్ప "   బదులిచ్చింది రెసెప్షనిష్ట్ .

3 గంటలు కావస్తుండగా డాక్టరు గారు కారు దిగి హడావుడిగా ధీయెటరు లోనికి వెళ్ళారు .మఱో 45 మినిట్స్ గడిచిన తర్వాత , సిష్టర్ బైటకు వచ్చి "   రాహుల్ గారు , మీకు మగశిశువు , తల్లీ ,బిడ్డ క్షేమంగా ఉన్నారు "   చెప్పి లోనకు వెళ్ళింది .

ఆ వార్త విన్న రాహుల్ కి ఆనందం కంటే దిగులే కలిగింది .

భారతమ్మ కాల్ కి బదులుగా , దిగాలుగా "    అమ్మా 4 గంటల 15 నిముషాలకు మగ శిసువుని ప్రసవించింది , తల్లీ ,బిడ్డ క్షేమమే "   అని కట్ చేశాడు .

వెంటనే "   జానకిరామయ్య గారు మా రూప మగశిశువుని ప్రసవించింది  సాయంత్రం 4-15 కి . మఱి నక్షత్రం చూసి , ఏమేమి  శాంతులు , ఎలా చేయాలో చూసి సెలవియ్యండి రేపు "   అన్నది భారతమ్మ .

"   అలాగేనమ్మగారు . జ్యోతిష్య శాస్త్రం ఎన్నటికీ తప్పు కాదు . శాస్త్రాలు వ్రాసింది మనుషులే  . అంత మాత్రాన తేలికగా తీసిపారెయ్యకూడదు .  ఎన్నో తరాల మానవుల అనుభవాలని ఆకళింపు చేసుకొని వ్రాసినవే కాని , పుక్కిటి పురాణాలు కాదు అని ముందు తరాల వారికి , మన ముందు యుగాల వారు తెలియచేశారు  . ఏదైనా శాస్త్రం అంటే పంచభూతాలతో యిమిడి వుంటుందన్నది మనం మఱచి పోకూడదు . మన శరీరం పంచభూతాలతో సృష్టించబడ్డది . కనుక ఆ పంచభూతాల ప్రభావం ఎప్పుడూ మనపై ఉంటుందన్నది మనకి ఎఱుకలో వుండాలి  . ఏటికి ఎదురీదాలనుకోవటం ఎప్పటికీ తప్పే అవుతుంది  "  అని సెలవిచ్చారు జానకిరామయ్య గారు .


                                                                                         *  స  *  మా  *  ప్తం  *             

అంతర్జాలం


                                                                                                                                        రచన : శర్మ జీ ఎస్

పెద్దలు చెప్ప(లే )నివి , చెప్పకూడనివివి , అతి సులువుగా చెప్పేస్తుంది , సారీ చూపించేస్తుంది . మాటవరుసకు వయసు పద్దెనిమిదా ? అడుగుతుందే గాని  , పద్దెనిమిది అనగానే , పద పదమంటూ పరుగులు తీయిస్తుంది . ఉరకలు వేయిస్తుంది , నురగలు కక్కిస్తుంది . మంచి , చెడుల రెంటినీ , సమంగా చూపిస్తుంది , అందుకొనే వాళ్ళ మానసిక ఔన్నత్యాన్ని బట్టే అంటుంది . పెడత్రోవలో పడితే దాని తప్పు కాదు సరి కదా !  , దారి చూపే మార్గదర్శ
కుడు కాన రాడు , ఆదుకొనే నాధుడు ఉండనే ఉండడు .

అటువంటప్పుడు దానిని చూడటమే ఎందుకు ? అన్న సందేహం కలగవచ్చు . ఆ సందేహ నివృత్తే ఈ దిగువ యిస్తున్నా . 

ఇలా చూపించటం తప్పు కాదా అనిపించవచ్చు . తప్పు కానే కాదు ఎలా చూసినా .

కొద్ది కాలం జీవించే మనం , మన పసిపిల్లల అన్నప్రాసన సమయంలో  , కత్తి , కలం , వెండిగిన్నెలో కొంచెం పాయసం  , బంగారం , పుస్తకం , ధనం లాంటివన్నీ అక్కడ వుంచుతాం . మన పిల్లవాడు పారాడుకొంటూ వెళ్ళి ఏది ముట్టుకుంటే అందులో ( వాడి భవిష్యత్తులో ) ప్రావీణ్యత సంపాదించుకొంటాడన్న భావనతో అలా అన్నీ అక్కడ ఏర్పరుస్తాము .

మనకు తెలుసు కత్తి ముట్టుకొంటే హంతకుడని , కలం ముట్టుకుంటే కవి అని , వెండిగిన్నె ముట్టుకొంటే గొప్ప తిండిబోతు అని , బంగారం ముట్టుకొంటే ఐశ్వర్యవంతుడని , ధనం ముట్టుకొంటే ఆ ధనం మీద వ్యామోహితుడని , ధనాన్ని బాగా కూడబెడ్తాడని , ధనలక్ష్మిని తనింట్లోనే వుండిపొమ్మంటాడని , ధనదాసుడైన అతనిని , ధనబాసుగా భావిస్తారని , ఇలా రకరకాలుగా భావిస్తూ అవన్నీ ఏర్పాటు చేస్తాం .

అభం , శుభం తెలియని పసిపాపల ముందు ఇలా ఏర్పరచటం వాస్తవానికి యిలా చేయటం తప్పుకదా ! 

ఆ పసిపాపలకేమి తెలుసు ఏది ఏమిటి ? ఎలా దాని ప్రభావం వాళ్ళ మీద చూపిస్తుందని . ఆ పసిపాపలు ఏది కనపడినా తీసుకొంటుంటారు , ఆ వెంటనే నోట్లో పెట్టేసుకొంటారు . ఇది తెలిసిన పెద్దలమైన మనమే ( అలా ఏర్పాటు చేయటం తప్పని తెలిసినా )  తెలియని వాళ్ళలా అలా అక్కడ పెట్టి అత్యంతుత్సాహంతో కళ్ళప్పగించి చూస్తుంటాము కదా !

కలకాల శక్తి కూడా యిలాగే ఈ జీవరాసుల ముందు మంచి చెడు గుణాలను వదలి , ఏది ఏ జీవరాసి తీసుకొని ఎలా
తన జీవనాన్ని గడుపుతుందో  వాటి ఆలోచనాసరళికే వదిలేస్తుంది .

ఈ స్థితిలో "   బుధ్ధిః కర్మానుసారిణి "   అన్నది వర్తించుకోవచ్చు .

అలాగే ఈ అంతర్జాలం కూడా ఆ కలకాల శక్తిలా ఇలా మంచీ చెడులను మన ముందుంచుతున్నది . కనుక తప్పు కాదని ఒప్పుకొందాం సరేనా మరి .


                                                                       ************
  

వైద్యో నారాయణో హరిః

                                                                                                                                కధా రచన : శర్మ జీ ఎస్



రాజ్యలక్షమ్మ మెట్రిక్యులేషన్ పాసయింది .  రంగారావు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఈ యిరువురూ ఆలు మగలు .
వీరిద్దరు , వీరికిద్దరూ ఆడపిల్లలే  మీనా , వసంతలు .

రాజ్యలక్షమ్మ మనసు కి తఱచూ నొప్పి కలుగుతుండేది. కానీ ఏ డాక్టరుకి చూపించుకోవటానికి ముందుకు రాలేదు .
ఎందుకంటే డాక్టర్లు దేహాలతోనే వైద్య శిక్షణ పొందుతారు కదా , మనసులతో కాదు గదా అని. ఓ వేళ మనశాస్త్రాన్ని చదివినడాక్టర్లకి చూపించుకోవచ్చు గదా అనవచ్చు. ఆ సైకాలజీ వైద్యులు , మనసు పక్కదోవలు పడ్తుంటే , దానిని లైన్ లో పెట్టగలరేమోగాని , ఆ మనసుకి కలిగే నొప్పిని తగ్గించలేరు అన్న ధృఢ నమ్మకంతో వుండటమే అసలైన ముఖ్య కారణం . ఈ విషయాన్నిఎవరికీ తెలియకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నది .

అలా తఱచూ మనసుకి కలుగుతున్న నొప్పి ,  రిపీట్ అవుతూ , ఓ స్థాయిలో  గుండెకి ఎటాక్ అయింది. దానినే ఆంగ్ల భాషలో హార్ట్ ఎటాక్ అంటారు .

ఈ విషయం  రంగారావుకి తెలియగానే , హుటాహుటిన ,ఫ్యామిలీ డాక్టరు వద్దకు తీసుకువెళ్ళి చూపించాడు. తక్షణమే ఆసుపత్రిలో జాయిన్ చేసి వైద్యం  ప్రారంభించారు.

నాలుగు రోజులు గడిచాక , నార్మల్ కి వచ్చ్చిన తర్వాత డిశ్ఛార్జ్ చేశారు. ఇంటికి చేరుకొన్నది రాజ్యలక్షమ్మ.

"   వదినా! యిప్పుడెలా ఉన్నది ? ఆసలు ఏమైంది నీకు ? ఎందుకిలా వచ్చింది ? ఈ విషయం విని నేనెంతగా కంగారు పడ్డానో తెలుసా ? అసలు ఇంట్లో ఉండబుధ్ధి కాలేదు. వెంటనే యిక్కడకొచ్చేశాను. ఆసుపత్రికొచ్చి నాకు చేతనయిన సాయం చేద్దామనుకొంటే గౌరి అన్నది , ఎవర్నీ రానీయటం లేదని. ఏం చేస్తాను , నీ కొఱకు పడిగాపులు కాస్తూ, ఎప్పుడొస్తావో అని ,  ఇక్కడే యిలాగే కూర్చుండిపోయాను "   అంటూ తన ప్రేమని చూపించింది ఆడబిడ్డ రంగనాయకి .

రాజ్యలక్షమ్మ మాత్రం సైగలతోనే తనకు ఫరవాలేదని చెప్పింది.

"   హమ్మయ్య మంచిమాట విన్నాను. అమ్మాయ్ మీనా అమ్మకు , నాకు , మీ నాన్నకు కాఫీ కలిపి తీసుకురా " అన్నది ఆడబిడ్డ .

తనకు కాఫీ వద్దని సైగ చేసింది రాజ్యలక్షమ్మ .

"   అమ్మకు వద్దట, నాకు , మీ నాన్నకు తీసుకురా ,  ఆ చేత్తోనే మా పిల్లలకు పాలు పట్టుకు రావే " అన్నది ఆడబిడ్డ .

మారు మాట్లాడక , రెండు కాఫీ గ్లాసుల్లో  తీసుకు వచ్చ్చి యిచ్చ్చి , " పిల్లలకు యిపుడే తెస్తానత్తయ్యా " అన్నది మీనా .

" ఏరా అన్నాయ్ , ఆ కాఫీ తాగరా. వదినెకి తగ్గిందిగా, యింకా బెంగెందుకు ? పైగా యింటికి కూడా వచ్చిందిగా . ఓ నెల రోజుల్లో నార్మల్ కి వస్తుందన్నారుగా , నేను రోజూ వచ్చి చూస్తుంటాగా "   అంటూ ధైర్యం చెప్పింది .

                                                                                   
                                                                                                           *         *          *

పదిరోజులు గడిచాయో లేదో , మఱలా రాజ్యలక్షమ్మ గుండె ఎటాక్ అవటంతో , ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
ఇది రెండవసారి గనుక , డాక్టరుకి ట్రీట్మెంట్ చేయటంలో ఆలస్యం జరుగలేదు. వారం రోజులు గడిచిన పిమ్మట డిశ్ఛార్జ్చేస్తూ, "    చూడండి రంగారావు గారు , హార్ట్ ఎటాక్ రెండుమార్లు వచ్చినా ఫ్రవాలేదు , మూడవమారు వస్తే , మేమే మాత్రం భరోసాయివ్వలేం . కనుక పేషంటుకి పెయిన్ కలగకుండా, వీలైనంత విశ్రాంతినిస్తూ, ప్రశాంతతని కూడ కలిగించాలి . పేషంటు ఎక్కువ ఆలోచించకూడదు రణగొణ ధ్వనులు వినకూడదు . ఉద్వేగం కలిగించే విషయాలకు , ముఖ్యంగా మన తెలుగు టీ వీ సీరియల్స్ కు చాలా దూరంగా  వుంచాలి. గలభాలకు , కొట్లాటలకు కూడా దూరంగా వుంచాలి .  మీరు ఈ విషయంలో చాలా శ్రధ్ధ తీసుకోవాలి "

రంగారావు మనసు ఎంతగానో బాధపడినా , తన రాజ్యం తనకు దక్కుతున్నందుకు సంతోషిస్తూ "   అలాగేనండి " అని బదులిచ్చాడు.

రాజ్యలక్షమ్మను తీసుకొని ఇంటికి చేరుకున్నాడు .

వదినని చూసిన రంగనాయకి, "   వదినా వచ్చావా ? యిప్పుడెలా వున్నది ? నీకు మఱలా హార్ట్ ఎటాక్ వచ్చిందంటే , నా మనసు ఎంతగా మధనపడిందో తెలుసా ? అయ్యో యింత మంచి వదినెకు ఈ యిబ్బందులేమిటా ? ఆని విపరీతంగా ఆలోచిస్తున్నాను . ఆసుపత్రికి వద్దామా అంటే, ఏ రోజుకా రోజు నువ్వు  డిశ్ఛార్జ్  అయి వస్తావని  అమ్మాయిలు అంటుంటే, యిక్కడే ఉండిపోయాను , మా ఆయన్ని కూడా యిటే రమ్మన్నాలే ".

"   ఫరవాలేదమ్మాయ్, యిప్పుడే కదా ఆసుపత్రినుంచి వచ్చింది. ముందు దాన్ని విశ్రాంతి తీసుకోనియ్ "   అంటూ , రాజ్యం "   యిదిగో ఈ బెడ్ మీద మెల్లగా నడుం వాల్చు .  డాక్టరు గారు మఱీ మఱీ చెప్పారు ఏ విషయాలు పట్టించుకోవద్దని "  అంటూ బెడ్ వైపు నడిపించాడు రంగారావు .

"   వదినా అలా బెడ్ మీద ఎంతసేపు  ఒక్కదానివి పడుకొంటావు ? బోర్ కొట్టకుండా , నేను రోజూ వస్తాలే "   ఆన్నది రంగనాయకి .

"   అయితే అత్తయ్యా నీకు కూడా ఆ పక్కనే మరో బెడ్ వేయించమంటావా ? "   ఆన్నది  కోపాన్ని ఆపుకోలేక  మీనా .

"   నాకెందుకే బెడ్ , యిదిగో ఈ కుర్చీ సరిపోతుందిలే . ఇందులో కూర్చొని కబుర్లు చెప్తాలే "   అన్నది .

"   అంత అవసరం లేదులే అత్తయ్యా , మామయ్య రాగానే మీరు బయలుదేరి వెళ్ళండి . మఱల అడుగడుక్కి రాకండి అన్నది మీనా .

"   రాకుంటే, వదినకెలా ఉందోనన్న ఆందోళన ఎక్కువవుతుంది నాలో , అపుడు నేను ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. ఆది నాకిష్టం లేదే , అందుకని నేనే వస్తుంటా రోజూ " .

"   వద్దు అత్తయ్యా , నేను ఎప్పటికప్పుడు అమ్మ ఆరోగ్యవిషయాలు తెలియచేస్తుంటాగా "   అన్నది మీనా .

"   ఎందుకే , ప్రక్క బజారులోనే గా నే ఉండేది, నేను రాకుంటే , నా మనసుకి స్థిరం వుండదు ".

"   వద్దులే అత్తయ్య , అమ్మనొక్కదాన్నే అలా విశ్రాంతి తీసుకోనివ్వండి , మీరు రాకండి " .

"    అదేమిటే , పెద్దదానినని చూడకుండా , యిలా ముఖం మీద అనేస్తున్నావ్ . ఏరా అన్నాయ్ , నువ్వైనా చెప్పరా దానికి పెద్దవాళ్ళని అలా అనకూడదని "  .

రంగారావు వినీ విననట్లు పక్కకెళ్ళిపోయాడు.

"   ఏం చెప్పకుండా అలా వెళ్ళిపోతావేమిటీరా అన్నాయ్ "   అన్నది .

"   చెప్పటానికేముంది , డాక్టరు గారు  మీ వదినను కంప్లీట్ గా విశ్రాంతి తీసుకోమన్నారు . కనుక మనం ఎవరం కదిలించి యిబ్బంది పెట్టకూడదు "   అన్నాడు రంగారావు .

                                                                                                               *       *        *

ఎవరెంత వద్దంటున్నా , రంగనాయకి  వాళ్ళ అన్నయ్య యింటికి రోజూ వస్తూనే వున్నది , తన ధోరణి ఏ మాత్రం మార్చుకోలేదు .తన పిల్లలు కూడా స్కూల్ నుంచి యిటే వచ్చి , తండ్రి వచ్చేదాకా అక్కడే ఆడుకుంటూ , హోం వర్ఖ్ అతి కష్టం మీద పూర్తి చేసుకుని , డిన్నర్ పూర్తి చేసుకొని వెళ్తున్నారు. మీనా , వసంతలకు చాకిరి తప్పలేదు , రాజ్యలక్షమ్మకి ఈ రగడ తప్పలేదు . ఆన్నా ప్రయోజనం లేక అనుభవిస్తున్నారు .

పట్టుమని పదిరోజులైనా గడవక ముందే , మఱల రాజ్యలక్షమ్మకి హార్ట్ పెయిన్ కలగగా , డాక్టరు వద్దకు తీసుకెళ్ళాడు రంగారావు .

డాక్టరు  గారు వెంటనే ఐ సీ యు లో కి తీసుకెళ్ళారు రాజ్యలక్షమ్మను . రంగారావు వెలుపల వెయిట్ చేస్తున్నాడు .

ఓ గంట గడిచిన తర్వాత , డాక్టరు గారు  రంగారావుని  లోపలకి పంపించమని సిష్టర్ కి చెప్పారు .

డాక్టరు గారేం చెబుతారోనని రంగారావులో ఖంగారెక్కువైంది . కళ్ళవెంట వస్తున్న  కన్నీళ్ళను ఆపుకొంటూనే , మీనా వసంతలకు ధైర్యం చెప్పి లోపలకి వెళ్ళాడు .

"   నమస్కారం సార్ " .

"   రండి రంగారావు గారు , కూర్చోండి  . పోయినసారే మీకు చెప్పాను. హార్ట్ ఎటాక్ మూడవ సారి రానే రాకూడదు , వస్తే మేమేమీ భరోసా యీయలేమని "   అంటుండగానే ,

"   అలా అనకండి డాక్టరు గారు , ఎలాగైనా నా రాజ్యాన్ని నాకు దక్కించండి , మీ కాళ్ళు పట్టుకుంటాను "   అంటూ కాళ్ళు పట్టుకొని  భోరున ఏడుస్తున్నాడు.

"   ఏడవకండి , మీ చేతుల్లో వున్నది  మీరు చేస్తే , మా చేతుల్లో వున్నది మేం చేయగలం  ".

"   మీరన్నది నిజమే డాక్టరు గారు , ఎలాగైనా నా రాజ్యాన్ని రక్షించండి "   మొఱ పెట్టుకుంటున్నాడు రంగారావు .

"   రోగాన్ని గుర్తించి రోగికి మందులు యివ్వగలిగినవాళ్ళమే మేం . ఆ మందులతో పాటు , రోగి మీద ఎక్కువగా చుట్టుప్రక్కల పరిసరాలు పని చేస్తాయి . ఇలా అంటున్నందుకు మీరేమి అన్యధా భావించకండి . విశ్రాంతిలో ఎక్కువగా శాంతి లభ్యమవుతుంది . అందుకే రోగులకి ఎక్కువగా మేము విశ్రాంతినే ప్రిఫర్ చేస్తుంటాము . ఆ విశ్రాంతి హాయి నిస్తుందే గాని అశాంతిని కలుగచేయదు . మీ ఆవిడకి హార్ట్ ఎటాక్  యిలా అడుగడుగుకి రావటనికి కారణం , మీ యింటి వాతావరణమే . మనసు పదే పదే గాయపడితే , గుండెకు తాకుతుంది . ఆ గుండెతట్టుకోలేనపుడు డిసీజ్ గా మారుతుంది . ఒకటి , రెండు సార్లు మా డాక్టర్ల ట్రీట్మెంట్ ద్వారా సర్దుకొంటుంది . మూడవ సారి వస్తే యిక అది
మా మాటా కూడా ఖాతరు చేయదు . అప్పుడే మా ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుంది .  కనుక , మీ యింటి వాతావరణం మార్చగలిగితే , మరోమారు హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకొంటే చాలా మంచిది ."

"   తప్పకుండా డాక్టరుగారు , ఈ క్షణం నుంచి నా యింటి వాతావరణాన్ని మార్చుకుంటాను . ఎలాగైనా మీరు నా రాజ్యాన్ని కాపాడండి ప్లీజ్ ,  ' వైద్యో నారాయణో హరిః ' అంటారు . మీరే మా దైవం "   బ్రతిమలాడుకుంటున్నాడు రంగారావు .

"   మేము మా శాయశక్తులా ప్రయత్నిస్తాం "   అన్నాడు డాక్టర్ .

రంగారావు మనసు కుదుట పడింది . మీనా , వసంతల భుజాల మీద చేయి వేసి దగ్గఱకు తీసుకొన్నాడు.
                                   
                                                                                                          *         *         *

రంగారావు  యింటికి చేరుకొనేసరికి , రంగనాయకి ,  పిల్లలు హాయిగా సోఫాలో కూర్చొని , యాపిల్స్, కమలాలు , బత్తాయిలు సెంటర్టేబుల్  మీద పెట్టుకొని కోసుకొని ఆరగిస్తున్నారు.  రంగారావుని చూడగానే , సోఫా వెనక కొన్ని, చీరకొంగు వెనక కొన్నిసర్ది , ఆ కొంగుతోనే కళ్ళు తుడుచుకొంటూ , " అన్నయ్యా ! వదినెకెలా ఉన్నది ? ఎంత బాధపద్తున్నామో , ఎప్పుడొస్తుంది ? ఇంకా  ఎన్నాళ్ళుండాలన్నారు ? అంటూ , అమ్మాయి గౌరి మంచినీళ్ళు పట్టుకురామ్మా "   అన్నది .

రంగారావు కోపాన్ని అణచుకోలేక , "   ఏమిటే నీ కపటప్రేమ . మీ వదినెకు నెల తిరగకుండానే 3 మార్లు హార్ట్ ఎటాక్ అయ్యిందటే , దానికి కారణం నువ్వేనే .  ఆరోగ్యం బాగా లేదు , విశ్రాంతి తీసుకోమని చెప్పారు  ,  కొన్నాళ్ళు రావద్దే  అన్నా , వినకుండా , నువ్వొచ్చింది కాక , నీ పిల్లలను చేర్చుకొని ఉదయం నుంచి రాత్రిదాకా యిక్కడే తిష్ట వేసుక్కూర్చొని , అడుగడుక్కి కాఫీ , ఫలహారాలు అడుగుతుంటే అందించలేక  నా పిల్లలు బాధపడ్తున్నా , నీ కెక్కడా రవంతైనా తప్పనిపించటంలేదు .
ఇన్నాళ్ళూ నా సొమ్మంతా , మీ చదువులకి, పెళ్ళిళ్ళకి వెచ్చించాను , నా పిల్లల బాగోగులను కూడా కాదన్నా . నా రాజ్యం గాని , నా పిల్లలు గాని ఏ నాడూ నోఱు తెఱచి అడగలేదు . అది మా చాతకానితనంగా భావించి ,  యింత నీచంగా ప్రవర్తిస్తున్నావు . తక్షణమే , బైటకు వెళ్ళిపో, మఱల నా యింటి గడప త్రొక్కవద్దు , నీకూ , మాకూ ఈ క్షణంతో ఋణానుబంధం తీరిపోయిందనుకుంటున్నా "   అని స్వయంగా తనే బయటకు పంపించాడు .

వసంతకి రంగారావు లో కోపాన్ని చూడటం ఇదే ప్రధమం .

రాజ్యలక్షమ్మ  డిశ్ఛార్జ్  అయ్యి యింటికి తిరిగి వచ్చేసింది . ఇంటి వాతావరణం నిశ్శబ్దంగా ఉండటం ఎంతో కొంతైనా నూతన ఉత్తేజాన్ని పొందినట్లుగా ఫీలయింది.

 ( వాస్తవానికి హార్ట్ ఎటాక్ 3 మార్లు వస్తే చరిత్రలో బ్రతకటమనేది , లేదన్నది వైద్య శాస్త్రంలోనే లేదు.  మఱి 3 మార్లు వచ్చిన రాజ్యలక్ష్మి ఎలా బ్రతికిందన్న సందేహం అందఱికి వచ్చి తీరుతుంది. నిజ్జంగా 3 వ మారు హర్త్ ఎటాక్ కాలేదు . తెలిసిన డాక్టరు కావటం వలన యింటి విషయాలన్నీ వివరించి , తెలివిగా భర్త మీదకు ఎటాక్ చేసిందిలా , భర్తలో మార్పు రావాలని  యిలా చిన్న నాటకమాడింది .  తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది . )
 
                                     
                                                                                      *     స      *     మా     *     ప్తం      *

అటు ఏడు ఇటు ఏడు

                                                                                                                                      రచన : శర్మ జీ ఎస్ 

పెళ్ళిళ్ళు చేయటానికి అటు ఏడు తరాలు , ఇటు ఏడు తరాలు చూసేవాళ్ళు మా పెద్దవాళ్ళు . ఇపుడేమిటి , ఇలా చూస్తున్నారు , అలా  చేసేసుకుంటున్నారు అని మా బామ్మ అంటుండేది . ఆ మాట వినగానే నాకు ఆశ్ఛర్యం అనిపించింది .

"   అదేమిటి బామ్మా ? అలా అంటావేమిటి ? ఏం చూసేవాళ్ళేంటి ? "   అడిగాను .

"   ఔనురా  "   పెళ్ళి అంటే నూరేళ్ళ పంట "   అని ఓ మహా కవి అని ఎలుగెత్తి పాడించాడు . వినలేదా ? "

"  విన్నాను బామ్మా ? చాలా విన సొంపుగా వుంది . పెళ్ళి జరిగే విధానాన్ని చక్కగా తెలియజేశారు .వినసొంపుగా వుండాలంటే ఏ మాటైనా సంగీతపరంగా రాగయుక్తంగా ఆలాపిస్తే బాగానే వుంటుంది . "

"   ఇప్పుడు మనకు కావలసింది అది కాదు . పెళ్ళి అంటే నూరేళ్ళ పంట అంటే ఏమిటి ? అని . "

"   నువ్వు చెప్పు బామ్మా , నేను వింటాను . తెలుసుకోవాలనిచాలా కుతూహలంగా వున్నది . "

"   పెళ్ళి చేసేటప్పుడు గాని / చేసుకొనేటప్పుడు గాని / చేయవలసివచ్చినప్పుడు గాని చాలా చాలా ముఖ్యమైన విషయాలు చూడవలసి వున్నది . దాని మీదే భవిష్యత్తు బంగారుబాట అయ్యే అవకాశం వుంటుందిరా . 

పెళ్ళికూతురి వైపు వాళ్ళు పరిశీలించాల్సినవి .
1 . వాళ్ళ వంశం వాళ్ళకు ఆడవాళ్ళను గౌరవించే అలవాటు వున్నదా ?
2 . వాళ్ళ వంశంలోని మగవాళ్ళు ఆడవాళ్ళకంటే ముందే టపా కట్టేస్తారా ? అప్పుడు ఆ యింటి భారం ఈ అమ్మాయిమీద పడ్తుంది కనుక .
3 . వాళ్ళకు వంశాభివృధ్ధి తప్ప ఆరోగ్యవృధ్ధి చూసుకొనే అలవాట్లు ఉన్నాయా ? లేదా ?
4 . వాళ్ళు వాళ్ళ యింటికి సంబంధం కలుపుకొని తెచ్చుకుంటున్న అమ్మాయిని చాకిరీ తగ్గించి సుఖపెడ్తారా ? లేదా ?
5 . వాళ్ళు మనమ్మాయి చేత ఉద్యోగం చేయించి డబ్బులు కూడబెట్టుకోవాలనుకుంటున్నారా ?
6 . వాళ్ళు అవసరాలకు ఖర్చు పెడ్తారా , లేక ఎందుకులే అని వదిలేస్తారా ?

పెళ్ళికొడుకు వైపు వాళ్ళు పరిశీలించాల్సినవి .
1 . ఆ కోడలుగా అడుగిడబోయే అమ్మాయి గుణ గణాలే వాళ్ళ వంశ వారసులకు ప్రధానమైన విషయం గనుక              పరిశిలించాల్సిందే .అవే ముందు తరాల వారసులకు వారసత్వమౌతూ కొనసాగుతాయి .
2 . ఆ అమ్మాయి పెద్దలను గౌరవిస్తుందా ? లేక మొగుడిని మాత్రమే గౌరవిస్తుందా ?
3 . ఆ అమ్మాయి చదివిన చదువు తన సంసారాన్ని ( అవసరమైతే ) సరిదిద్దుకోగలదా ?
4 . ఆ అమ్మాయికి తన స్వేఛ్ఛ ముఖ్యమా ? లేక ఆ ఇంటిలోని నలుగురి శ్రేయస్సు ముఖ్యమా ?
5 . ఆ అమ్మాయి మన వంశప్రతిష్టలకు భంగం కలగకుండా నడుచుకోగల నడవడిక గలదేనా ?
6 . ఆ అమ్మాయి తన పిల్లలని ( వంశ వారసులను ) చక్కగా పెంచగలదా ? ( కొంతమందికి పిల్లను కనటం యిష్టం   లేదనుకునే వాళ్ళను దృష్టిలో పెట్టుకొనవలసి వస్తోంది ) .నక్షత్రాలను , రాశులను , లగ్నములను  చూసి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు . "

"   ఇవేంటి బామ్మా . నక్షత్రాలేమో ఆకాశంలో వుంటాయి . మనమేమో భూమ్మీద వుంటాము . వాటిని మనం చూడటమేమిటి ? అవి మనల్ని కాపాడటమేమిటి ? అంతా అయోమయంగా వుంది బామ్మా . "

"   ఈ ప్రపంచంలో ఏదైనా తెలియకముందు , అంతా అయోమయంగానే వుంటుంది . తెలుసుకున్న తర్వాత  , యింతేనా ? అని మన మనసు తేలిక పడ్తుంది . ఇక ఆపై  దాన్ని వుపయోగించాలనే తహ తహ అధికమౌతుంటుంది . "

"   అదేమిటో వివరంగా చెప్పు బామ్మా . "

"   చెప్తా శ్రధ్ధగా విను . వినటమే కాదు ,ఆలోచించి ఆచరణలో పెట్టాలి మంచిది అనిపిస్తే , అర్ధమైందా ? "

"   అలాగే బామ్మా , మా మంచి కోరి చెప్తున్నప్పుడుమీ పెద్దల మాట తప్పకుండా వింటాము . "

"    ఈ భూమండలం , నక్షత్ర మండలాల  చుట్టూరా  చుట్టి వస్తుంటుంది . ఆ నక్షత్ర మండలాల ప్రభావం ఈ భూమండలం మీద పడ్తూనే వుంటుంది . ఈ విషయాన్ని మన పూర్వీకులు ( ముందు తరాల వారు ) ఎన్నో పరిశోధనలు చేసి , ఎంతో మంది జీవితాలను కూడా పరిశీలించి ఇటువంటి మంచి విషయాలను ఎన్నిటినో కనుక్కొని , రాబోయే తరాల వాళ్ళకు కానుకగా యిచ్చి , మార్గదర్శకులయ్యారు .
నిజానికి ఈ నాడు మనం చేస్తున్నవన్నీ , మనమేమీ కొత్తగా ఏమీ చేయటం లేదు . మనం చేస్తున్నవన్నీ మన పూర్వీకులు చేసినవే . కాకుంటే విషయం అదే గాని , విధానమే మారుతుంది . కనుక మనవి ఎంగిలి బతుకులే . దీనికే  మనం ఏదో కొత్తగా , కనుక్కున్నామని , చేస్తున్నామని , మనం లేకపోతే ఈ ప్రపంచానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని విఱ్ఱవీగుతుంటాము . ఇది చాలా పెద్ద పొఱపాటు .

ఇక అసలు విషయానికి వస్తున్నా ( నక్షత్రాలు , రాశులు , లగ్నములు  ) . 
నక్షత్రాలు 27 , ఒక్కొక్క నక్షత్రానికి  పాదాలు 4 , 27 x 4  = 108 పాదాలు . వాటిని చూసే ఈ రాశులు 12 , ఈ నక్షత్రాలకు అధిపతులుగా  , అంటే ఈ 108 పాదాలుగల నక్షత్రాలను పరిపాలిస్తుంటాయి .
అంటే ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి . ఆ 27 నక్షత్రాలు 12 రాశుల అధీనంలో ఉంటాయి . ఈ రాశుల గుణ గణాలను కూలంకషంగా పరిశీలించిన మీదట అవి ఏ గుణం కలవో , ఏ గణం కోవకు చెందినదో నిర్ణయిస్తారు .
ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాలి , గుణం అంటే బుధ్ధికి సంబంధించినది . గణం అంటే అంశకు సంబంధించినది .

1 . మేషం  ( అశ్వని 4 పాదాలు  దేవగణం  , భరణి 4 పాదాలు మనుష్యగణం . & కృతిత్తిక 1 వ పాదం రాక్షసగణం . ) = మేక అంటే ఈ రాశికి సంబంధించిన నక్షత్రాల పాదాలలో సాధుగుణం గలిగి , మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు .

2 . వృషభం ( కృత్తిక 2,3,4 పాదములు రాక్షసగణం  , రోహిణి 4 పాదములు మనుష్యగణం & మృగశిర 1 , 2  పాదములు దేవగణం   = ఎద్దు , మొరటుగ వుండి బండ చాకిరీ చేయటానికి ఏ మాత్రం వెనుకాడరన్నది తెలుస్తోంది .

3 . మిధునం ( మృగశిర 3,4 పాదములు దేవగణం  , ఆరుద్ర 4 పాదములు మనుష్యగణం , పునర్వసు 1,2,3 పాదములు దేవగణం  ) = అంటే దాంపత్య కలయిక . కామ గుణాన్ని చక్కగా ఆనందించాలనుకునే మనస్తత్వం కలవారు .

4 . కర్కాటకం ( పునర్వసు 4 వ పాదము దేవగణం  , పుష్యమి 4 పాదములు దేవగణం , ఆశ్లేష 4 పాదములు రాక్షసగణం ) = ( ఎండ్రకాయ ) అవకాశం కొరకు ఎదురుచూస్తూ , వచ్చినప్పుడు వదులుకోకుండా గట్టి పట్టు పట్టే స్వభావం గలవారు .

5 . సింహం ( మఖ 4 పాదములు రాక్షసగణం , పుబ్బ 4 పాదములు మనుష్యగణం , ఉత్తర 1 వ పాదం మనుష్యగణం ) =  సింహంలా కనపడ్తూ , అధికారాన్ని వినియోగించుకుంటుంటారు .

6 . కన్య ( ఉత్తర 2,3,4 పాదములు , హస్త 4 పాదములు  దేవగణం  & చిత్త 1, 2 పాదములు రాక్షసగణం ) = కన్యలా సంతోషంగా జీవిస్తారు ఎవరికీ తలవంచకుండా ) .

7 . తుల ( చిత్త 3,4 పాదములు రాక్షసగణం , స్వాతి 4 పాదములు  దేవగణం & విశాఖ 1,2,3 పాదములు రాక్షసగణం ) = వస్తువులను తూనిక వేయాల్సి వచ్చినప్పుడు త్రాసు ( కాటా ) ని తీసుకొని తూస్తాము ఎటూ మొగ్గు చూపకుండా . అలాగే వీళ్ళు బ్యాలెన్స్ డ్ గా వుంటారు .

8 . వృశ్చికం ( విశాఖ 4 వ పాదము రాక్షసగణం , అనూరాధ 4 పాదములు  దేవగణం & జ్యేష్ట 4 పాదములు రాక్షసగణం ) = తేలు , ఇది తనని ఎవరూ ఏమీ చేయకుండా ఎదుటివారిని కుట్టటంలో అత్యంత ప్రావీణ్యత గలిగిన ఓ కీటకం . అవకాశం వదులుకోరు ఈ రాశి స్వభావులు .

9 . ధనుస్సు ( మూల 4 పాదములు రాక్షసగణం , పూర్వాషాఢ 4 పాదములు మనుష్యగణం & ఉత్తరాషాఢ 1 వ పాదం మనుష్యగణం  ) = విల్లు . అవసరం వచ్చినప్పుడు విల్లు వాడటం చాలా చాలా సద్గుణం . ఈ రాశివారు ఈ స్వభావం కలిగి వుంటారు .

10. మకరం ( ఉత్తరాషాఢ 2,3,4 పాదములు మనుష్యగణం  , శ్రవణం 4 పాదములు  దేవగణం  & ధనిష్ట 1 , 2 పాదములు రాక్షసగణం ) = మొసలి . నిద్రపోతున్నట్లే వుంటుంది , కాని అవకాశం కొరకు ఎదురుచూస్తూ వదలిపెట్టనే పెట్టదు .

11. కుంభం ( ధనిష్ట 3 , 4 పాదములు రాక్షసగణం , శతభిషం 4 పాదములు రాక్షసగణం & పూర్వాభాద్ర 1,2,3 పాదములు మనుష్యగణం ) = కలశం లాంటి నిండు కుండ . సద్గుణాల రాశులు .

12. మీనం ( పూర్వాభాద్ర 4 వ పాదం మనుష్యగణం  , ఉత్తరాభాద్ర 4 పాదములు మనుష్యగణం  & రేవతి 4 పాదములు  దేవగణం  ) = అంటే చేప . ఇది నీటిలోనే వుంటూ ఆంతులేని ఆనందాలను అనుభవిస్తున్నట్లు హడవుడిగా గెంతుతూ పైకి కనపడ్తుంది . తన స్థావరాన్ని దాటి బయటకు రావటానికి యిష్టపడనే పడదు .  గీసిన గిరి లోనే జీవించటంలో ఆనందాల్ని అనుభవిస్తుంటుంది .

సహజంగానే కొన్ని జంతువులకు వైరం వుండనే వున్నది . అందులో వివాహ విషయంలో తప్పక ఆ జంతు వైరం గల నక్షత్రాలు గల ఆడ మగ వాళ్ళకు వివాహం చేస్తే ఆ యిరువురి నడుమ అడుగడుగునా , భేదాభిప్రాయాలు , తఱచుగా కొట్లాటలు , యిరువురి నడుమ ప్రేమ భావం చాలా తక్కువగా వుంటుంది .
అంతే కాకుండా గణ పొంతన కూడా చాలా అవసరమైనదిగా భావించాలి . దేవగణం , మనుష్యగణములైతే ఎంతో మంచిది . దేవ , మనుష్యగణములు గాని ,రాక్షస మనుష్యగణములు గాని పనికి రావు . రెండు ఒకే గణములైన యిబ్బందులుండబొవు .
అయితే శాస్త్ర ప్రకారం గణములు అన్నీ కుదరకపోయినా , కనీస వైర జంతువులను చూసుకొనగలిగితే చాలావరకు జీవితం ఆనందమయంగా వుంటుంది .
అది కూడా చాలా మంది చూడక , ఆ శాస్త్రాన్నే అవతల పెట్టి , తమ కనుకూలంగా ముహూర్తాలు పెట్టించుకొని పెళ్ళిళ్ళు హడావుడిగా చేసేసుకొంటున్నారు . ఆ తర్వాత వచ్చే యిబ్బందుల్ని ఎదుర్కోలేక విడిపోతున్నారు .


మన భూమండలం చుట్టి వస్తున్న నక్షత్ర మండలాల ప్రభావం మన మనుగడ మీద ఎంతగా వున్నదో అర్ధమైందిగా . కనుక అటు ఏడు , ఇటు ఏడు తరాలే కాకుండా పెద్దలు చెప్పిన వీటిని గూడా చూడటం ఎంతో శ్రేయస్కరం కదా ! ఆలోచించుకో .

                                                                                                      ********

మన కోసమైనా........

                                                                                                                             కవితా రచన : శర్మ జీ ఎస్


కనబడే  వృక్షాలు శాశ్వతం కాదు ,
కొండలు , లోయలూ శాశ్వతం కాదు ,
నేనూ శాశ్వతం కాదు ,
నువ్వూ శాశ్వతం కాదు ,
మనమెవ్వరమూ శాశ్వతం కాదు ,
ఏ ప్రాణులు శాశ్వతం కాదు ,
జీవించటమంటే ,
బ్రతికిన నాలుగు రోజులలో ,
పదుగురికి కాకున్నా ,
నలుగురికైనా సాయపడాల , 
దేనికంటే , 

అక్కడ కూడా  స్వార్ధపు ఆగడమే ,
పోయినాక  నలుగురు మొయ్యాలిగా ,
ఆపైనే  ఆనందించాల ,
ఆనక నే చావాల ,
ఆపైన  మొయ్యాల ,
ఆపైన దించాల ,  

ఎక్కడనుంచి వచ్చామో ,
ఎక్కడికి వెళ్తామో , 
తెలియరాని మనం ,
శాశ్వతమైన బంధాలను ,
కోరుకోవటంలో ,
అర్ధమేమున్నది ,
స్వార్ధపరత్వం తప్ప .
     
*****

సవారీయా ? సవాలా ?


                                                                                                                                       రచన : శర్మ జీ ఎస్ 

నేను , నా శ్రీమతి  
ఈ మమ్మీ రైడ్ కి వెళ్ళే వాళ్ళు ఏ విధమైన బ్యాగులు క్యారీ చేయకూడదుట . కనుక మా బ్యాక్  ప్యాక్ ఆ ప్రక్కనే వున్న ఫ్రీ లాకర్లో పెట్టాము . ఆ లాకర్ కంప్యూటర్ లో మన ఫింగర్ ప్రింట్ ద్వారా లాక్ చేయబడ్తుంది . నా శ్రీమతి హ్యాండ్ బ్యాగ్ మాత్రం తన వద్దనే వుంచుకోచ్చు అన్నారు .

ఆ భారీ లైన్లలో అలా నడుచుకొంటూ వెళ్తుండగా "   రకరకాలవారు రాగిమీసాలవారు  "   అన్న చందాన అక్కడే ఆలింగనాలు , ముద్దులు , మురిపాలు చూడ తటస్థించింది . 


ఓ పడుచు కుఱ్ఱవాడు తన క్రాఫ్ ని కోడిపుంజు నెత్తిపై నున్న ఎఱ్ఱకిరీటంలా చేసుకున్నాడు . బహుశా తను పెట్ట కాదు , పుంజునని అందరకు తను చెప్పకనే తెలిసిపోవాలనుకున్నాడు కాబోలు .

అది మనకు మాత్రం ఓ వింత  కాగా , మా కెమేరాలో బందించాను . ఈ  రైడ్స్ కి నిర్ణీత సమయం వుందని ప్రకటనల పలక మీద ప్రకటిస్తుంటాడే గాని , ఒక సమయమంటూ లేదు , నిరంతరం ఒక బోటు తర్వాత మరో బోటులో ఎక్కించి పంపుతుంటారు . ఆ లైన్లన్ని నడచి మేం ఆ సాధనాన్ని  చేరేసరికి  6.20 అయింది .

ఏ రైడ్ల కైనా ఒక్కరు వెళ్తే వాళ్ళను ఎక్కడో ఒక చోట కూర్చో పెట్టి పంపుతుంటారు . అదే ఎక్కువమంది అయితే వాళ్ళను పక్కపక్కన కూర్చోపెట్టి పంపుతుంటారు .

మాయిరువురిని ఆ  సాధనంలో  ఒక చోట కూర్చోమన్నారు . రెండవ వరుసలో ఆఖరున కూర్చొన్నాం . వెంటనే లాక్ చేసేశారు . కూర్చోగానే అక్కడి స్టాఫ్ అలా వెళ్ళే వాళ్ళందరకి హ్యాపీ రైడ్ చెప్తారు . బయలుదేరింది .మలుపు తిరిగింది , అలుపూ మొదలైంది , జీవం కోల్పోయిన అస్థిపంజరాలు  కూడా జీవం వున్నవారిని భయ పెడ్తున్నాయి మన మీదకు వచ్చి . ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మన పై నుంచి  మన మీదకు ఆ అస్థి పంజరాలు వాటి చేతులతో మనల్ని పట్టుకొన ప్రయత్నిస్తున్నట్లుగా చేతులను చాచుతూ కదుల్తుంటాయి . ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే పైన వేదికలా వున్న ఆ చోట ఒక శవాకారం మాట్లాడుతుండగా మనం పైకి చూస్తుండగా ,   సడెన్ గా మన కుడి , ఎడమల రెండు అస్థిపంజరాలు ఠక్కున కనపడి కాలి బూడిదవుతాయి .

అది దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి పైకి ఎక్కుతూ వేగం పుంజుకొంటుంది మా వాహనం . ఆ వేగంలో ఎటు పోతున్నామో , ఏం చూడబోతున్నామో తెలియని అదో రకపు అయోమయ స్థితి . ఇదో రకమైన థ్రిల్ . ఆ వేగం అంతా , యింత అని చెప్పలేని పరిస్థితి . అంధకారాన్ని మనం తరచూ చూస్తూనే వుంటాం .  గాడాంధకారం , కళ్ళు విప్పార్చినా ఏమీ కనపడని స్థితి యిది .  ఏ ఆలోచన దరిజేరనీయదు , ప్రాణాన్ని గుండెలోనే నొక్కి పట్టి ఒకరికొకరు గట్టిగ పట్టుకొని ఉన్న స్థితిలో వేగంగా అష్ట కాదు అనేక వంకరలు తిరుగుతూ , పైకి , క్రిందకు పల్టీలు కొడుతూ , మధ్య మధ్యలో మనమీదకు దూకే అస్థిపంజరాలు , ఛటుక్కున ఎదురుగా ఏదో వస్తే ( సడెన్ బ్రేక్ తో ఆగినట్లు )ఆగిపోయింది .

ఇంతదాకా హాహాకారాలతో తమ ఉనికిని తెలుపుకుంటున్న అందులోని మా సహచరులు ( పలు భాషా ప్రజలు ) ఒక్కమారుగా హమ్మయ్య బ్రతికిపోయాం రా అన్న భావాన్ని తమ నిట్టూర్పులతో వ్యక్తపరిచారు . ఇంకా గాడాంధకారం వీడిపోలేదు . ఉచ్వాస , నిశ్వాసల ద్వారా , మేము ఊపిరి తీసుకొంటున్నామని తెలుసు కొనటం జరిగింది . ఆ తర్వాత ఎలా ఉంటుందో , ఏమో అని , ఎందుకైనా మంచిది అని మరల హాయిగా , ఒక రెండు నిముషాలు ఊపిరిని ఉఛ్ఛ్వాస , నిశ్వాసలతో పీల్చుకున్నాము .

మా వాహన కదలికలు మళ్ళీ ఆరంభమయ్యాయి , మేమంతా మరల ఏం జరుగుతుందోనని సంసిధ్ధమయ్యే సమయంలో , ఎటు వెళ్తుంది  , ఈ గేట్ తీస్తాడేమో , ఇంకా ఏమి చూపిస్తాడో అనుకుంటుండగా అదే వేగంతో , వెను తిరిగింది  .

ఎందుకంటే , ఇంతవరకు తెలియకుండా జరిగిన ఈ ప్రయాణం ఆశ్చర్యాన్ని , ఆనందాన్ని అందించింది మన ప్రిపరేషన్ ఏమీ లేకుండానే . అదే వంకర టింకర ప్రయాణం మరల సాగింది . ఈ మారు భయభ్రాంతులకు గురైనాము . మళ్ళీ అదే ప్రయాణమా ? అన్న భయం  ఆవహించినా , మనం అరిచి గీ పెట్టుకున్నా , వచ్చి ఆదుకొనే నాధుడెవడూ లేడు కనుక నోరు మూసుకొని సాగిస్తున్నామనుకొంటే పొరపడినట్లే . నోరు బాగా తెరచి , బిగ్గరగా , రణగొణ ధ్వనులతో హాహాకారాలు మొదలయ్యాయి . అలా , అలా వెనక్కి తీసుకువెళ్తూ , ఎప్పుడు మలుపు తిరుగుతుందో మనకు తెలియదు , చిట్ట చివరికి ఒక్కమారు ఆ పై నుంచి క్రిందకు తోసేసింది .

గుండెలవిసిపోయాయి అని మా  పెద్దవాళ్ళు అంటుంటె విన్నాను గాని దాని భావమేమిటో తెలుసుకోలేకపోయాను . ఇప్పుడు అనుభవంలో తెలుసుకున్నాను .

అందరం  బ్రతికి బయటపడ్డాంరా బాబూ అనుకున్నంత ఆనందంతో బయటకు వచ్చాము .

నిజానికిది కూడా వాళ్ళు ప్రకటించిన నియమ నిబంధనలను చూడకుండానే ఈ రైడ్ కి మేమిరువురం వెళ్ళి వచ్చాం . బైటకు వచ్చేసరికి , 7 గంటలయింది . సూర్యుడికి కూడా ఈ అమెరికా బాగా నచ్చినట్లుంది .  5 గంటలకల్లా వస్తున్న లేత వెలుతురుతో సూర్యుడూ పరుగులు తీస్తూ పై పైకి గబగబా వచ్చి తొంగి చూస్తుంటాడు ఇక్కడి ప్రకృతిని . తన వెలుగు , జిలుగులతో ఝిగేలుమనిపిస్తుంటాడు . ప్రతాపాన్ని చూపబుధ్ధికాక , ప్రకాశాన్నే అందంగా అందజేస్తాడు . అలాగే సాయంత్రాలు కూడా .అంత పొద్దున్నే వచ్చాడు కదా అని  తొందరగా వెళ్ళిపోడు . ఆయన ఈ అమెరికాలోని అందాలను తనివితీరా చూస్తూ , ఆ మైమరపులో ఆలస్యంగా వెళ్తున్నట్లుగా మనకనిపిస్తుంది .

అలా తను పొందిన ఆనందాలని ఈ జీవకోటికి అందించాలన్న సదాలోచనతో రాత్రి 8.45 నుంచి 9 గంటలలోపు తిరిగి వెళ్ళిపోతాడు .

                                                                                       
                                                                                                           *********** 

ఆన్ సైట్ ఫైట్

                                                                                                                             కవితా రచన : శర్మ జీ ఎస్

ఉద్యోగపరంగా తరలి వెళ్ళాక ,
అమ్మా నాన్నలను వదలి వెళ్ళాక ,
భార్యాబిడ్డలను వదలి వెళ్ళాక ,
కులాలని , మతాలని ,
మన దేశం లోనే వదిలేయాల్సిందే ,
స్వదేశం కాని పరదేశంలో ,
అక్కడ అనుక్షణం హితం కోరే 
అసలు సిసలు స్నేహితుడే కావాలి ,
చక్కటి రూం మేటే దొరకాలి ,
ఎవరికి ఏ అవసరం వచ్చినా ,
ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి ,
అవసరాలకు అనుగుణంగా మసులుకోవాలి ,
సక్రమంగా స్పందిచే గుణం కావాలి ,
అభిమతాలని తెలుసుకొని మసలాల్సిందే ,
ఆ క్షణమే ఆన్ సైట్ ఆల్ రైట్ .

 ******

పండుగలు

                                                                                                                   వచన కవితా రచన : శర్మ జీ ఎస్ 

        
కడుపేదల కడుపు నిండాలని ,
కలకాలం ఈ పండుగలుండాలని ,
అల కాలంలో ఆలోచించి ఆదేశించారు ,
ఆనాటి కృతయుగ మహా(పు)రుషులు ,
ఆ ఆదేశాలను శాసనాలుగా  చేసేశారు  .

లేనివాడు ,
నిన్నటికంటే నేడు ,
ఈ పండుగల పేరుతో ,
కడుపు నిండుగ భోజనం చేస్తున్నాడు .

ఉన్నవాడు ,
ఇంతకుముందూ కంటే , 
ఇంకొంచెం ఘనంగా ,
ఈ పండుగలనన్నిటినీ జరుపుకొంటూ ,
తన(దైన) గొప్పని ప్రదర్శిస్తున్నాడు .

మధ్య తరగతివాడు ,
లేనివాడితో పోల్చుకోలేక ,
ఉన్నవాడి స్థాయిని అందుకోలేక ,
అప్పుల తిప్పలతో , అటు, యిటు
అయి సతమతమవుతున్నాడు . 

రాజకీయ నాయకులు ,
ఈ పండుగలను , 
తమకనుగుణంగా ,
తమ బలప్రదర్శనకు ,
అవకాశంగా మలుచుకొంటున్నారు ,
ఆ బలప్రదర్శనలు , 
అనామకుల కడుపు నింపుతూ ,
మందుల విందుల చిందులతో ,
కాపురాలను కూల్చేస్తున్నాయి .

*******


చరిత్ర హీనులు

                                                                                                                  వచన కవితా రచన : శర్మ జీ ఎస్  

సామాన్య ప్రజానికానికి ,
సంవత్సర పొడవునా పండుగలే . 

రాజకీయ నాయకులకు ,
రెండే రెండు పండుగలు ,
5 ఏళ్ళకొక మారు వచ్చే ఎన్నికలు ,
ఆకస్మికంగా ఆ 5 ఏళ్ళలో వచ్చే ,
మధ్యంతర ఎన్నికలూ ,
ఓ వైపు డబ్బులు దండగ అవుతున్నా ,
ఆనందాన్ని అందిస్తాయన్న ,
ఎన్ని కలల పండుగలు .

పెదవి కాంక్షించి ,
రావణాసురుడు రాలిపోయాడు ,
రామాయణం చాటింపు వేస్తోందీనాటికీ .

పదవినాశించి దుర్యోధనుడు ,
దుష్ట చతుష్టయంతో కలిశాడు ,
దురద కంటే కండూతి కడు ఘోరమని , 
మహాభారతం చాటింపు వేస్తోందీనాటికీ .

ఈ యిరువురూ స్వార్ధంతో ,
సర్వనాశనమై పోయారు ,
ఇది చరిత్ర చెప్పిన నగ్న సత్యం ,
తెలిసినా అటే మొగ్గు చూపుతున్నారంటే ,
నేటి రాజకీయ నాయకులూ ,
వీళ్ళూ చరిత్ర హీనులుగా మిగిలిపోవలసిందే కదా !

*****

ఉల్లి తల్లిపై లొల్లి

                                                                                                                            కవితా రచన : శర్మ జీ ఎస్
( పెండెం గారి ఛాయాచిత్రానికి నా చిరు కవిత )


ఉల్లి తింటే ఘాటు , 
కొనకుంటే లోటు ,
కొనాలంటే ధరల వేటు ,
తినకుంటే రుచిలో పెద్ద లోటు

వరదల వర్షాలతో స్తంభించిన నిల్వల ,
ఉల్లి మురిగి ముక్కు మూసుకొనే స్థాయిలో మళ్ళీ , 

రవాణా శాఖ నిరవధిక సమ్మె వల్ల ,
ఉల్లి దొరకలేదని ఒకటే లొల్లి ప్రతి గల్లీలో ,
ఉల్లికే కాదు , దేనికైనా  గాలి సోకాలి లేకుంటే ,
గాలి ( దెయ్యం ) సోకినదానిలా కుప్ప కూలిపోతుంది ,

తర తరాలుగ ఉల్లి తఱుగుతుంటే కన్నీళ్ళు ,  
నడుమ నడుమ కొనాలంటేనే ధరల  కన్నీటి ధారలే ,

రాజకీయ పార్టీల ప్రముఖులు ,
బ్లాకు మార్కెట్లో  అధిక ధరకి కొని ,
అల్ప ధరకే అమ్మటంలోని అంతరార్ధం ,
ప్రజలపై అభిమానం అసలు కానే కాదు ,
నల్ల ధనాన్ని కొంతైనా తెల్లగ మార్చటానికే , 
ఈ ఉల్లి లొల్లి రాజకీయ నాయకులకు మళ్ళీ మళ్ళీ , 

ఒక రాజకీయ పార్టికే పరిమితం కాదు ,
అన్ని రాజకీయ పార్టీలకు యిలాంటి లొల్లులు ,
అపుడపుడు ధనలక్ష్మి గజ్జెల గల గలలు ,

ఉల్లి చేసే మేలు తల్లైనా చేయదంటారు ,
ఉల్లి చేసిన కీడు తల్లెంతమాత్రమూ చేయదంటా ,

ఓ నాడు యిదే ఉల్లి ఓ ప్రముఖ పార్టీని,
పదవి నుంచి క్రిందకు తోసేసింది ,
తన సత్తా ఏమిటో ఘాటుగా చూపించింది ,
అది మర్చిపోలేదేమో ? అందుకేనేమో మళ్ళా ఈ ఉల్లి లొల్లి  .

******

ఆధ్యాత్మికతలో పురోగతి

                                                                                                                                        రచన : శర్మ జీ ఎస్

శ్యామలీయం గారి ఈ నెల 5 న ఆయనకు అనుభూతమైన ' ఒక విచిత్రానుభవం ' , 6 న కలిగిన ' ఏమో అనుకొంటి ' టపాలు చదివిన పిమ్మట నా భావ పరంపరలు . )

ఈ ఆధ్యాత్మికత మార్గంలో పయనిస్తున్న వాళ్ళని అణిమాది సిధ్ధులు ఆకర్షిస్తుంటాయి . అవి షులు తపస్సు చేసుకొంటుంటే ( కావలసినదేదో ఆశించి ) ఆ తపమును భంగం కలిగించే దిశగా , రంభ , ఊర్వశి , మేనకలను ఆ ఇంద్రుడు వుసిగొల్పినట్లు , ఈ అణిమాది సిధ్ధులు ఏవో కొన్ని అనుభూతులను కలిగించి , జరగబోయే కొన్ని ముఖ్య విషయాలను ముందే తెలియబరచి , మన దృష్టిని పక్కకు మళ్ళిస్తాయి . దానితో అధః పాతాళానికి నెట్టబడటం జరుగుతుంది . ఇలాంటి విషయాల మీద  మన దృష్టి పోనీయకుండా ( ఎవ్వరికీ , ఆఖరికి మీ దేహంలో అర్ధభాగమైన అర్ధాంగికి కూడా తెలియచేయకూడదు అన్నమాట . ఎందుకంటే , ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరూ లేరు , ఎవరితో ఎవరూ ఎన్నడు రారు , ఈ మానవ జన్మలో తను నీ భార్య , గత జన్మలో తానెవరో , నీవెవరో . ) ) మన ఆధ్యాత్మిక సాధనను మనం మరింత ముందుకు నడిపించుకోగలిగితే , మనం మరింత  ఎంతో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలం .

ఆ తర్వాత మనం మన అనుభవాలను అందరితో పంచుకొనవచ్చు . అదే మన ఆధ్యాత్మికతకు అనుమతి .

ఉదా : ఒకరు కలెక్టర్ గారి వద్ద అపాయింట్మెంట్ తీసుకున్నారు ఉదయం 10 గంటలకు . తను ప్రొద్దునే లేచి తన నిత్య కృత్యాలు తీర్చుకొని , తను కలెక్టరు గారి బంగళాకు 9 గంటలకే చేరుకున్నాడు . సెక్యూరిటీకి తన అపాయింట్మెంట్ టైం చూపించాడు . అతను 9.30 గంటలకి అనుమతిస్తామన్నాడు . సరే నని అక్కడే నిరీక్షించాడు చెప్పిన  ప్రకారం 9.30 గంటలకి సెక్యూరిటీ అనుమతించాడు . ఆ కలెక్టరు గారి బంగళా చాలా లోపలకి వున్నది . నడుచుకొంటూ పోవాలి . ఆ మార్గంలో యిరువైపులా అందమైన పూలమొక్కలు , కొన్ని కొన్ని చెట్లు అందంగా కత్తిరించి అందమైన కళాకృతులుగా మలిచారు . మరికొన్ని పూల మొక్కలు సువాసనలు వెదజల్లుతూ వెంటబడ్తుంటాయి , తమనో కంట చూడమని . ఇలాంటి వాటి వెంట వున్న మార్గంలో నడుస్తూ వెళ్తున్న అతను వీటి అందాల్ని , ఆ కళాకృతులను చూస్తూ , ఆ సువాసనలను ఆఘ్రాణిస్తూ మెల మెల్లగా ముందుకు సాగాడు ( గతంలో అతనెన్నడూ యిలాంటి దృశ్యాలను వీక్షించి వుండలేదు . ఆ సరికే 10.30 గంటలు అయింది . అక్కడే వున్న కలెక్టర్ గారి పర్సనల్ సెక్రెటరీకి చూపించాడు . 

 "  అతను , సారీ , మీ షెడ్యూల్ టైం అయిపోయింది , ఇపుడు వేరే వాళ్ళతో బిజీగా వున్నారు అన్నారు . "   

"   మరి నన్నెప్పుడు అనుమతిస్తారు ? "   అని అడిగాడు . 

"   మళ్ళీ మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి . "   

"   ఎప్పుడు ? రేపే దొరుకుతుందా ? " 

"   రేపే ఎలా దొరుకుతుంది ? ఇప్పుడు మీరు తీసుకొన్న అపాయింట్మెంట్ ఎన్నాళ్ళనుంచి ప్రయత్నించారో మీకు తెలియనిది కాదుగా . "

"   అవును , ఎన్నాళ్ళనుంచో ప్రయత్నిస్తే , యిప్పటికి దొరికింది . "

"   దాన్ని వృధా చేసుకున్నారుగా . "

"   కావాలని చేసుకోలేదు కదండి . "

"   మీరెలా చేసుకొన్నా మాకవసరం లేదు . మళ్ళీ అపాయింట్మెంట్ దొరుకుతుందో , లేదో కూడా గట్టిగా చెప్పలేను . ఆయనను కలవటానికి ఎంతోమంది అపాయింట్మెంట్ క్యూలో వున్నారు . ఎపుడైనా వచ్చిన అవకాశం వదులుకొని , మరో అవకాశం కొఱకు ఎదురుచూడకూడదు . తర్వాత అంటే వాతే నన్నది మఱచిపోకూడదు . "

"   నేను అపాయింట్మెంట్ టైం కంటే 1 గంట ముందే వచ్చాను యిక్కడకి . "

"   గేటు ముందుకు రావటం ముఖ్యం కాదు , ఆయన గారి ఆఫీసుకి టైంకి రావటం ముఖ్యం . ఏది ఏమైనా ఆయనను కలుసుకొనాలనుకొంటుంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయండి ( మీకా ఉత్సాహం , తప్పక కలుసుకొనాలన్న బలంగా స్థిరపడి వుంటే > ) వెనువెంటనే కాకపోయినా , చిట్ట చివరికైనా లభిస్తుంది . ఈ మారు మాత్రం మార్గమధ్యంలో వున్న అందాలకు ,అనుబంధాలకు లొంగకండి .  వెళ్ళి మళ్ళీ రావటానికి ప్రయత్నించండి ."

ఇక్కడొక సందేహం చదువరులకు కలగవచ్చు .

"    మఱి ఈ ప్రపంచంలో చాలామంది వాళ్ళ వాళ్ళ అనుభవాలను  బైటకు చెప్తూనే వున్నారు గదా ! అని . "

వాళ్ళ ఆధ్యాత్మికత అభ్యాసాలు పూర్తి కాకుండా  బైటకు చెప్పుకొని , తమను తాము గొప్పగా డప్పులు కొట్టుకోవటం వలననే వాళ్ళందరూ అధోగతి పాలౌతున్నారు . మనమూ నిత్యం చూస్తూనే వున్నాం . ఎంతో ఉన్నతంగా కనపడ్తూ , వున్నట్లుండి  నీచస్థితిలోకి వెళ్ళిన వాళ్ళని చూస్తూనే వున్నాము . ఒక్కటి బాగా ఈ జీవితకాలం  అందరూ  గుర్తుంచుకొని తీరవలసిందే ఆధ్యాత్మికత / ఏదైనా సాధించదలుచుకొన్నప్పుడు . 
    . 
"    మనము విద్యార్ధిగా ఆ(ధ్యాత్మికత) పాఠశాలలో అడుగు పెడ్తూ , మనము తెలుసుకున్న కొంచెం మన సహాధ్యాయులకి నేర్పాలనుకోవటం అవివేకం . "   

అందుకే ఎంత నేర్చుకున్నా సద్గురువుల అనుమతి యీయకుండా సమాజంలోనికి రా(లే)రు ఏ శిష్యులైనా . ఎందుకంటే సద్గురువులు ఎల్లవేళలా సమాజ శ్రేయస్సుకై పాటుపడ్తుంటారు . అందుకని ఆ సద్గురువులు ఈ సమాజానికి ఎటువంటి మంచి చేయాలనుకున్నారో , ఆ విషయాన్ని శిష్యుల ముఖంగా చేయచూస్తారు . అందుకని శిష్యులను ఆ దిశగా సంసిధ్ధుల్ని కావించి , ఆ తర్వాత అనుమతిస్తారు సమాజ శ్రేయస్సుకై .   

కనుక ఏదైనా సాధించదల్చుకున్నప్పుడు గోప్యంగా వుంచటమే అన్ని విధాలా శ్రేయస్కరం . ఈ విషయాన్ని మన పూర్వీకులు మన నిత్యజీవితాల నడవడిలో అలవర్చారు . 
ఉదా : పెళ్ళైన ఆదవాళ్ళకి నెల నెలా వచ్చే ఋతుక్రమం తప్పగానే 3 వ నెల వచ్చేటంతవఱకు ఆ విషయాన్ని ( గర్భం అని ) ఎవరికీ వెల్లడి చేయరు . 3 మాసాలు గడచిన పిమ్మట , గుట్టుగా ' దొంగ చలిమిడి చేసి పెడ్తారు . ఆ తర్వాత 4 వ నెల గడచిన తర్వాత వాళ్ళు చెప్పదల్చుకున్న వాళ్ళ వాళ్ళకి తెలియచేస్తారు . 

ఏ రంగంలో నైనా పురోగతిలో పయనించాలనుకొనే వాళ్ళు , సాదించేవరకు , సౌమ్యంగా , మౌనంగా వుండటం ఎంతో శ్రేయస్కరం .


                                                                                       ** స ** మా ** ప్తం ** 

  

నా న్యూ నుడులు - 11

                                                                                                                                     రచన : శర్మ జీ ఎస్

1  .  గమ్యం ఒక్కటే
       దారులు ఎన్నో .

2  .  రోగమొక్కటే ,
       రావటానికి కారణాలు ఎన్నో  .

3  .  సాధించే వారొక్కరే ,
       వేదించేవారెందరో .

4  .  హతుడయ్యేవారొక్కడే ,
       హతాశులయ్యేవారెందరో .

5   .  విత్తనమొక్కటే ,
        కాయలెన్నో .

6  .  సంపాదించే వారొక్కరే ,
       అనుభవించే వారెందరో .

7  .  మంచి కోరే వారొక్కరే ,
       మెచ్చుకొనే వారెందరో .

8  .  కోరికలు కోరే వారెందరో .
       కోరిక తీరే వారే ఎక్కడో
      
9  .  అదృష్టం రాలేదనుకునేవారు తప్ప ,
       వచ్చినదానిని నిలబెట్టుకొనే వారు అరుదు .

10 . అందుకోలేదని బాధపడేవారు తప్ప ,
       అందినదానితో ఆనందంగా గడిపేవారే కరువు .


                                                                                                                 ( మరో మారు కలుసుకుందాం )

గృహమే కదా స్వర్గసీమ .

                                                                                                                          కవితా రచన : శర్మ జీ ఎస్                       
                           ( జూలై మాలిక యాగ్రెగాటర్లో ప్రచురించిన పెండెం గారి చిత్రానికి నా చిరు స్పందన ).                                 


నాడు ,
జనాభా అల్పం ,
స్వలాభాలు చవి చూశాం ,
నా యింటి ముంగిలి వాకిలి నాది ,
ఆ దారి నన్ను దాటి పో(లే)దు కదా !
నాదనుకొన్నా గనుకనే ,
కళ్ళాపు చల్లి , కళ్ళకు నిండుగా ,
ముగ్గుల అలంకరణలు చేసి ,
ముస్తాబు చేశా నా కన్నపిల్లకు మల్లె .

నేడు ,
జనాభా అధికం ,
గలభాలు పెరిగాయి ,
పల్లెలు కాస్తా పట్టణాలై పోయాయి
రూపు రేఖలు , ఆకార ఆచార వ్యవహారాలూ ,
అన్నీ మెల్ల మెల్లగ మారిపోతున్నాయి ,
ఉదయాన్నే నిద్ర లేచే పనే లేదు ,
లేవలేదేమిటని అడిగే వాళ్ళూ లేరు ,
వాళ్ళు పడే శ్రమను చూస్తున్నారు గనుక ,

నాడు కళ్ళు చెదిరేలా ముగ్గులలో ముగ్ధలు ,
నేడు వళ్ళు మరిచేలా నిదురలో ఆ ముగ్ధలే , 

ఆ నాడు అలా వుండటానికి ,
ఈ నాడు యిలా వుండటానికి ,
కారణం ఆ యా పరిసరాలు , పరిస్థితులే తప్ప ,
వేరేవీ కావు అన్నది గ్రహించి మసులుకొంటే చాలు ,
అపుడే  కదా  !
గృహమే  స్వర్గసీమ .

******

ష్..... గప్ చుప్

                                                                                                                                కధా రచన : శర్మ జీ ఎస్

రాత్రి ఏడు గంటలకే ఢిల్లీ రోడ్ల మీద జన సంచారం బహు తక్కువ వున్నది . కర్ఫ్యూ విధించకున్నా , చలికాలం కావటమే అందుకు మూలకారణం . అత్యవసరంగా ప్రయాణం చేయవలసిన వారు మాత్రమే ప్రయాణానికి ప్రాముఖ్యతనిస్తున్నారు .

నడివయసులో నవరసాలను అందుకోవాలనుకొనేవారికి , కొత్త కొత్త రుచులను , కొంగొత్త కోరికలను సరికొత్త రీతులలో తీర్చుకోవాలనుకొనే నూతన వధూవరులకు ఈ చలికాలం చక్కటి వరం . అందునా ఏ సీ కుపే . అనువైన స్థలం . తాపాన్ని చల్లబరచుకోవటానికి , ప్రతాపాన్ని చూపటానికి మగవారికింతకంటే మంచి చోటు మఱెక్కడా లభ్యం కాదాదనుకొనే అవకాశం కూడా లేకపోలేదు .

ఇంటిలోని పందిరిమంచం కిఱ్ఱు కిఱ్ఱుమంటుందన్న శంక గాని , పదిమంది చూస్తారన్న భయం గాని అసలు లేనే లేదు . అన్ని అనుమానాలు జర్నీలో కల్సిపోయి , ఫన్నీగా మిగిలిపోతుందిందలి సంసారం .

రాధా మాధవ్ లు నూతన వధూవరులు కావటంతో , రతీ మన్మధుల్లా రసిక సామ్రాజ్యంలో మునిగి తేలియాడుతూ సతతం సంతసం పొందుతున్నారు . ట్రెయిన్ వేగానికి దీటుగా తమ వేగాన్ని జస్ట్ అడ్జస్ట్ చేసుకొంటూ ఆనందిస్తున్నారు .

ట్రెయిన్ ఝాన్సీ చేరుకోగానే "   మీరేమైనా స్వీట్స్ , మ్యాగజైన్స్ పట్టుకురాండి  "    అన్నది రాధ .

"   ఈ దుస్థితోలో నా వల్ల కాదు . అర్ధం చేసుకో . ఇలా అందరికీ అసౌకర్యం కలిగించటం నా అభిమతం కాదు . కొంచెం దిగి నీవే తీసుకొద్దువూ "   అని బదులిచ్చాడు .

"   అర్ధం చేసుకొన్నాలెండి "   అంటూ నవ్వుకుంటూ కురులు దువ్వుకొని ట్రెయిన్ దిగి రిఫ్రెష్మెంట్ హాలు వైపు
నడుస్తూ , వెళ్తున్న ఓ అమ్మాయిని చూసి "  హాయ్ సరూ  "   అంటూ బిగ్గఱగా కేక వేసింది .

ఆ సరికే 2 టైర్ బోగీ ఎక్కబోతున్న ఆ అమ్మాయి వెనుదిరిగి చూసి  "   హాయ్ రాధా ఎన్నాళ్టికి కలిశావే ?  "   అంటూ రాధను జేరుకొన్నది .

"   హాయ్ సరూ ఎక్కడికే ?  "   అడిగింది .

"  సికింద్రాబాద్ కి . అవును మా పెళ్ళీకి రాలేదేం ? ఎంతగా ఎదురుచూశానో తెలుసా ? భలే డిజప్పాయింట్ చేసేశావే .  
"   ఆయన క్యాంపులో వున్నారు . నేననారోగ్యంతో రాలేకపోయాను . మీవారేరి ?  "

"   ఆయన కూపేలో వున్నారు . మా బంధువుల మ్యారేజ్ కి వెళ్తున్నాం . పద ఆయనను పరిచయం చేస్తా . "

"   ఆనక పరిచయం చేద్దువు . త్వరగా మీవారికి చెప్పి రా . చక్కగా కబుర్లు చెప్పుకొంటూ ఈ కాసేపైనా కాలక్షేపం చేద్దాం . అదిగో ఆ రెండవ బోగి . నేను నీ కొఱకు నిరీక్షిస్తుంటా . "

"   సరే యిపుడే వచ్చేస్తా  "కుపే వైపు నడిచింది రాధ .

సరళ తన బోగీ చేరుకొని భర్తతో  "   ఏమండీ నా ఆప్త మిత్రురాలు చాలాకాలం తర్వాత కలిసిందీ రోజు . తనూ ఈ ట్రెయిన్ లో ప్రయాణం చేస్తున్నది . ఇక్కడకు రమ్మన్నాను , సరదాగా గడిపేద్దామని . చిన్నతనం నుంచి ఒకే కంచంలో తిని ఎంత అనుబంధంగా ఉండేవాళ్ళమో  "   అన్నది .

"   ఆ అనుబంధం అంతవరకేనా ? లేక ........  "   అడిగాడు .

"   అపుడపుడు ఆ రెండోది కూడా తప్పదుగా మరి ఆప్తమిత్రులమైన తర్వాత  "  . అని బదులిచ్చింది .

"  అయితే అల్పాహారానికి కూడా కొఱతేనా ?  "   అని అనుమానం వెళ్ళబుచ్చాడు .

"   అదేమీ తెల్లవార్లు నా పక్కనే వుండదులెండి . ఇటార్సీ రాగానే దిగిపోతుందిలెండి . అంత యిబ్బందికి గురి చేయదు లెండి . "

"   ఏమో ఎలా చెప్పగలం ?  "

"  ఈ మధ్యనే దానికీ పెళ్ళి అయింది లెండి . ఆ యిబ్బంది దానికి మాత్రం తెలియదా ఏమిటి ? కంగారుపడి దానిముందు బైట పడకండి , బాగుండదు  "  హెచ్చరించింది కడు సున్నితంగా .
కుపే చేరుకున్న రాధ తను తీసుకొచ్చిన వాటిని మాధవ్ కి అందించి సరళ విషయం వివరించి  "  జస్ట్ అడ్జస్ట్ కండి "  అన్నది .

"   ఈ చలిలోనా   అందునా ? ఒంటరిగానా ? నావల్ల కాదు సుమా ! కుపే నన్ను క్రూరంగా కుదిపేస్తుంది .ఇటార్సీ వరకా ! అమ్మో !  "   అని తన అశక్తతను వెల్లడి చేశాడు మాధవ్ . 

"   ప్లీజ్ తప్పదు . ఏ ప్రయాణమైనా మజిలీలతో చేయాలని మన పూర్వీకులేనాడో సెలవిచ్చారని మా బామ్మ చెప్తుండేది . అందుకేనేమో కాశీ మజిలీలతో చూస్తారుట . అసలు మన ఈ మజిలీకి విరామం తప్పని సరి . ఆరగించిన వెంటనే ఆయాసం వెంట వుంటుందట . ఆ ఆయాసం ఆరోగ్య సూత్రం కాదట ఈ మజిలీకి . "

"  ఇది కూడా మీ బామ్మే చెప్పిందా ? "  ఉక్రోషంగా అడిగాడు .

"  ఆ మా బామ్మే చెప్పింది , లేకుంటే నాకెలా తెలుస్తుంది ? నాకేమీ పూర్వానుభవం లేదు . చక్కగా విశ్రాంతి తీసుకోండి  . వీలు చూసుకొని వస్తాను  "  అన్నది .

"   వీలు చూసుకొని కాదు , చేసుకొని త్వరగా వచ్చేయ్ , ఓ మారు "   అన్నాడు .

"   కుదరదండి , అది ఎదురుచూస్తుంటుంది , ట్రెయిన్ కి సిగ్నల్ యిచ్చారు , నే వస్తా  "   అంటూ కుపే దిగి 2 టైర్ వైపుగా నడిచింది .

తప్పని సరై తినుబండారాలారగించి ఆ బెర్త్ మీదనే విశ్రమింఛాడు . చెలి చెంత లేని సమయంలో ప్రతి జీవికి నెచ్చెలిగా చెంత చేరి చెలామణీ అవుతున్నది అనాదిగా నిద్రా దేవి .

కొరుక్కు తింటున్న చలికి , కోరికలు తీర్చే చెలి వంత పలకకపోయేసరికి అతనిలో తాపం ప్రతాపాన్ని చూపుతున్నది అతనిపై . రగ్గు కప్పుకొని పడుకున్నా , చలికి నుగ్గు నుగ్గు అవుతున్న అవయవాలు నిగ్గు తేలి ముగ్గులోకి దిగమని గగ్గోలు పెడ్తున్నాయి . కళ్ళు తెఱచి చూడగా యింకా భోపాలే రాలేదని గ్రహించాడు . అయినా తనని ఈ లోగా వీలు చేసుకొని రమ్మన్నాగా , తనూ వస్తానన్నది . భోపాల్ లో వస్తుందేమోనని డోర్ అన్ లాక్ చేసి వుంచాడు . చలికి తట్టుకోలేక నిండా రగ్గు కప్పుకొన్నాడు . అవయవాలు సోలిపోయాయి . 

మూడు గంటలవుతున్నది . కుపే కంపార్ట్మెంటంతా మాంచి నిద్రలో వున్నట్లున్నది . కొరుక్కు తింటున్న చలికి , కోట బుఱుజ్క్కిన కోర్కెకి , ముంచుకొస్తున్న నిద్రని తట్టుకోలెక మరల మరల యిబ్బంది కలుగకుండా టయిలెట్ కి వెళ్ళిడోర్ బోల్ట్ బిగించింది . వేళ్ళు కొంకరులు తిరిగిపోయే ఆ చలి పులి నించి తప్పించుకో ప్రయత్నంలో అతని చెంత చేరి రగ్గు నిండా కప్పుకొని , నిద్రపోతున్న అతనిని , అతనిలోని కోర్కెలను తట్టి లేపింది . ఆమె అతనికి పరుపుగా మారినా అతను మాత్రం ఆమెకు బరువుకాలేదు . అనుకోని ఈ ఆకస్మిక అవకాశపు దాడికి ఆశ్చర్యపడినా , అంతదాకా ఎదురు చూసిన అతను అప్రమత్తుడై వెంటనే తన అవయవ ఆయుధాలను సమాయత్తపఱచి , మదన కదన రంగానికి నడుం ఉడుం పట్టులా కావించి వుచ్చు బిగించాడు మాధవ్ .

ఆమె వెచ్చదనాన్ని కోరుకొంటూ తనువు తనువుల రాపిడిలో రాజుకునే ఆ వెచ్చని సెగల ఉత్పత్తికి నిరీక్షిస్తున్నది , ఉడికిస్తున్నది .

 అచ్చోట భార్యాభర్తల నడుమ సరస సంభాషణలు , సరస సల్లాపాల అవసరమే లేకపోయింది ఆ యిరువురికి . గిలిగింతల పులకింతలతో తన్మయత్వంలో తేలే ప్రయత్నం చేస్తున్నారు . పదే పదె అసలు సిసలు మదనుని చిఱునామా విచారణలో విపరీతంగా ఒకరికొకరు పోటీ పడ్తున్నారు . నలుములలా పలుమార్లు ఆరా తీస్తూనే వున్నారు . ఊరూ పేరూ వున్నవారి అడ్రస్ ఆరా తీయటానికే చాలా సమయం పడ్తుంది . ఈ మన్మధుడికి శాశ్వతమైన పేరుంది గాని , నిఖరమైన ఊరు లేనప్పుడు , అతని అసలు చిఱునామా దొరకటం అతి దుర్లభం కదా అని ఆలస్యంగా గ్రహించారా యిరువురూ పలుమార్లు ప్రయత్నించి . అంతటితో ఆగక , ఆ ప్రయత్నాన్ని విరమించక ఈ మారైనా తెలుస్తుందేమోనన్న అత్యుత్సాహంతో రమిస్తూ , శ్రమిస్తూనే వున్నారు .

"   మన పెళ్ళై నాలుగు నెలలైనా అంతటి కవ్వింపు , యింతటి ప్రోత్సాహం , నేనెన్నడూ పొందలేదు . ఆహాహా ! అమోఘం , అద్వితీయం ,అనిర్వచనీయం , మాటలలో మనసుకందనిది , చేతలతో తనువుకందినది "   అని తను పొందిన , పొందుతున్న ఆనందాన్నిలా వ్యక్తం చేశాడు మాధవ్ .

ఆమె మాటలలో వ్యక్తం చేయక , తనూ పొందిన , పొందుతున్న ఆనందాన్ని తన్మయత్వంతో  "  ఉ... ఉ. .."   అంటూ వ్యక్తం చేయగా "   ఊ "  కూడా తన చేత అంపించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు .

వారిరువురి కామకేళి రహస్యం ఆ పడుకున్న బెర్త్ కి , కప్పుకున్న రగ్గుకి తప్ప మరెవ్వరికీ తెలియకుండా ముసుగులోనే చాలా సమయం పంచుకున్నారు .

పలుమార్ల ప్రయత్నాలలో వేడి చల్లారింది . బిగి కౌగిళ్ళు సడలాయి . వెంటనే ఆమె అతని నుంచి విడివడి హడావుడిగా లేచి చీర కుచ్చెళ్ళు సరి చేసుకొని జాకెట్ ని సెట్ చేసుకొని , పవిట కొంగు నిండుగా కప్పుకొని పరిసరాల్ని తేరిపాఱ చూసింది . అది తన కుపే కాదు . తన భర్త హరీష్ కాదు . అవాక్కయి తల దించుకున్నది .

అతనూ హడావుడిగా లేచి ఆమెను చూసి , తన భార్య రాధ కాదని గ్రహించి నోట మాట రాక తలవంచుకొన్నాడు .
కొంత తడవుకు మెల్లగా అతనే గొంతు పెగల్చుకొని  "   సారీ అండి . మీరెవరో నాకు తెలియదు . ఇక్కడికెలా వచ్చారు ? ఇంతదాకా నా భార్య అనుకొని కోంచెం అడ్వాన్స్ అయ్యాను . మఱో మారు సారీ అండి "   అన్నాడు .
ఆమె సిగ్గుతో తలవంచుకొన్నది .

తెలిసి చేసిన పొఱపాటు కాదు కదండి . మిమ్మల్ని చూస్తుంటే ఉన్నత కుటుంబంలోని వారిలా వున్నారిఉ . ఇలా ఎలా వచ్చారు ? "  తన ఆశ్చర్యాన్ని , ఆమె మీద తనకేర్పడిన ఉన్నతాభిప్రాయాన్ని వెల్లడి చేశాడు .

తలవంచుకొనే మెల్లగా "  నాకూ అదే ఆశ్చర్యంగా వున్నదండి . టాయిలెట్ కి వెళ్ళి , ఆ కొఱుక్కు తింటున్న చలిలో , ఆ నిద్రమత్తులో అక్కడినుండి నాలగవదైన నా కుపేకి వెళ్ళిపోయాను . రగ్గుతో కవర్ చేశానా చలిని . అంతే యిపుడు యిక్కడ వున్నాను . నాకంతు పట్టటం లేదు "   అని ఆలోచనలో మునిగిపోయింది .

"  టాయిలెట్ నుంచి మీ కుపే నాలుగవదన్నమాట . అంటే కుడివైపా ? ఎడమవైపా ? "  అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు .

అపుడామె మస్తిష్కంలో ఓ మెఱుపు మెఱిసింది . తను చేసిన పొఱపాటుని గ్రహించింది . కుడివైపు వెళ్ళవలసిన తను ఎడమ వైపు వెళ్ళింది . అదే తనకింతటి శిక్షను అమలు జరిపింది . "   ఓ మై గాడ్ "    అనుకొంటూ తల మీద చేయి వేసుకొని బాధ పడ్తున్నది .

"    ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను మన్నించండి . మీరు బాధపడితే ప్రయోజనం లేదు . ప్లీజ్ బాధపడకండి . కావాలని చేసింది కాదు . పొఱపాటున పొఱపాటు జరిగిపోయింది "  అంటు ఓదార్చబోయాడు . 

"    జరిగిన పొఱపాటుని తీసివేయలేను . కాకుంటే మీరీ విషయాన్ని ఘనంగా పదిమందికీ  ప్రకటించవచ్చు . మీ ఘనత పెరగనూ వచ్చు . మా ఆడవాళ్ళ జీవితం అర్ధరహితమై , వ్యర్ధ జీవితమై అధఃపాతాళానికి త్రోసేయబడ్తుంది . జరిగిన పొఱపాటుని గుర్తించే తలంపుతో నా ఉనికిని తెలియస్జేశాను . దయయుంచి ఈ విషయాన్ని పబ్లిక్ చేయకండి  "   రిక్వెస్ట్ చేసింది .

"    చూడండి , మీ స్థితి నాకర్ధమైంది .నేను కృతజ్ఞుడను , కృతఘ్నుడను కానేరను . ఇదే నా భార్యకు జరిగినా , తనూ మీలా రిక్వెస్ట్ చేసుకొని అడ్జస్ట్ అవుతుందే తప్ప మరో మార్గం లేదు . నన్ను నమ్మండి . నేనెక్కడా , నా భార్య దగ్గర కూడా లీక్ చేయను "  అని అభ్యర్దించి నమ్మించాడు .

ఆమె "   థ్యాంక్స్ "   డోర్ బోల్ట్ తీసి ఆ కుపే నుంచీ బైటపడి ,  కుడివైపు వేగంగా నడిచింది . 

ఒక గంట గడచిన పిమ్మట , భోపాల్ స్టేషన్లో రాధ మాధవ్ తో జాయిన్ అయింది . అంతవరకు జరిగిన విషయంతో అతనికి నిద్రపట్టక అవే ఆలోచనలలో తేలుతున్న అతనిని చూసి తన కొఱకే నిరీక్షిస్తున్నాడని భావించిన రాధ అమాంతంగా అతనిని రగ్గు ముసుగుతో కప్పేసి ముగ్గులోకి దించింది .

                                               
                                                                                         ** స ** మా ** ప్తం **