ఆధ్యాత్మికతలో పురోగతి

                                                                                                                                        రచన : శర్మ జీ ఎస్

శ్యామలీయం గారి ఈ నెల 5 న ఆయనకు అనుభూతమైన ' ఒక విచిత్రానుభవం ' , 6 న కలిగిన ' ఏమో అనుకొంటి ' టపాలు చదివిన పిమ్మట నా భావ పరంపరలు . )

ఈ ఆధ్యాత్మికత మార్గంలో పయనిస్తున్న వాళ్ళని అణిమాది సిధ్ధులు ఆకర్షిస్తుంటాయి . అవి షులు తపస్సు చేసుకొంటుంటే ( కావలసినదేదో ఆశించి ) ఆ తపమును భంగం కలిగించే దిశగా , రంభ , ఊర్వశి , మేనకలను ఆ ఇంద్రుడు వుసిగొల్పినట్లు , ఈ అణిమాది సిధ్ధులు ఏవో కొన్ని అనుభూతులను కలిగించి , జరగబోయే కొన్ని ముఖ్య విషయాలను ముందే తెలియబరచి , మన దృష్టిని పక్కకు మళ్ళిస్తాయి . దానితో అధః పాతాళానికి నెట్టబడటం జరుగుతుంది . ఇలాంటి విషయాల మీద  మన దృష్టి పోనీయకుండా ( ఎవ్వరికీ , ఆఖరికి మీ దేహంలో అర్ధభాగమైన అర్ధాంగికి కూడా తెలియచేయకూడదు అన్నమాట . ఎందుకంటే , ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరూ లేరు , ఎవరితో ఎవరూ ఎన్నడు రారు , ఈ మానవ జన్మలో తను నీ భార్య , గత జన్మలో తానెవరో , నీవెవరో . ) ) మన ఆధ్యాత్మిక సాధనను మనం మరింత ముందుకు నడిపించుకోగలిగితే , మనం మరింత  ఎంతో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలం .

ఆ తర్వాత మనం మన అనుభవాలను అందరితో పంచుకొనవచ్చు . అదే మన ఆధ్యాత్మికతకు అనుమతి .

ఉదా : ఒకరు కలెక్టర్ గారి వద్ద అపాయింట్మెంట్ తీసుకున్నారు ఉదయం 10 గంటలకు . తను ప్రొద్దునే లేచి తన నిత్య కృత్యాలు తీర్చుకొని , తను కలెక్టరు గారి బంగళాకు 9 గంటలకే చేరుకున్నాడు . సెక్యూరిటీకి తన అపాయింట్మెంట్ టైం చూపించాడు . అతను 9.30 గంటలకి అనుమతిస్తామన్నాడు . సరే నని అక్కడే నిరీక్షించాడు చెప్పిన  ప్రకారం 9.30 గంటలకి సెక్యూరిటీ అనుమతించాడు . ఆ కలెక్టరు గారి బంగళా చాలా లోపలకి వున్నది . నడుచుకొంటూ పోవాలి . ఆ మార్గంలో యిరువైపులా అందమైన పూలమొక్కలు , కొన్ని కొన్ని చెట్లు అందంగా కత్తిరించి అందమైన కళాకృతులుగా మలిచారు . మరికొన్ని పూల మొక్కలు సువాసనలు వెదజల్లుతూ వెంటబడ్తుంటాయి , తమనో కంట చూడమని . ఇలాంటి వాటి వెంట వున్న మార్గంలో నడుస్తూ వెళ్తున్న అతను వీటి అందాల్ని , ఆ కళాకృతులను చూస్తూ , ఆ సువాసనలను ఆఘ్రాణిస్తూ మెల మెల్లగా ముందుకు సాగాడు ( గతంలో అతనెన్నడూ యిలాంటి దృశ్యాలను వీక్షించి వుండలేదు . ఆ సరికే 10.30 గంటలు అయింది . అక్కడే వున్న కలెక్టర్ గారి పర్సనల్ సెక్రెటరీకి చూపించాడు . 

 "  అతను , సారీ , మీ షెడ్యూల్ టైం అయిపోయింది , ఇపుడు వేరే వాళ్ళతో బిజీగా వున్నారు అన్నారు . "   

"   మరి నన్నెప్పుడు అనుమతిస్తారు ? "   అని అడిగాడు . 

"   మళ్ళీ మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి . "   

"   ఎప్పుడు ? రేపే దొరుకుతుందా ? " 

"   రేపే ఎలా దొరుకుతుంది ? ఇప్పుడు మీరు తీసుకొన్న అపాయింట్మెంట్ ఎన్నాళ్ళనుంచి ప్రయత్నించారో మీకు తెలియనిది కాదుగా . "

"   అవును , ఎన్నాళ్ళనుంచో ప్రయత్నిస్తే , యిప్పటికి దొరికింది . "

"   దాన్ని వృధా చేసుకున్నారుగా . "

"   కావాలని చేసుకోలేదు కదండి . "

"   మీరెలా చేసుకొన్నా మాకవసరం లేదు . మళ్ళీ అపాయింట్మెంట్ దొరుకుతుందో , లేదో కూడా గట్టిగా చెప్పలేను . ఆయనను కలవటానికి ఎంతోమంది అపాయింట్మెంట్ క్యూలో వున్నారు . ఎపుడైనా వచ్చిన అవకాశం వదులుకొని , మరో అవకాశం కొఱకు ఎదురుచూడకూడదు . తర్వాత అంటే వాతే నన్నది మఱచిపోకూడదు . "

"   నేను అపాయింట్మెంట్ టైం కంటే 1 గంట ముందే వచ్చాను యిక్కడకి . "

"   గేటు ముందుకు రావటం ముఖ్యం కాదు , ఆయన గారి ఆఫీసుకి టైంకి రావటం ముఖ్యం . ఏది ఏమైనా ఆయనను కలుసుకొనాలనుకొంటుంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయండి ( మీకా ఉత్సాహం , తప్పక కలుసుకొనాలన్న బలంగా స్థిరపడి వుంటే > ) వెనువెంటనే కాకపోయినా , చిట్ట చివరికైనా లభిస్తుంది . ఈ మారు మాత్రం మార్గమధ్యంలో వున్న అందాలకు ,అనుబంధాలకు లొంగకండి .  వెళ్ళి మళ్ళీ రావటానికి ప్రయత్నించండి ."

ఇక్కడొక సందేహం చదువరులకు కలగవచ్చు .

"    మఱి ఈ ప్రపంచంలో చాలామంది వాళ్ళ వాళ్ళ అనుభవాలను  బైటకు చెప్తూనే వున్నారు గదా ! అని . "

వాళ్ళ ఆధ్యాత్మికత అభ్యాసాలు పూర్తి కాకుండా  బైటకు చెప్పుకొని , తమను తాము గొప్పగా డప్పులు కొట్టుకోవటం వలననే వాళ్ళందరూ అధోగతి పాలౌతున్నారు . మనమూ నిత్యం చూస్తూనే వున్నాం . ఎంతో ఉన్నతంగా కనపడ్తూ , వున్నట్లుండి  నీచస్థితిలోకి వెళ్ళిన వాళ్ళని చూస్తూనే వున్నాము . ఒక్కటి బాగా ఈ జీవితకాలం  అందరూ  గుర్తుంచుకొని తీరవలసిందే ఆధ్యాత్మికత / ఏదైనా సాధించదలుచుకొన్నప్పుడు . 
    . 
"    మనము విద్యార్ధిగా ఆ(ధ్యాత్మికత) పాఠశాలలో అడుగు పెడ్తూ , మనము తెలుసుకున్న కొంచెం మన సహాధ్యాయులకి నేర్పాలనుకోవటం అవివేకం . "   

అందుకే ఎంత నేర్చుకున్నా సద్గురువుల అనుమతి యీయకుండా సమాజంలోనికి రా(లే)రు ఏ శిష్యులైనా . ఎందుకంటే సద్గురువులు ఎల్లవేళలా సమాజ శ్రేయస్సుకై పాటుపడ్తుంటారు . అందుకని ఆ సద్గురువులు ఈ సమాజానికి ఎటువంటి మంచి చేయాలనుకున్నారో , ఆ విషయాన్ని శిష్యుల ముఖంగా చేయచూస్తారు . అందుకని శిష్యులను ఆ దిశగా సంసిధ్ధుల్ని కావించి , ఆ తర్వాత అనుమతిస్తారు సమాజ శ్రేయస్సుకై .   

కనుక ఏదైనా సాధించదల్చుకున్నప్పుడు గోప్యంగా వుంచటమే అన్ని విధాలా శ్రేయస్కరం . ఈ విషయాన్ని మన పూర్వీకులు మన నిత్యజీవితాల నడవడిలో అలవర్చారు . 
ఉదా : పెళ్ళైన ఆదవాళ్ళకి నెల నెలా వచ్చే ఋతుక్రమం తప్పగానే 3 వ నెల వచ్చేటంతవఱకు ఆ విషయాన్ని ( గర్భం అని ) ఎవరికీ వెల్లడి చేయరు . 3 మాసాలు గడచిన పిమ్మట , గుట్టుగా ' దొంగ చలిమిడి చేసి పెడ్తారు . ఆ తర్వాత 4 వ నెల గడచిన తర్వాత వాళ్ళు చెప్పదల్చుకున్న వాళ్ళ వాళ్ళకి తెలియచేస్తారు . 

ఏ రంగంలో నైనా పురోగతిలో పయనించాలనుకొనే వాళ్ళు , సాదించేవరకు , సౌమ్యంగా , మౌనంగా వుండటం ఎంతో శ్రేయస్కరం .


                                                                                       ** స ** మా ** ప్తం ** 

  

5 comments:

  1. చాలా చక్కగా సూటిగ్గా వ్రాసారు.

    'ఆధ్యాత్మికత అభ్యాసాలు పూర్తి కాకుండా బైటకు చెప్పుకొని , తమను తాము గొప్పగా డప్పులు కొట్టుకోవటం వలననే వాళ్ళందరూ అధోగతి పాలౌతున్నారు .' బాగా చెప్పారు!

    మీరు చెప్పిన ఉదాహరణ కూడా బాగుంది.

    ReplyDelete
  2. "మార్గమధ్యంలో వున్న అందాలకు ,అనుబంధాలకు లొంగకండి"

    మర్గమధ్యములొనున్నవి ఏవైనా
    అందముగా కనిపించినా
    మనస్సు చలించినా
    నీవు అనేవాడు దానికి లొంగకూడదని ప్రయత్నించినా
    ఆ "నీవు" సంసిద్దుడిగా లేనట్టే తన గమ్యం చేరడానికి అన్నది ఒక సూచిక.
    అప్రయత్నముగా వాంఛారహితుడిగా ఉన్ననాడే ఆ "నీవు" గమ్యముని చేరగాలుగుతాడు...
    స్పందన ప్రతిస్పందన కలిగినంతకాలం ఆ "నీవు" నీవుగానే మిగులుతావు
    కాకపోతే ఈ మధ్యలో చేస్తున్నదంతా కేవలం నన్ను చేరాలన్న నీ కోరిక మాత్రమే ..
    " నన్ను చేరాలి " అన్న నీ తలంపు కూడా ఒక కోరికే ....
    ఈ కోరిక కూడా నీలో బలముగా వున్నన్నాళ్ళు నువ్వు ఎప్పటికీ నన్ను చేరలేవు .....
    ఒక మారు నీవు స్పందన రహితుడిగా మారినంత అప్రయత్నముగానే నన్ను చేరెదవు
    వాంఛ , స్పందన లేకుండుట అనేది ఒక దైవీక స్థితి .... అదే దైవత్వం
    అందుకే ఈ లోకమున ఎన్నో ఎన్నెన్నో మంచి చెడు రెండు జరుగుతున్నాయి ఆ దేవుడే సాక్షిగా ....

    అయితే సామాన్యుడికి ఆ స్థితికి చేరడానికి సులభ మార్గమే గీతోపదేశం ....
    నీ కర్తవ్యమ్ అని నువ్వు భావించినది నీవు నిర్వర్తించు ... స్పందనలకి అతీతముగా రాగబద్దుడివిగా నిలువు అని చాల సింపుల్ గా వివరించాడు....
    అద్యాత్మికతలో నేను ఏదో పురోగతి సాదించాను అని నీకు అనిపించినా యెడల అసలు "నీవు" అనే భావమే నిన్ను విడువ లేదని నువ్వు మరువకు...
    ఈ తత్త్వం బోధపడితే ఇంకా అంతా దైవీకమే ....


    ReplyDelete
    Replies
    1. గీతోపదేశం అంటేనే , ఈ జీవనపయనంలో మన గమ్యంలో అనేకానేక గీతలుంటాయని , వాటిని దాటుకొంటూ ముందుకు రాగలిగితేనే ఆ గమ్యాన్ని ( ఆ సర్వ సద్గుణ శక్తి స్వరూపుడైన దేవుడు / దేవతను ) చేరుకోగలవు అన్నదే అందులోని సారాంశము .
      అసలు ' నువ్వు 'అన్నది మరచిన నాడే అక్కడకు చేరుకొనటానికి అర్హత లభిస్తుందని , ఆ పై ఏ ఆటంకాలు కలగవన్నది మా బాగా చెప్పావ్.

      Delete

  3. అబ్బా, ఈ 'ఆధ్యాత్మికత లో కూడా 'గోల్' సెట్టింగ్, గోల్ ఇన్ మైండ్ ఏ నా !

    In search of the goal are we lacking the spirit to enjoy the path ! After all a goal when reached serves no other purpose than to say 'I' have reached the goal steadfastly!
    Enjoy the way! Bother not about the goal! You are always happy through out and not just at reach of goal only !

    A road more beautifully travelled is far better than a goal achieved monotonously !


    cheers
    zilebi

    ReplyDelete