నా న్యూ నుడులు - 11

                                                                                                                                     రచన : శర్మ జీ ఎస్

1  .  గమ్యం ఒక్కటే
       దారులు ఎన్నో .

2  .  రోగమొక్కటే ,
       రావటానికి కారణాలు ఎన్నో  .

3  .  సాధించే వారొక్కరే ,
       వేదించేవారెందరో .

4  .  హతుడయ్యేవారొక్కడే ,
       హతాశులయ్యేవారెందరో .

5   .  విత్తనమొక్కటే ,
        కాయలెన్నో .

6  .  సంపాదించే వారొక్కరే ,
       అనుభవించే వారెందరో .

7  .  మంచి కోరే వారొక్కరే ,
       మెచ్చుకొనే వారెందరో .

8  .  కోరికలు కోరే వారెందరో .
       కోరిక తీరే వారే ఎక్కడో
      
9  .  అదృష్టం రాలేదనుకునేవారు తప్ప ,
       వచ్చినదానిని నిలబెట్టుకొనే వారు అరుదు .

10 . అందుకోలేదని బాధపడేవారు తప్ప ,
       అందినదానితో ఆనందంగా గడిపేవారే కరువు .


                                                                                                                 ( మరో మారు కలుసుకుందాం )

8 comments:

 1. మంచి చెప్పేవారెందరో వినేవారెందరు?

  ReplyDelete
  Replies
  1. అంతు చిక్కని సమాధానంగానే మిగిలిపోయింది నేటి సమాజానికి .

   Delete
 2. 1,2,5 చాలా బాగున్నాయి.

  ReplyDelete
 3. వినాయక చవితి శుభాకాంక్షలు
  http://brundavanam.org/publications.html

  ReplyDelete
  Replies
  1. సాహితి గారు . నాబ్లాగుకి సుస్వాగతం . మీకు ఈ వినయక చవితిసందర్భంగా శుభాకాంక్షలు . మీ బ్లాగులోని " నాన్న " కు సంబంధించినవి క్లుప్తంగా చదివాను . బాగున్నాయి . వీలు చూసుకొని ఆర్డరిస్తాను ఆ ఒక్క పుస్తకానికి . లేదా నా మనిషి చేత గుంటూరు నుంచి తెప్పించుకుంటాను .

   Delete
 4. " korolalu thirche vaadokkade" anunte baavundedemo... Nice...

  ReplyDelete
  Replies
  1. ' కోరికలు తీర్చేవాడొక్కడే ' అంటే అది ఒక్క మగవాడే ( మొగుడే )అన్న భావన వస్తుండి . అదే ' కోరికలు తీరే వారెక్కడో ' అంటే అందులో ఆడ , మగ వాళ్ళందరికీ వర్తిస్తుంది .

   Delete