సీ సా

                                                                                                                          కవితా రచన : శర్మ జీ ఎస్                        
                                 ( మాలిక యాగ్రిగేటర్ లో ప్రచురించిన పెండెం గారి చిత్రానికి నా చిరు కవిత )


ప్రేమించటం , 
పెళ్ళి చేసుకోవటం ,
ఆనందించటం ,
వారసులను కనటం ,
అన్నీ హడావుడి  (ప్ర) క్రియలే ,
వారసులని కనగానే సరిపోదు ,
వాళ్ళని భావిపౌరులుగా తీర్చి దిద్దవలసిన ,
బాధ్యత మనదే అన్నది మరువరాదు ,
వాళ్ళకు మంచి విద్యను అందించాలంటే ,
ఆ విద్యల వెయిట్  , పిల్లలకంటే అధికమై ,
ఆ విద్యాలయం అందనంత ఎత్తులో వున్నది ,
సహజంగా పిల్లల వెయిట్ని కిలోలలో చూస్తాము ,
విద్యల వెయిట్  డబ్బుతో చూస్తున్న రోజులివి  ,
అందుకే పిల్లల  వెన్ను మీద వెయిట్ తగ్గించి ,
ఆ వెన్నుకు అండగున్న తల్లి తండ్రులపై వేశారు  ,
పిల్లలకు సీ సా ర్పరచి ఆడుకొమ్మన్నారు ,
ఆ విద్యాలయానికి మెట్లు లేనే లేవట ,
ర్పరచిన సీ సా నే విద్యార్జనకు అసలు మెట్టన్నారు ,
విద్యాలయం వైపు చిరంజీవిని కూర్చోపెడ్తారుట ,
ఆ తల్లితండ్రులు తాము ఆర్జించినదంతా ఆవల వైపు  , 
గోనె సంచుల్లో రాశులుగా పోసి వుంచాలట ,
ఆ ధన రాశుల వెయిట్ తో ఆ విద్యార్ధి ,
మెట్లు లేని ఆ విద్యాలయంలోకి అడుగెడతాడుట ,
అప్పుడే ఆ అధ్యాపకుడు అనుమతిస్తాడట ,
విద్యనార్జించటానికి అర్హుడౌతాడట ,
ఈ సీ సా విద్యలకొక రకమైన వీసానే .
కనుక  చిరంజీవులని కనక ముందే ,
అధిక మొత్తంలో  సమకూర్చుకొనటమే ఎంతైనా సబబు .

******* 

6 comments:

  1. జీవితం "సీ సా" "సీసా" చుట్టూ తిరుగుతోందండీ!

    ReplyDelete
    Replies
    1. అందుకునే వరకు ఆ సీసా ల చుట్టూ ,
      అందుకున్నాక , పుచ్చుకొన్నాక ,
      తన చుట్టూ తానే తిరుగుతుంటారు ,
      యువత , అదే నవత అనుకుంటారు ,
      నవ్వుకొంటారని యోచించరు .

      Delete
  2. సీ-సా అన్నది చాలా బాగుంది ....
    nice usage ....

    ReplyDelete
  3. Very very nice... Eppati chaduvula gurinchi baaga chepparu....

    ReplyDelete
  4. Very very nice... Eppati chaduvula gurinchi baaga chepparu....

    ReplyDelete