రచన : శర్మ జీ ఎస్
తొలి కి మన జీవితాలకి చాలా అన్యోన్య సంబంధం వున్నది . పరిశీలిస్తే మనకే బాగా అర్ధమవుతుంది .
మనకు తెలియకుండానే ఎన్నో మారులు ఎంతమందికో అంతులేని ఆనందాన్ని అందించటం , మనం పొందటం కూడా జరుగుతుంటుంది .
మాతృ గర్భంలోంచి భూమి మీదకి రాగానే తొలి చూపుతో ఎంతమందినో ఆనందంలో ముంచేస్తాము .
తొలి ఏడుపుతో సంబంధితవారినెందరినో ఆనందానుభూతికి లోను చేస్తాము .
తొలి బోసినవ్వుతో మరలా ఎనలేని సంతోషాల్ని కలిగిస్తాము .
తొలిసారి తల్లి పాలు తాగుతుంటే ఆ మాతృమూర్తి పొందే అనుభూతి వర్ణనాతీతం .
తొలిసారి బోర్లా పడటంతో బొబ్బట్లు చేసి సంతోషంతో అందరికీ పంచుతుంటారు .
ఆ తొలిసారిగా పారాడుతున్న ఆ వేళ అమిత ఆనందం చెందేవాళ్ళు .
ఆ పై తల్లిపాలు ( ద్రవ పదార్ధములు ) తగ్గించి ఘన పదార్ధం అలవరుస్తున్న తొలి సారి చప్పరించే ఆ చప్పరింతలకు చప్పట్లు కొడ్తున్నట్లుగా ఆనందించే వాళ్ళు .,
తొలిసారి అలాగే పారాడుతూ గడపలు అతి కష్టంతో దాటుతున్న వేళ గారెలు చేసుకుని ఆరగిస్తూ ఆనందపడిపోయే వాళ్ళు .
తొలి సారిగా చిగురులు గట్టిపడి పళ్ళు వస్తున్న తరుణంలో , విరోచనాలతో బాధపడ్తున్నఆ పసిపిల్లలను చూస్తూ భలే ఆనందం చెందేవాళ్ళు .
తొలి సారిగా తడబడుతూ తప్పుటడుగులు వేస్తున్న సమయాన్ని సంతోషంగా ఇంటిల్లిపాది పంచుకొనేవారు .
తొలి సారిగా ఏదో చెప్పాలనే తపనతో " త్త , త్త , త్త " అంటూ వెంటపడ్తుంటే , దానికి పెద్దవాళ్ళు ' చూశారా బామ్మగారు వీళ్ళు ఇంత చిన్న వయసునుంచే అత్తయ్యను కాకా పడ్తున్నారంటూ వాళ్ళు పొందే ఆనందం అంతా , యింతా కాదు .
తొలి సారిగా అన్నాన్ని అలవాటు చేయాలని వాళ్ళు నోటిలో పెడ్తున్నప్పుడు ఆ పసిపిల్లలు చూపించే ఆ హావ భావాలను చూసి , పదే పదే పెడ్తూ ఆనందపడేవాళ్లు .
తొలిసారిగ పాఠశాలకు పంపుతున్నప్పుడు ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవాలని , ఆ పాఠశాలలోని సహ విద్యార్ధులకు తినుబండారాలు , పలకలు , బలపాలు పంచి ఆనందించేవాళ్ళు .
తొలిసారిగా చదువులో అత్యున్నతమైన ప్రధమ స్థానాన్ని సాధించినపుడు ఆనందం అలాగే కొనసాగాలని ఆశీర్వదిస్తూ వాళ్ళు పొందే ఆనందం అనివచనీయమైనది .
తొలిసారిగా ( ఆడపిల్లైతే రజస్వల / మగపిల్లవాడైతే నూనూగు మీసాలు ) వస్తుంటే మా పిల్లలు పెద్దవాళ్ళౌతున్నారు అని అందరితో చెప్పుకుంటూ , ఆ ఆనందాన్ని పంచుకొంటూ ఆనందించేవాళ్ళు .
ఇంతవరకు మన ప్రమేయం లేకుండా మనం ఎంతమందినో ఆనందపరచిన సందర్భాలు .
ఇక ఇప్పటినుంచి ఆ తొలి అనుభూతి ఎలా వుంటుందో ఎవరికి వారికి తెలియటం మొదలవుతుంది .
తొలిసారిగా ప్రేమ తెలియటం ఆరంభమైనప్పుడు .
తొలిచూపులోనే ఎదుటివారి మనసు దోచినప్పుడు .
తొలిసారిగా సంపాదన ఆరంభమైనప్పుడు .
తొలి రాత్రి తొలి స్పర్శతో జరిగే సంగమమప్పుడు .
తొలిసారిగా మాతా , పితరులౌతున్నప్పుడు .
సో తొలి , తొలి ఎంత మధురమో ..... . గో ఎ హెడ్ మలి వరకు , ( అదీ ధర్మబధ్ధంగానే సుమా ! )అవకాశం , ఓపిక వున్నంతవరకు .
******

తొలి గతించిన మలి సంధ్యలో తొలిగానం బాగుంది.
ReplyDeleteనిజమే కదండి మరి .
Deleteఏంటో అన్నీ తొలి తొలేనే?
ReplyDeleteతొలి లేని మలి వుండదు కదా !
Delete