నా న్యూ నుడులు - 8

                                                                                                                                    రచన : శర్మ జీ ఎస్

1  . కాపురంలో కష్టాలు ,
     వ్యాపారంలో నష్టాలు ,
     అరుదుగ తప్పవు .

2  . పదవి , పెదవి ఈ ఫృధ్విలో ,
     చెలామణీ అవుతున్నాయి  ( అనాది నుండి ) .

3  . ఒకమ్మాయికి కన్ను కొట్టాడంటే
     మనసు పడ్డాడనుకోవచ్చు ,
     కనపడ్డమ్మాయికల్లా కన్ను కొడ్తున్నాడంటే ,
     జబ్బున పడ్డాడనుకోవలసిందే .

4  . ఎంగిలి పడటానికి ఓ సమయం వుంది  కాని ,
      దొంగలు పడటానికి సమయం లేనే లేదు .

5  . ఎదపై చక్కగుంటే అది చున్నీయే ,
      ఎదపై ఎగుడు దిగుడుగా వుంటే ఫన్నీయే .

6  . పేక అంటే ,
      పే దవారిని , లవారిగా ,
      కలవారిని పేదవారిగా మార్చగలిగేదే .

7  . విందులో , మందులో , పొందులో ,
      కులమతాల ప్రసక్తే  వుండదు .
      
8  .  ఓ నాడు యావశ్శక్తి కనుగొనటానికే ధారపోశారు ,
       ఈ నాడు యావశ్శక్తి కొనుక్కొనటానికే ధారపోస్తున్నారు .

9  .  అరుదుగానైనా బోన్ లేని మనుషుల్ని చూడగలం ,
       ఫోన్ లేని మనుషుల్ని మాత్రం చూడలేమేమో .

10 . ఎవరి పాపడి వారికే అందం ,
       ఎవరి పాపం వారికే అంతం .

                                                                                                                     ( మళ్ళీ కలుసుకొందాం )    

4 comments:

  1. Good. happy friendship day

    ReplyDelete
    Replies
    1. స్నేహంలో ఉన్న ఘనత మరి దేనిలో లేదండి .

      Delete

  2. శర్మ గారు 'న్యూడుల్' రాసినా అవి న్యూ 'నుడులే' !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మరల చాలా రోజుల తర్వాత మీ కమెంట్ చూస్తున్నా. ఎవరు ఏ నుడులు నుడివినా నిత్యసత్యాలే కదా!

      Delete