రచన : శర్మ జీ ఎస్
1 . when your body is excess sizes ,
you need the exercises .
2 . పేగు తెంచుకొని జనిస్తాడు ,
పేరు కొరకు తపిస్తాడు .
3 . ఆనాడు వందేమాతరం అన్నారు ప్రతి ఒక్కరు ,
ఈనాడు మందే మా తరం అంటున్న యువత .
4 . నాడు పవిట వేయటం పరదా ,
నేడు పవిట తీయటం సరదా .
5 . నిప్పు లేనిదే పొగ రాదు ,
తప్పు చేయనిదే పగ కాడు .
6 . అయినవాళ్ళు ఆవుల్లాంటివారు ,
కానివాళ్ళు కాకుల్లాంటివారే .
7 . ఆలోచనలకు నిదానమే అమృతం ,
ఆచరణకు ఆలస్యమే విషం .
8 ' నాడు పని మీదే ధ్యాస
నేడు మనీ మీదే ఆశ
9 . చాటుగా చెప్పేది కంప్లెయింట్ ,
ఎదురుగా యిచ్చేది కాంప్లిమెంట్ .
10 . కనపడేది శాశ్వతం కాదు ఈ దృష్టికి ,
శాశ్వతమైనది కనపడదు ఈ దృష్టికి .
( మళ్ళీ కలుసుకొందాం )
Adbhutah. I particularly liked 3, 7 & 10
ReplyDeleteకృతజ్ఞతలు .
Deleteఆలోచనలకు నిదానమే అమృతం ,
ReplyDeleteఆచరణకు ఆలస్యమే విషం
చాలా చాలా బాగుంది
నిజం అదే కనుక చాలా చాలా బాగుంటుంది .
Deleteఈనాడు మందే మా తరం అంటున్న యువత .
ReplyDeleteTrue
కృతజ్ఞతలు .
Deleteన్యూ నుడులన్నీ బాగున్నాయి సర్...
ReplyDeleteధన్యవాదములు .
Delete