లిబర్టీ స్టాట్యూ

                                                                    
                                                                                                                                        రచన : శర్మ జీ ఎస్


లిబర్టీ స్టాట్యూ 
ఎడిసన్ నుంచి  మాకుటుంబం వరకు లిబర్టీ స్టాట్యూ చూసి వద్దామని ఉదయం10.30 గంటలకు బయలుదేరాము . వర్షసూచన 20 శాతం అని గూగుల్ నెట్ లో చూసి , అందుకు కావలసిన సరంజామా ( స్వెట్టర్లు , మంకీ క్యాప్స్ , యియర్ క్యాప్స్ ) తీసుకొని మా ఇన్నోవాలో బయలుదేరాం . 45 మినిట్స్ లో చేరుకున్నాము . 


 మాన్యుమెంట్
26 సెప్టెంబర్ 2009 లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ల్లో మరణించిన వాళ్ళ జ్ఞాపక  చిహ్నంగా కట్టిన దారి ( మాన్యుమెంట్  ) గుండా ఆ లిబర్టీ పార్క్ దగ్గరికి వెళ్ళాము .

పోర్ట్ ఆఫ్ ఎంట్రీలా పనిచేసిన ఆ నాటి రైల్వే స్టేషన్
గతంలో యిక్కడ విదేశాలనుంచి వచ్చినవాళ్ళను చెక్ చేయటాన్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీ లా ఉపయోగించేవాళ్ళట ఆ రైల్వే స్టేషన్ ని . ఆ విషయం తెలుసుకొని ముందుకు అలా నడచుకుంటూ వెళ్ళాము . ఈ లోగా మా అబ్బాయి వెహికిల్ పార్కింగ్ చేయటానికి వెళ్ళి వచ్చి , యిక్కడ లిబర్టీస్టాట్యూని చూడటనికి అనుమతులు ఆపుచేశారుట జూలై 4 వరకు అని తెలియచేశాడు . దాంతో మొదట కొంచెం నిరుత్సాహపడ్డా , మెల్లగా ఆ చుట్టుపక్కలే చూసుకుంటూ కొన్ని ఫొటో
లు తీసుకొన్నాము  . 







                                                                                     
                                                                     బహుళ అంతస్తుల భవనసముదాయం 

షుమారుగా 1.15 కి అలా ఆవల ( న్యూయార్క్ ) వైపు వున్న బహుళ అంతస్తుల భవన సముదాయం ప్రక్కనే వున్నబ్యాటరీ పార్క్ వద్దకి వెళ్ళి , అలా బోట్  మీదగా వెళ్ళి దగ్గరగా చూడాలనుకొన్నాము . 2.30 కి అక్కడకు చేరుకొని , 3 గంటలకి   బోట్ లో తీసుకువెళ్ళి చూపిస్తారంటే టికెట్లు తీసుకొని , వెళ్ళి లైన్లో నుల్చొన్నాము . ఈ లోపల అక్కడే ఒకళ్ళు మీరెంతమంది అని , అందర్నీ నుల్చోమని ఓ ఫొటో తీశారు . ఫొటోబాగుంటే ,ఇష్టమైతే తీసుకోవచ్చు మనీ పే చేసి . 4 గంటలకు ఆఖరు అన్నారు . 2.30 బోట్ వచ్చింది , వరుసగా అందరం ఎక్కాము . కొంతమంది లోపల , ఇంకొంతమంది పైన ఎక్కారు . అప్పటికి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరింది . 

అలా ఆ బోటులో వెళ్తుంటే , ఆ ప్రక్కనే హెలికాఫ్టర్ రైడింగ్ ఉన్నది . ఆ హెలికాఫ్టర్స్ పసుపు రంగులో ఉంటాయట . కాని మాకు కనపడిన హెలికాఫ్టర్లు వేరే రంగులో వున్నాయి . అవి భద్రతావిధుల వాళ్ళకు సంబంధించినవట .లోపలనే ఆ చుట్టుప్రక్కల వాటి గురించి వివరంగా వివరించబడ్తాయి స్పీకర్ ద్వారా . అలా అలా చుట్టురా వున్నబహుళ అంతస్తుల భవనాలను చూసుకొంటూ , లిబర్టీ స్టాట్యూ వద్దకు చేరుకొన్నాము . లోపలకు ఇప్పుడు ఎలౌ చేయటం లేదు కొన్ని రిపేర్ల కారణంగా . దూరాన్నుంచే ఆ లిబర్టీ స్టాట్యూ ఫొటోలు తీసుకొని వీడియోలు తీసుకుని నలువైపులా చూస్తూ , 4.15 గంటలకు  మెల్లగా రిటర్న్ అయినాము . 





ఇక్కడ అండర్ గ్రౌండులో     
వ్యాపారదుకాణాల సముదాయం వుంటుంది.వాటికి ఇనప తలుపులు వాడతారు  . 





 
ఫుట్ పాత్ మీద వున్న పాన్ షాప్


అక్కడ ఫుట్ పాత్ మీద వున్న పాన్ షాప్ లను ఫొటో తీసుకుని నడుచుకొంటూ వస్తుంటే వర్షం పడింది . ఆగాము , పది నిముషాలలో పార్కింగ్ కి వెళ్ళి , అక్కడనుంచి అటు , ఇటు తిరిగి ఎడిసన్ కి
6 గంటలకు వెళ్ళాము . 

                                                            


                                                                                                           *********

4 comments:

  1. మీ పోస్ట్ & ఫోటోస్ ద్వారా నేను చూసేసానుగా :-)

    ReplyDelete
    Replies
    1. చూ(సే)సినందులకు థాంక్స్ .

      Delete
  2. కానీ ఖర్చులేకుండా మాకు అమెరికా చూపించేస్తున్నారు. ఏంటీ? అక్కడా ఫుట్ పాత్ వ్యాపారం ఉందా? !!!

    ReplyDelete
    Replies
    1. పదిమందితో పంచుకొనాలన్న సదుద్దేశమే దీనికి మూలకారణం . ఇక ఫుట్ పాత్ వ్యాపారం అన్ని దేశాలలోనూ వుంటుంది . ఎందుకంటే వ్యాపారాభివృధ్ధికి మూలమైనదని ఎప్పుడైతే మొబైల్ బిజినెస్ ప్రారంభించారో , అదే అన్ని రకాల వ్యాపారాలకు అవకాశమైంది .

      Delete