Showing posts with label పేరడీ పాటలు. Show all posts
Showing posts with label పేరడీ పాటలు. Show all posts

మమ్ము వదలి.......



                                                                                                                           పేరడీ పాట : శర్మ జీ ఎస్


( బాబూ మూవీస్ వారి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించిన ఈ " మంచి మనసులు " చిత్రం 1962 లో విడుదలై విజయభేరి మ్రోగించబడింది . ఆ చిత్రానికి మన సుకవి మనసుకవి ఆచార్య ఆత్రేయ గారు వ్రాసిన ' నన్ను వదలి నీవు పోలేవులే అదీ నిజములే " అన్న పాటకు ఈ నాటి రాజకీయాలకు పేరడిగ వ్రాయబడ్డది .)

మమ్ము వదలి మీరు పోలేరులే అదీ నిజములే' ,
ఓట్లు లేక మీరు నిలువలేరులే... లేరులే ,
మమ్ము వదలి మీరు పోలేరులే అదీ నిజములే' ,
ఓట్లు లేక మీరు నిలువలేరులే... లేరులే .

ఓట్లు లేని మాకు విలువలేదులే ఇదీ నిజములే ,
మీరు  లేని మేము లేనె లేములే... లేములే  ,
ఓట్లు లేని మాకు విలువలేదులే ఇదీ నిజములే ,
                        మీరు  లేని మేము లేనె లేములే... లేములే  .                          

మీ మనసే చిక్కుకునే మా ఓట్ల వలలో ,
మా ఓట్లు మీ నోట్లు నిండెను మీ మదిలో ,
మీ మనసే చిక్కుకునే మా ఓట్ల వలలో ,
మా ఓట్లు మీ నోట్లు నిండెను మీ మదిలో ,
చిరకాలపు మీ కలలే ఈ నాటికి నిజమాయే ,
దూరమైన ఆ స్థానాలు చేరువైపోయె ఓ... ,

ఓట్లు లేని మీకు విలువలేదులే ఇదీ నిజములే ,
                           మేము లేని మీరు లేనె లేరులే... లేరులే .                           

మందు మత్తులో కనులు మూసుకుని ,
మొఖము వంచుకుని ,
చెయ్యరాని ఘోరాలు చెయ్యమని , 
మందు మత్తులో కనులు మూసుకుని ,
మొఖము వంచుకుని ,
చెయ్యరాని ఘోరాలు చెయ్యమని .
ఆకర్షించే ఆ సీటులో అమాంతంగా కూచొని ,  
                        పొంగిపోయే శుభదినం రానున్నదిలే ఓ... ,                           

మమ్ము వదలి మీరు పోలేరులే అదీ నిజములే' ,
ఓట్లు లేక మీరు నిలువలేరులే... లేరులే .


అసెంబ్లీలో  అగపడుతూ , తడబడుతూ  మెలమెల్లగా ,
మీరు కూర్చోగా , 

ఆ సీటు హొయలు మీలోని పొగరు మాలోన ,
కంగారు రేపగా , 

నాయకులు కలసి ఉయ్యాలలూగి అవకాశమే ,
అందుకొనగా ,
      పైపైకి సాగి అసెంబ్లీలు దాటి అందరాని స్థానాలు అందుకోగా ,  

                ఆహా..ఓహో..ఉహూ...ఆ..ఆ..ఆ... ,                          

ఓ...మిమ్ము వదలి మేము పోలేములే ఇదీ నిజములే ,

మీరు లేని మేము లేనె లేములే..లేములే  ,

ఓ...మిమ్ము వదలి మేము పోలేములే ఇదీ నిజములే ,

                      మమ్ము వదలి మీరు పోలేరులే అదీ నిజములే' .                       


                                                                                                    ******                                                                                                                                                                                                                                

ల ల లాం లక్కీ ఛాన్సులే


                                                                                                                                      రచన : శర్మ జీ ఎస్

( ( 1959 లో విడుదలైన ( అంటే స్వాతంత్ర్యం వచ్చిన 12 ఏళ్ళకన్నమాట )  " ఇల్లరికం " తెలుగు సినిమాలో కొసరాజు రాఘవయ్య చౌదరి గారు వ్రాసిన ఈ పాటకు నేటి రాజకీయ నాయకులకు పేరడీగా వ్రాయటం జరిగింది  ))


భలేచాన్స్ భలేచాన్సులే...
భలేచాన్సులే భలేచాన్సులే
లలలాం లలలాం లక్కీచాన్సులే
భలేచాన్సులే
అధికారంలో వున్న మజా...
అధికారంలో వున్న మజా..
అది అనుభవించితే తెలియునులే,
తెలియునులే,
భలేచాన్సులే...

అమాయకపు ప్రజలకు  ఒక్క నాయకుడౌ ,
అదృష్ట యోగం పడితే , పడితే ,
పోటీదారులే లేకుంటే
ఆ నాయకుడిదే అధికారం ,
అధికారం ,
భలేచాన్సులే...

మందుపోసినా అమృతంలాగా
కమ్మగా ఉందనుకుంటే
బహుకమ్మగా ఉందనుకుంటే
ఛీ, ఛా అన్నా చిరాకు పడక
దులపరించుకు పోయేవాడికి
భలేచాన్సులే (అధికారంలో వున్న మజా )

సీ బీ ఐ  పట్టుకుని బయటికీడ్చినా,
చెఱసాలలో ఫెట్టినా ,
సీటు పట్టుకొని వేలాడీ , వేలాడీ ,
దూషణ భూషణ తిరస్కారములు
ఆశీస్సులుగా తలచేవాడికి  ,
భలేచాన్సులే (అధికారంలో వున్న మజా )

అణగి మణగి ఉన్నామంటే
అంతా మనకే చిక్కేది (2)
పైసా పైసా కూడబెట్టితే
మనవాళ్ళకే కాదా దక్కేది
అది మనవాళ్ళకే కాదా దక్కేది
అది మనకే ఇహ మనకే
అది మనకే మనకే మనకే
వదలను కనకే , కనకే , కనకే .

              *******