పేరడీ పాట : శర్మ జీ ఎస్
( బాబూ మూవీస్ వారి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించిన ఈ " మంచి మనసులు " చిత్రం 1962 లో విడుదలై విజయభేరి మ్రోగించబడింది . ఆ చిత్రానికి మన సుకవి మనసుకవి ఆచార్య ఆత్రేయ గారు వ్రాసిన ' నన్ను వదలి నీవు పోలేవులే అదీ నిజములే " అన్న పాటకు ఈ నాటి రాజకీయాలకు పేరడిగ వ్రాయబడ్డది .)
మమ్ము వదలి మీరు పోలేరులే అదీ నిజములే' ,
ఓట్లు లేక మీరు నిలువలేరులే... లేరులే ,
మమ్ము వదలి మీరు పోలేరులే అదీ నిజములే' ,
ఓట్లు లేక మీరు నిలువలేరులే... లేరులే .
ఓట్లు లేని మాకు విలువలేదులే ఇదీ నిజములే ,
మీరు లేని మేము లేనె లేములే... లేములే ,
ఓట్లు లేని మాకు విలువలేదులే ఇదీ నిజములే ,
మీరు లేని మేము లేనె లేములే... లేములే .
మీ మనసే చిక్కుకునే మా ఓట్ల వలలో ,
మా ఓట్లు మీ నోట్లు నిండెను మీ మదిలో ,
మీ మనసే చిక్కుకునే మా ఓట్ల వలలో ,
మా ఓట్లు మీ నోట్లు నిండెను మీ మదిలో ,
చిరకాలపు మీ కలలే ఈ నాటికి నిజమాయే ,
దూరమైన ఆ స్థానాలు చేరువైపోయె ఓ... ,
ఓట్లు లేని మీకు విలువలేదులే ఇదీ నిజములే ,
మేము లేని మీరు లేనె లేరులే... లేరులే .
మందు మత్తులో కనులు మూసుకుని ,
మొఖము వంచుకుని ,
చెయ్యరాని ఘోరాలు చెయ్యమని ,
మందు మత్తులో కనులు మూసుకుని ,
మొఖము వంచుకుని ,
చెయ్యరాని ఘోరాలు చెయ్యమని .
ఆకర్షించే ఆ సీటులో అమాంతంగా కూచొని ,
పొంగిపోయే శుభదినం రానున్నదిలే ఓ... ,
మమ్ము వదలి మీరు పోలేరులే అదీ నిజములే' ,
ఓట్లు లేక మీరు నిలువలేరులే... లేరులే .
అసెంబ్లీలో అగపడుతూ , తడబడుతూ మెలమెల్లగా ,
మీరు కూర్చోగా ,
ఆ సీటు హొయలు మీలోని పొగరు మాలోన ,
కంగారు రేపగా ,
నాయకులు కలసి ఉయ్యాలలూగి అవకాశమే ,
అందుకొనగా ,
పైపైకి సాగి అసెంబ్లీలు దాటి అందరాని స్థానాలు అందుకోగా ,
ఆహా..ఓహో..ఉహూ...ఆ..ఆ..ఆ... ,
ఓ...మిమ్ము వదలి మేము పోలేములే ఇదీ నిజములే ,
మీరు లేని మేము లేనె లేములే..లేములే ,
ఓ...మిమ్ము వదలి మేము పోలేములే ఇదీ నిజములే ,
మమ్ము వదలి మీరు పోలేరులే అదీ నిజములే' .
******
No comments:
Post a Comment