1 . ఆకట్టుకున్నదానితో ఆనందించకు ,
ఆ కట్టుకున్నదానితోనే ఆనందించు .
2 . కనిపించిన కన్నెపిల్లలను వదలలేడు ,
కట్టుకున్న తల్లితండ్రులను మాత్రం వదిలేస్తాడు .
3 . గమ్యం తెలియకుంటే అంతా అగమ్యమే ,
అదే తెలుసుకుంటే అంతా సుగమమే .
4 . ఒకరికి అన్యాయం చేయకపోవటమే ,
న్యాయం చేయటానికి సుముఖతగా ఉన్నట్లే .
5. వయసులో ముద్దులు,
వయసైనాక ముద్దలు .
6. కొస మెఱుపులే ,
పస తెలుపులే .
7. రోగం ఒక్క రోజులో రాదు ,
ఒక్క రోజులో తగ్గదు కూడా .8. అవసరమైతే దిశ మార్చుకో ,
సునాయాసంగా దశ హెచ్చులే .
9 వ్యసనాలు అంటుకొంటే వదలవు
పాసనాలు పట్టుకుంటే ఆగవు .
దగ్గరకెళ్తే ఆ కొండలే గణుపు
( మఱి కొన్ని మరో మారు )
No comments:
Post a Comment