ల ల లాం లక్కీ ఛాన్సులే


                                                                                                                                      రచన : శర్మ జీ ఎస్

( ( 1959 లో విడుదలైన ( అంటే స్వాతంత్ర్యం వచ్చిన 12 ఏళ్ళకన్నమాట )  " ఇల్లరికం " తెలుగు సినిమాలో కొసరాజు రాఘవయ్య చౌదరి గారు వ్రాసిన ఈ పాటకు నేటి రాజకీయ నాయకులకు పేరడీగా వ్రాయటం జరిగింది  ))


భలేచాన్స్ భలేచాన్సులే...
భలేచాన్సులే భలేచాన్సులే
లలలాం లలలాం లక్కీచాన్సులే
భలేచాన్సులే
అధికారంలో వున్న మజా...
అధికారంలో వున్న మజా..
అది అనుభవించితే తెలియునులే,
తెలియునులే,
భలేచాన్సులే...

అమాయకపు ప్రజలకు  ఒక్క నాయకుడౌ ,
అదృష్ట యోగం పడితే , పడితే ,
పోటీదారులే లేకుంటే
ఆ నాయకుడిదే అధికారం ,
అధికారం ,
భలేచాన్సులే...

మందుపోసినా అమృతంలాగా
కమ్మగా ఉందనుకుంటే
బహుకమ్మగా ఉందనుకుంటే
ఛీ, ఛా అన్నా చిరాకు పడక
దులపరించుకు పోయేవాడికి
భలేచాన్సులే (అధికారంలో వున్న మజా )

సీ బీ ఐ  పట్టుకుని బయటికీడ్చినా,
చెఱసాలలో ఫెట్టినా ,
సీటు పట్టుకొని వేలాడీ , వేలాడీ ,
దూషణ భూషణ తిరస్కారములు
ఆశీస్సులుగా తలచేవాడికి  ,
భలేచాన్సులే (అధికారంలో వున్న మజా )

అణగి మణగి ఉన్నామంటే
అంతా మనకే చిక్కేది (2)
పైసా పైసా కూడబెట్టితే
మనవాళ్ళకే కాదా దక్కేది
అది మనవాళ్ళకే కాదా దక్కేది
అది మనకే ఇహ మనకే
అది మనకే మనకే మనకే
వదలను కనకే , కనకే , కనకే .

              *******

11 comments:

  1. చాలా బాగా ఇమిటేట్ చేసారు.ఆయనకి కూడా కవిరాజు అనే బిరుదు ఉన్నట్తుంది. అలా అయితే మీరు కపిరాజు అవుతారు.హాస్యానికి బొజ్జ దేవుడు ఒజ్జ అయితే లాస్యానికి తోకదేముడు పెద్ద:-)

    ReplyDelete
    Replies
    1. హరిబాబు గారు ,

      మీమీద నాకు చాలా గౌరవం వున్నది . అది మీకు తెలుసనుకొంటున్నాను .
      ఇప్పటికి చాలామంది పేరడీ పాటలు వ్రాసి వుంటారు . పేరడీ అంటేనే అనుకరించటం అన్నది వేరే చెప్పనక్కరలేదనుకొంటాను .

      ఎదుటివారిని ఎల్లప్పుడూ తప్పుగా అర్ధం చేసుకోకండి .

      ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము రాఘవయ్యకు రఘుపతి వెంకయ్య అవార్డు (1984) ఇచ్చింది.
      తెలుగు ప్రజానీకం 'కవి రత్న' 'జానపద కవి సార్వభౌమ' మున్నగు బిరుదులు ఇచ్చింది.

      కవిరాజు అన్న బిరుదు వారికి లేదు . ఎదుటివారిని తిట్టిపొయ్యాలనే తలంపులతో యిలా వ్రాయటం మీలాంతి పెద్దవారికి తగదు అని భావిస్తున్నాను .
      తప్పనిసరి తెలియచేయవలసి వచ్చింది .

      విషయాలు తెలుసుకోవటం గొప్ప విషయమే . నిజాన్ని ధైర్యంగా మాట్లాడటం , ఒప్పుకోవటం అంతకంటే ఎంతో గొప్ప విషయం అనుకొంటున్నాను .


      మీరు దయచేసి మీ కాంటాక్ట్ నంబర్ యిస్తే , మీతో మాట్లాడాలనుకొంటున్నాను .

      Delete
    2. క్షమించాలి.నేను మిమ్మల్ని తిట్టదం యేమిటి?మీరన్నా మీ బ్లాగన్నా చాలా గౌరవం నాకు.పేరడీ గురించీ తెలుసు. మీ పేరడీ బాగుందనే అభిప్రాయం లోనే కామెంటు వేసాను.కొన్ని సినిమా పత్రికల్లో కవిరాజు కొసరాజు అని రెఫర్ చెయ్యటం చూశాను.భావం లోనూ పదాల యెంపిక లోనూ అదే ఒడుపు చూపించతం వల్ల అలా పోల్చాను, అనతే.కామెంటులో ప్రాస కోసం సరదాగా రాసాను.

      కామెంటులో క్లారిటీ లోపించటం అపార్ధానికి గురయినట్టుంది.మరోసారి క్షమాపణలు.

      Delete
    3. హరిబాబు గారు ,

      మన్నించటం , అటువంటి మాటలు వాడకండి . ఏదో కాసేపు సరదాకి , కాలక్షేపానికి , మన భావనలను నలుగురితో పంచుకోవటానికి వ్రాయటం జరుగుతున్నది .
      పేరడీ పాటలెప్పుడూ కడుపు మంటతో పుట్టి కొంతమందినైనా నవ్విస్తాయనేది నా భావన . అంతే .

      Delete
    4. సారు కూలయ్యా రన్న మాట!సినిమా పత్రికల వళ్ళు తమ పాండిత్యం కోసం ప్రాస కోసం "కొస రాజు", "కవి రాజు" అనేసరికి నేను అది నిజమే కాబోలు ననుకుని కామెంటులో ప్రాస కోసం సరదాగా వాడుకునేసరికి మీకది నేను వెక్కిరింతగా చేసాననుకున్నారు.కామెంటులో యెక్కదయినా ఒక స్మైలీ వేస్తే పోయేది. యేమయినా కాంటాక్టు నంబర్ అదగటం మాత్రం నిజంగానే కంగారు పెట్టింది:-)

      Delete
    5. హరిబాబు గారూ ,


      కూల్ అవటానికి , హర్ట్ అవటానికి మన నడతేనన్నది మీకూ తెలియనిదేమీ కాదుగా .
      కంటాక్ట్ నంబర్ అడిగింది మిమ్మల్నేదో చేయాలని మాత్రం కాదు . మీతో వీలుంటే నాలుగు మంచి మాటలు మాట్లాడి నాకు తెలియని విషయాలు , మీకు తెలిసిన విషయాలు తెలుసుకోవాలనే తప్ప వేరే దురుద్దేశాలేమీ లేవు . కాస్త అర్ధం చేసుకొందురూ .

      Delete
  2. కొసరాజు గారిని "కవిసార్వభౌమ" అనే వారనుకుంటాను (నాకు గుర్తున్నంత వరకు). "కవిరాజు" అనే బిరుదు మాత్రం త్రిపురనేని రామస్వామి గారిది. దువ్వూరి రామిరెడ్డి గారిని "కవికోకిల" అనేవారు.

    శర్మ గారి పేరడీ బాగుంది. ఎన్ని వ్రాసినా "ఆ మనుష్యులు" మారతారనుకోను; మనం చదివి నవ్వుకుని ఆనందించడమే.

    ReplyDelete
    Replies
    1. శ్రీ విన్నకోట నరసింహా రావు గారికి ,
      ముందుగ నా బ్లాగుకి స్వాగతం .
      మీరన్నట్లు సరదా కొఱకు వ్రాసిందే అయినా , అల్లాంటి నాయకులలో మార్పు వస్తే బాగుంటుందని . ఇవేమీ వాళ్ళకు తెలియనివి కావు .
      నిద్రపోతున్న వాడిని లేపటానికి ప్రయత్నం చేసి ఎప్పటికైనా లేపవచ్చు . నిద్రపోతున్నట్లు నటించేవాడిని ఎన్నటికీ లేపలేము .

      ఇక మీరన్నట్లు " కవి సార్వభౌమ " బిరుదు కాదు , " జనపద కవిసార్వభౌమ " బిరుదు ప్రదానం చేయబడినది .

      Delete
    2. Thank you Sri Sharma garu for your welcome and the correction.

      Delete
  3. Idi just fun anni parady llagaane. Dayachesi evvaruu garam...garam ayipokandi, maree serious gaa theesukokandi. Kaassepu navvukuni vadileddam anthe........thagalaasina vaallaki elaaguu thagaladu.

    ReplyDelete
    Replies
    1. శ్రీ జే.వీ.రావు గారికి ,

      ముందుగా నా బ్లాగుకి స్వాగతం .

      పేరడీ పాటలెప్పుడూ విమర్శలతో కూడిన సరదాలతోనే ఎక్కువగా ముడిపడి వుంటాయి . మామూలు పాటలు , భక్తిగీతాలు వుంటాయి .

      ఇది కాసేపు సరదాగా ఉండటానికని అర్ధం చేసుకొంటే చాలు .

      ఇవేవో తగలాల్సిన వాళ్ళకి తగిలి , మనకేదో చేస్తారని భావించటం లేదు . 40 ఏళ్ళక్రితమనుకుంటా శ్రీశ్రీ గారు చెప్పారు .
      ఎవరో వస్తారని ,
      ఏదో చేస్తారని ,
      ఎదురు చూసి మోసపోకుమా ,
      నిజం మఱచి నిదుర పోకుమా అని .

      ఇది ఈ నాటి పరిస్థితులకు నిప్పు లాంటి నిజం .

      Delete