మమ్ము వదలి.......                                                                                                                           పేరడీ పాట : శర్మ జీ ఎస్


( బాబూ మూవీస్ వారి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించిన ఈ " మంచి మనసులు " చిత్రం 1962 లో విడుదలై విజయభేరి మ్రోగించబడింది . ఆ చిత్రానికి మన సుకవి మనసుకవి ఆచార్య ఆత్రేయ గారు వ్రాసిన ' నన్ను వదలి నీవు పోలేవులే అదీ నిజములే " అన్న పాటకు ఈ నాటి రాజకీయాలకు పేరడిగ వ్రాయబడ్డది .)

మమ్ము వదలి మీరు పోలేరులే అదీ నిజములే' ,
ఓట్లు లేక మీరు నిలువలేరులే... లేరులే ,
మమ్ము వదలి మీరు పోలేరులే అదీ నిజములే' ,
ఓట్లు లేక మీరు నిలువలేరులే... లేరులే .

ఓట్లు లేని మాకు విలువలేదులే ఇదీ నిజములే ,
మీరు  లేని మేము లేనె లేములే... లేములే  ,
ఓట్లు లేని మాకు విలువలేదులే ఇదీ నిజములే ,
                        మీరు  లేని మేము లేనె లేములే... లేములే  .                          

మీ మనసే చిక్కుకునే మా ఓట్ల వలలో ,
మా ఓట్లు మీ నోట్లు నిండెను మీ మదిలో ,
మీ మనసే చిక్కుకునే మా ఓట్ల వలలో ,
మా ఓట్లు మీ నోట్లు నిండెను మీ మదిలో ,
చిరకాలపు మీ కలలే ఈ నాటికి నిజమాయే ,
దూరమైన ఆ స్థానాలు చేరువైపోయె ఓ... ,

ఓట్లు లేని మీకు విలువలేదులే ఇదీ నిజములే ,
                           మేము లేని మీరు లేనె లేరులే... లేరులే .                           

మందు మత్తులో కనులు మూసుకుని ,
మొఖము వంచుకుని ,
చెయ్యరాని ఘోరాలు చెయ్యమని , 
మందు మత్తులో కనులు మూసుకుని ,
మొఖము వంచుకుని ,
చెయ్యరాని ఘోరాలు చెయ్యమని .
ఆకర్షించే ఆ సీటులో అమాంతంగా కూచొని ,  
                        పొంగిపోయే శుభదినం రానున్నదిలే ఓ... ,                           

మమ్ము వదలి మీరు పోలేరులే అదీ నిజములే' ,
ఓట్లు లేక మీరు నిలువలేరులే... లేరులే .


అసెంబ్లీలో  అగపడుతూ , తడబడుతూ  మెలమెల్లగా ,
మీరు కూర్చోగా , 

ఆ సీటు హొయలు మీలోని పొగరు మాలోన ,
కంగారు రేపగా , 

నాయకులు కలసి ఉయ్యాలలూగి అవకాశమే ,
అందుకొనగా ,
      పైపైకి సాగి అసెంబ్లీలు దాటి అందరాని స్థానాలు అందుకోగా ,  

                ఆహా..ఓహో..ఉహూ...ఆ..ఆ..ఆ... ,                          

ఓ...మిమ్ము వదలి మేము పోలేములే ఇదీ నిజములే ,

మీరు లేని మేము లేనె లేములే..లేములే  ,

ఓ...మిమ్ము వదలి మేము పోలేములే ఇదీ నిజములే ,

                      మమ్ము వదలి మీరు పోలేరులే అదీ నిజములే' .                       


                                                                                                    ******                                                                                                                                                                                                                                

ఓటు - వేటు

                                                                                                           
                                                                                                                                     రచన : శర్మ జీ ఎస్

దవాఖానాలో ఉన్నా ,
ఆఖరికి ,
పాయిఖానాలో వున్నా , 
చిట్లించుకొంటున్నా ,
ఛీదరించుకొంటున్నా , 
నాకూ , నా వాళ్ళకి ,
యిచ్చినంత ప్రాముఖ్య ,
వాళ్ళ భార్యకే కాదు ,
వాళ్ళను కన్నవాళ్ళకు గాని ,
వాళ్ళు కన్నవాళ్ళకు గాని ,
ఇవ్వనే యివ్వరు ,

వాళ్ళ 5 ఏళ్ళ రాజకీయ భవితవ్యాన్ని ,
తేల్చే వాడిని , నేనేనని  ,
( ఓటరుని  కదా ! )
కటిక నేలపైనైన ,
ఏ నాయకులైనా  , 
నాకొఱకు పడిగాపులు కాస్తారు ,

అలా నా ఓటు అందుకున్నాక ,
అదేనండి , 
రేపు గెలిచాక ,
ఆ పదవులను అంటిపెట్టుకొని , 
ఆ సీటు కొఱకు తాము వెచ్చించిన దానికి ,
పదింతలని రాబట్టుకోవటంలో వాళ్ళు చూపే శ్రధ్ధలో , 
నన్నే మఱచిపోతారు ,
మఱచిపోవటం మానవ నైజమేనని ,
అనుకొని సర్ది చెప్పుకోవచ్చు ,
కానీ , 
నేనెవ్వరో గుర్తు చేసినా , 
గుర్తుకు వచ్చినా , రానట్లు , 
అసలు తెలియనట్లు ప్రవర్తించే ఆ తీరుకే , 
ఓటు వేయాలన్న మనసు ,
కలగటం లేదు ,
 ఆలోచనే రావటం లేదు ,
చదువుకున్న నాకైనా , 
చదువు తెలియని మా అమ్మా , అయ్యలకైనా ,
డొనేషన్లు కట్టి చదువు కొనే నా వారసులకైనా .

  ******

(ని)దర్శనం


                                                                                                                                      రచన : శర్మ జీ ఎస్నా(యకుల)కు రెండే రెండట ,
మొదటిది సీటట , దానికే ఓట్లట ,
ఏం చేయటానికైనా వెనుకాడరట .

నా(యకుల)కు పార్టీ ముఖ్యంకాదంటారు ,
అధికారమే ముఖ్యమంటూనే 
అదీ ప్రజాసేవకంటారు .

ఎజెండాలేమిటంటే ,
ఏ జెండా ఐనా ఫరవాలేదంటారు  ,
లెజెండునయితే చాలంటారు .

ఆ సీటు కొఱకు ,
ఏ గడియైనా తడతానంటారు ,
ఏ చర్యకైనా వెనకాడనంటారు .

ప్రజలకు దగ్గరయ్యేటందుకు ,
ప్రజాసేవ చేసేటందుకు ,
ఇదొక్కటే అనువైన మార్గమంటారు .

జయంతి , వర్ధంతులకు కనపడ్తారు ,
దండలు వేస్తారు , ఫొటోలకు పోజులిస్తారు ,
చప్పట్లు కొట్టించుకొంటారు .

నేటి బాలలని రేపటి పౌరులుగా చాటేస్తారు ,
తమకే తప్పక ఓట్లెయ్యాలని వాటేసుకొంటారు ,

ఈ ఎన్నికల ప్రచారంలోనే వారి మహద్దర్శనం ,
ఆ పై కానరారు అదే వారి రాజకీయాలకు నిదర్శనం .

******

మీ మా లు


                                                                                                                                     రచన : శర్మ జీ ఎస్

" ఎన్నికలు " అంటేనే , మనకు కావల్సిన అనటం కంటే , మనలను చక్కగా పరిపాలించేవాళ్ళను " ఎన్నిక " చేసుకోవటమని మనందరకు తెలిసిన విషయమే .

మన " ఎన్నిక " ఎలా వుండాలంటే , "మన్నిక " కెంత ప్రాధాన్యత యిస్తామో , అలాగే ఈ ఎన్నిక(ల )కు కూడా అంతకంటే అధిక ప్రాధాన్యతను యీయవలసి వుంటుంది .  

మనం ( ఓటర్లు ) ఈ విషయాన్ని ఎన్నటికీ మఱచిపోకూడదు . 

మనలను సక్రమంగా పరిపాలించే నాయకులను మనమే ఎన్నుకోవటం స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మనకు ఆనవాయితీలోకి వచ్చింది . 

ఆ ఆనవాయితీ క్రమేపీ వారసత్వంలోకి మారింది . 

ఆ వారసత్వం ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎగబాకింది .

ఆ వారసత్వ పోరుతోటే సుపరిపాలన అందించే నాయకులను ఎన్నుకోవసిన ఈ ఓటర్లను తికమక పెట్టి వాళ్ళ వారసత్వాధిపత్యాన్ని కొనసాగించేటందుకు గాను , 

కొన్నాళ్ళు ఓటర్లను మద్యానికి , 
కొన్నాళ్ళు ధనానికి , 
కొన్నాళ్ళు వాళ్ళ స్వ అవసరాలను తెలుసుకొని వాటిని అందిస్తూ వచ్చారు . అలా కొంతకాలం సాగింది .

ఎప్పుడైతే వాళ్ళ వారసత్వపు పరిపాలనా దక్షతకు , ఆధిపత్యపు ఆటలకు అడ్డుకట్ట పడినదో ,అప్పుడు కొత్త కొత్త ఆలోచనలతొ , పోటీదారులను ఎక్కువ మందిని వాళ్ళే నిలబెట్టి , ఓట్లను చీల్చి , వాళ్ళు అనుకొన్న విధంగానే , ఆ వారసత్వపు పరిపాలనా అధికారాన్ని మఱల చేజిక్కించుకోవటం అలవాటు చేసుకొంటూ వచ్చారు . 

ఐతే  , ఈ మార్గాలన్నీ మూసుకు పోయేసరికి , ఎవరితో స్నేహం చేసి అయినా సరే అధికారం దక్కించుకోవాలన్న ఉద్దేశ్యంతో , తోటి రాజకీయ పార్టీలను ( తమకంతకు ముందు శత్రువులైనా సరే ) స్నేహబంధం అనే ఎత్తుగడలతో పొత్తుల పొత్తాన్ని బైటకు తీసి ఎదురుచూస్తున్నారు .

గతంలో లాగా ప్రజలు ఇప్పుడు వెఱ్ఱివాళ్ళు కారు అన్నది అన్ని రాజకీయ పార్టీలు గ్రహించటం చాలా అవసరం వారి భవిష్యత్ కార్యాచరణలకు .

ఓనాడైతే , ఆ నాయకులు ఏం చెపితే అది విన్నారు , నమ్మారు  ఓటర్లు . 

కాని నేడు అలా కాదు . ప్రసార మాధ్యమాల ( రేడియో , పత్రికలు , బుల్లితెరల ) పుణ్యమా అన్ని విషయాలు ( జరిగిన ) అరక్షణంలోనే తెలిసిపోతున్నాయి  ఓటర్లకు .

అందువలన ఓటర్లు జాగృతులైనారన్నది నాయకులు మఱచిపోరాదు .

మద్యంతో , మనీతో , గూండాయిజంతో , అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేయకండి నాయకులారా ! 

చూపులకి , కాగితాలకి పరిమితమయ్యే బూటకపు ప్రజా సంక్షేమ ఆకర్షణ పధకాల ప్రణాలికలతో ఓటర్ల వద్దకు రాకండి .  

అమలు జరపగలిగే ఆచరణ యోగ్యమైన , అర్ధవంతపు చేతలతో ఓటర్ల వద్దకు రండి .  ఓట్లు అడగండి .

గెలిచి , అధికారానికొచ్చిన తర్వాత మీరిచ్చిన   ఆచరణ యోగ్యమైన ప్రణాలికలోని అంశాలను ఆచరణలో పెట్టండి .

ఈ విషయాలు మీకు తెలియనివని చెప్పటం లేదు . ఓట్ర్ల నాడి మారిందని తెలియచేస్తున్నా . 

తెలుసుకొని తదనుగుణంగా మసులుకొంటే రాబోయే తరాల నాయకులకు మార్గదర్శకులౌ తారు . చరిత్రలో చరిత్రకారులౌతారు .
లేకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు .

కనుక నాయకులూ యికనైనా తెలుసుకొని మసులుకొంటే మీ , మా మనుగడకే మంచిది .
  
                                                                                                       ********

ధనం , ఇంధనం , సాధనం


                                                                                                                                      రచన : శర్మ జీ ఎస్ 

ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసిన నాటి నుంచి  ప్రతి రోజు బుల్లితెరలో  నిత్యం నల్లధనాన్ని పట్టుకుంటున్న వివరాలన్నీ పోలీస్ అధికారులు , ఎన్నికల అధికారులు కూడా ఎప్పటికప్పుడు తెలియచేస్తుంటే , అన్నీ ప్రత్యక్షంగా చూస్తూనే వున్నాము , వింటూనే వున్నాము , పత్రికలలో నిత్యం చదువుతూనే వున్నాము .

అంతగా పట్టుబడ్తున్న ఆ నల్లధనం యిప్పటికి 6.48 కోట్ల వఱకు చేరిందని , మఱల ప్రభుత్వానికే చేరిపోతుందని వింటున్నాము . 

వాస్తవంగా ఆ నల్లధనం అక్రమంగా నాయకులు ఓటర్లకు లంచం రూపంలో ముట్టజెప్పదలచుకొన్నదే గదా!  

మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో కనీస అవసరాలు కూడా లేని పరిస్థితులలో అట్టడుగున జీవిస్తున్న కోట్ల మంది ప్రజలను , పల్లెలను నిత్యం ప్రముఖ పత్రికలలో చిత్రాలతో చూస్తూ చదువ్తున్నాము  , బుల్లితెరలలో దృశ్యాలతో సహా చూస్తున్నాము కూడా చూస్తున్నాము , వింటున్నాము .

అలాంటి ఆ ధనాన్ని మఱల ప్రభుత్వానికి చేర్చి గమ్ముగా కూర్చొనే కంటే , ఆ నల్లధనాన్ని యిలాంటి వాటికి ప్రభుత్వాధికారుల పర్యవేక్షణలో వాటి బాగోగులకు వినియోగించటం అన్ని విధాలా శ్రేయస్కరం .

ఆ నల్లధనాన్నిలా సద్వినియోగం చేస్తే , భవిష్యత్తు ఎన్నికలలో ఎవ్వరూ ఓటరల్ ధనాన్ని పంచాలనుకోరు . ఎందుకంటే , వాళ్ళ నల్లధనం వాళ్ళ పేర్లతో ( కనీసం ) వినియోగం కావటం లేదు కదా! .

ధనం సమాజ శ్రేయస్సుకి ఉపయోగపడినప్పుడు అది ఇంధనమౌతుంది , సాధనమౌతుంది .

గమనిక : ఈ వ్యాసాన్ని ఏప్రియల్ 4 వ తారీఖున ఈనాడు తెలుగు దినపత్రికకు పంపగా వారు ప్రచురించలేదు . అందువలన ఈ వ్యాసాన్ని నా బ్లాగులో ప్రచురించటమైనది . 

                                                                                                            ******* 

ల ల లాం లక్కీ ఛాన్సులే


                                                                                                                                      రచన : శర్మ జీ ఎస్

( ( 1959 లో విడుదలైన ( అంటే స్వాతంత్ర్యం వచ్చిన 12 ఏళ్ళకన్నమాట )  " ఇల్లరికం " తెలుగు సినిమాలో కొసరాజు రాఘవయ్య చౌదరి గారు వ్రాసిన ఈ పాటకు నేటి రాజకీయ నాయకులకు పేరడీగా వ్రాయటం జరిగింది  ))


భలేచాన్స్ భలేచాన్సులే...
భలేచాన్సులే భలేచాన్సులే
లలలాం లలలాం లక్కీచాన్సులే
భలేచాన్సులే
అధికారంలో వున్న మజా...
అధికారంలో వున్న మజా..
అది అనుభవించితే తెలియునులే,
తెలియునులే,
భలేచాన్సులే...

అమాయకపు ప్రజలకు  ఒక్క నాయకుడౌ ,
అదృష్ట యోగం పడితే , పడితే ,
పోటీదారులే లేకుంటే
ఆ నాయకుడిదే అధికారం ,
అధికారం ,
భలేచాన్సులే...

మందుపోసినా అమృతంలాగా
కమ్మగా ఉందనుకుంటే
బహుకమ్మగా ఉందనుకుంటే
ఛీ, ఛా అన్నా చిరాకు పడక
దులపరించుకు పోయేవాడికి
భలేచాన్సులే (అధికారంలో వున్న మజా )

సీ బీ ఐ  పట్టుకుని బయటికీడ్చినా,
చెఱసాలలో ఫెట్టినా ,
సీటు పట్టుకొని వేలాడీ , వేలాడీ ,
దూషణ భూషణ తిరస్కారములు
ఆశీస్సులుగా తలచేవాడికి  ,
భలేచాన్సులే (అధికారంలో వున్న మజా )

అణగి మణగి ఉన్నామంటే
అంతా మనకే చిక్కేది (2)
పైసా పైసా కూడబెట్టితే
మనవాళ్ళకే కాదా దక్కేది
అది మనవాళ్ళకే కాదా దక్కేది
అది మనకే ఇహ మనకే
అది మనకే మనకే మనకే
వదలను కనకే , కనకే , కనకే .

              *******

పంచవర్ష ప్రణాలిక


                                                                                                                                   రచన : శర్మ జీ ఎస్
                                                                             
టోపీలు పెట్టుకుంటారు ,
టోకరాలు చేస్తుంటారు . 

ప్రేమగా వాటేసుకొంటారు ,
దోమలా కాటేయ చూస్తారు .
                                                                           
ఇస్త్రీలు చేస్తారు ,
కుస్తీలు పడతారు .

కట్టెలు మోస్తారు ,
రొట్టెలు వేస్తారు ,

మొక్కలు నాటుతారు ,
గోతులు తవ్వుతారు .

కూరలమ్ముతారు ,
చీరె , సారెలనిస్తారు  .

చెప్పని ఊసులు లేవు ,
చేసిన దాఖలాలు లేవు .

 దోశలు వేస్తారు ,
ఆశలూ రేపుతారు .

రాఖీలు కడతారు ,
కాఖీలను పడతారు .

ఆటోలు నడుపుతారు ,
ఆటలు ఆడుతారు .

కంకణం కట్టించుకొంటారు ,
కందకాల్లోకి తోసేస్తారు .

వెయ్యని వేషాలు లేవు ,
చెయ్యని మోసాలు లేవు .
                                                                 
ఎక్కని గడపలు లేవు ,
మొక్కని దేవుళ్ళు లేరు .

నీతులు వల్లిస్తారు ,
చేతులు జోడిస్తారు .

ఎండనకా , వాననకా తిరుగుతారు ,
ఏ ఎండకా గొడుగు వాడతారు ,

మనసారా పదవిని ఆకాంక్షిస్తూ ,
సారా , మనసారా అందిస్తారు .

సీట్ల కొఱకు ఎగబడ్తారు ,
ఈయకుంటే తిరగబడ్తారు .

కుర్చీలు విరగ గొడ్తారు ,
ఖుషీగ జెండా మార్చేస్తారు .

ఎదుటి పార్టీ తమ గూండాయిజానికే ,
సీటు యిస్తుందన్న దుర్భావనతో .

ఎంతైనా ఖర్చు పెడ్తారు ,
మఱల సంపాదించుకోవచ్చనే ,
దురాలోచనతో , దూరాలోచనతో .

ఈ వేషాలన్నీ ఈ ఎన్నికల సమయంలోనే ,
మన ఓట్లతో పదవులనందుకోవాలనే .

ఈ ఎన్నికలు మన నాయకులకు ,
పంచవర్ష ప్రణాళికలు గదా  మఱి  ! 


******


యువతా మేలుకో - నేతా ఇకపై ఏలుకో యిలా


                                                                                                                                       రచన : శర్మ జీ ఎస్

గమనిక : ఈ వ్యాసాన్ని ఏప్రియల్ 4 వ తారీఖున ఈనాడు తెలుగు దినపత్రికకు పంపగా వారు ప్రచురించలేదు . అందువలన ఈ వ్యాసాన్ని నా బ్లాగులో ప్రచురించటమైనది . 

" యువతే ఈ సారి ఎన్నికలలో ప్రధాన పాత్ర వహించి రాజకీయ నేతల తలవ్రాతలు మారుస్తారని పత్రికలలో చదువుతున్నాము  , బుల్లి తెరలలో కూడా వింటున్నాము ."

యువ ఓటర్లూ మేలుకోండి . ప్రభుత్వాలని నిలదీయండి . ఏ ప్రభుత్వాలైనా మీరంతా ఒక్కటే . కారణం మీరే రేపటి భావితరాల పౌరులు , నాయకులూ .

మీరు ఎవ్వరినైనా ఎన్నుకోండి . అధికారం కొఱకు ఏ పార్టీ జెండా ఎగరటానికి అవకాశమిచ్చినా ఫరవాలేదు ప్రభుత్వంలో .

మీరు ఓటు వేస్తున్నది  మీ బాగోగులు చూడటానికే నన్నది  మాత్రం మఱచిపోకండేం . 

వాళ్ళు పదవులంటిపెట్టుకొని వాళ్ళ సంపదలను , వాళ్ళ సమీప , దూరపు బంధువులు బాగుపడటానికి మాత్రం కాదని మనం మఱచి పోకండి.

అంతే కాకుండా మన ఈ భారత దేశంలో ఎంతోమంది యువత నిరుద్యోగంతో , నిరుత్సాహంతో సతమవుతున్నారు . 
అటువంటి యువతకు ఈ భారతదేశ నేతలు ఏం చేస్తున్నారు ?

యువతను ఎప్పటికప్పుడు ఉద్యమాలని , ఊరేగింపులని ఉసిగొల్పి , వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టేస్తున్నారు ఈ స్వార్ధపూరిత నాయకులు . ఆ యువతలో కొంతమంది చనిపోగానే , వాళ్ళకు స్మారక స్థూపాలు నిర్మించి , ఆ యువత తల్లి తండ్రులకు ఊరట కల్గిస్తున్నారే గాని , వారికి బాసటగా ఉండలేకపోతున్నారు . ఈ స్మారక స్థూపాల వలన చెట్టంత ఎదిగిన ఆ కొడుకులు వాళ్ళకు చేయూతగా లేకపోయారన్నది , వారి జీవితాల్ని దుర్భరం చేస్తుంది . జీవితమంతా ఆ దిగులుతో కృశిస్తూ వాళ్ళ ఆ శేష జీవితాల్ని గడపవలసినదే కదా ! ఆలోచించవలసిన విషయం . 

ఎన్నో ఉద్యోగాల ప్రకటనలు ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్లికేషన్లని అందిస్తూ , వాటికి చలాన్లు కట్టమని , ఆ పరీక్షలకు ఎక్కడో హాజరు కమ్మని పత్రికాముఖంగ ప్రకటనలు చేస్తుంది . వాస్తవానికి ఆ ఉద్యోగాల ఖాళీల సంఖ్య 4 , 5 అంకెలలోనే వుంటుంది . కానీ అప్లికేషన్లు మాత్రం లక్షల సంఖ్యలలో . ఎందుకంటే మన ఈ భారతదేశంలో నిరుద్యోగులు ఎక్కువ కదా ! 

విచిత్రమేమిటంటే , వాళ్ళసలే నిరుద్యోగులు , వాళ్ళ పాకెట్ ఖర్చులకు కూడా వాళ్ళు నిత్యం తల్లితంద్రుల వద్ద చేయి చాస్తూనే వుంటారు . అటువంటి వాళ్ళనుంచి , ఈ ఉద్యోగాల రూపంలో , 
అప్లికేషన్ల ద్వారా , 
చలాన్ల ద్వారా ,
రవాణా ఛార్జీల ద్వారా ,
అధికారిక క్యాంటీన్ల ద్వారా ,సంపాదిస్తుంటుంది మన ఈ ప్రభుత్వం . 
దీనివలన ఎంతమంది నిరుద్యోగులు , నిరుద్యోగులుగానే వుండిపోతున్నారో ఒక్క మారు ఆలోచించండి . వేలల్లో ఉద్యోగులు ,
లక్షల్లో వున్న నిరుద్యోగులనుంచి , కోట్లల్లో ప్రభుత్వం సంపాదించుకుంటుంది . ఆ పై అధికారులు పంచుకొంటారు కొన్ని ఉద్యోగాలను వాళ్ళ యిలాకాలో వాళ్ళకు ముట్టజెప్పి .

ఇలా ఈ మన ప్రభుత్వం చేసే కంటే , యిలా చేస్తే బాగుంటుంది ( ఏ ప్రభుత్వాలైనా ఈ భావి భవిష్యత్తుకి యువతకు )ఒకమారు కాదు , పలుమార్లు ఆలోచించండి .

అప్లికేషన్లు ఉచితంగా అందించాలి .
చలాన్లను ఎత్తివేయాలి .
ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళకు ఉచితంగా వెళ్ళేటందులకు , రైల్వేలో ఉచిత భోజన వసతి కల్పించాలి , అనుమతించాలి తగు నిర్ధారిత పత్రాలతో .
ఆ పరీక్షా కేంద్రాలలో క్యాంటీను వసతులు కల్పించి , నామ మాత్రపు ధరలకే నాణ్యతతో అందించాలి .
ప్రభుత్వ గెస్ట్ హౌస్ లలో ఆ పరీక్షా సమయాలలో మాత్రమే ఉండే ఉచిత వసతి కల్పించాలి .

ఆ ప్రభుత్వ ఉద్యోగాలు చదువును బట్టి కేటాయించాలే గాని , రికమండేషన్లతో కాదు . 
నిజ్జంగా వెనుకబడిన వర్గాలకూ ప్రాధాన్యత యివ్వవచ్చు . ఆ సాకుతో అన్యాయాలకు ఒడిగట్టకూడదు .

ఆ నాడు ఏ పార్టీ ప్రభుత్వం వున్నా యువతను తీర్చి దిద్దినదై , వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండగలదని ఘంటాపధంగా చెప్పవచ్చు .

                                                                                                                   ****** 

ఇవో పధకాలు


                                                                                                                                     రచన : శర్మ జీ ఎస్

ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నిరుపేదల ఓటు బ్యాంకుతోనే అన్నది ఎవ్వరూ , ఎన్నటికీ మరువరానిది .
అల వచ్చిన ప్రభుత్వాలు ఆ నిరుపెదలకి ఏవైనా చేయాలన్న సదుద్దేశ్యంతోనె కొన్ని కొన్ని కొత్త కొత్త పధకాలు లేవనెత్తుతుంటుంటారు .

అలాంటిదే ఈ క్రింది ఆలోచనలు .

పేదవాళ్ళు పిల్లలను కనటానికి ఉచిత ప్రసవానికి మందులతో కలిపి గర్భవతిగ నిర్ధారణ అయిన నాటి నుంచి  , ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్డర్లు జారీ చేశారు . అంతే కాకుండా ఆ పుట్టే ఆడపిల్ల భవిష్యత్తుకి భరోసా కల్పిస్తూ " బంగారు తల్లి " సర్టిఫికెట్ ని ప్రసవం అయి ఇంటికి వెళ్తూండగా యిష్యూ చేస్తుంది ప్రభుత్వం .
ఆ ఆడపిల్లలు ఎంతవరకు చదువుకొంటామంటారో , అంతవరకు వాళ్ళ చదువులకయ్యే ఖర్చు అంతా ప్రభుత్వమే పెట్టుకొంటుందని .

పధకాలైతే బాగానే వున్నాయి .

వాస్తవానికొస్తే , ఆ ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన వైద్యులు లేక , మందులు లేక అంతే కాదు పడకలు లేక ఎంతమంది నేల మీదనే ప్రసవ నొప్పులు పడ్తున్నారో నిత్యం మనం ప్రముఖ పత్రికలలో చదువుతున్నాము . బుల్లి తెరలలో చూస్తున్నాము .

అయినా  ప్రభుము తక్షణమే తీసుకొంటున్న చర్యలు ఏమీ కనపడటం లేదు .

అలాగని పేదవాళ్ళు పిల్లలను కనటానికే మాత్రం వెనకాడటం లేదు . అలాగే , ఆ కటిక నేలమీదనే ప్రసవిస్తున్నారు . ధైర్యంగా వుంటున్నారు , ఎందుకో తెలుసా ? ఆ ప్రభుత్వ పధకాలను చూసి .

ఇటువంటి ముందు చూపు అన్ని రాజకీయ పార్టీలదే . నేడు కాకపోయినా , రాబోయే కాలంలో ఆ నిరుపేదల ఓటు బ్యాంకుని కొల్లగొట్టగలమనే అత్యాశే ఈ పధకాల వెనుక వున్న అతి నిగూఢ రహస్యం .

ఈ పేదవాళ్ళ పిల్లలు పెరిగి పెద్దయ్యేనాటికి ఆ ప్రభుత్వంలో ఎవరు అధికారంలో వుంటారో ఎవ్వరి కెఱుక ?

ఈ పధకాలన్ని ఖాళీ స్థలంలో పెంచుతున్న టేకు మొక్కల లాంటివన్నది ఈ నిరుపేదలు గ్రహించకపోవటం కడు శోచనీయం .


వాళ్ళు దోచుకునేందుకు వీలుగా  " ఇవో పధకాలు  " .


నేత ( ర ) చరిత్ర


                                                                                                                                      రచన : శర్మ జీ ఎస్ 


ఎన్నికల సమయంలో , ధనం , బలం కలిగిన నాయకులను ఎటువంటివరినైనా తమ పార్టీ అభ్యర్ధిగ నిలబెట్టటానికి దాదాపు ప్రముఖ పార్టీలేమాత్రం వెనకాడటం లేదనే చెప్పుకోవాలి .

ఎవరు , ఏ పార్టీనుంచి వచ్చినా , స్వాగత వచనాలు పలికి , కుశల సమాచారాలడిగి , ఆ పై వాళ్ళ పార్టీల తీర్ధం యిచ్చి , ఆ పై ఓ కండువా కప్పి అభ్యర్ధిగా నామినేషన్లు వేయిస్తుంటారు .

ఆ సమయంలో ఆ నాయకులు తు .చ . తప్పకుండా వాళ్ళ ఆస్తుల వివరాలు , రిటర్నింగు అధికారికి అందిస్తున్నారు .
అయితే అవి ఎంతవరకు నిజం అన్నదే ప్రశ్నార్ధకమవుతున్నది .   

వాళ్ళు గతంలో ఎక్కడెక్కడ  స్థిర చరాస్తులు కొన్నారో , అవి కొనటానికి ఎన్ని రకాలుగ వ్యవహారాలు జరిపారో , అటు అమ్మిన వాళ్ళకి , యిటు కొన్న వాళ్ళకి , ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగినదో , ఎవరు డబ్బులు ముట్టజెప్పారో అన్ని వివరాలు చాలా మందికి తెలుసు . 

అటువంటివేమీ యిప్పుడు , యిక్కడ సదరు అభ్యర్ధి స్వంత ఆస్తుల లోనికి రావు .

తీరా  నామినేషన్లు వేసిన తర్వాత , నేరచరిత్రులనటం ఎంతవరకు సమంజసం ?
వాస్తవానికి ఆ యా పార్టీలు అభ్యర్ధిగా నామినేషన్లు వేయించిన తర్వాత , వాల్ళు కొత్తగ నేరాలు చేసిన వాళ్ళేమీ కాదు కద ! 

అంతకు ముందు వాళ్ళు నేరచరితులని , ఎన్నో మార్లు జైలు గడపలు చూసి వున్నారని , కోర్టు బోనులలో నుల్చొన్నారని , తమ తమ పలుకుబడిని ఉపయోగించి బయటకు వచ్చిన వాళ్ళేనని , యింకా కొంతమంది కేసులు కోర్టులలో కొనసాగుతూనే వున్నాయని , చాల మందికి తెలిసిన విషయమే . 

అంటే అవి తేలేటంతవరకు వాళ్ళు దోషులుగా పరిగణించలేము అనే వాళ్ళు లేకపోలేదు . నిజమే , అయితే యిక్కడ మరొక్కటి కూడా వాళ్ళు గ్రహించాలి . ఏమిటంటే , ఆ కేసులు కోర్టులో తేలేటంతవరకు ఎలా దోషులుగా పరిగణించలెమో , అలాగే నిర్దోషులుగా కూడా నిర్ణయించలేము .

కనుక అటువంటి వాళ్ళకు ఏ పార్టీలైనా తమ అభ్యర్ధిగా ఎలెక్షన్లలో సెలెక్షన్ చెయ్యకూడదు అన్నది గ్రహించుకోవాలి .
ఇలా గ్రహించేటందులకు ప్రభుత్వపరంగా ఇటువంటి చట్టాన్ని క్రమబధ్ధీకరణ ( పటిష్టంగా ) చెయ్యాలి . 

చరిత్ర అడక్కు , చెప్పింది విను అన్నది ఈ మధ్య ఎక్కువగా రాజ్యమేలుతున్నది . అందులకే నేరచరిత్రులే నేతలౌతున్నారు .


చరిత్రనడగాలి , పలువురికి తెలియజేయాలి , ఆ పైనే వారు అర్హులా ? కాదా ? అన్న కోర్టు నిర్ణయంతో నామినేషన్లకు ఉపక్రమించాలి .

ఏ పార్టీ అయినా ముందుగా తమ పార్టీ అభ్యర్ధి ఎవరో పత్రికా ముఖంగా తెలియ చేయాలి కోర్టుకి . ఆ తర్వాతనే వాళ్ళు అర్హులా ? కారా అన్నది నిర్ధారించబడ్తుంది వాళ్ళ నేరచరిత్రల ఆధారంగా . ఆ తర్వాతనే తదనుగుణంగా అభ్యర్ధుల చేత  నామినేషన్లు వేయించేలా చేయాలి .

ఆనాడే నేరచరితుల రాజకీయ చరిత్రకు ఓ చక్కటి ఆనకట్ట వేసిన వాళ్ళమౌతాము .

సత్చరిత్ర గల సమాజ  సేవ చేసే నాయకులను ఎన్నుకొనే అవకాశం మనందరకి లభిస్తుంది .

                                                                                           *******

పధకాలా ? పాతకాలా ?

                                                                                                                                        రచన : శర్మ జీ ఎస్
గ్యాస్ :

ఓ నాడు గ్యాస్ వాడేవాళ్ళు లేక ( దాని ఉపయోగం తెలియక లెండి ), గ్యాస్ సరఫరదారులు వెంటపడి మఱీ ,మఱీ మీరు తీసుకోండి , మీరు తీసుకోండి అంటూ అంటగట్టారు వాడకందారులకు యిష్టమున్నా లేకున్నా . మాంసం రుచి చూసిన పులి , మందు కలవాటు పడిన వాళ్ళు ఎలాగైతే , వాటికొఱకు ఎదురు చూస్తుంటారో , అలాగే అధిక మొత్తం లో గ్యాస్ కనెక్షన్లు తీసేసుకొన్నారు . వాళ్ళు ఆనందంగా కొన్ని సమయాలలో అత్యధిక ధరకు ఆ గ్యాస్ సరఫరా దారులు కూడా అమ్మిన ఆనవాళ్ళు రిజిస్టర్ చేసుకొన్నాయి .

కొంతకాలానికి గ్యాస్ చౌక మఱియు సుఖం అని తెలుసుకొన్న ప్రజలు ఎక్కువమంది కనెక్షన్ల కొఱకు దాఖలు చేసు కొన్నారు .

గ్యాస్ సరఫరాదారులు ఈ పరిస్థిని ఎదుర్కొనలేక , అధికార ప్రభుత్వంతో చేతులు కలిపి , కొత్త కొత్త నియమ నిబంధ నలను అమలులోకి తెచ్చింది .

దాని రూపమే , అధిక కనెక్షన్ దారులు ( ఒకే ఇంటిలో నివసిస్తున్న వాళ్ళు ) ఒక కనెక్షన్లో రెండు సిలిండర్ల కంటే అర్హులు కారు . కనుక మీకున్న అధిక కనెక్షన్లని గ్యాస్ కంపెనీలకు వాపసు చేసి మీకు రావలసిన సొమ్మును మీరు పుచ్చుకోవచ్చు . లెకుంటె , మీకు అధిక కనెక్షన్లున్నాయని మేమే కనుగొంటే , అప్పుడు మీరు నానా విధాలుగా నష్టపోవలసి వస్తుంది అని హెచ్చరించటంతో చాలా వఱకు అధిక కనెక్షన్లు వాపసు చెయటం జరిగింది . ఎప్పుడైతే 
వాపసు వచ్చాయో , వెంటనే మఱల కొత్త కనెక్షన్లు యిస్తాము , 1 అధిక సిలిండర్ కూడా  , అసలు గ్యాస్ కనెక్షన్ లేనివాళ్ళు దాఖలు చేసుకోవలసినదని ప్రకటన చేశారు . ఆ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది .

ఈ నడుమ గ్యాస్ సరఫరాదారులతో , ప్రభుత్వం చేతులు కలిపి ఓ కొత్త విధానాన్ని అమలు లోకి తెచ్చారు  . ఆ నూతన విధానమే " ఆధార్ " కార్డ్ .

ఇది అత్యంత విశేషమైనదని , భారతదేశ ప్రజలు ( అప్పుడే పుట్టిన బేబీ నుంచి చావబోయే వాడి వరకు ) గర్వించే విధంగా దీనిని రూపకల్పన చేశాము . దీని భారత దేశ ప్రజలకు ముఖ్యమైనవన్నీ దీనిలో పొందు పరుస్తాము . ఇది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది . ప్యాన్ కార్డ్ లా కాదు , బ్యాంకు అకౌంటుల కాదు . అన్ని రకల ఖాతాలు దీనిలో పొందుపరచబడ్తాయి . దీన్ని ఒక్కదాన్ని కలిగుంటే వాళ్ళ జాతకం మొత్తం అందులో వున్నట్లే నని తెగ ప్రచారం చేశారు . కోట్లకు కోట్లు వెచ్చించారు .

ఈ ఆధార్ ఎలా యివ్వబడిందో ఒకమారు పరిశీలించండి .

అధికారుల ఆజమాయిషీ లోపాలు :
1 ) ఈ ఆధార్ నమోదు కేంద్రాలలో టెంపరరీ క్లర్కులను నియమించటం .
2 ) ఆధార్ నమోదుకి కావలసిన పూర్తి అవగాహన కల్గించకపోవటం .
3 ) వాళ్ళు నమోదు చేసుకున్న అప్లికేషన్లని ఏ రోజు కా రోజు పరిశీలించి , తగు విధమైన కట్టుదిట్టంగా భద్రపఱచక పోవటం .

ఇదిలా వుండగా ఒక కుటుంబం అత్యధిక ప్రయాసలకోర్చి ( అందఱినీ ఒక చోట చేర్చటంలో )ఆధార్ అప్లికేషన్లు నమోదు చేసుకొంటే , ఆధార్ కార్డులు ఆ కుటుంబంలోని 3 రికో , 4 గురికో ఇష్యూ చేయటం , మిగిలిన వాళ్ళకు రాకపోవటం .అడిగితే త్వరలో మీకు వస్తాయని మొదట , కొంతకాలం తర్వాత వెతుకుతున్నామని , ఇంకా రాక , మఱల అడిగితే , మీరు మళ్ళీ రిజిస్టర్ చేసుకొమ్మని సలహాలు వెబ్ సైట్ ద్వారా తెలియచేయటం జరిగింది అనటం .

ఈ ఆధార్ కార్డ్ ఎలా ఇష్యూ చేస్తారో ఈ పధ్ధతి చూస్తే మీకే అర్ధమైపోతోంది మీ అందఱికీ .

ఆధార్  కార్డ్  కి రెసిడెన్స్ ఋజువుగా , లేటెస్ట్ కరెంట్ బిల్ ఒక్కటి జిరాక్స్ కాపీ జత పరిస్తే చాలట ( ఆ యింటిలో నివసించకపోయినా ) .


ఇలా ఆధార్ కార్డ్ లు ఇష్యూ చేసుకొంటూ పోతుంటె , ఎంతోమంది టెర్రరిస్టులకు , గూండాలకు , హంతకులకు  మఱియు అవినీతి పరులకు బలం చేకూర్చినట్లు కాదా !  

ఇంక అసలు విషయంలోకి వద్దాము .

అలా అధిక కనెక్షన్లని వాపసు తీసుకొని , కొత్త కనెక్షన్లు యిస్తూ , మీకు ఒక కనెక్షంకి సంవత్సరానికి 6 సిలిండర్లు సరఫరా చేయబడ్తుందని , మీ గ్యాస్ కనెక్షన్ ఈ ఆధార్ కార్డ్ కి జత చేయాలని ఆర్డర్ జారీ చేసింది అధికార ప్రభుత్వం . ఆ 6 స్య్లిండర్లు కూడా ఒక్కింటికి 1320 లు చెల్లించాలని ( మామూలు మొత్తం కంటే రెండు రెట్లు అధికంగా ) , మీ బ్యాంకు అకౌంట్ ఈ ఆధార్ కార్డ్ కి జతపరచమని , ఆ తర్వాతే మీకు ఆ అధికంగా చెల్లించిన మొత్తం జమ చేయపడ్తుందని ఆర్డర్ జారీ చేసింది .
ఈ చర్య వల్ల , గ్యాస్ మామూలుగా చెల్లించే 441 లు లేక ఎన్నో యిబ్బందులు పడ్తుంటే , అధికంగా రెండు రెట్లు ఎక్కడనుంచి చెల్లించగలడు సామాన్య మానవుడు .

ఆ ఆధార్ కార్డుకి ఈ లింకులన్నీ జత చేసేవరకు ( చాలా సమయం తీసుకొంటుంది కదా! )యిలా సిలిండర్ల కొఱకు అధికంగా చెల్లించిన మొత్తానికి నీళ్ళు వదులుకోవలసిందే .

ఇంతే కాకుండా , 6 సిలిండర్లని 9 గా మార్చటం , ప్రజలకేదో సాయం చేస్తున్నట్లు ఓ భావన కలిగించటం . మఱల ఆ 9 ని 12 చేయటం   ( ఎన్నికలను దృష్టిలో పెట్టుకొన్నట్లున్నారు లెండి ) . ఇప్పుడు ఈ ఏప్రియల్ 1 నుంచి ఆధార్ జతకి సంబంధంలేదని . మామూలు ధరకే గ్యాస్ సరఫరా చేస్తారని కొత్తగ ఆర్డినెన్స్ జారీ చేయటం . 

ఇప్పుడు అమలు జరుపుతున్నారు మఱల ఆ అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న దురుద్దేశంతోనే .

ఇంత గొప్పగ చెప్పబడిన ఆధార్ కార్డ్ ని భారతదేశ ప్రజలకు ఎలా అందించాలో తెలియని ప్రభుత్వంలో ఉన్నామని చెప్పుకోవటానికి సిగ్గు పడవల్సి వస్తోంది .
అధికార ప్రభుత్వం ఎంతోమంది అడ్డగాడిదలతో , అడ్డంగా చేతులూపుకొంటూ ప్రారంభించే పధకాలే ఇవి .

పధకాలే యివి , ప్రజలను పబ్లిక్ గా దోచుకొనే లైసెన్స్డ్ పధకాలే నిజ్జంగా యివి .

ఇటువంటి ప్రభుత్వాలనా మనం అధికారంలో కూర్చోపెడ్తున్నది ? ఒకసారి సుదీర్ఘంగా ఆలోచించండి ఓటర్లూ . 


                                                                                                             *******


కలిసుందాం---- రా !


                                                                                                                                       రచన : శర్మ జీ ఎస్

కేంద్రంలో అ అందుకెలాగైనా ధికార పగ్గాలు పట్తలంకొంటున్నారు ,చక్రం తిప్పాలనుకొంటున్నారు భారతీయ జనతా పార్టి అభ్యర్ధులందరూ . అయితే ఈ పార్టీ నాయకులందరూ ఏకగ్రీవంగా తమ ప్రధాని అభ్యర్ధి ' నరేంద్ర మోడీ ' అని ప్రకటించిన తర్వాత , నరేంద్ర మోడీయే ఆ పార్టీకి సెంటర్ అయి పోయాడు . ఇప్పుడు మొత్తం ఆ నరేంద్ర మోడీని ముద్దుగా " నమో " అంటూ పిలుచుకొంటున్నారు .
ఆ పార్టీ ప్రచారభారాన్ని అధికంగా నెత్తిన వేసుకున్నది కూడా ఆ నమోయే . ఇప్పుడా పార్టీ ఏ స్థాయికి మారిందంటే , ఒన్ మ్యాన్ ఆర్మీగా మారి , మిగిలిన ఆ పార్టీ సభ్యులందరూ ఈ నమోనే చూపిస్తుండటంతో , ఆ నమోయే ఒన్ మ్యాన్ షో ప్రజలతో పాటు పార్టీ వాళ్ళందఱకీ ప్రదర్శన యిస్తున్నారు .

ఇక కేంద్రం పగ్గాలు పట్టాలంటే , కొన్ని రాష్ట్రాలకు పొత్తుల తాయిలాన్ని ఎఱ వేస్తున్నారు . ఎందుకంటే ఎలాగైనా సరే కేంద్రం లోని యూ పీ ఏ ( కాంగ్రెస్ ని ) అధికారం నుంచి క్రిందకు దింపి మట్టి కఱిపించి , మిగిలిన వారి పొత్తుతో ఆ కేంద్రంలోని ప్రధానమైన ప్రధాన మంత్రి పదవి నధిష్టించాలని .

ఈ ఉద్దేశంతోనే వాళ్ళ పార్టీకి ఏ మాత్రం పట్టు లేని పలు రాష్ట్రాలలో తమకు అవకాశమీయాలని , అప్పుడే మన పొత్తు విజయవంతమౌతుందని ఒత్తిడి తెస్తున్నారు ఆ యా ప్రాంతీయ పార్టీలతో .

ఏ రాష్ట్రానికా రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు వాళ్ళకున్న యిప్పటి ప్రజా వ్యతిరేకతను , బలంగా మరుతున్న పరిస్థితులలో , స్వతంత్రంగా నుల్చొన్నా , రాష్ట్ర అధికార పగ్గాలు చెజిక్కించుకోగలరు . అయినా బి జే పి వాళ్ళ పొత్తు ఎందుకు కోరుతున్నారంటే , ప్రస్తుతం అధికారంలో నున్న యూ పీ ఏ పరిపాలనా యంత్రాంగం ఘోరాతి ఘోరంగా , అవినీతి వృక్షాన్ని ఆకాశాన్నంటించాలని విశ్వ ప్రయత్నం చేస్తూనే వున్నది . నిరవధికంగా నీతిని అధః పాతాళానికి అణగదొక్కే ప్రయత్నం చేస్తూనే వున్నది .

దానితో మరో ప్రత్యామ్నాయ జాతీయపార్టీ గత పదేళ్ళ నుంచి అప్పోజిషన్లోనే తిష్ట వేసుకున్న తన పొజిషన్ మార్చు కోవాలనుకొని , ప్రాంతీయ పార్టిల పొత్తుల ఎత్తులు చూపుతుంటే , ఈ సదవకాశాన్ని తాము ఉపయోగించుకొంటే , వాళ్ళు అధికారానికి వస్తే , తమ రాష్ట్ర అభివృధ్ధికి చేయూత అందిస్తుందన్న సద్భావనతో సంసిధ్ధమవుతున్నాయి ఆ యా రాష్ట్ర ప్రాంతీయ పార్టిలు .

ఈ సందర్భాన్ని ఆసరాగా తీసుకొన్న బి జే ఫి , ఆ యా ప్రాంతీయ పార్టీలకు కంచుకోటలైన ముఖ్య ప్రాంతాలలో వాళ్ళ జెండా ఎగురవేయాలన్న దురాలోచనతో , దూరాలోచనతో , ఆ ప్రాంతాలనే తమ పార్టీ అభ్యర్ధులకు టికెట్లు కేటాయించాలని ఒత్తిడి యిస్తున్నారు .

ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తులో వాళ్ళ కంచుకోటలు కాస్తా మంచుకొండల్లా కరిగిపోయి , మఱుగున పడే అవకాశాలు వస్తున్నాయి .

ఇదే విషయాల్ని ఆ యా పార్టీల సీనియర్ మెంబర్లు చెప్తున్నా ఆ పార్టీ అద్యక్షులు గ్రహించక పోవటం ఒక రకంగా తప్పిదమని తెలుస్తోంది .

కలిసుందాం---- రా ! అనగానే  పరుగులు తీయకూడదు , అమాంతంగా సామాన్లూ సర్దుకోకూడదు .

ఎక్కడ , ఏ ప్రాంతంలో కలిసుంటామో తెలుసుకొని , ఏ ఏ షరతులతో కలిసుంటామో తెలుసుకొని , అందులకు యిరువురకు అంగీకారమైతే , అప్పుడు పరుగులు తీసినా , సామాన్లు సర్దుకున్నా తప్పు కాదు . ఈ విషయాన్ని అర్ధం చేసుకొని మసులుకొంటే భవిషత్తు బంగారు బాటే .


                                                                                                              ******* 

ఏలికా మేలుకో ?

                                                                                                                                     రచన : శర్మ జీ ఎస్

మాట పెదవి దాటినా , ఆడవాళ్ళు గడప దాటినా పర్యవసానం తీవ్రంగా వుంటుందని మన ముందు యుగాల వారన్ననానుడి మఱచారనుకుంటా

మామూలు వ్యక్తి  , ఒక పబ్లిక్ వ్యక్తిగా  రూపాంతరం చెందినప్పుడు , ఆ వ్యక్తి మాట్లాడే ప్రతి మాటకూ రియాక్షన్స్ వుంటాయని తెలుసుకోవాలి . తెలుసుకోకుండా ఏదైనా మాట్లాడుతాను , ఏమైనా చేస్తాను అంటే సామాన్య ప్రజలు ఊర్కోరని తెలుసుకోవటాం ఎంతైనా అవసరం .

మఱి అటువంటి రాజకీయ నాయకుడు పెదవి విప్పితే ఫృధ్వి దాటినట్లేనని , అది అత్యంత ప్రమాదకరమని తెలుసుకున్నట్లు లేదు కాబోలు ఈ ములాయం సింగ్ యాదవ్ .  

ఒక సీనియర్ నాయకుడు , ముఖ్యమంత్రి పదవినేలిన , ఏలుతున్న వ్యక్తి మహిళలపట్ల యిలా వ్యాఖ్యలు  చేయటం ఖండిచతగినవే . మహిళల సంక్షేమానికి పాటు పడవలసిన ముఖ్యమంత్రే యింతటి నీచభావాలు కలిగి వుంటే సమాజానికి మేలెలా కలుగుతుంది ?  ఇందుకు ములాయం సింగ్ యాదవ్ మఱల పత్రికా ముఖంగా కాని , బుల్లితెర ద్వారా గాని క్షమాపణలు చెప్పి తీరవలసిందే .

" మగాళ్ళు కొన్ని కొన్ని సందర్భాలలో తప్పులు చేస్తారు . అంత మాత్రాన వాళ్ళకు మరణదండన విధించటం తప్పు " అని , ఇంకా " మగాళ్ళు ఎప్పుడూ మగాళ్ళే " అని ఓ ప్రముఖ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవ్ గారు యిలాంటి వ్యాఖ్యలు చేయటం , మహిళల పట్ల ఆయనకున్న చులక భావనని , సద్భావన లేదని , మహిళలెన్నటికీ మగవాళ్ళకు సరి తూగరని  బట్ట బయలు చేస్తున్నాయి . అందులో ఆయన సాదా సీదా రాజకీయ నాయకుడు కానే కాదు . ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా .

ముఖ్యంగా ఈ అత్యాచార  కేసుల్లో యిలాంటి  వ్యాఖ్యలు చేయటం సంచలనాన్ని రేపటం సర్వ సహజం కదా!
ఇలాంటి వ్యాఖ్యలు ఈ అత్యాచార కేసులోనే కాదు , ఏ అత్యాచార కేసులోనూ  చేయనే కూడదు .ఎందుకంటే  అత్యుత్తమమైన సుప్రీం కోర్టు తీర్పు అంటేనే ప్రజాశ్రేయస్సుతో కూడుకున్నదని మఱచినట్ట్లున్నారు .
ములాయం సింగ్ వ్యాఖ్యలని ఖండించి తీరవలసిందే . అవసరమైతే చట్టాల్ని తన వ్యాఖ్యలకు సరి తూగేలా ఇదివరకున్న చట్టాల్ని సవరించేస్తాడట . ఇటువంటి భావాల నాయకులు ప్రధానమంత్రి పదవికి కూడా ఆశపడ్తున్నారంటే , దేశం ఏమైపోతుందో ? ఎటు వైపు నడుపబడ్తుందో ఆయనకు , ఆయన సహచరులకే ఎఱుక .

ఇటువంటి వారిని ఓటర్లు బాగా ఆలోచించి తమ ఓటును సద్వినియోగం చేసుకొనటం ఎంతైనా అవసరం .

ఏలికా మేలుకో , మహిళలను , సమాజాన్ని క్షమాపణలు కోరుకో వెంటనే . ఇంక జాగు చేయకు . నీ ఉనికికే పెను ముప్పు పొంచి వున్నది . 


                                                                                                       ******

నాయకులూ బహుపరాక్

                                                                                                                                     రచన : శర్మ జీ ఎస్

ఉదయం బుల్లితెర ఆన్ చేయగానే ,

" మా అమ్మాయి పెద్దదవుతుంటే ఒక ప్రక్క ఆనందంగా వున్నది చక్కగా చదువుకొంటుంటే , మరో ప్రక్క భవిష్యత్తు గురించి బాధగా కూడా వున్నది . ఉన్నత చదువులకు పరాయి ఊరికి బయటకు పంపాలంటే , ఏ మూలనుంచి ఏ కిరాతకుడు అరాచకాలు సృష్టిస్తాడేమోనని . ఎక్కడ చూసినా ఆడపిల్లలపై అత్యాచారాలు , వృధ్ధులపై హత్యా ప్రయత్నాలు . వీటన్నింటినీ అఱికట్టించాలంటే " ఆయన రావాలి " అని ఆ యింటిల్లిపాది అనుకొంటూంటే ఒక రాజకీయ నాయకుడి ముఖచిత్రం దర్శనమిస్తుంటుంది .

" అవును ఆయన వస్తున్నాడు , యిక మన భద్రతకు , భవిష్యత్తుకు  ఏ లోటు వుండదు " అని ఆనందంగా చెప్పుకొంటుంటారు .

ఇంకొంచెం సేపటి తర్వాత మరొకటి దర్శనమిస్తున్నది అదే బుల్లితెరలో .

అమ్మా అన్నం తినవే అంటూ బ్రతిమలాడుతున్న ఓ కొడుకుచేతిని తను తిననంటూ ఆ అన్నపు పళ్ళాన్ని నెట్టేస్తూ , నా కొఱకు కూలీ పని చేసి నీ చేతులకు కాయలు కాయించుకున్నావటరా అంటుంది ఆ తల్లి ముసలమ్మ .లేదమ్మా " ఆయన వస్తున్నాడు " అంటాడు . ఎవర్రా ఆయన ? అని అడుగుతుంది . " ఆయన కాదమ్మా , నీ మనమడు వస్తున్నాడు , ఫ్యాను దుమ్ము దులపండి అంటూ వినపడ్తుంది .

మఱల ఇంకొంచెం సేపటి తర్వాత ,

" అందరం కలుసుందాం కలిసుంటే కలదు సుఖం అంటూ నినదిస్తూ , ఈ భూ ప్రపంచంలో ప్రతి మానవుడికి పాదరక్షలు నిత్యావసరమైనవి . పాదరక్షలు లేనిదెవ్వరైనా , ఎక్కడైనా , ఎప్పుడైనా , ఎటువంటి వారైనా బయట ప్రపంచంలో అడుగు పెట్టలేరు . అటువంటి పాదరక్షలు కలిసుండాలని కోరుకొంటున్నాయి . కనుక పాదరక్షలు మన జీవనానికి ముఖ్యమైనవని మరువకండి . "

అంతే కాదు " వేర్పాటువాదులకు ' చెప్పు ' సమాధానం " అంటూ ఓ క్యాప్షన్ కూడా .

మరల మరొకళ్ళు ,

మీ గిరిజనులను ఎస్ సీ లో కలిపేస్తము , జర్నలిస్టులకు ఉచితంగా ఇళ్ళు కట్టిస్తం , లక్షలకొద్దీ ఉద్యొగలిప్పిస్తము . మాయలోళ్ళు వస్తరు , మాయలు చేస్తరు , ఆశలు చూపిస్తరు , బాసలు చేస్తరు , నమ్మకండి . 60 ఏళ్ళ పాటు మనల్ని పాలిస్తున్నట్లు అగపడ్తూ , మన ప్రాంతాల్ని , మనల్ని యిప్పటిదాకా నిరవధికంగా డొబ్బారు . ఇంకా చాలలేదన్నట్లు యిప్పుడు ( అంటే సోనియమ్మ తప్పనిసరై యిచ్చేసిన తెలంగాణా రాష్ట్రం )కూడా వాళ్ళే మనల్నిపాలించాలని మన ప్రాంగణం లోనికి దూసుకొచ్చేస్తున్నారు . నమ్మకండి , నన్ను  , నా కుటుంబాన్ని, నా అనుచర వర్గాన్ని మాత్రమే నమ్మండి . ఈ ఎన్నికలలో మమ్మల్నే ఎన్నుకోండి . "

మరో ఛానల్ లో ,

" రైతులను ఆదుకుంటాను ,   అసలు రైతుల ఋణాలు బ్యాంకులలో ఎంత వున్నాయో తెలుసుకోకుండానే , ఎవరికి వాళ్ళు పాత ఋణాలు మాఫీలు చేస్తాం  అనటం ఎంతవరకు ఆచరణ రూపం దాల్చగలదు ? ఆడబిడ్డకు పుట్టినప్పటినుంచి అంతా ఖర్చులు మేమే భరిస్తాం అంటూ ఎన్నో ఆవేశపూరిత వాగ్దానాలు ఓ ప్రక్క వినపడ్తున్నాయి , కనపడుతున్నాయి . 

ఎవరు ఏం చెప్పినా ఓటర్లకి , ఎంతవరకు చేయగలరు ఈ నాయకులు అన్న ఆలోచన ఈ ఓటర్లకు వుండదను కొంటా రేమో . ఒకరిని మించి ఇంకొకరు పోటీ పడి నోటికి వచ్చిన వాగ్దానాలను చేస్తూ పోతుండటం , ఓటు బ్యాంకింగుకు తప్ప , ఓటర్ల భవిష్యత్తును బాగుచేద్దామన్న ధ్యాస లేని ఈ నాయకులకు పదవి మీద తప్ప వేరే ధ్యాస లేదన్నది స్పష్టంగా అందఱికీ అర్ధమవుతూనే వున్నది కదా !  

ఇటువంటి వాగ్దానాలు నీటిపైన వ్రాయలేని వ్రాతలు కావా ? కొంచెం ఆలోచించి చూడండి .

ఇలా ఏవేవో చెప్పుకు పోతుంటే ప్రజలు నమ్ముతారనుకొంటున్నారా ? నమ్మరు గాక నమ్మరు .

అయితే ఒక్కటి  మాత్రం ఏ ప్రజానాయకుడైనా మరువకూడదు , ఎల్ల వేళలా గుర్తుంచుకొని తీరవలసిందే .

గతంలో మీరేం చెప్పారో , మీరేం చేశారో మీకు గుర్తు లేదా ? లేక మాకు గుర్తుండదని ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రపోజల్స్ పెట్టి మభ్య పెట్టాలనుకొంటున్నారా ?  నాయకులారా , బహుపరాక్ !


                                                                                         *******

స్వాతంత్ర్యపు వారసత్వ నాయకుల తీరు తెన్నులు

                                                                                                                                   రచన : శర్మ జీ ఎస్                                                                                                                                                       

జవహర్లాల్ నెహ్రూ కుటుంబ వివరాలు డాక్టర్ నారాయణరావు గారు తన బ్లాగులో పొందుపరచిన దాని నుంచి సేకరించిన విషయాలు , చిత్రాలను ఇందులో పొందుపరుస్తున్నాను .

వాస్తవానికి నెహ్రూ గారి తాతగారి పేరు ఘియాసుద్దీ ఘాజి . ఈయన మొగలు వంశస్థుడు .
బ్రిటీష్ వారి ఆక్రమణ తరువాత మొగలులను చంపడం మెదలుపెట్టడం తో వారు అప్పట్లో పేర్లు మార్చుకొని కాస్మీరి పండిట్ లలాగా చలామణీ లోకి వచ్చారు . నెహ్రు గారి తాత, మోతిలాల్ తండ్రి కూడా గంగాధర్ నెహ్రుగా పేరు మార్చుకున్నారుట . 

ఆ క్షణం నుంచి ఆ జవహర్లాల్ కుటుంబం నెహ్రూ కుటుంబంగా మారింది . 

స్వాతంత్ర్యం అహింసామార్గంలో ఎంతకీ రాకపోయేసరికి , సుభాష్ చంద్రబోస్ ఒకింత చొరవ తీసుకొని ఒత్తిడి పెంచాడు ఆతను ఎంచుకొన్న  మార్గంలో . ఆ మార్గం ఆనాటి ఆంగ్లేయులు అతనిని  హింసావాదిగా ముద్ర వేశారు . తెల్ల దొరలనబడే ఆంగ్లేయుల వాదనకి చేయూతనిచ్చి , ఆతను కనపడితే మీకు అప్పజెప్తామని బాస చేసి , స్వాతంత్ర్యాన్ని అందుకొన్నారు .

స్వాతంత్ర్యం అందుకొనేనాటికే ఎవరిని ప్రధాన మంత్రిని చేద్దామని ఆలోచిస్తున్న తరుణంలో నెహ్రూ ఆ ఆసనం పై కన్ను వేశాడు . గాంధీ పంచన చేరి , సర్దార్ వల్లభాయ్ పటేల్కి కాకుండా తనకే యివ్వాలనే , తానే అన్ని విధాలా అర్హుడనని , పదేపదే చెప్పి ఒత్తిడి తెచ్చి ఆ ప్రధానమంత్రి పదవిని అధిరోహించారు . ఆడ వాళ్ళతో మన అలనాటి ప్రధమ ప్రధాని
                                                


ఆడవాళ్ళతో మన అలనాటి ప్రధమ ప్రధాని  ఎంతమందిలో నైనా 
                                                                                                                                                                  
సన్యాసినిని సంసారిణిగా మార్చిన నెహ్రూ
                                                                  
మన అలనాటి ప్రధమ ప్రధాన మంత్రి నెహ్రూ 
                                                    
ఫిరోజ్ గాంధీ అనబడ్తున్న ఫిరోజ్ ఖాన్ 
                                                 
Feroz Khan (మద్యం అమ్మే వ్యాపారి). అడపా దడపా వస్తూ వుండటం వల్ల, వంటరి ఇందిర అక్రమ సంబంధం మొదలు పెట్టింది. దీన్ని నెహ్రు తెలుసు కునే లోగ ఇందిర, MAIMUNA BEGUM గ మారింది. మతమార్పిడి తో లండన్ మసీదు లో పెళ్ళికూడా జరిగింది. జవహర్లాల నెహ్రు, కమల నెహ్రు వ్యతిరేకించిన ఏమి చెయ్యలేని పరిస్తితి దాంతో వచ్చిన గొప్ప ఆలోచనే FEROZ KHAN కాస్త FEROZ GANDHI అయ్యారు. అంటే FEROZ GANDHI ముస్లిం నుంచి హిందు కాలేదు, ఒకచిన్న COURT AFFIDAVIT మనల్ని నమ్మించడానికి ఆడిన పెద్ద నాటకం. ఈ నాటకానికి గాంధీ గారు FEROZ ని దత్తతు తీసుకున్నారని మరో రచన చాతుర్యం జోడించి. నాటకాన్ని రసవత్తరంగ తీర్చిదిద్దారు. మొత్తానికి జనల కోసం వేదమంత్రాలతో పెళ్లి జరిగింది తరువాత ఇద్దరు కుమారులు రాజీవ్, సంజయ్ లు పుట్టారు. దీంట్లో మరో చమత్కారం ఉంది సంజయ్ గాంధీ అసలు పేరు సంజీవ్ గాంధీ. కాని UK లో కారు దొంగతనానికి పోలీసు లు ఆయనగారి passport జప్తుచేసారు. అక్కడమారింది అయన పేరు కొత్త passport సృష్టించి మరీ మార్చారు. 


ఇందిరా , మొహమ్మద్ యూనస్ ల పుత్రుడు సంజీవ్ /సంజయ్ గాంధీ 
                                                   
రాజీవ్ గాంధీని ఆకర్షించి పెళ్ళిచేసుకొన్న  అలనాటి ఇటలీ సానియా మైనా / సోనియా 
                                                     
గర్ల్ ఫ్రెండ్ ( కంబోడియా డ్రగ్ మాఫియా కూతురు) తో రాహుల్ విన్సీ / రాహుల్ గాంధి 
                                                       
                                              నెహ్రు కుటుంబ నిజాలు: చెరిగిపోని చరిత ...

డాక్టర్ నారాయణరావు గారు  బ్లాగు ( సౌజన్యంతో  )లో   జూన్ 29 2011 పోస్ట్ చేయబడ్డది .


మన ఘన చరిత్ర

                                                                                                                                      రచన : శర్మ జీ ఎస్

నిజాలు ఖనిజాల్లాగా అట్టడుగునే వుంటుంటాయి . తవ్వే కొద్దీ బయట పడ్తుంటాయి అన్నది మనం ఎన్నటికీ మఱచిపోరాదు .

హై కమాండ్ ( కేంద్రాన్ని ) ని నమ్మించి ఆంధ్రరాష్ట్ర ప్రజలకు షుమారు ఆరున్నర ఏళ్ళ పాలనని అందిస్తూ , ఎవరు ఏమడిగినా , చట్టం తన పని తాను చేసుకుపోతుందని అనుక్షణం తెలియచేస్తూ , తాను , మనం అందఱం చట్టానికి అతీతులము కాము అంటూ తెలియ చెప్తుండేవారు .

అసలు విషయానికి వస్తే , యిలా చెప్తూ , తను చేయతలచుకున్న స్వార్ధపూరిత పనులనన్నింటినీ చక్కగా , తనకు , తన అముచరగణానికి అనువుగా చేసుకుంటూ పోయేవాడు . చిట్ట చివరికి తనే నామ రూపాల్లేకుండా పోయాడు .

ఈ రోజు ఆ పాపపు చిట్టాలన్నీ బయటకు వస్తున్నా , తండ్రి అనుకోకుండా వదలివేసిన ఆ మూడున్నర ఏళ్ళ పాలనను తను చేసి తమ తండ్రిని ఎన్నుకున్న ప్రజల ఋణం తీర్చుకోవాలన్న గొప్ప సదుద్దేశంతో , తండ్రి పోయిన మరుక్షణం దిగులును కూడా ప్రక్కకు నెట్టి , ఆంధ్రరాష్ట్ర ప్రజలకు తన తనయుడు వారసత్వాన్ని చాటాలని విశ్వప్రయత్నం చేయగా , హై కమాండ్ ( కేంద్రం ) తొందర పడవద్దు , కొన్నాళ్ళు ఆగమని , తనకున్న అనుభవంతో సోనియా సెలవిచ్చిన వినకుండా , తన తండ్రి పోయిన క్షణాలను " సానుభూతి పవనాలుగా " మార్చుకొనాలని ఏకంగా ఆ అధికార కాంగ్రెస్ కి ఎదురుదాడిగా తన తండ్రి పేరుని , అధికార కాంగ్రెస్ పేరుని కలిపి పార్తీగా పెట్టి తన తండ్రి పలనలో ( తండ్రికి ) ముఖ్యమైన వాళ్ళనందరిని చేర్చుకొని అధికార కాంగ్రెస్ కి వున్న బలగన్ని చీల్చి చూపించాడు .

ఈ దుశ్చర్యని తట్టుకోలేని కాంగ్రెస్ వాళ్ల తండ్రి రాజశేఖర రెడ్డి చేసిన అవినీతిని బయటపెడ్తూ , ఇందులో ఈ కొడుకు జగన్ భాగాన్ని వెలికి తీసి కేసులు పెట్టి చెఱసాలలో కూడా వేయించింది . ఆ కేసులన్నీ విచారణ జరుగుతున్నాయి .ఇటువంటి ఈ సమయంలో మఱల ఎన్నికల నగారా మోగబోతుందని తెలుసుకున్న అధికార కాణ్గ్రెస్ 60 ఏళ్ళ నుంచి కలసి జీవనం సాగిస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలను , తెలంగాణా ప్రజలను , తెలంగాణా ప్రజల ఆకాంక్ష , ఒత్తిడి మేఱకు , సీమాంధ్ర ప్రజలు వద్దంటున్నా వినకుండా , విభజిద్దామన్న నిర్ణయానికి వచ్చింది . సీమాంధ్రలో వాళ్ళ పార్టీ ఒక్క సీటు గెల్చుకోకపోయినా , తానిచ్చిన తెలంగాణా రాష్ట్ర పార్టీతో పొత్తు పెట్టుకొంటే , సీమాంధ్రలో తమ పార్టీ గెలవకపోయినా ఫరవాలేదు అనుకొన్నది .

ఇదే సమయమదనుగా తలచిన ఆ వై సి పి పార్టీ ప్రధానులు సోనియాతో చర్చలు జరిపి , మా అబ్బాయిని చెఱసాల నుంచి విడుదల చేయండి . మా అబ్బాయికి మాంఛి ఫాల్లోయింగ్  ఉన్నది సీమాంధ్రలో , మీకు ఒక్క సీటు కూడా రాక పోయినా , మాకన్నీ వచ్చేస్తాయి . అప్పుడు మీరు నిస్సందేహంగా గత పదేళ్ళ లాగానే కేంద్రాన్ని ఏలుకోవచ్చు అన్న ఆశతో , చెఱసాలలో వున్న అబ్బాయిని విడుదల చేసింది .

అంతే , బయటకు వచ్చిన అబ్బాయి , వచ్చీ రావటంతోటే , పేట్రేగి పోయాడు సోనియా పార్టీ మీద .అలా ప్లేటు ఫిరాయించటంతో , ఏం చేయాలో తోచక , కనీసం తెలంగాణా యిచ్చి , వీల్లాతోనైనా పొత్తు కలుపుకొంటే , మనమే ఏలటానికి మార్గం సుగమమవుతుందని , ముందు వెనుకలు ఆలోచించకుండా , ఏ మేధావులతో చర్చించకుండా ( విభజన తీరుపై ) , భజన సంఘం ఉసి కొల్పగా , తన పుట్టిన రోజు కనుకగా డిసెంబర్ 9 న యిచ్చేయాలనుకున్నది . కుదరక ఎన్నో అవకతవకల నడుమ యిచ్చేసింది .

తీరా అలా తెలంగాణాను అణ్దుకున్న కే సీ ఆర్ , కృతఙ్నతగా , తన కుటుంబం మొత్తాని సోనియాకు చూపించాడు . ఆ సోనియా సంతోషించేటట్లుగా ఫొటోలు తీయించాడు . వస్తనమ్మా సోనియమ్మా అంటూ హైదరాబాద్ కి దిగాడు .
తెలంగాణా ప్రజలు ఆ కే సీ ఆర్ కి బ్రహ్మరధం పట్టగా , భువికి నీళ్ళు తెచ్చిన భగీరధుడిలా తనను ఊహించు కొన్నాడు .

దాంతో ఆ తెలంగాణా యిచ్చిన సోనియాను కూడా నెట్టి పారేసేశారు  .

ఈ ఊహించని పరిణామానికి , నిప్పు తొక్కిన కోతిలా అయిపోయింది సోనియాకి . బ్రతిమలాడింది ఏమైనా కనికరిస్తారేమోనని , కానీ  భంగపాటే మిగిలింది చిట్ట చివరికి తెలంగాణాలో .

ఇక సీమాంధ్రా గురించి మఱల చెప్పుకోవలసిన పని లేదు . అయినా తమ వంతు ప్రయత్నంగా , ఏవేవో కొత్త కొత్త ప్యాకేజీలు యిచ్చేస్తున్నాము , మిమ్మల్ని బాగా చూసు కొంటాము , మీ ప్రాంతాల్ని బాగా అభివృధ్ధి చేస్తాం అంటు తాయిలాలు వేయ ప్రయత్నిస్తోంది . సీమాంధ్ర కేంద్ర మంత్రుల్ని శునకాలుగా భావించినట్లున్నది కాబోలు .

ఆంధ్ర రాష్ట్ర విభజనకు వ్యతిరేకులము , మేము రాజీనామాలు చేసేశాము అన్న ఆ కేంద్ర మంత్రులు కూడా , విభజన అయిన తీరుని ప్రత్యక్షంగా పలు పంచుకొని కూడా , ఇంకా ఆ కేంద్ర పదవులనే అంటి పెట్టుకొని , రాజీనామాలు ఆమోదింప చేసుకోకుండా , ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి విభజనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తే , అతి తక్కువ కాలమైనా ఆ ముఖ్యమంత్రి పదవికి , సిగ్గు లేకుండ ఎదురుతెన్నులు కాచి , చివరికి వద్దు అన్న కేంద్రం మాటకే తలొగ్గి , కొత్త కొత్త పదవులను అంటగడితే , ఆనందంగా అందుకొని , ఒక్కరుగా సీమాంధ్రలోకి ప్రవేశిస్తే , తమనెక్కడ చెప్పు దెబ్బలతో సత్కరిస్తారోనని , మూకుమ్మడిగా ఆ మంత్రులను సీమాంధ్రకు పంపి బస్సు యాత్రగ చిత్రీకరించారు .
ఆ మంత్రులు కూడా ఆనందంగా ప్రచారంలో బిజీ గ వుండిపోతున్నారు .

ఇక్కడ ఎవరు ఏ సభ పెట్టినా జనం వస్తుంటారు . అంత మాత్రాన ఆ పార్టీని బలపరుస్తారని భావించకూడదు .ఎందుకంటే , మనకు జనాభా కోట్లల్లో ఉన్నప్పుడు , లక్షల్లో రవటం పేద్ద విశేషమేమీ కాదు . అంతే కాకుండా , ఎవరు ఏం చెబుతున్నారు అని కొందరు , ఎంత నిజముందోనని ఇంకొందరు , నిజమేమిటో తెలుసుకుందామని మఱి కొందరు , యిలాంటి రకరకాల భావాలతో హజరవుతుంటారు .

ఇది ప్రతి పార్టీ నాయకులు తెలుసుకొంటే చాలు .

ఈ పార్టీని ఛీదరించుకొంటున్నారని , ఆ పార్టీని వీడి , మరొక పార్టీ తీర్ధం పుచ్చుకొంటున్నవాళ్ళకు సీటు వస్తుందేమో గాని , ఓట్లు వస్తాయన్న నమ్మకం లేదు . ఎందుకంటే , గత పార్టీలో ఈ అభ్యర్ధులు ఏమీ చేయలేని వీళ్ళే , మరొక పార్టీలో చేరి ఏం చేయగలుగుతారు అన్నది బాగా ఆలోచిస్తారన్నది మఱచిపోకండి .

పైగా రాజకీయ అభ్యర్ధులందరూ నిత్యం ఒకరిని ఒకరు విమర్శించుకొంటూ పోతుంటే , ఓటరు తన ఓటు హక్కుని దుర్వినియోగం చేస్తున్నానేమోనన్న భావంకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి .

కనుక నాయకులూ ఈ విషయాల్ని ఒకింతైనా తెలుసుకొని మసులుకోవటం మీ తాజకీయ భవిష్యత్తుకెంతైనా మంచిదని మరువకండి . 


                                                                                                  ********

శ్రీరామ నవమి                                                                                                                                    రచన : శర్మ జీ ఎస్ఈ జయ నామ సంవత్సర  పంచాంగంలోని తెలుగు తిధులలో తొమ్మిదవదైన నవమి . మాసాలలో ప్రధమదైన చైత్రం .

ఈ రోజుకి ఓ ప్రత్యేకత ఏర్పడినది . ఎప్పటినుంచో కాదు .

త్రేతాయుగం నుంచి మాత్రమే . అంతకు ముందు గడచిపోయిన కృత ( సత్య ) యుగం నుంచి కాదు అన్నమాట .
సహజంగానే ఒక్కొక్క యుగంలో కొంతమంది సమాజ శ్రేయస్సుకై జన్మించి , సమాజంలో ఎలా మానవుడిగా ఎలా బ్రతకాలి ? సాటి మానవులను ఎలా చూడాలి ? వారి సమస్యలను ఎలా తీర్చాలి ? లాంటి వన్నింటినీ తన జీవనం ద్వారా తెలియ చెప్పేటందులకై ఆ శక్తి రక రకాల రూపాల్లో జన్మించటం జరుగుతుంటుంది .

అలా ఆ త్రేతాయుగంలో , శ్రీరామచంద్రుడుగా జన్మించి , తన జన్మకు కారణభూతులైన ఆ  తల్లితండ్రుల వద్ద ఎలా పెరగాలో సోదరులతో ఎలా మెసులుకోవాలో , సహధర్మచారిణి అయిన ధర్మపత్నిని ఎలా చూసుకోవాలో , ప్రజల సమస్యలను ఓ రాజుగా ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ ఎలా పరిపాలించాలో అలా పరిపాలించి ఆ తర్వాత యుగాలకు మార్గదర్శకుడిగా నిల్చిపోయాడు .

అందుకే ఆ తర్వాత యుగాల అన్ని వయసుల వాళ్ళు అలనాటి ఆ శ్రీరామచంద్రుణ్ణి ఆదర్శపురుషుడిగా భావిస్తూ , కనపడని , అంతు తెలియని ఆ దైవ శక్తిని ఆయనలో పూజిస్తున్నారు .

అయితే పాటకులందరి మనసుల్లో ఒక్క సందేహం పొడసూపవచ్చు . ఏమిటంటే , మఱి ఆ ముందు యుగమైన , ప్రారంభ యుగమైన : కృత ( సత్య ) యుగం లో ఏ మహనీయుడు జన్మించలేదా ? ఎందులకు ? అని .
సందేహం పొడసూపటం సమంజసమే . మీ సందేహము సత్యమే . ఏలనన ఆ యుగమే ఆరంభం . అందునా ఆ యుగం సత్య యుగమవటం వలన ఈ అవసరం వచ్చి వుండక పోయిందని అనుకోవాల్సిందే .

ఆ తర్వాత యుగమైన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు జన్మించి రాబోయే కలియుగానికి ఆదర్శపురుషుడు .

ఆ తర్వాత యుగమైన కలియుగంలో ఆ శక్తి మానవ రూపంలో జన్మించన , సాటి మానవులందరూ పూర్తిగా గ్రహించుకోలేరని , సద్గురువుల రూపంలో , శిలా విగ్రహ రూపాలలో అవతరించి సన్మార్గపధానికి దోహదకారమవటం జరుగుతోంది .

ఈ కలియుగ జనాభా , మిగిలిన అన్నియుగాలు కలిపితే వచ్చినంత అన్నమాట . 

అటువంటి ఆ శ్రీరామ నవమి పండుగ రోజే ఈ రోజు .

ఆ ప్రయత్నంలో దీన్ని అత్యంత శుభకార్యంగా జరుపుకొంటున్నారు మన ముందు యుగాల వాళ్ళు .  

కనుక అటువంటి మహానుభావులను స్మరించుకొంటూ , మనసులో ఆ మంచిగుణాలను మనం చేసుకొంటుంటే , కొన్ని ఆ సద్గుణాలు కొన్నైనా అబ్బుతాయేమోనని ప్రయత్నం చేద్దాం . 

పాకులందరికీ ఇటువంటి శ్రీరామ నవమి శుభాకాంక్షలు మనఃస్ఫూర్తిగా .

     
                                                                                                       ****** 

నిగూఢ జీవన రహస్యాలు

                                                                                                                              రచన : శర్మ జీ ఎస్ 


భార్యాభర్తల బంధం ఈ మానవ జీవన గమనానికి అత్యంత ప్రధానమైనదిగా మనం భావిస్తుంటాము .
ఆ బంధాన్నే ఈడు జోడు , తోడు నీడ అంటుంటారు .
వాస్తవానికి ,
వయసులో  ఆ ఈడు , జోడు కొఱకు తపిస్తూ , అవసరంతో కూడిన ప్రేమానుబంధంగా ముడిపడ్తుంది .
నడివయసులో పిల్లల పెంపకంలో బాధ్యతతో కూడిన ప్రేమానుబంధంగా పెంచబడ్తుంది  .  
వయసైపోతున్నప్పుడు మాత్రమే ఒకరికి ఒకరు తోడుగా , నీడగా  నిలబడ్తుంది . ఆ తోడు కూడా , నీడలా వెన్నంటి వుండాలని నిర్ణయించబడ్తుంది .
ఇదే అసలు సిసలు నిజమైన భార్యాభర్తల బంధం .
అయితే ఈ వయసయ్యాక వుండాల్సిన తోడు నీడను , వయసు నుంచే ప్రారంభించటం జరుగుతుంది అసలు విషయం తెలియకుండానే .
అంటే భవిష్యత్తును బంగారుబాటగా తీర్చి దిద్దుకొన్నట్లన్నమాట .

వయసు పైబడినా అన్ని అవయవాలు బాగుండి , ఇంట్లోని వారి విషయాలలో పట్టించుకోకుండా వుండటం , ఇంటిలోని వాళ్ళు వ్యక్తికి పట్టం కట్టిన పెద్దరికం .

అలా కాకుండా అందరి విషయాలలో ( పిలవకున్నా , సంబంధం లేకున్నా ) ప్రవేశించటాన్ని ఇంటిలోని వారంతా మూకుమ్మడిగా అంటకట్తబడే చాతకానితనం .

మాత్రం సంబంధం లేకున్నా అన్ని విషయాలలో తల దూరుస్తున్నప్పుడు , కాలం తన గాలంతో ఏవి వినపడకుండా చేసేస్తుంది . అయినా అన్నీ వినాలనే తపన మెషిన్ పెట్తించుకొనే ప్రయత్నం చేయిస్తుంటుంది . అది రకంగా అవివేకమే , అతి చొరవకు నిదర్శనమే .

వయసులో వున్నప్పుడు చాలామంది దృష్టి లోపాల్ని ఎదుర్కొంటుంటారు . ఫలితంగా కంటికి సంబంధించిన ప్రత్యేక వైద్యులని సంప్రదిస్తారు . వైద్యులు మీకు దూరదృష్టి లోపించినదని కొంతమందికి , హ్రస్వ దృష్టి లోపించినదని  ఇంకొంతమందికి , మీ దృష్టికి శుక్లాలు అడ్డం బడబోతున్నాయని మఱికొంతమందికి , శుక్లాలు అడ్డం పడ్తున్నాయని ఇంకా కొంతమందికి యిలా చెప్పి , వాటి నివృత్తి కొఱకు వైద్యం చేస్తారు .

వాస్తవానికి దూరదృష్టి లోపం అంటే , మీరు భవిష్యత్తుని సరిగా అర్ధం చేసుకోలేకపోతున్నారు , కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకొని తప్పుని ముందు ముందు మఱల పునరావృతం కాకుండా సరిచేసుకోండి అని అన్నమాట .

హ్రస్వ దృష్టి లోపం అంటే , దగ్గఱ దగ్గఱ విషయాలను భవిష్యత్తుని సరిగా అర్ధం చేసుకోలేకపోతున్నారు, కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకొని తప్పుని ముందు ముందు మఱల పునరావృతం కాకుండా సరిచేసుకోండి అని అన్నమాట .

కొంతమందికి శుక్లాలు అడ్డం మీ దృష్టికి అడ్డం పడబోతున్నాయని , పడబోతున్నాయని చెప్తున్నారంటే , మీ దృష్టి భవిష్యత్తుకి అవసరమైన విషయాలను చూడలేకపోతుందని , కనుక తగు జాగ్రత్తలు తీసుకొని భవిష్యత్తుని బంగారుబాట చేసుకొమ్మని అన్నమాట .

ఎప్పుడైనా  శరీరంలోని మిగిలిన అవయవాలైనా ఆకస్మికంగా కొంచెం కుంటుపడితే మఱల కుదుటపడే స్థితి కలుగుతుంది కొన్ని కొన్ని స్థితులలో అంటే , ఇంకా మన ఉనికి భూమ్మీద అవసరమున్నదని అన్నమాట .

అలా కాకుండా పదే పదే కుంటు పడ్తుంటే , యిక మన ఉనికి భూమ్మీద అవసరం ఉండబోదని , తనకు , తన సంబంధీకులకు చూచాయగా ఒక సూచన యిస్తున్నట్లే అని అర్ధం చేసుకోవాలి . చేసుకొన్న పిమ్మట , మనం చేద్దామనుకొన్న పనులను వీలైనంత సత్వరంగా పూర్తి చేసుకొనేలా అడుగులు వేసుకోవాలని .

మఱల లేచే విధంగా కాకుండా కుంటుపడితే , యిక మన ఉనికి భూప్రపంచానికి అసలు అవసరం లేదని , తన వాళ్ళను ధైర్యంగా వుండమని , తగు విధంలో నడుచుకొని , తన వాళ్ళకు వలసిన ధైర్యం అందించాలన్నమాట .

పుట్టిన వారెవరైనా , ఎన్నటికైనా , ఎప్పుడైనా గిట్టక తప్పదు . కారణం మనమంతా అఖండ ప్రపంచంలో అణువు కన్న ఎంతో అత్యల్పులమన్న మాట .

అలాగని నిరుత్సాహపడి జీవితాన్ని దుఃఖమయం చేసుకొమ్మనటం లేదు . అనంత విశ్వంలో  మనమేమిటో తెలుసుకొంటున్న తర్వాత , ఆయువున్నంత కాలం ఆనందంగా మన జీవితాన్ని చక్కగా తీర్చి దిద్దుకొని , పదిమందికి ( అవసరమైతే ) మార్గదర్శకం కావాలి .

ఇది మన మానవ జీవన గమనంలో అడుగడుగున మనకు అగపడ్తున్న , అనుభూతమయ్యే వాస్తవాలు .

                                                                                                 *******