నా న్యూ నుడులు - 12

                                                                                                                                      రచన : శర్మ జీ ఎస్

1 .  రాతను మార్చేది ఎవరో , కాని 
     వ్రాతను సరిదిద్దుకోవలసినది మాత్రం మనమే .

 2.  చెప్పు చేతిలోకి రాకూడదు ,
      చెప్పు చేతల్లో ఉంటే చాలు .

3.  శాసనాలు కలకాలం ఉంటాయి ,
     వాసనలు క్షణకాలమే ఉంటాయి .

 4 . నడక బాగున్నంత మాత్రాన సరిపోదు ,
     నడత బాగుంటే ఎక్కడైనా మెప్పు పొందగలం .

5 . ఓర్పుని ఎదుటివాళ్ళలో చూడాలనుకొంటుంటారు ,
    నేర్పు మాత్రం తమలోనే చూడమంటుంటారు .

6 . ఒకరికి ఆ మూల ఈశాన్యంగా భావిస్తారు ,
     ఆ ముందువాళ్ళకు అదే మూల వాయవ్యం .

7 . ఒకరు ఆ మూలని నైఋతిగా భావిస్తారు ,
     అదే మూలని అటు వాళ్ళు ఆగ్నేయంగా భావిస్తారు .

8 . శాస్త్రాలు మన ముందు తరాల వాళ్ళ అనుభవ సారాలు ,
    నేడు అవసరానికి వాడుకొనే అత్యంతోత్సాహ అస్త్రాలు .

9 . మార్పు ఎదుటివారిలో రావాలని కోరుకొంటుంటారు ,
     అదే మార్పు తలో రావాలంటే  మాత్రం తట్టుకోలేరు .

10 . ఒకరు ఓ పని చేస్తే తప్పుగా పరిగణిస్తారు ,
       అదే పని వారు చేస్తే ఒప్పుగా , బహు గొప్పగా భావిస్తారు  .



                                                                                                             ( మఱి కొన్ని , మఱి కొన్నాళ్ళలో )

2 comments:

  1. పది రాశారు పది కాలాల పాటు గుర్తుంచుకోవాల్సినవి ధన్యవాదాలు సర్.

    ReplyDelete
    Replies
    1. ఫాతిమాజి ,

      పది వ్రాయటం లోని అంతరార్ధం పదిమందితో పంచుకొనాలనే .

      Delete