రచనా సంకలనం : శర్మ జీ ఎస్
1 )
' తోమాలసేవ '
' సుప్రభాత సేవ ' లు చేసి ,
' నిత్యపూజలివిగో ' అంటు పూజలు చేసి ,
' భగవత్ దర్శనం ' చేసుకొని ,
' నాదనీరాజనం ' సమర్పించుకొని ,
' శతమానం భవతి ' దీవెనలందుకొని ,
' శ్రీవారి కళ్యాణోత్సవం '
' పద్మావతి అమ్మవారి కళ్యాణం ' లు చూసుకొని ,
' కలియుగ వైకుంఠం ' ఇదే అంటూ చూపిస్తుంది .
******
2 )
' శ్రీ లలితా సహస్రనామం ' పఠించి ,
' హనుమాన్ చాలీసా ' స్మరించి ,
' అర్చన ' జరుపుకొని ,
' గ్రహబలం ' ఎలాగున్నదో తెలుసుకొని ,
' పుణ్యక్షేత్రంలో ' దేవుని ,
' కృష్ణావతారం ' చూసి ,
' కృష్ణ తత్వం ' తెలుసుకొని ,
' ప్రత్యక్ష దర్శనం ' చేసుకొని ,
' శ్రీ లక్ష్మీ స్తోత్రం ' ,
' మహేశ్వర వైభవం ' చూస్తూ ,
' ఓం నమః శివాయ ', ' ఓం నమః శివాయ ' ,
అని జపించడంతో ,
భక్తి విశేషాలు తెలియబడ్తాయంటుంది .
*****
3 )
' తమసోమా జ్యోతిర్గమయి ' అంటూ ,
' ఆరాధన ' తో ఆరంభించి ,
' ప్రార్ధనా ' సమయాన్ని కేటాయించుకొని ,
' తీర్ధయాత్రలు ' చేస్తూ ,
' సరదా సరదాగా ' గడుపుతూ ,
' సుఖీభవ ' లుగా వుండవచ్చని ,
' ఆంధ్రావని ' లోని ,
' అన్నదాత ' సహకారంతో ,
' జీవనజ్యోతి ' ని వెలిగించుకొమ్మంటుంది .
*******
4 )
' వార్తలు ' వినిపించి ,
' శుభలగ్నం ' చూడమని ,
' వాణి రాణి ' ల ,
' మధుబాల ' ల ,
' స్వయంవరం ' అంటూ ,
' సంప్రదాయం ' మరువకుండా ,
' ఆహ్వానం ' పలుకుతూ ,
' మూడు ముళ్ళ బంధం ' లాంటి ,
' అనుబంధాలు ' కలసి ,
' మరో చరిత్ర ' ను సృష్టిస్తాయని ,
' ఛాంగు ఛాంగురే బంగారు రాణి ' చాటుతోంది .
*****
5 )
' గోపురం ' చూపిస్తూ ,
' శ్రీకరం శుభకరం ' అంటూ ,
' భక్తి సమాచారం ' తెలియచేస్తూ ,
' అత్తారింట్లో 5 గురు కోడళ్ళు ' ,
' కలవారి కోడళ్ళు ' అని చాటుకోకుంటే ,
' గడసరి అత్త సొగసరి కోడలు '
' పునర్వివాహం ' యోచనకవకాశం యివ్వద్దని ,
' పెళ్ళినాటి ప్రమాణాలను ' మరచిపోకుండా ,
' పసుపు కుంకుమ ' లను మరువకుండా ,
' గోరంత దీపం ' కొండంత వెలుగు నిస్తుందని ,
' బృందావనం ' గా చేసుకోవచ్చని ,
' మమతల కోవెల ' గా మలుచుకొమ్మంటుంది .
*******
6 )
' జీవన వేదం ' లో ,
' హర హర మహదేవా ' ప్రాముఖ్యాన్ని ,
' సిల్వర్ స్క్రీన్ ' మీద చూపుతూ ,
' శ్రీ చాగంటి దుర్గా వైభవం '
కంటికి తెలిసేలా చేస్తూ ,
' మోడ్రన్ మహలక్ష్మి '
' మా ఊరి వంట ' రుచి చూడమంటుంది ,
' పుట్టింటి పట్టుచీరను '
' పవిత్ర ' చేత పెట్టి ,
' అభినందన ' స్వీకరించింది ,
' కోడలా కోడలా కొడుకు పెళ్ళామా '
' పెళ్ళంటే నూరేళ్ళ పంట ' ,
' అత్తారిల్లు ' లో ,
' కాంచన గంగ '
' చూపులు కలసిన శుభవేళ '
' చిన్నారి పెళ్ళికూతురు ' గా అయిన సందర్భంలో ,
' ళుషీ ' గా ,
' అష్టా చెమ్మా ' ఆడుకుంటూ ,
' భలే ఛాన్సు లే ' అనుకొంది .
*****
7 )
' ప్రభాత తుషారం ' తాకిన ,
' తెలుగింటి అమ్మాయి '
' గురుదేవో భవ ' అని కీర్తించి ,
' అమ్మ మనసు '
' మందార మకరందాలు ' గా భావించి ,
' కిసాన్ '
' రైతు నేస్తాల ' సహకారంతో ,
' తెలుగుతోట ' లో పండించి ,
' భారత నిర్మాణంలో '
' ఆరోగ్యభారతం '
ప్రధాన పాత్రగా తలవమంటుంది .
*****
తెనుగు ఛానళ్ళ మీద పి.హెచ్.డి కి తయరవుతున్నట్టేవుంది :)
ReplyDeleteఈ ప్రపంచంలో అతి కొద్దిగా కనపడేవి మన కొంపలు ముంచుతాయి . పేరుకి బుల్లి తెరలే గాని వుల్లి పొరల కంటే కడు ప్రమాదమైనవి , స్లో పాయిజన్ లా .
DeleteIts Awesome :-)
ReplyDeleteకృతజ్ఞతలు .
Deleteబాగా గుర్తుంచుకున్నారే అన్ని ఛానల్స్ ప్రోగ్రామ్స్,..బ్రహ్మాండంగా వ్రాసారు,..బుల్లితెరలే కాని వుల్లిపొరలు ఇది మరీ బాగుంది...
ReplyDeleteఆడదానికి ఆడదే శతృవు అన్నది ఈ బుల్లితెరలలో అడుగడుగునా కనపడ్తుంటుంది . ఇంట్లో ఆడవాళ్ళు ఈ సీరియల్స్ ని చూస్తూ కంట కన్నీళ్ళు కారుస్తూ , ఆ పాత్రలు ఏమై పోతున్నాయన్న దిగులుతో ఇంటిని కూడా పట్టించుకోని మహా నారీమణులను నిత్యం చూస్తూనే వున్నాను మన సమాజంలో .
DeleteLol!! Meeru Anni channels baaga for follow authunnarani arthamindi.....
ReplyDeleteఅన్ని ఛానల్స్ని ఫాలో కావాల్సిన అవసరం రచయితకు వుండదు . రచయితలు వేరు వేరు కోణాల్లో ఆలోచిస్తుంటారు . అందు కొరకు అన్నీ ఫాలో కావలసిన పని లేదు . సింపుల్గా అన్ని కోణాల్లోంచి ఆలోచిస్తే సరిపోతుంది .
Delete