బుల్లి తెరల నిత్య భాగోతం

                                                                                                                      రచనా సంకలనం : శర్మ జీ ఎస్

1 )     


' తోమాలసేవ '
' సుప్రభాత సేవ ' లు చేసి ,
' నిత్యపూజలివిగో ' అంటు పూజలు చేసి ,
' భగవత్ దర్శనం ' చేసుకొని ,
' నాదనీరాజనం ' సమర్పించుకొని ,
' శతమానం భవతి ' దీవెనలందుకొని ,
' శ్రీవారి కళ్యాణోత్సవం '
' పద్మావతి అమ్మవారి కళ్యాణం ' లు చూసుకొని ,
' కలియుగ వైకుంఠం ' ఇదే అంటూ చూపిస్తుంది .

  ******

2 )    


' శ్రీ లలితా సహస్రనామం ' పఠించి ,
' హనుమాన్ చాలీసా ' స్మరించి ,
' అర్చన ' జరుపుకొని ,
' గ్రహబలం ' ఎలాగున్నదో తెలుసుకొని ,
' పుణ్యక్షేత్రంలో ' దేవుని ,
'  కృష్ణావతారం ' చూసి ,
'  కృష్ణ తత్వం ' తెలుసుకొని  ,
' ప్రత్యక్ష దర్శనం ' చేసుకొని ,
' శ్రీ లక్ష్మీ స్తోత్రం ' ,
' మహేశ్వర వైభవం ' చూస్తూ ,
' ఓం నమః శివాయ ', ' ఓం నమః శివాయ ' ,
  అని జపించడంతో  ,
  భక్తి విశేషాలు తెలియబడ్తాయంటుంది . 

*****

3 )   


' తమసోమా జ్యోతిర్గమయి ' అంటూ ,
'  ఆరాధన ' తో ఆరంభించి ,
'  ప్రార్ధనా ' సమయాన్ని కేటాయించుకొని ,
'  తీర్ధయాత్రలు ' చేస్తూ ,
'  సరదా సరదాగా ' గడుపుతూ ,
'  సుఖీభవ ' లుగా వుండవచ్చని ,
'  ఆంధ్రావని ' లోని ,
'  అన్నదాత ' సహకారంతో ,
'  జీవనజ్యోతి ' ని వెలిగించుకొమ్మంటుంది .

*******


4 )      

'  వార్తలు ' వినిపించి ,
'  శుభలగ్నం ' చూడమని ,
'  వాణి రాణి ' ల ,
'  మధుబాల ' ల ,
'  స్వయంవరం ' అంటూ ,
'  సంప్రదాయం ' మరువకుండా ,
'  ఆహ్వానం ' పలుకుతూ ,
'  మూడు ముళ్ళ బంధం ' లాంటి ,
'  అనుబంధాలు ' కలసి ,
'  మరో చరిత్ర ' ను సృష్టిస్తాయని ,
'  ఛాంగు ఛాంగురే బంగారు రాణి ' చాటుతోంది .

*****

5 )     

'  గోపురం ' చూపిస్తూ ,
'  శ్రీకరం శుభకరం ' అంటూ ,
'  భక్తి సమాచారం ' తెలియచేస్తూ ,
'  అత్తారింట్లో 5 గురు కోడళ్ళు ' ,
'  కలవారి కోడళ్ళు ' అని చాటుకోకుంటే ,
'  గడసరి అత్త సొగసరి కోడలు '
'  పునర్వివాహం ' యోచనకవకాశం యివ్వద్దని ,
'  పెళ్ళినాటి ప్రమాణాలను ' మరచిపోకుండా ,
'  పసుపు కుంకుమ ' లను మరువకుండా ,
'  గోరంత దీపం ' కొండంత వెలుగు నిస్తుందని ,
'  బృందావనం ' గా చేసుకోవచ్చని ,
'  మమతల కోవెల ' గా మలుచుకొమ్మంటుంది .

*******

6 )      

'  జీవన వేదం ' లో ,
'  హర హర మహదేవా ' ప్రాముఖ్యాన్ని ,
'  సిల్వర్ స్క్రీన్ ' మీద చూపుతూ ,
'  శ్రీ చాగంటి దుర్గా వైభవం '
   కంటికి తెలిసేలా చేస్తూ ,
'  మోడ్రన్ మహలక్ష్మి '
'  మా ఊరి వంట ' రుచి చూడమంటుంది ,
'  పుట్టింటి పట్టుచీరను '
'  పవిత్ర ' చేత పెట్టి ,
'  అభినందన ' స్వీకరించింది ,
'  కోడలా కోడలా కొడుకు పెళ్ళామా '
'  పెళ్ళంటే నూరేళ్ళ పంట ' ,
'  అత్తారిల్లు ' లో ,
'  కాంచన గంగ '
'  చూపులు కలసిన శుభవేళ '
'  చిన్నారి పెళ్ళికూతురు ' గా అయిన సందర్భంలో ,
'  ళుషీ ' గా ,
'  అష్టా చెమ్మా ' ఆడుకుంటూ ,
'  భలే ఛాన్సు లే ' అనుకొంది .

*****

7 )      

'  ప్రభాత తుషారం ' తాకిన ,
'  తెలుగింటి అమ్మాయి '
'  గురుదేవో భవ ' అని కీర్తించి ,
'  అమ్మ మనసు '
'  మందార మకరందాలు ' గా భావించి ,
'  కిసాన్ '
'  రైతు నేస్తాల ' సహకారంతో ,
'  తెలుగుతోట ' లో పండించి ,
'  భారత నిర్మాణంలో '
'  ఆరోగ్యభారతం '
   ప్రధాన పాత్రగా తలవమంటుంది .

*****

8 comments:

  1. తెనుగు ఛానళ్ళ మీద పి.హెచ్.డి కి తయరవుతున్నట్టేవుంది :)

    ReplyDelete
    Replies
    1. ఈ ప్రపంచంలో అతి కొద్దిగా కనపడేవి మన కొంపలు ముంచుతాయి . పేరుకి బుల్లి తెరలే గాని వుల్లి పొరల కంటే కడు ప్రమాదమైనవి , స్లో పాయిజన్ లా .

      Delete
  2. Its Awesome :-)

    ReplyDelete
  3. బాగా గుర్తుంచుకున్నారే అన్ని ఛానల్స్ ప్రోగ్రామ్స్,..బ్రహ్మాండంగా వ్రాసారు,..బుల్లితెరలే కాని వుల్లిపొరలు ఇది మరీ బాగుంది...

    ReplyDelete
    Replies
    1. ఆడదానికి ఆడదే శతృవు అన్నది ఈ బుల్లితెరలలో అడుగడుగునా కనపడ్తుంటుంది . ఇంట్లో ఆడవాళ్ళు ఈ సీరియల్స్ ని చూస్తూ కంట కన్నీళ్ళు కారుస్తూ , ఆ పాత్రలు ఏమై పోతున్నాయన్న దిగులుతో ఇంటిని కూడా పట్టించుకోని మహా నారీమణులను నిత్యం చూస్తూనే వున్నాను మన సమాజంలో .

      Delete
  4. Lol!! Meeru Anni channels baaga for follow authunnarani arthamindi.....

    ReplyDelete
    Replies
    1. అన్ని ఛానల్స్ని ఫాలో కావాల్సిన అవసరం రచయితకు వుండదు . రచయితలు వేరు వేరు కోణాల్లో ఆలోచిస్తుంటారు . అందు కొరకు అన్నీ ఫాలో కావలసిన పని లేదు . సింపుల్గా అన్ని కోణాల్లోంచి ఆలోచిస్తే సరిపోతుంది .

      Delete