అకారానికి నాలుగు దశలు ఏర్పడతాయి ,
బాల్యం , యౌవనం , కౌమారం , వార్ధక్యం ,
బాల్యం లో తనకేం కావాలో తెలియకపోవటం వలన చుట్టు ప్రక్కల వాళ్ళందరి నడవడి ప్రభావం పడి ,
తనకు తెలియకుండానే గడిచిపోతుంది .
ఇక యౌవనం , ఈ దశలో అవయవాలు పెరుగుతూ , వాటికి కొన్ని అవసరాలుంటాయని , అవి తీర్చు
కోమని , తొందర చేస్తుంటాయి . ఈ తొందరలో దాదాపుగా పధ్ధతిగా ( నిజంగా తనకు భవిష్యత్తులో ) ఏం
కావలసి వస్తుందో తెలియనీయకుండా తొందర చేసి భవిష్యత్తుని అంధకారమయం చేస్తుంటుంది . ఈ
దశలోనే ఈ దశలను అనుభవించిన వాళ్ళు , వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో వుంచుకొని , కనీసం మిగిలిన
( తన ) వాళ్ళ జీవితాలు అలా కాకుండా ఉండాలని యోచించి ఆ యౌవ్వనులకు , వివాహాలు చేస్తుంటారు .
కొంతమంది వింటారు , ఇంకొంతమంది వినకుండా , మా జీవితం మాది , మాకు తెలుసు , ఎలా జీవిం
చాలో , ఎటువంటి వారిని నా సహచరులుగా ఎంచుకోవాలో అని ఆ దిశగా నడుచుకొంటుంటారు .
మూడవది కౌమారం : ఈ దశలో తాము వయసులో చేసిన పొరపాట్ల వల్లనో , లేక ఆ అలవాట్ల వల్లనో ,
తమకు కలిగిన సంతతిని అలా పెంచకుండా సక్రమంగా పెంచాలని ( తాము సరిగా పెరిగుంటే ఇలా ఆలో
చించటం సబబే . తాము అల్లర చిల్లరగా పెరిగున్నా , తమ పిల్లల భవిష్యత్తైనా చక్కగా ఉండాలన్న సదు
ద్దేశం కూడా ఒక కారణం కావచ్చు ) ఎక్కువగా వెంటపడ్తుంటారు . తమ ఆనందాలను అనుభవించటా
నికి విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంటారు .
నాల్గవది వార్ధక్యం : పై మూడు దశలలో అనుభవించిన తదుపరి లభించే దశ ఇది . ఇక్కడ చాలావరకు
తమ వారసులను సరైన మార్గంలో వాళ్ళ జీవనం సాగించాలని , వాళ్ళను తమ అనుభవాలతో ప్రభావితం
చేయాలని ప్రయత్నం చేస్తూ , ఆఖరి పయనం కొరకు నిరీక్షిస్తుంటారు .
**************