రచన : శర్మ జీ ఎస్
2. పాటలు పాడగలం
పాట్లు మాత్రంపడలేం
1. మంచాలలో రక్తి ,
లంచాలతో విరక్తి .
2. పాటలు పాడగలం
పాట్లు మాత్రంపడలేం
3. పదవి కొఱకు నాయకులు ,
అరాచకాలను సృష్టిస్తారు .
4. పెదవి కొఱకు కాముకులు ,
అత్యాచారాలకు ఒడిగడతారు .
5. ఎదుటివాడు చేస్తే అది తప్పు ,
అదే మనం చేస్తే గొప్ప ఒప్పు .
6. ఆడవాళ్ళకు ఆభరణాలు అందం
ఆడవాళ్ళకు ఆ భరణమూ ఆనందమే .
7. స్వార్ధంతో సమస్యలు ఉత్పన్నమౌతాయి
అర్ధం చేసుకొంటే దూరంగా పారిపోతాయి .
8. ఆ వినాయకుడిని ఏమైనా , ఎన్నైనా అడగొచ్చు
ఈ నాయకుడిని ఏలాగైనా , ఎప్పుడైనా కడగొచ్చు.
9. సహజంగా చెప్పిందే చెప్పటాన్ని నస అంటారు
పదే పదే అదే విషయాన్ని పదుగురితో చెప్పటాన్ని
ఈనాటి పనసగా పేరుగాంచింది .
ఈనాటి పనసగా పేరుగాంచింది .
10. తన ప్రాణ రక్షణ కొఱకు ఎదుటి జీవిని చంపటం తప్పు కాదట ,
మానవులు తప్ప మరే జీవులైనా దీన్ని పాటిస్తే పేద్ద తప్పట ,
అదే అసలు సిసలు ధర్మమట
అదే అసలు సిసలు ధర్మమట
*******
మంచాలలో రక్తి ,
ReplyDeleteలంచాలతో అనురక్తి