తెలుసుకో - మసులుకో

                                                                                                                                              శర్మ జీ ఎస్


ఇల్లలకగానే పండుగ కాదు

తాళి కట్టగానే శోభనం కాదు

రోగం అప్పటికప్పుడు రాదు

వచ్చినా  , వెంటనే తగ్గిపోదు

స్థలం కొనగానే విలువ పెరగదు

నారు వేయగానే పంట పండదు

ఇల్లు కట్టి చూడు , పెళ్ళి చేసి చూడు

ఆలోచన రాగానే ఆచరణకు నోచుకోదు

ఎసరు పెట్టగానే అన్నం తయారు కాదు

ప్రేమించగానే పెళ్ళాము కాదు , మొగుడు కాడు

కడుపుతో వుండగానే పిల్లలను ప్రసవించలేరు

బ్యాంకులో డిపాజిట్ చేయగానే వడ్డీ కలవదు


ఇలాంటి వాటన్నిటి వెనుక మనకు కనపడకుండా ఒకటి దాగి వున్నది .
అదే కాలం .

ఇవన్నీ అందరకీ తెలిసినవే అయినా , వాటిలోని అంతత్రార్ధం తెలుసుకోకుండా ఫలితాల కొఱకు ఎదురు చూడటం . అవి అందనప్పుడు నిరాశ చెందటం పరిపాటి అయిపోయింది . అప్పుడు కాలాన్ని నిందించటం సర్వ సాధారణమై పోయింది .

అసలు ఈ ప్రపంచంలో మానవ మనుగడకు మూలాధారమైనది కాఇలం అని తెలుసుకొంటే సమస్యలు సమస్యలుగా కనపడవు . వెఱపు లేకుండా ఆనందంగా జీవించే అవకాశాలు అధికంగా లభ్యమౌతాయి .

                                                                    ********




5 comments:

  1. అన్నిఈ సత్యాలు చెప్పేస్తున్నారు

    ReplyDelete
    Replies
    1. ముందుగా నా బ్లాగుకు స్వాగతం . నిజాలు ఎవరు చెప్పినా బాగుంటాయి కదా!

      Delete
  2. ముందుశోభనం తరవాతే తాళి, ఇదీ నేటి రీతి.

    ReplyDelete
    Replies
    1. శర్మ గారూ , నమస్తే .

      ఈ రోజుల్లో దాదాపుగా సుందరాంగులే కదా ! అందుకే కొంచెం తొందరెక్కువే . ఈ రోజుల్లో అడ్వాన్స్ తీసుకోనిదే అడుగు ముందుకు వెయ్యటం లేదు కదా ! ఇలా ముందే జరుపుకోవటానికి యిది కూడా ఓ కారణం కావచ్చేమో ?

      Delete
  3. మంచిగా చెప్పారు. ఆలస్యం అమృతం విషం - నిదానమే ప్రధానం , ఇవి రెండూ సత్యాలే. సందర్భాన్ని బట్టి వాడుకోవాలి. అదే కాలమహిమ.

    ReplyDelete