ల్యాప్ టాప్ బేబ్


                                                                          ల్యాప్ టాప్ బేబ్

                                                                                                                               కధా రచన : శర్మ జీ ఎస్

            (  మాలిక వేగవంతమైన బ్లాగుల సంకలిని లోని 15/06/2013 పెండెం గారి చిత్రానికి నా చిన్న కథండి  )

వనజ వరుణ్ లు కొత్తగా పెళ్ళైన పడుచు జంట . పెళ్ళై 3 నెలలు తిరగకుండానే , నెల తప్పేలా చేశాడు . వనజ ఎంత
గానో ఆనందం చెందింది .

ఓ నాడు "   వరుణ్ "   అంటూ అతని వక్షస్థలం మీద తన కుడి చేత్తో మెల్లగా గీరుతోంది .

"   ఏమిటి ? "   అని అడిగాడు .

"   నాకు మనల్ని తల్లితంద్రులుగా చేస్తున్నదెవరో తెలుసుకోవాలని ఉంది "   అన్నది .

"   ఎవరో ఎందుకు చేస్తారు ? మనకు మనమే చేసుకొంటున్నాం . నీకు తెలియలేదా ? "   అన్నాడు .

"   తెలుసు , మనం చేస్తున్న ఆ సంసారం వల్లనేనని . "

"   అంత తెలిసినదానివి మరి ఎలా అడిగావ్ అలా ? "

"   మనల్ని తల్లితండ్రులని చేస్తున్నది బాబా ? పాపా ? అని ."

"   అదా ! ఎవరైనా అందులో తేడా ఏముంది ? ఎవరికైనా మనం డాడ్ & మామేగా ."

"   నిజమేననుకోండి . కాకుంటే బాబా ? పాపా అని తెలుసుకోవాలన్నది నా కోరిక "   అన్నది .

"   మన ఇండియాలో ఆ అవకాశం లేదుగా . "

"   అవకాశం లేదని నా కోరికను చంపుకోమంటావా ? "

"   మరింకేం చేస్తాం ? "

"   ఎం చేస్తావో  నాకు మాత్రం తెలియదు , నాకు తెలియాలి  అంతే ."

"   అదెలా కుదురుతుంది ? "

"   నేనేమైన సీతలా బంగారు జింకను తెమ్మన్నానా ? పారిజాతపు పువ్వునడిగానా ? లేక నాగలోకపు మణి 
నడిగానా ? లేదే ? సింపుల్ గా నా కడుపులో ఉన్న బేబీ గురించి అడిగానంతే ."

"   నువ్వడిగింది చిన్న కోరికైనా అవకాశం లేనప్పుడు అది తీర్చలేనిదై చాలా పెద్దదిగానే వుంటుంది . "

"   అందరూ అనుకుంటుంటే విన్నాను . భార్య కడుపుతో ఉన్నపుడు భర్త అడిగిన కోరిక తీరుస్తాడని . "

"   తీర్చగలిగిందైతే . "

"   తీర్చ లేకపోవటానికి , నిన్నేమైనా కొండలెక్కమన్నానా ? కొండమీద కోతిని  తెచ్చిమ్మన్నానా ? నా కడుపులో వున్న బేబి ఎవరో తెలుసుకోమన్నాను అంతేగా ."

"   మన ఇండియాలో పాప అని తెలుసుకొని , ఆ కడుపులోనే చంపేసేస్తున్నారని , ఆ విధానాన్ని నిషేధించారు . "

"   ఆ విషయం నాకూ తెలుసు వరుణ్ . మనం అలా చపుకునేవాళ్ళం కాదుగా . "

"   ఆ విషయం మనకు తెలుసు , వాళ్ళకు తెలియదుగా . "

"   తెలియజేసి , అనుమతి తీసుకో , అవసరమైతే బాండ్ కూడా వ్రాసిస్తామని చెప్పు . "

"   ఎవరూ మన మాట వినరు ."

"   అయితే నా కోరిక తీర్చవా ? మనసుంటే మార్గముంటుందంటారుగా , నీకు నా మీద మనసు లేదన్నమాట ."

"   అలా అనకు ,ఆలోచిస్తున్నా . అవును మీ ( స్వంత )పిన్ని డాక్టరేగా , కనుక్కోక పోయావా ? "   అన్నాడు .

"   ఆ ప్రయత్నం చేసి చూశాను . ప్రయోజనం లేకపోయింది . ఈ విషయంలో ప్రభుత్వం స్ట్రిక్ట్ గరూల్స్ ఫాలో చేస్తు
న్నారుట . లంచాలకు కూడా ఎవరూ తలవంచటం లేదు .  ఎవరు అతిక్రమించినా వాళ్ళ లైసెన్స్ లు జీవితకాలం నిషేధిస్తారున్నారుట .ఇండియా ఒక్క ఈ విషయంలోనే స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నది . "

"   అయిన వాళ్ళ వల్లే కావటం లేదంటే , ఇంక ఎం చేస్తాం "   అనుకొన్నాడు .

"   మనకు పుట్టే పిల్లలు బాబో , పాపో తెలియకుండా కనటం నాకిష్టం లేదు . నువ్వు ఎలాగైనా తెలుసుకొని చెప్పు "   అంటూ నిద్రాదేవి ఒడిలో సోలిపోయింది వనజ .

ఆ రాత్రంతా అలాగే ఆలోచిస్తూ ఆలస్యంగా నిద్రపోయాడు .
ఇలా 3 రాత్రులు గడచాయి . వనజ ప్రక్కనుందనే గాని , ఆ ఆలోచన తప్ప మరో ఆలోచనకు తావు లేకుండా పోయిం
ది .
ఈ అవకాశం యూ ఎస్ లో మాత్రమే వున్నది . పుట్టబోయే బేబి బాబా లేక పాపా అన్నదే కాకుండా , అసలు డెలివరీ టైంలో ఆ పుట్టబోయే బిడ్డకు తండ్రి అయిన వాడు  ఆ కనబోయే సమయంలో తల్లి ఎదుట వుండాలిట . కనుక యూ ఎస్ లోని తమ హెడ్ ఆఫీసు వాళ్ళతో సంప్రదిస్తే ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందేమోనని అనుకొన్నాడు .

యూ ఎస్ లోని హెడ్ ఆఫీస్ వాళ్ళతో సంప్రదించాడు , సమస్యను వివరించాడు . వాళ్ళు సాల్వ్ చేస్తానన్నారు .
"   మిష్టర్ వరుణ్ , మీరు చేయవలసినదల్లా ఒక్కటే . ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు , మీ ఇండియా టైం ప్రకారం గూగుల్ లైవ్  స్కానింగ్  లోకి  రండి , మీ మిసెస్ ని ఒకమారు స్క్రీనులో  చూపించండి , ఇక్కడ ఎక్స్పర్ట్ డాక్టర్స్ వున్నారు , వాళ్ళ అత్యాధునికమైన సాంకేతిక నిపుణతతో స్కాన్ చేసి , మీకు స్క్రీన్ మీద లైవ్ లో చూపిస్తారు . డోంట్ వర్రీ మిష్టర్ వరుణ్ . ఇటీజ్ వెరీ ఈజి "   అని బదులిచ్చారు .

"    థాంక్యూ సో మచ్ "    అని తన భార్యకు కాదు , తనకే డెలివరీ అయినంతగా ఆనందం పొందాడు .

అదే విషయాన్ని వనజకు చెప్పాడు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే . వనజ ఆనందానికి అవధుల్లేవు . తను అనుకు
న్నది సాధించగలిగుతున్నానన్న గొప్ప సంతృప్తి .
ఆ రోజు అర్ధరాత్రి ఎప్పుడౌతుందా అని ఎదురుచూస్తున్నది . "  ఇంకా పదిన్నరేనా ?  అబ్బ 12 గంటలు ఎప్పుడవు
తుంది వరుణ్ ?  "   అన్నది .

"   రోజూలాగే ఈ రోజు 11.59 తర్వాతే 12 అవుతుందిట , మార్పేమి లేదుటే "   అన్నాడు .

"   అలాగా ! నేను ముందు 12 అవుతుంది , 11 తర్వాత అవుతుందనుకున్నానే "   అంటూ వెక్కిరించింది .

"   కాకపోతే ఏమిటే ? కాలం ఎప్పుడూ ఒకలాగే వుంటుంది , వుండనిదల్లా మన మనసే . మనకు పని వున్నా , లేకపోయినా కాలం ముందుకు సాగిపోతూనే ఉంటుంది . మనం ఒకదాని కొరకు ఎదురుచూసినప్పుడు మాత్రం కాలం ఎంతకీ ముందుకు పోకుండా వున్నట్లు వుంటుంది . అది మన భ్రమే . కాలం ఎప్పుడూ , ఎవరి కొరకు ఆగటం గాని , అలాగని ముందుకు పరుగెత్తదు . ఆ తపన మాత్రం మనకు అలాంటి భావాల్ని కలిగిస్తుంది "   అన్నాడు .

అర్ధరాత్రి 12 అయింది , వాళ్ళ యూ ఎస్ హెడ్ ఆఫీస్ వాళ్ళు యిచ్చిన సలహా మేరకు గూగుల్  లైవ్  స్కానింగ్  కి   అటెండ్ అయ్యేటందుకు ల్యాప్ టాప్ ఆన్ చేశారు . వనజని స్క్రీన్ మీద చూపించాడు , ఒకటికి రెండు సార్లు .
వెంటనే స్కానింగ్ అరేంజ్ మెంట్స్ మొదలయ్యాయి . 5 నిముషాలలో బేబ్ జెండర్ తెలిసిపోయింది . వనజకు , వరుణ్ కి కూడా అమిత ఆనందం కలిగింది . చలాకీగా అటు , యిటూ కదుల్తూ , హెల్దీగా కనపడ్డాడు . అలా చూస్తుంటే పదే పదే చూడాలన్న ఉత్సాహం ఎక్కువైంది యిద్దరిలో . అలా చూస్తూనే వున్నారు . కొంతసేపటికి ఆ బాబు ల్యాప్ ట్యాప్ చెక్ చూస్తున్నట్లు కనపడటంతో ఒక్కసారి దిగ్భ్రాంతికి లోనయ్యారు , మెల్లగా ఆ దిగ్భ్రాంతి ఆనందాశ్ఛర్యాలుగా పరి
వర్తన చెందింది . 
అపుడనిపించింది సాఫ్ట్ వేర్ దంపతులు అహోరాత్రులు ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగాల గురించి ఆలోచిస్తూ వుండటం వలన వాళ్ళకు పుట్టబోయే బిద్దల మీద కూడా ఆప్రభావమే ఈ పర్యవసానమని తెలుసుకొని నవ్వుకున్నారిరువురూ . ఇది అంతా వీడియో తీశాడు వరుణ్ . యూ ఎస్ ఆఫీస్ వాళ్ళకు ధన్యవాదాలు తెలిపారిరువురూ .

వనజ్ వరుణ్ ని తన బిగి కౌగిలి లో బంధించాలనుకున్నా , కడుపులో వున్న పిల్లవాడు గుర్తుకు వచ్చి , మెల్లగా
ముద్దులతో సరి పెట్టుకోమంది .

చూడాలనిపించినపుడు అలా ఇంటిలోని టీ వీ లో చూసుకొంటూ ఆనందిస్తున్నారు .


                                                                     ** స ** మా **  ప్తం **

4 comments:

 1. వామ్మో ఇలా తెలుసుకోవచ్చా! శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు.

  ReplyDelete
  Replies
  1. దరిద్రాలు కాదు , అవసరాలు మాష్టారూ .

   Delete
 2. మనసుంటే మార్గముంటుంది, కథ బాగుంది కానీ మీ కిటుకును ఉపయోగించి శిశులింగనిర్ధారణ చేసి ఆడశిశువయితే కడతెరిస్తే ఎలా?!ప్రభుత్వ చట్టం ఏం కాను???

  ReplyDelete
  Replies
  1. చిత్రం చూడగానే విచిత్రంగా అనిపించి , ఓ కధ వ్రాస్తే అనిపించి , ఓ కొత్త ఆలోచనతో ఈ కధ వ్రాయటం జరిగింది . ఆ రోజులు కూడా వస్తాయి ముందుముందు .
   ఇక ప్రభుత్వ చట్టం ఏం కాను ? అని . అంతర్జాలాన్ని విపరీతంగా వుపయోగించుకుంటున్నారు అన్ని రకాలుగా . ఇప్పటికే న్యూడ్ ఫిల్మ్ లను చూస్తూ . మరి మన ప్రభుత్వం ఏం చేయగల్గుతున్నది ?
   ఇంకొకటి ఒకరికి ఈశాన్యం , ఇంకొకరికి వాయవ్యం అవుతున్నది , వేరొకరికి నైఋతి , మరొకరికి ఆగ్నేయం అవుతున్నది మన కళ్ళముందు కనపడ్తున్న నగ్న సత్యం . ఇలాగే ఎవరి దేశాల సంస్కృతి వారిది . ఏ ప్రభుత్వం ఏమీ చేయలేదు , చూసీ చూడనట్లు పోవటం తప్ప .

   మీ స్పందనకు అభినందనలు .

   Delete